





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబూ ముహమ్మద్ అబ్దుల్లాహ్ ఇబ్నె అమర్ ఇబ్నిల్ ఆస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "మీలో ఎవరూ విశ్వాసి కాలేడు - నేను తెచ్చిన దానికి అతని కోరికలు అనుసరించేలా చేసేంత వరకు."
కితాబ్ అల్-హుజ్జహ్ లో ప్రామాణికమైన ఇస్నాద్ తో నమోదు చేసినారు:ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు: ఒక వ్యక్తి తన విశ్వాసంలో పరిపూర్ణతను పొందలేడు - అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెచ్చిన ఆజ్ఞలు, నిషేధాలు మరియు ఇతర విషయాలను ప్రేమించేంత వరకు. తద్వారా అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించిన వాటిని ప్రేమిస్తాడు, మరియు ఆయన నిషేధించిన వాటిని ద్వేషిస్తాడు.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "నాలుగు లక్షణాలు ఎవరిలో ఉంటాయో, అతను కపటివాడు అవుతాడు. ఒకవేళ వాటిలో ఒక లక్షణం అతనిలో ఉంటే, అతను దానిని విడిచిపెట్టే వరకు అతనిలో కపటత్వపు ఒక లక్షణం ఉన్నట్లే. ఆ లక్షణాలు ఏమిటంటే: అతను మాట్లాడితే అబద్ధం చెబుతాడు, వాగ్దానం చేస్తే దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాడు, వాగ్దానం చేస్తే దానిని భంగం చేస్తాడు, మరియు ఒప్పందం చేసుకుంటే మోసం చేస్తాడు."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాలుగు లక్షణాలకు వ్యతిరేకంగా హెచ్చరించారు, ఒక ముస్లింలో ఈ నాలుగు లక్షణాలు కలిసి ఉంటే, ఈ లక్షణాల కారణంగా అతను కపటులను బలంగా పోలి ఉంటాడు. ప్రగాఢంగా ఈ లక్షణాలను కలిగి ఉన్నవారికి ఇది వర్తిస్తుంది, కానీ అరుదుగా ఉన్నవారు ఈ వర్గంలో చేర్చబడరు. అవి: మొదటిది: అతను మాట్లాడేటప్పుడు, అతను ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెబుతాడు మరియు అతడు తన మాటలలో సత్యవంతముగా ఎప్పుడూ ఉండడు. రెండవది: అతను ఒడంబడిక చేస్తే, అతను దానిని నెరవేర్చడు, మరియు అతని సహచరుడికి ద్రోహం చేస్తాడు. మూడవది: అతను వాగ్దానం చేస్తే, అతను దానిని నెరవేర్చడు మరియు దానిని ఉల్లంఘిస్తాడు. నాల్గవది: అతను ఎవరితోనైనా వాదనకు దిగి, గొడవపడితే, అతని వాదన తీవ్రంగా ఉంటుంది, అతను సత్యం నుండి వైదొలగుతాడు, మరియు అతను దానిని తిరస్కరించడానికి మరియు దానిని చెల్లనిదిగా చేయడానికి కుతంత్రాలను పన్నుతాడు, మరియు అతను అబద్ధాలు చెబుతాడు. కపటత్వము అంటే, అది లోన ఉన్న దానికి వ్యతిరేకంగా బయటకు చూపడం. ఈ అర్థం ఈ లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తిలో కనుగొనవచ్చు. అతని కపటత్వం అతనితో మాట్లాడే, అతడు వాగ్దానం చేసే, అతను వాదనకు దిగే మరియు అతడు ప్రజలలో ఏదైనా ఒడంబడిక చేసుకునే వారి పట్ల కనిపిస్తుంది. కపటవాది అంటే ఇస్లాంలో అని మాత్రమే కాదు. అతడు తన అవిశ్వాసాన్ని కప్పిపుచ్చుకుంటూ తన కపటత్వాన్ని చూపుతాడు. ఎవరైతే ఈ లక్షణాలలో ఒకదానిని కలిగి ఉంటారో, అతను దానిని విడిచిపెట్టే వరకు అతను కపటత్వం యొక్క ఒక లక్షణాన్ని కలిగి ఉంటాడు.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “ఎవరి చేతిలోనైతే ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా, ఈ జాతిలో (ఈ మానవ జాతిలో) అది యూదుల జాతి గాని, మరియు క్రైస్తవుల జాతి గానీ ఎవరైతే నా గురించి విని కూడా నేను ఏ సందేశముతో అయితే పంపబడినానో దానిని విశ్వసించకుండానే చనిపోతాడో, అతడు తప్పకుండా నరకవాసులలో ఒకడు అవుతాడు.”
