





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ అల్ ఆస్ రజియల్లాహు అన్హు మర్ఫు ఉల్లేఖనం;శకునం కారణంగా పని నుండి వెనుకకు మరలి పోయినవాడు నిశ్చయంగా షిర్క్ కు పాల్పడినట్లే ,సహాబాలు ప్రశ్నిస్తూ ‘దానికి ప్రత్యామ్నాయం/మార్గాంతరం ఏంటి ప్రవక్త అని ప్రశ్నించారు,ప్రవక్త బదులిస్తూ ‘ఈ విధంగా దుఆ చేయటం"అల్లాహుమ్మ లా ఖైర ఇల్లా ఖైరక,వలా తియర ఇల్లా తియరక వలా ఇలాహ గైరుక{ఓ అల్లాహ్ నీవు తప్ప మేలు ను వేరెవరు ప్రసాదించలేరు నీ శకునం తప్ప మరే శకునం లేదు నీవు తప్ప ఇతర వాస్తవ ఆరాధ్య దేవుడు లేడు}
దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారుఅల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఈ హదీసు ద్వారా తెలియజేస్తున్నారు :సంకల్పించుకున్న పనిని శకునం కారణంగా ఎవరైతే విరమించుకుంటాడో అతను ఒకరకమైన షిర్కు కు పాల్పడ్డాడు,అనుయాయులు సహాబాలు దైవప్రవక్తను ఈ మహాపాతకానికి పరిహారం ఏమిటి? అని అడిగితే ‘హదీసులో ఉన్నమహత్తర పదాలను పఠించాలని మార్గనిర్దేశం చేయబడింది,ఇందులో కార్యాల భారం అల్లాహ్ పై వేస్తూ మంచి చెడుల శక్తి ఆయనకు మాత్రమే ఉందని ఇతరలకు లేదని ఖండించడం జరిగింది.
ఉబాదహ్ ఇబ్న్ సామిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “”ఎవరైతే “లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, వ అన్న ఈసా అబ్దుల్లాహి, వ రసూలుహు, వ కలిమతుహు, అల్’ఖాహా ఇలా మర్యమ, వ రూహుమ్మిన్’హు, వల్ జన్నతు హఖ్ఖున్, వన్నారు హఖ్ఖున్”, అని సాక్ష్యం పలుకుతాడో, అల్లాహ్ అతడిని స్వర్గం లో ప్రవేశింపజేస్తాడు, అతడి ఆచరణలు ఏమైనప్పటికీ.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఈ క్రింది విషయాలు తెలుపుతున్నారు: ఎవరైతే తౌహీద్ వాక్యాలను, వాటి అర్థాన్ని, భావాన్ని బాగా అర్థం చేసుకుని, వాటిని ఉచ్చరిస్తాడో, మరియు వాటికి అనుగుణంగా ఆచరిస్తాడో, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు అని, ఆయన దాస్యానికి; మరియు ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు అని, ఆయన దౌత్యానికి సాక్ష్యం పలుకుతాడో; మరియు ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క దాసుడని, మరియు ఆయన సందేశహరుడని అంగీకరిస్తాడో, మరియు అల్లాహ్ ఆయనను (ఈసా అలైహిస్సలాం ను) కేవలం తన వాక్కు “కున్” (అయిపో) అనడం ద్వారా సృష్టించినాడని, ఆయన ‘అర్వాహ్’ (అల్లాహ్ సృష్టించిన ఆత్మలు ఉంచబడిన ప్రదేశం) లోని ఆత్మలలో ఒక ఆత్మ అని వాటిని అల్లాహ్ సృష్టించినాడని అంగీకరిస్తాడో, యూదులు ఆపాదించిన దాని నుండి (ఆరోపణ నుండి) ఆయన తన తల్లిని బయటకు తీసుకు వచ్చినాడని, స్వర్గము సత్యమని, మరియు నరకము సత్యమని, వాటి ఉనికి సత్యమని, అవి అల్లాహ్ ప్రసాదించే వరము (స్వర్గము), మరియు ఆయన విధించే శిక్ష (నరకము) అని విశ్వసిస్తాడో, మరియు దానిపైనే మరణిస్తాడో, అతని గమ్యస్థానము స్వర్గము – అతడు ఆచరణలలో తగినంత శ్రద్ధ చూపకపోయినా, పాపకార్యాలకు పాల్బడుతూ అవిధేయతకు పాల్బడినా కూడా.
