





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబీ అయ్యూబ్ అల్ అన్సారీ రజీయల్లాహు అన్హు ఉల్లేఖనం : "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "(కోపంలో) ఒక ముస్లిం తన తోటి ముస్లిం నుండి మూడు రాత్రులకంటే ఎక్కువ దూరంగా ఉండుట అనుమతించబడలేదు. (మామూలుగా అలాంటి స్థితిలో) ఒకరినొకరు కలిసినా, ఒకరికొకరు వీపు చూపుకుని మరలి పోతారు. అయితే వారిలో ఉత్తముడు ఎవరంటే - ఎవరైతే తోటి వానికి సలాం చెప్పడంలో ముందడుగు వేస్తాడో".
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోపంలో ఒకరినుంచి ఒకరు దూరమై పోయే ముస్లిములను గురించి వివరిస్తున్నారు. కోపంలో ఒక ముస్లిం తన తోటి ముస్లింను మూడు రాత్రుల కంటే ఎక్కువ దినాలు వదిలి వేయడం నిషేధించబడింది. వారు ఒకరికొకరు తారస పడుతున్నా కోపం కారణంగా సలాం చేసుకోరు, మాట్లాడుకోరు. వీరిద్దరిలో ఉత్తమమైన వారు ఎవరంటే ఎవరైతే తమ మధ్య పెరిగిన దూరాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తాడో మరియు ‘సలాం’తో మరలా కలవడానికి ప్రయత్నం మొదలు పెడతాడో. ఇక్కడ పెరిగిన దూరం అంటే, వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య కోపం కారణంగా పెరిగిన దూరం. అదే అల్లాహ్ హక్కు కొరకు ఎవరితోనైనా దూరం పెంచు కున్నట్లయితే అంటే ఉదాహరణకు – అల్లాహ్’కు అవిధేయత చూపేవానితో దూరం పెంచుకొనుట, ధర్మములో కొత్త విషయాలను సృష్టించే వానితో దూరం పెంచుకొనుట లేదా చెడు సహవాసులతో దూరంంగా ఉండుట – ఈ విధమైన దూరానికి సమయం (ఇన్ని రోజులు) అనేది వర్తించదు. ఆ దూరం తొలగి పోవడం అనేది వారిలో నుండి ఆ చెడులక్షణాలు దూరం కావడం పై ఆధారపడి ఉంటుంది.
అబీ సిర్మహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైనా ఇతరులకు హాని కలిగించినట్లయితే, అల్లాహ్ అతనికి హాని కలుగజేస్తాడు. మరియు ఎవరైనా ఇతరులను కఠిన పరిస్థితులకు లోను చేసినట్లయితే, అల్లాహ్ అతడికి కఠిన పరిస్థితులను కల్పిస్తాడు”.
అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికైనా హాని కలుగ జేయరాదని హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక ముస్లిం, తన తోటి సహోదర ముస్లింనకు. అతనికి సంబంధించిన ఏ విషయములోనైనా సరే, అతనికి హాని కలుగజేయరాదు. ఉదాహరణకు అతనికి వ్యక్తిగతంగా గానీ, అతని సంపదలో గానీ లేదా అతకి కుటుంబానికి గానీ హాని కలుగజేయరాదు. ఒకవేళ ఎవరైనా అలా చేసినట్లయితే, అల్లాహ్ వారి ఆచరణను బట్టి వారికి తగిన ప్రతిఫలాన్నిస్తాడు (శిక్షిస్తాడు).
