





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఒక వ్యక్తి ఇలా అనగా విన్నారు: “కాదు; ఈ కాబా సాక్షిగా” అని. అపుడు ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా అతనితో ఇలా అన్నారు: “అల్లాహ్ పేరున గాక మరింకెవరి పేరునా ప్రమాణం చేయకు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా నేను విన్నాను: “ఎవరైతే అల్లాహ్ పేరున గాక మరింకెవరి పేరుతో ప్రమాణం చేస్తారో, నిశ్చయంగా వారు అవిశ్వానికి పాల్బడినట్లే లేదా అల్లాహ్ కు సాటి కల్పించినట్లే”.
అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు – ఎవరైతే అల్లాహ్ పై కాకుండాఇతరులపై లేదా వారి పేర్లపై లేదా వారి గుణగణాలపై ప్రమాణం చేస్తారో, నిశ్చయంగా వారు అల్లాహ్ పట్ల అవిశ్వాసానికి పాల్బడినట్లే లేక ఆయనకు సాటి కల్పించినట్లే. ఎందుకంటే ప్రమాణం చేయడం అనేది, మనం ఎవరిపై ప్రమాణం చేస్తున్నామో, నిశ్చయంగా అందులో వారి ఘనతను, వారి ఔన్నత్యాన్ని అనివార్యం చేస్తుంది. నిజానికి ఘనత, ఔన్నత్యమూ ఏకైకుడైన అల్లాహ్ కొరకు మాత్రమే. కనుక పరమ పవిత్రుడైన అల్లాహ్ పై, ఆయన శుభనామములపై లేక ఆయన గుణగణాలపై తప్ప (మరింక ఎవరిపైనా, దేనిపైనా) ప్రమాణము చేయరాదు. (ఇతరుల పేరున) ప్రమాణం చేయడం అనేది “తక్కువ స్థాయి షిర్క్” (అష్షిర్క్ అల్ అస్గర్) అనబడుతుంది. అయితే, (కొంతమంది ఉలమాల అభిప్రాయం ప్రకారం) ప్రమాణం చేయునపుడు, ఎవరి పేరున అయితే ప్రమాణం చేస్తున్నారో అతడిని, సర్వోన్నతుడైన అల్లాహ్ ను ఏవిధంగానైతే అత్యంత ఉత్తమమైన పేర్లతో, ప్రశంసనీయ పదాలతో పొగుడుతామో, అతడిని కూడా అల్లాహ్ ను స్తుంతించిన స్థాయిలో లేదా అంతకంటే ఎక్కువగా స్తుతించినట్లయితే అది “పెద్ద షిర్క్” (అష్షిర్క్ అల్ అక్బర్) అనబడుతుంది.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నిశ్చయంగా కపటులపై అత్యంత భారమైన నమాజులు ఇషా మరియు ఫజ్ర్ నమాజులు. వాటిలో ఏమి (శుభము దాగి) ఉన్నదో ఒకవేళ వారికి తెలిస్తే, వారు (తమ కాళ్ళపై నడవలేక) ప్రాకుతూ రావలసి వస్తే, అలా ప్రాకుతూ అయినా వస్తారు. నిశ్చయంగా కొన్నిసార్లు నేనిలా అనుకున్నాను – సలాహ్ కొరకు ఆదేశించి (అదాన్ ఇవ్వమని ఆదేశించి), సలాహ్ ప్రారంభించమని చెప్పి (ఇఖామత్ పలుకమని ఆదేశించి), ఒక వ్యక్తిని ప్రజలకు నమాజు చదివించమని ఆదేశించి, తరువాత ఒక వ్యక్తిని కట్టెల మోపుతో నావెంట తీసుకుని బయలుదేరి, నమాజు కొరకు రాని వారి వైపునకు వెళ్ళి, వారిని వారి ఇళ్ళతో సహా తగులబెట్టాలని భావించినాను.