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా నేను విన్నాను: “ఎవరైతే అల్లాహ్’తో ‘షిర్క్’ నకు పాల్బడకుండా (ఆయనకు ఎవరినీ, దేనినీ సాటి కల్పించకుండా, తౌహీద్ పై ఉండి) అల్లాహ్ ను కలుస్తాడో, అతడు స్వర్గం లో ప్రవేశిస్తాడు. మరియు ఎవరైతే అల్లాహ్‘కు ఇతరులను సాటి కల్పిస్తున్న స్థితిలో అల్లాహ్ ను కలుస్తాడో అతడు నరకంలో ప్రవేశిస్తాడు”.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపు తున్నారు: ఎవరైతే, అల్లాహ్ కు ఏవిషయంలోనూ, ఎవరినీ మరియు దేనినీ ఆయనకు సాటి కల్పించని స్థితిలో చనిపోతారో, అటువంటి వారు తాము చేసిన తప్పులకు, పాపాలకు కొద్ది కాలం నరక శిక్ష అనుభవించినా, చివరికి వారి శాశ్వత గమ్యస్థానము స్వర్గమే. అదేవిధంగా, ఎవరైతే షిర్క్ నకు పాల్బడుతున్న స్థితిలో (అల్లాహ్ కు సాటి కల్పిస్తున్న స్థితిలో) చనిపోతారో వారు శాశ్వతంగా నరకంలో వేయబడతారు.
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట అన్నారు; దానిపై నేను రెండో మాట అన్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “ఎవరైతే అల్లాహ్ ను గాక ఇంకెవరినైనా అల్లాహ్ కు సాటి కల్పిస్తూ వేడుకుంటాడో, మరియు ఆ విధానం పైనే మరణిస్తాడో అతడు నరకాగ్ని లోనికి ప్రవేశిస్తాడు.” మరియు నేను ఇలా అన్నాను “ఎవరైతే అల్లాహ్ ను గాక మరింకెవరినీ వేడుకొనడో అతడు స్వర్గములోనికి ప్రవేశిస్తాడు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఇలా తెలుపుతున్నారు: ఎవరైతే అల్లాహ్ కు చెందవలసిన దానిని వేరే ఇంకెవరికైనా అంకితం చేస్తారో, ఉదాహరణకు అల్లాహ్ కు కాకుండా వేరే వారికి దుఆ చేయడం, లేక ఆయనను గాక సహాయం కొరకు (ఆయన స్థానములో) వేరే ఇంకెవరినైనా అర్థిస్తాడో – మరియు అదే విధానం పై మరణిస్తాడు అతడు నరకవాసులలోని వాడు అవుతాడు. అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు దానికి కొనసాగింపుగా ఇలా అన్నారు: “ఎవరైతే ఎవరినీ లేక దేనిని అల్లాహ్ కు సాటి కల్పించకుండా, ఆ స్థితిలోనే మరణిస్తాడో అతని గమ్యస్థానము స్వర్గము.”
అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “(ధర్మం విషయంలో) ‘హద్దుమీరేవారు నాశనమయ్యారు”. అలా మూడు సార్లు అన్నారు.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో – (ధర్మం విషయంలో గానీ లేదా ప్రాపంచిక విషయంలో గానీ) ఇస్లాం విషయంలో హద్దులను ఉల్లంఘించి వ్యవహరించే వారు భంగపాటుకు, వైఫల్యానికి, ఆశాభంగానికీ గురి అవుతారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలుపుతున్నారు. అలాంటి వారు ధర్మం విషయంలో గానీ, తమ ప్రాపంచిక విషయాలలో గానీ, తమ సంభాషణల్లో గానీ లేదా తమ ఆచరణలలో గానీ సరియైన మార్గదర్శకత్వం లేక పోవటం వలననో, తగినంత ఙ్ఞానము లేక పోవటం వలననో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధించిన షరియత్ హద్దులను ఉల్లంఘిస్తారు.
ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం"అల్లాహ్ వాక్యం గురించి తెలియ పర్చారు(وَقَالُوا لا تَذَرُنَّ آلِهَتَكُمْ وَلا تَذَرُنَّ وَدًّا وَلا سُوَاعًا وَلا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا)"వారన్నారు ‘మీరు మీ ఆరాధ్య దైవాలను ఎన్నటికీ వదలకండి,వద్ద్ ను సువా ను యగూస్ ను యఊక్ ను నసర్ ను ఎన్నటికీ వదలకండి’’ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా తెలుపుతూ ‘ఈ పేర్లు అన్నీ నూహ్ అలైహిస్సలమ్ కాలం కు సంబంధించిన పుణ్యపురుషులు"చెప్పారు,వారు చనిపోయిన తరువాత షైతాన్ వారికి"ఆ పురుషులు కూర్చునే సమీక్ష స్థలాల్లో వారి గుర్తులను నెలకొల్పుకొని వారి పేర్లను పెట్టుకోవాలని ఉపదేశించాడు,షైతాన్ మాటలు విని వారు అలాగే చేశారు కానీ ఆరాధించలేదు,ఆ తరం నశించింది తరువాత సత్యాన్ని మరిచిపోయారు,ఆపై వారి ఆరాధన ప్రారంభమయింది.
దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారుఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఈ ఆయత్ వ్యాఖ్యానం ఇలా చేశారు :అల్లాహ్ ప్రస్తావించిన ఈ విగ్రహాల గురించి నూహ్ జాతి ప్రజలు వాటిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని భోదించుకునేవారు,అప్పటికి నూహ్ అలైహిస్సలామ్ వారికి షిర్కు చేయకూడదని వారించారు,అవి వాస్తవానికి గతించిన సత్పుర్షుల పేర్లు,షైతాన్ చెడు ప్రేరణలకు లోనై ప్రజలు వారి పట్ల అతిశయిళ్ళారు,చివరికి వారి ప్రతిమలను ఏర్పరుచుకున్నారు,ఆ తరువాతి కాలం గడిచాక అవే విగ్రహాలుగా ప్రతిష్టించుకోబడ్డాయి,పిదప అల్లాహ్ ను వదిలి వాటిని ఆరాధించడం జరిగింది.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే, (పేదరికం కారణంగా) తీసుకున్న అప్పు తీర్చలేక పోతున్న వానికి వ్యవధినిస్తాడో లేదా ఎవరైతే అతని అప్పులో కొంత భాగాన్ని తగ్గిస్తాడో, అతడికి అల్లాహ్ తన నీడ తప్ప మరింకే నీడ ఉండని ఆ తీర్పు దినమున తన అర్ష్ (సింహాసనము) క్రింద నీడ కల్పిస్తాడు”.
అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీసులో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరైతే (పేదరికం కారణంగా) తీసుకున్న అప్పు తీర్చలేక బాధపడుతున్న వానికి తగినంత సమయాన్ని ఇస్తాడో లేదా అతడి అప్పు నుండి కొంత భారాన్ని తగ్గిస్తాడో, అటువంటి వాని ప్రతిఫలాన్ని గురించి తెలియజేస్తున్నారు: తీర్పు దినము నాడు, సూర్యుడు తన పూర్తి ప్రతాపముతో ప్రకాశిస్తూ, అల్లాహ్ యొక్క దాసుల తలలను తాకేటంత క్రిందకు వస్తాడు, ఆ వేడికి వారంతా తల్లడిల్లి పోతుంటారు. ఏ నీడా అందుబాటులో లేని అటువంటి కఠినమైన సమయాన, అల్లాహ్ అతడికి తన సింహాసనము క్రింద నీడను ప్రసాదిస్తాడు. కనుక, అల్లాహ్ ఎవరికైతే నీడను ప్రసాదిస్తాడో, వారికి తప్ప ఇంకెవ్వరికీ ఆనాడు నీడ దొరకదు.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “అల్లాహ్ ఎవరికైతే మంచి చేయాలని తలపోస్తాడో అతడిని బాధలు, కష్టాలు అనుభవించేలా చేస్తాడు”.