జరీర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఉన్నాము. రాత్రి ఆయన చంద్రుని వైపు చూసినారు – అంటే పూర్ణ చంద్రుడిని – చూసి ఇలా అన్నారు: “నిశ్చయంగా మీరు ఏ విధంగానైతే ఈ పూర్ణ చంద్రుడిని చూస్తున్నారో, ఆ విధంగా మీరు మీ ప్రభువును చూస్తారు; ఆయనను (కనులారా) చూడడంలో మీరు ఎటువంటి ఇబ్బందినీ ఎదుర్కొనరు. కనుక సూర్యుడు ఉదయించడానికి ముందు నమాజును (ఫజ్ర్ నమాజును) మరియు అతడు అస్తమించడానికి ముందు నమాజును (అస్ర్ నమాజును) ఆచరించకుండా ఉండేలా చేసే దేనినైనా, మిమ్మల్ని లొంగదీసుకోకుండా చేయగలిగే సామర్థ్యం మీకు ఉంటే అలా చేయండి (అంటే ఆ నమాజులను వదలకుండా ఆచరించండి)”. తరువాత వారు ఈ ఆయతును పఠించినారు “....వసబ్బిహ్ బిహంది రబ్బిక ఖబ్ల తులూఇష్షంసి వ ఖబ్లల్ గురూబి” (“....మరియు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు. ఆయన స్తోత్రాలు చెయ్యి, ప్రతిరోజు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి ముందు కూడా”) (సూరహ్ ఖాఫ్ 50:39)
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుసహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉన్నపుడు ఒక రాత్రి ఆయన చంద్రుని వైపు చూసి, అంటే పదునాలుగవ రాత్రి నాటి పూర్ణచంద్రుడిని; చూసి ఇలా అన్నారు: నిశ్చయంగా విశ్వాసులు తమ కళ్ళతో స్వయంగా కనులారా తమ ప్రభువును చూస్తారు; ఎటువంటి సందేహము లేకుండా. సర్వోన్నతుడైన తమ ప్రభువును చూడడానికి వారు గుంపులుగా గుమిగూడరు; వారికి ఎటువంటి అలసటా కలుగదు; మరియు ఎటువంటి కష్టమూ ఎదుర్కొనరు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు: ఫజ్ర్ నమాజును మరియు అస్ర్ నమాజును ఆచరించకుండా చేసే ప్రతి దాన్ని కత్తిరించ గల సామర్థ్యం మీకుంటే అలా చేయండి, ఆ నమాజులను సంపూర్ణముగా వాటి నిర్ధారిత సమయాలలో, జమాఅత్’తో ఆచరించండి. ఎందుకంటే అది, సర్వశక్తిమంతుడూ, సర్వోన్నతుడూ అయిన అల్లాహ్ యొక్క ముఖమును చూడడానికి అవకాశం కల్పించే కారణాలలో నిశ్చయంగా ఒకటి. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు: “....వసబ్బిహ్ బిహంది రబ్బిక ఖబ్ల తులూఇష్షంసి వ ఖబ్లల్ గురూబి” (“....మరియు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు. ఆయన స్తోత్రాలు చెయ్యి, ప్రతిరోజు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి ముందు కూడా”) (సూరహ్ ఖాఫ్ 50:39)
అబూ మూసా అల్ అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా అల్లాహ్ దుష్ఠునికి, దౌర్జన్యపరునికి (వెంటనే శిక్షించక) కొంత గడువునిస్తాడు. అయితే, ఆయన అతడిని పట్టుకున్నపుడు, ఇక అతడిని విడిచిపెట్టడు.” అపుడు ఆయన (ప్రవక్త (స) ఈ ఆయతును పఠించినారు: “మరియు ఈ విధంగా నీ ప్రభువు దుర్మార్గులైన నగర (వాసులను) – పట్టుకొని (శిక్షించ) దలచితే – ఇలాగే పట్టుకొని (శిక్షిస్తాడు). నిశ్చయంగా, ఆయన పట్టు చాలా బాధాకరమైనది, ఎంతో తీవ్రమైనది.” (హూద్: 11:102)