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కపట విశ్వాసుల గురించి మరియు నమాజులు ఆచరించుటకు హాజరు కావడంలో – ప్రత్యేకించి ఇషా మరియు ఫజ్ర్ నమాజులు ఆచరించుటకు హాజరు కావడంలో - వారి సోమరితనాన్ని గురించి తెలియజేస్తున్నారు. మరియు వాటిలో ఎంతటి ప్రతిఫలం ఉన్నదో మరియు వాటిని ముస్లిములు జమా’అత్ తో ఆచరించుటకు హాజరు కావడంలో ఎంతటి పుణ్యం ఉన్నదో ఒకవేళ వారికి తెలిస్తే, పిల్లవాడు తన చేతులు మరియు మోకాళ్ళపై పాకిన విధంగా పాకుతూ అయినా వస్తారు అని తెలియజేస్తున్నారు. మరియు నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "నమాజు కొరకు (అదాన్ ఇవ్వమని) ఆదేశించి, నమాజు ప్రారంభించుటకు (అఖామత్ ఇవ్వమని) ఆదేశించి, ఒక వ్యక్తిని తన స్థానములో ప్రజలకు ఇమామత్ చేయమని (నమాజు చదివించమని) ఆదేశించి, తరువాత కట్టెల మోపులతో ఒకవ్యక్తిని తన వెంట తీసుకుని, జమాఅత్’తో నమాజు ఆచరించుటకు రాకుండా (తమ ఇళ్లలోనే) ఉండి పోయిన వారి ఇళ్ళకు వెళ్ళి, వారిని వారి ఇళ్ళతో సహా తగులబెట్టాలని" నిశ్చయించుకున్నారు. ఎందుకంటే ఆ విషయములో (నమాజు కొరకు రాకుండా ఉండిపోవడంలో) వారు పాల్బడిన పాపము యొక్క తీవ్రత కారణంగా వారు అలా భావించినారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా చేయలేదు, ఎందుకంటే ఇళ్ళలో స్త్రీలు, అమాయకులైన పిల్లలు మరియు ఇతరులు ఉంటారు కనుక, మరియు వారి భార్యాబిడ్డలపై దోషము ఏమీ లేదు కనుక.
అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ప్రజలలో అత్యంత నీచులు, దుష్టులు ఎవరంటే, వారు జీవించి ఉండగానే ప్రళయఘడియ వచ్చి పడుతుంది, మరియు ఎవరైతే సమాధులను తమ ఆరాధనా గృహాలుగా (మస్జిదులుగా) చేసుకున్నారో.”
ఆహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అత్యంత నీచులు, దుష్టులను గురించి ఇలా తెలియజేస్తున్నారు: వారు జీవించి ఉండగానే ప్రళయఘడియ వచ్చి పడుతుంది; మరియు ఎవరైతే సమాధులను మస్జిదులుగా చేసుకున్నారో, అంటే వారు సమాధుల వద్ద తమ నమాజులను ఆచరిస్తారు, మరియు వాటి వైపునకు తిరిగి నమాజులను ఆచరిస్తారు.
మహ్’మూద్ ఇబ్న్ లబీద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: మహ్’మూద్ ఇబ్న్ లబీద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా మీ విషములో నేను భయపడే విషయం ఏమిటంటే – మీరు చిన్న షిర్క్ కు పాల్బడతారేమోనని.” అక్కడ ఉన్న వారు ఇలా ప్రశ్నించారు “చిన్న షిర్క్ అంటే ఏమిటి ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం?” దానికి ఆయన “ప్రదర్శనా తత్వము (ఏ మంచి పనినైనా లోకులు మెచ్చుకోవాలనే సంకల్పముతో చేయడం) మరియు కాపట్యము” అన్నారు. తీర్పు దినమునాడు ప్రజలకు వారి వారి ప్రతిఫలం ఇవ్వబడుతున్నపుడు, సర్వ శక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ వారితో ఇలా అంటాడు: “ప్రపంచ జీవితంలో (మీరు అల్లాహ్ ను వదిలి) ఎవరినైతే ఆరాధిస్తూ వచ్చినారో వారి వద్దకు వెళ్ళండి, వెళ్ళి వారి వద్ద చూడండి (మీ కొరకు) ఏమైనా ప్రతిఫలం ఉన్నదేమో.”
ఆహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతున్నారు: తన ఉమ్మత్ (అనుయాయుల జాతి) పట్ల తాను ఎక్కువగా భయపడే విషయం చిన్న షిర్క్, అంటే ప్రదర్శనా తత్వము (ఏ మంచి పనినైనా లోకులు మెచ్చుకోవాలనే సంకల్పముతో చేయడం) మరియు కాపట్యము గురించి అని. తరువాత ఆయన అటువంటి కపటుల యొక్క శిక్ష ఏమిటో చెప్పారు. తీర్పు దినము నాడు వారికి చెప్పబడుతుంది – ప్రాపంచిక జీవితంలో (ఏ మంచి పనినైనా) మీరు ఎవరి కొరకైతే ఆచరించేవారో వారి వద్దకు వెళ్ళండి. వెళ్ళి చూడండి, మీరు ఆచరించిన దానికి వారేమైనా ప్రతిఫలం ఇవ్వగలరేమో అని.
అదీ బిన్ హాతిమ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ఆయన మహనీయ ప్రవక్తను ఈ ఆయత్ పటిస్తుండగా విన్నాను “ "اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِنْ دُونِ اللَّهِ وَالْمَسِيحَ ابْنَ مَرْيَمَ وَمَا أُمِرُوا إِلاَّ لِيَعْبُدُوا إِلَهًا وَاحِدًا لا إِلَهَ إِلاَّ هُوَ سُبْحَانَهُ عَمَّا يُشْرِكُونَ" {వారిలోని పండితులను మరియు సన్యాసులను అల్లాహ్ కు సాటిగా వారు ప్రభువు గా చేసుకున్నారు మరియు మర్యం పుత్రుడైన ఈసా ఆయన వారికి కేవలం ఏక దైవ ఆరాధన చేయాలని,అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్యుడు లేడు అని ,అల్లాహ్ కు సాటికల్పిస్తున్న విషయాలన్నింటి నుండి ఆయన పరిశుద్దుడు అని భోదించారు }‘నేను దైవప్రవక్తతో మేము వారిని ఆరాధించేవారము కాదు కదా ?అని అడిగాను ప్రవక్త బదులిస్తూ ‘వారు అల్లాహ్ హలాలు పర్చిన విషయాలను హరామ్ చేయలేదా మీరు వాటిని హరామ్ గా భావించలేదా? అల్లాహ్ నిషిద్దపర్చిన విషయాలను హలాల్ చేయలేదా మీరు వాటిని హలాల్ గా భావించలేదా? అని ప్రశ్నించారు,దానికి నేను అవును! అన్నాను ఆయన మరి అదే దాస్యం చూపడం అంటే అని జవాబిచ్చారు
దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారుమహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ యూదుల మరియు క్రైస్తవుల కు చెందిన ఈ ఆయత్ పఠించి"వారు తమ పండితులను,సన్యాసులను ప్రభువుగా మలుచుకున్నారు,వీరు ప్రజల కొరకు చట్టాలను మలిచేవారు,షరీఅతుకు వ్యతిరేఖంగా అవి ఉండేవి,ప్రజలు వారికి విధేయత చూపేవారు-అన్న విషయాలు చెప్పినప్పుడు సహాబీ విన్నారు కానీ అర్ధం ఆయనకు చేసుకోవడం క్లిష్టమైంది,ఆయన ఆరాధన అంటే సజ్దాలు మొ ”చేయడం వరకే పరిమితం అనుకున్నారు,కానీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారు సహాబీకి కలిగిన సంశయాన్ని దూరంచేస్తూ– పండితుల మరియు సన్యాసుల ఆరాధన అర్ధఏమిటంటే ‘ అల్లాహ్ మరియు దైవప్రవక్త ఆదేశాలకు వ్యతిరేఖంగా హలాలు ను హరాము గా హరామును హలాలు గా ప్రకటించడంలో వారి కి విధేయత చూపడం.
అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : ముఆద్ ఇబ్నె జబల్ రజియల్లాహు అన్హు ను యమన్ కు పంపునపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనతో ఇలా అన్నారు: “నిశ్చయంగా నీవు ఇప్పుడు గ్రంథావహులైన జాతి (ప్రజల) వద్దకు వెళుతున్నావు. వారి వద్దకు చేరినపుడు “అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు” అని సాక్ష్యం పలుకమని వారిని ఆహ్వానించు. మరి వారు ఆ విషయంలో నిన్ను అనుసరిస్తే, వారికి తెలియజేయి ‘నిశ్చయంగా వారిపై ప్రతి రోజూ ఐదు పూటల నమాజు ఆచరించుటను అల్లాహ్ విధిగా చేసినాడు’ అని. వారు ఆ విషయంలో నిన్ను అనుసరిస్తే, వారికి తెలియజేయి ‘నిశ్చయంగా అల్లాహ్ వారిపై ‘సదాఖా చెల్లించుటను (జకాత్ చెల్లించుటను) విధిగా చేసినాడు’ అని, ‘అది వారిలోని ధనవంతుల నుండి తీసుకోబడుతుంది మరియు వారిలోని పేదవారికి ఇవ్వబడుతుంది’ అని. వారు అందులో కూడా నిన్ను అనుసరించినట్లయితే (ఓ ముఆద్!) వారి సంపదలలోని విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త (జకాతులో భాగంగా వాటిని తీసుకునే ప్రయత్నం చేయకు). అన్యాయానికి, దౌర్జన్యానికి గురైన వాని దువా పట్ల భయపడు. ఎందుకంటే, నిశ్చయంగా వాని ఆక్రందనకూ, అల్లాహ్ కు మధ్య ఎటువంటి అడ్డూ ఉండదు”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుముఆద్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు ను, ఇస్లాం ధర్మం వైపునకు ఆహ్వానించే ఒక దాయీగా, మరియు అక్కడి ప్రజలకు ఇస్లాం విధి విధానాలను నేర్పించే ఒక గురువుగా, యమన్ దేశానికి పంపునపుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు వివరించినారు – నీవు క్రైస్తవులతో ముఖాముఖీ కాబోతున్నావని, వారి కొరకు (అన్ని విధాలా) తయారుగా ఉండాలని, ఇంకా వారికి ధర్మబోధలో భాగంగా అతిముఖ్య విషయాలు బోధించి ఆ తరువాత ముఖ్య విషయాలను బోధించమని వివరించినారు. ధర్మం పరంగా, వారి విశ్వాసాన్ని తీర్చి దిద్దాడానికి, సంస్కరించడానికి అతడు ముందుగా వారిని “అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని సాక్ష్యం పలుకుట వైపునకు ఆహ్వానిస్తాడు. ఎందుకంటే అలా సాక్ష్యం పలుకుట ద్వారానే వారు ఇస్లాం లోనికి ప్రవేశిస్తారు. ఒకవేళ వారు దానికి సమ్మతించి అనుసరించినట్లయితే, అపుడు వారిని సలాహ్ (నమాజు) స్థాపించమని ఆదేశిస్తాడు. ఎందుకంటే ఒక ముస్లిం కొరకు తౌహీద్ (నిజ ఆరాధ్యుడు కేవలం ఏకైకుడైన అల్లాహ్ మాత్రమే అని విశ్వసించుట) తరువాత అతి ముఖ్యమైనది సలాహ్ యే. ఒకవేళ వారు దానిని స్థాపించినట్లయితే, వారిలోని ధనవంతులను, తమ సంపదలలో నుంచి పేదవారికి జకాత్ చెల్లించమని ఆదేశిస్తాడు. అలాగే జకాతు పేరున సంపదలలో నుండి ఉత్తమమైన వాటిని ఏరి తీసుకో రాదనే హెచ్చరిక కూడా ఉంది. ఎందుకంటే, విధి నిర్వహణ సమతుల్యతతో కూడి ఉంటుంది. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్యాయానికి పాల్బడ వద్దని హితబోధ చేసినారు. అన్యాయానికి పాల్బడినట్లయితే, అలా అన్యాయానికి గురైన వాడు అల్లాహ్ వద్ద మొరపెట్టుకుంటాడు మరియు అతడి మొర స్వీకరించబడుతుంది.
జాబిర్ రజియల్లాహు అన్హుఉల్లేఖనం : మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారితో ‘అన్నుష్ర ’{మంత్ర విద్యను మంత్ర విద్య తో దూరం చేయడం} గురించి ప్రశ్నించటం జరిగింది,ఆయన అది షైతాన్ చర్య అని బదులిచ్చారు.
దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు - దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారుఅజ్ఞానకాలం లోని జనులు ఆచరించే మాంత్రిక విద్యతో చేసే చికిత్స గురించి దాని ఆదేశమేమిటి అని మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లమ్’తో ప్రశ్నించగా?ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ బదులిస్తూ–నిశ్చయంగా అది షైతాన్ చర్య లేదా షైతాన్ సహాయం ఉపయోగించే చర్య,ఎందుకంటే జాదూలో ఎన్నో రకాల తాంత్రిక విద్యలతో పాటు,షైతాన్ సహాయం కూడా ఉంటుంది కాబట్టి ఇది షిర్కుతో కూడిన ఒక షైతాన్ చర్య,కాబట్టి దీన్ని‘రుఖియ లేదా మంత్రించిన దాన్నివెలికి తీసి చేతితో నష్టపరచి దూరం చేయొచ్చు,ఖుర్ఆన్ పారాయణం చేస్తూ హలాల్ మందులను ఉపయోగించి కూడా చేతబడి ని నష్టపర్చవచ్చు.
ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా నేను విన్నాను: “మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం ను క్రైస్తవులు (హద్దుమీరి) కీర్తించిన విధంగా, నా ప్రశంసలో అతిశయం చేయకండి. నిశ్చయంగా నేను ఆయన (అల్లాహ్) దాసుడను. కనుక నన్ను ‘అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు’ అని మాత్రమే అనండి.
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ హదీసులో: క్రైస్తవులు ఈసా ఇబ్నె మరియం అలైహిస్సలాం విషయంలో ఏ విధంగానైతే మితిమీరినారో, ఆ విధంగా – షరియత్ విధించిన పరిమితులు అతిక్రమించి, అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకమైన ఆయన గుణగణాలతో, ఆయన కార్యాలతో, ఆయన అగోచర ఙ్ఞానంతో సమానంగా లేదా ఆయనను వేడుకునే విషయంలో సమానంగా – (హద్దులు దాటి) తనను కీర్తించడాన్ని, తన గుణగణాలను అతి చేసి ప్రశంసించడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధిస్తున్నారు. ఇంకా తాను అల్లాహ్ యొక్క దాసులలో ఒక దాసుడను అని స్పష్టం చేస్తున్నారు. అందుకని తనను ‘అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు’ అని మాత్రమే అనమని మనల్ని ఆదేశిస్తున్నారు.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను వారిని ఇలా అడిగాను “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! తీర్పు దినమునాడు (అల్లాహ్ వద్ద) మీ మధ్యవర్తిత్వం లభించే (మీ సిఫారసు పొందే) ఆ అదృష్టవంతుడెవరు?”. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “ ఓ అబూ హురైరాహ్! నేను అనుకుంటూనే ఉన్నాను నీ కంటే ముందు ఎవరూ ఈ ప్రశ్న అడుగరు అని నాకు తెలుసు, నీలో హదీసులు నేర్చుకునే ఆశ, ఆసక్తి ఎక్కువ అనీను. తీర్పు దినమునాడు నా మధ్యవర్తిత్వాన్ని పొందే (నా సిఫారసు పొందే) ఆ అదృష్టవంతుడు ఎవరంటే – “లా ఇలాహ ఇల్లల్లాహ్” (నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, కేవలం అల్లాహ్ తప్ప) అని ఎవరైతే నిష్కల్మషంగా, హృదయపూర్వకంగా పలుకుతాడో అతడు".
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు – తీర్పు దినము నాడు తన మధ్యవర్తిత్వాన్ని పొందే వారు ఎవరంటే, ఎవరైతే ‘నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, కేవలం అల్లాహ్ తప్ప’ అని చిత్తశుద్ధితో హృదయపూర్వకంగా పలుకుతాడో’. అంటే, ‘కేవలం అల్లాహ్ తప్ప, నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు’ అని పలుకబడే సాక్ష్యం స్వచ్ఛమైనదై ఉండాలి, షిర్క్ (అల్లాహ్ కు ఇతరులను సాటి కల్పించడం) మరియు కపటత్వముల నుండి విముక్తి అయినదై ఉండాలి.