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు – అల్లాహ్ ఒకవేళ విశ్వాసులైన తన దాసులలో ఎవరికైనా మంచి చేయాలని తలిస్తే (ముందుగా) వారిని కష్టాల పాలు చేయడం ద్వారా అంటే వారి సంపదలలో నష్టాలు లేదా వారి కుటుంబాలలో కష్టాల ద్వారా వారిని పరీక్షిస్తాడు. ఎందుకంటే, కష్టాలలో ఒక నిజమైన విశ్వాసి, దుఆల ద్వారా (అల్లాహ్ ను వేడుకొనడం ద్వారా) అల్లాహ్ వైపునకు మరలుతాడు. తద్వారా అతడి పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది, అతడి స్థానాలు ఉన్నతం అవుతాయి.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నేను మీతో ప్రస్తావించని దాని గురించి అనవసరంగా నన్ను అడగవద్దు. నిశ్చయంగా, మీకు పూర్వం ఉన్న వారిని నాశనం చేసింది చాలా ప్రశ్నలు అడగడమే మరియు తమ ప్రవక్తలతో విభేదించడమే. కాబట్టి, నేను మిమ్మల్ని దేనినుంచైనా నిషేధించినట్లయితే, దాని నుండి దూరంగా ఉండండి; మరియు నేను మీకు ఏదైనా చేయమని ఆజ్ఞాపిస్తే, మీ శక్తి మేరకు చేయగలిగినంత చేయండి.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షరియత్ యొక్క నియమాలను మూడు విభాగాలు చేసి ప్రస్తావిస్తున్నారు: అవి 1) ప్రస్తావించబడని విషయాలు; 2) నిషేధాలు; మరియు 3) ఆదేశాలు. మొదటి భాగనికి సంబంధించి: ఇవి ఏ విషయాలపైనైతే షరియత్ మౌనంగా ఉన్నదో ఆ విషయాలు; వాటి గురించి ఒక ప్రత్యేకమైన ఆదేశం అంటూ లేని విషయాలు; అటువంటి విషయాల పట్ల ప్రాథమిక సూత్రం ఏమిటంటే వాటి గురించి ఏమీ విధి చేయబడ లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు సంబంధించి ఆయన కాలములో, “ఇది విధి చేయబడుతుందేమో”, లేక “ఇది నిషేధించ బడుతుందేమో” అనే భయంతో ఏదైనా విషయానికి సంబంధించి అనేక ప్రశ్నలు అడగ వలసిన అవసరం లేదు (ఎందుకంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారి మధ్యనే ఉన్నారు కనుక). ఆ విషయాలను ఆ విధంగానే వదలివేసి, నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల పట్ల కరుణ చూపినాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తర్వాత, ప్రశ్న ఫత్వా రూపంలో లేదా మతపరమైన విషయాలలో ఏమి అవసరమో బోధించుటకు సంబంధించినది అయితే, అది అనుమతించబడుతుంది, వాస్తవానికి అది ఆదేశంగా పరిగణించబడుతుంది. ఏదైనా విషయానికి సంబంధించి మొండిపట్టుగా, లేదా కపటత్వముతో కూడిన వాదనలకు ఒడిగట్టడం వంటి వాటికి దూరంగా ఉండమని ఈ హదీథులో ఉపదేశించబడుతున్నది. ఎందుకంటే అది ఇస్రాయీలు సంతతివారికి ఏమి జరిగినదో దానికి (పరాభవానికి, కష్టానికి) దారి తీస్తుంది. వారిని ఒక ఆవు బలి ఇవ్వమని ఆదేశించడం జరిగింది. వారు ఏదైనా ఒక ఆవు తీసుకువచ్చి బలి ఇస్తే ఆ ఆదేశంపై అమలు చేసిన వారయ్యేవారు. కానీ వారు ఆ ఆవు వివరాలకు సంబంధించి అనవసరమైన వాదనలో దిగి కఠినావస్థలో పడిపోయారు. అందుకని ఆ ఆదేశాన్ని పాటించడం వారికి కఠినతరం చేయబడింది. రెండవది: “నిషేధాలు”: నిషేధించిన వాటిని వదిలి వేసిన వానికి పుణ్యఫలం లభిస్తుంది; ఆ పనులకు పాల్బడిన వానిని శిక్షించడం జరుగుతుంది. కనుక నిషేధాలన్నింటికీ దూరంగా ఉండాలి. మూడవది: “ఆదేశాలు”: ఆదేశించబడిన విషయాలను ఆచరించిన వాడు పుణ్యఫలం పొందుతాడు, ఆదేశించబడిన విషయాలను ఆచరించకుండా వదలివేసిన వాడు శిక్షించబడతాడు. కనుక ఆదేశించబడిన విషయాలను ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు ఆచరించాలి.