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రజల హక్కులు కాజేయుట, పాపకార్యాలకు పాల్బడుట, అల్లాహ్ కు సాటి కల్పించే పనులకు (షిర్క్ నకు) పాల్బడుట మొదలైన వాటిలో పడి ఉండుటను గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో హెచ్చరించారు. నిశ్చయంగా అల్లాహ్ అటువంటి దుర్మార్గునికి ఇంకా గడువునిస్తాడు, అతని శిక్షను (త్వరగా విధించకుండా) ఆలస్యం చేస్తాడు, అతని వయస్సులో మరియు అతని సంపదలో వృద్ధినిస్తాడు, అతడిని శిక్షించుటలో త్వరపడడు. (అప్పటికీ) ఒకవేళ అతడు పశ్చాత్తాప పడకపోతే, అప్పటి వరకూ అతడు పాల్బడిన అనేక అన్యాయాలకు, దౌర్జన్యాలకు ప్రతిగా అల్లాహ్ అతడిని పట్టుకుంటాడు, మరింక వదిలిపెట్టడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్’ఆన్ లోని ఈ ఆయతును పఠించినారు: “మరియు ఈ విధంగా నీ ప్రభువు దుర్మార్గులైన నగర (వాసులను) – పట్టుకొని (శిక్షించ) దలచితే – ఇలాగే పట్టుకొని (శిక్షిస్తాడు). నిశ్చయంగా, ఆయన పట్టు చాలా బాధాకరమైనది, ఎంతో తీవ్రమైనది”. (హూద్: 11:102)
అబూ హయ్యాజ్ అల్ అసదీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నాతో అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఏ ఆదేశాలతో ఇక్కడికి పంపినారో, అవే ఆదేశాలతో నిన్ను కూడా పంపనా! ఏ చిత్రపటాన్నైనా, ప్రతిమ, బొమ్మ, శిల్పము మొదలైన వాటిని చెరిపి వేయకుండా, తొలగించకుండా వదలకు, అలాగే ఎత్తుగా నిర్మించిన లేదా ఏదైనా కట్టడం నిర్మించి ఉన్న ఏ సమాధిని కూడా నేలమట్టం చేయకుండా వదలకు.”
ముస్లిం నమోదు చేసినారు:(మక్కా విజయం తరువాత) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను - సజీవులదైనా లేదా నిర్జీవులదైనా (దేవతల) ఏ చిత్రపటాన్ని, శిల్పము, బొమ్మ, ప్రతిమను చూసినా దానిని తొలగించకుండా లేదా చెరిపివేయకుండా వదల రాదు అనే నిర్దేశాలతో నలువైపులకు పంపేవారు. అలాగే తన సహచరులను – ఎత్తుగా కట్టబడి ఉన్న ఏ సమాధినైనా లేదా ఏదైనా కట్టడము నిర్మించబడి ఉన్న ఏ సమాధినైనా సరే, దానిని ధ్వంసం చేయాలని లేదా నేలమట్టం చేయాలని, ఏ సమాధియైనా భూమికి ఒక మూరెడు ఎత్తు మాత్రమే ఉండాలనే నిర్దేశాలతో పంపే వారు.
ఇమ్రాన్ ఇబ్న్ హుసేన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే శకునాల కొరకు చూస్తాడో లేదా తన కొరకు ఏవైనా శకునాల భావార్థాన్ని (వ్యాఖ్యానాన్ని, తాత్పర్యాన్ని) తెలుసు కోవాలనుకుంటాడో; లేదా ఎవరైతే జోస్యము చెబుతాడో లేదా తన కొరకు జోస్యము చెప్పించుకుంటాడో; లేదా ఎవరైతే చేతబడి చేస్తాడో, లేక చేతబడి చేయిస్తాడో; అలాంటి వాడు మాలోని వాడు కాడు (అతడు ముస్లిం కాడు అని అర్థము). మరియు ఎవరైతే జోస్యుని దగ్గరకు వెళతాడో మరియు అతడు చెప్పిన దానిని విశ్వసిస్తాడో – అలాంటి వాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన దానిని విశ్వసించ లేదు.”
అల్ బజ్జార్ నమోదు చేసినారు:ఈ హదీసులో తన ఉమ్మత్’లో కొన్ని పనులు చేసే వాడిని “అతడు మాలోని వాడు కాడు” అని హెచ్చరించినారు. మొదటిది: “ఎవరైతే (పక్షిని) ఎగురవేసినాడో లేదా తన కొరకు (పక్షిని) ఎగురవేయమని నియమించినాడో”. ఈ ఆచారానికి మూలము – ఆ కాలములో ఎవరైనా ఏదైనా పని చేయాలని తలపెడితే, ఉదాహరణకు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని, లేక ఏదైనా దూర ప్రయాణము చేయాలని నిర్ణయించుకుంటే, లేదా ఇంకేదైనా పని చేయాలని నిర్ణయించుకుంటే – ముందుగా అతడు ఒక పక్షిని ఎగురవేసేవాడు (లేదా తన కొరకు పక్షిని ఎగురవేయమని ఎవరినైనా కోరేవాడు). ఆ పక్షి ఒకవేళ కుడివైపునకు ఎగిరిపోతే, శుభం జరుగుతుందని భావించి ఆ పని మొదలుపెట్టేవాడు. ఒకవేళ ఆ పక్షి ఎడమ వైపునకు ఎగిరిపోతే, అశుభం జరుగుతుందని భావించి ఆ పని చేయడం నుండి వెనుకడుగు వేసేవాడు. ఈ విధంగా తాను ఏదైనా పని చేయడానికి ముందు తాను స్వయంగా శకునం చూడడం లేదా ఎవరి చేతనైనా చేయించడం ఈ రెండూ నిషేధించబడినవే. ఎవరి ద్వారానైనా విని లేదా ఏదైనా చూసి అపశకునమని విశ్వసించడం (లేదా మంచి శకునమని విశ్వసించడం), అలాగే జంతువులను చూసి లేదా ఏదైనా అంగవైకల్యం గల వారిని చూసి ఆ విధంగా విశ్వసించడం లేదా ఫలానా అంకెలు లేదా ఫలానా రోజులు అపశకునమైనవి విశ్వసించడం, ఈ విధంగా మరింక దేనినైనా మంచి శకునానికి, అపశకునానికి, శుభానికి, అశుభానికి కారణాలుగా, ప్రతీకలుగా చూడడం, విశ్వసించడం – ఇవన్నీ కూడా ఇందులోనికే వస్తాయి. రెండవది: “ఎవరైనా జోస్యము చెప్పడం లేదా తన కొరకు జోస్యం చెప్పించుకోవడం”: నక్షత్రాలను లేదా అలాంటి ఇతరములను ఆధారం చేసుకుని ఎవరైనా తనకు అగోచర విషయాల ఙ్ఞానము ఉందని దావా చేసినట్లయితే లేదా అలా దావా చేసే వాని వద్దకు అంటే జోతిష్కుని వద్దకు వెళ్ళినా లేదా అతడు చెప్పిన దానిని విశ్వసించినా – అలాంటి వాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన దానిని (ఖుర్’ఆన్ ను) విశ్వసించలేదు. మూడవది: “చేతబడి”: అంటే చేతబడి చేసినా లేదా చేతబడి చేయమని ఎవరినైనా నియమించినా. సాధారణంగా ఇది ఎవరికైనా లాభం గానీ లేక నష్టం గానీ కలిగించడానికి – నిషేధిత మంత్రాలను ఉచ్ఛరిస్తూ దారాలపై ముడులు వేసి వాటిపై ఊదుతూ చేయబడుతుంది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలలో కొందరు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: (సహీహ్ ముస్లింలోని ఇదే హదీసులో హఫ్సహ్ బింత్ ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హా ఉల్లేఖించినట్లుగా పేర్కొనబడింది): “ఏదైనా విషయం గురించి ప్రశ్నించడానికి ఎవరైతే జ్యోతిష్కుని వద్దకు వెళతారో మరియు అతడు చెప్పిన దానిని విశ్వసిస్తారో – నలభై దినముల పాటు అతని నమాజులు స్వీకరించబడవు.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – భవిష్యత్తు గురించి చెప్పే వాని దగ్గరకు వెళ్ళరాదని హెచ్చరిస్తున్నారు. ‘జ్యోస్యుడు’, ‘కాలజ్ఞాని’, ‘దైవజ్ఞుడు’, ‘జ్యోతిష్కుడు’ మొదలైన పేర్లన్నీ అటువంటి వారిని సూచించడానికే వాడబడతాయి. ఈ రోజులలో వీళ్ళు ‘బాబాలు’ గా కూడా చెలామణి అవుతున్నారు. వీళ్ళు తాము ముందుగానే ఏర్పాటు చేసుకున్న కొన్ని విధానాల ద్వారా తమకు అగోచర విషయాల (భవిష్యత్తు) ఙ్ఞానము ఉన్నదని చెప్పుకుంటూ, తమకు తోచిన, ఊహించిన విషయాలను చెబుతూ ఉంటారు. అగోచర విషయాల ఙ్ఞానాన్ని గురించి అటువంటి వాడిని ప్రశించడం – ఎంత ఘోరమైన పాపము అంటే, అతడు నలభై దినముల పాటు ఆచరించిన నమాజుల పుణ్యఫలము నుండి అల్లాహ్ అతడిని దూరం చేస్తాడు. అది అతడి శిక్ష.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే నక్షత్ర గమనాల ద్వారా (గ్రహాల గమనాల ద్వారా) భవిష్యత్తు గురించి చెప్పే విద్యను నేర్చుకుంటే, అతడు చేతబడి (భూతవైద్యం, మంత్రతంత్రాల విద్య) లో ఒక భాగం (ఒక శాఖను) నేర్చుకున్నట్లే. అతడు ఎంత కాలం ఆ విద్యను గడించితే అంత ఎక్కువగా దానిని పొందినట్లే.”
అబూదావూద్, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ఎవరైతే నక్షత్రాల గమనాలను, గ్రహాల గమనాలను అధ్యయనం చేయడం ద్వారా, అవి (భూకక్ష్య లోనికి) ప్రవేశించడం లేదా (దూరంగా) వెళ్ళిపోవడం మొదలైన వాటి ద్వారా – భూమిపై జరిగే ఘటనలను, ఉదాహరణకు ఎవరి మృత్యువునకు లేక ఎవరి జన్మకు లేక ఎవరైనా వ్యాధిగ్రస్తులు కావడానికి, లేక అలాంటి విషయాలకు లేక భవిష్యత్తులో జరుగబోయే అలాంటి విషయాలకు ముడిపెట్టి వాటికి ఋజువులుగా చూపుతాడో – అతడు నిశ్చయంగా చేతబడి (మంత్రతంత్ర) విద్యలో ఒక భాగాన్ని నేర్చుకున్నట్లే. అతడు ఎంత ఎక్కువగా అందులో నిమగ్నమైపోతే అంత ఎక్కువగా ఆ విద్యను నేర్చుకున్నట్లే.
అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు కథనం మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెలియపర్చారు’మహాపరాధలలో అతి ఘోరమైనది ‘అల్లాహ్ కు ఇతరులను భాగస్వామ్యులుగా చేయడం‘అల్లాహ్ యొక్క శక్తి నుండి బేఖాతరు చేయకపోవడం,అల్లాహ్ కారుణ్యం నుండి నిరాశ చెందడం,అల్లాహ్ యొక్క ఆత్మ నుండి నమ్మకం కోల్పోవడం.
దాన్ని అబ్దుర్రజ్జాఖ్ ఉల్లేఖించారుఈ హదీసులో మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ మహాపరదాలుగా ఉన్న కొన్ని పాపాలను ప్రస్తావించారు,అవి : పరమపవిత్రుడైన అల్లాహ్ పోషణలో,లేక ఆరాధనలో ఇతరులను సాటి కల్పించడం,దీన్ని మొదట ప్రస్తావించడం జరిగింది ఎందుకంటే అది పాపాల్లో కెల్లా అతిపెద్ద పాపము,మరియు అల్లాహ్ కారుణ్యము నుండి నిరాశ చెందడం,ఎందుకంటే ఇది అల్లాహ్ పట్ల చెడు అనుమానము మరియు ఆయన కారుణ్య వైశాల్యత పట్ల అజ్ఞానము కలిగియుండటము,అల్లాహ్ తన దాసులపై వరాలు కురిపిస్తూ గడువు ఇస్తూ ఉండటం మరియు మరూపాటులో ఉన్నప్పుడూ హఠాత్తుగా పట్టుకోవడం వంటి వాటినుండి భయము లేకుండా ఉండటము,ఈ హదీసు అర్ధము ప్రస్తావించబడ్డ పాపాలు మాత్రమే పెద్దవి అని కాదు,మహాపాపాలు ఎన్నో ఉన్నాయి,అందులో అన్నింటికంటే పెద్ద పాపాలను ఇక్కడ ప్రస్తావించబడింది.