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పై ప్రమాణం చేసి ఇలా అంటున్నారు – ఈ జాతిలో (ఈ మానవ జాతిలో) అది యూదులు కానీ, క్రైస్తవులు కానీ లేక వేరే ఇంకెవరైనా కానీ వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశము చేరిన తరువాత దానిని విని కూడా, ఆ సందేశాన్ని విశ్వసించకుండా (ఇస్లాం ను స్వీకరించకుండా) చనిపోతే, నిశ్చయంగా అటువంటి వాడు నరకవాసులలో ఒకడు అవుతాడు. నరకం లో అతడు శాశ్వతంగా పడిఉంటాడు.
ఆయిషా మరియు అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమ్ ఉల్లేఖనం : అది రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఆయన అంతిమ ఘడియలు అవతరిస్తున్న సమయం. అపుడు ఆయన (తాను కప్పుకుని ఉన్న) దుప్పటిని తన ముఖము పైకి లాక్కుని, అసౌకర్యముగా అనిపించిన వెంటనే ముఖముపై నుండి తీసివేయసాగినారు. ఆయన ఆ స్థితిలో ఉండి (కూడా) ఇలా అన్నారు “క్రైస్తవులు మరియు యూదులపై అల్లాహ్ యొక్క శాపము ఉండుగాక, వారు తమ ప్రవక్తల సమాధులను మస్జిదుగా (ఆరాధనా గృహాలుగా) చేసుకున్నారు”. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన పని గురించి హెచ్చరించారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో - ఆయిషా మరియు అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమ్ మనకు ఇలా తెలియజేస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మృత్యు ఘడియలు సమీపించినపుడు, వారు (తాను కప్పుకుని ఉన్న) వస్త్రము యొక్క భాగాన్ని తన ముఖము పైకి లాక్కుంటూ, మృత్యువేదన కారణంగా (అలా కప్పుకుని ఉండడం) కష్టమనిపించినపుడు, ఆ వస్త్రాన్ని తన ముఖము పైనుంచి తీసివేసేవారు. అంతటి కఠిన ఘడియలలో ఉన్నపుడు, వారు ఇలా అన్నారు: “అల్లాహ్ యొక్క శాపము యూదులు మరియు క్రైస్తవులపై ఉండుగాక, వారిని తన కరుణ నుంచి దూరం చేయుగాక, ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులపై మస్జిదులు (ఆరాధనా గృహాలు) నిర్మించుకున్నారు”. ఈ విషయము ఇంత గంభీరమైనది కాకపోయి ఉంటే వారు ఆ స్థితిలో (ఉండి కూడా) అలా అని పలికే వారు కాదు. ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ ను అలా చేయడము నుండి నిషేధించినారు. ఇది (అంటే సమాధులపై ఆరాధనా గృహాలను నిర్మించుట) యూదులు మరియు క్రైస్తవుల ఆచరణ, మరియు ఇది అల్లాహ్ తో షిర్క్ చేయుటకు (ఇతరులను అల్లాహ్ కు సమానులుగా నిలబెట్టుటకు) ఒక మార్గము అవుతుంది.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఓ అల్లాహ్! నా సమాధిని (పూజించబడే) ఒక విగ్రహం మాదిరి కానివ్వకు. అల్లాహ్ వారిని శపించుగాక – ఎవరైతే తమ ప్రవక్తల సమాధులను సజ్దా (సాష్టాంగం) చేసే స్థలాలుగా చేసుకున్నారో!"
ఆహ్మద్ నమోదు చేసినారు:తన సమాధిని, ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజించే మరియు దానికి సజ్దాలు చేసే (సాష్టాంగాలు చేసే) ఒక విగ్రహం మాదిరిగా చేయకు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువు అయిన అల్లాహ్ ను వేడుకున్నారు. ఇంకా ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘ఎవరైతే ప్రవక్తల సమాధులను సజ్దాలు చేసే (సాష్టాంగాలు చేసే) స్థలంగా చేసుకున్నారో, అల్లాహ్ వారిని తన కారుణ్యం నుండి తొలగించి వేస్తాడని తెలియ జేసినారు. ఎందుకంటే వాటిని ప్రార్థనా స్థలాలుగా చేసుకోవడం అనేది కాలక్రమంలో వాటిపై తమ విశ్వాసాన్ని పెంచు కోవడానికి మరియు వాటిని పూజించడానికి ఒక మార్గంగా మారగలదు.
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు దైవ ప్రవక్త ద్వారా ఉల్లేఖిస్తూ చెబుతున్నారు : నిశ్చయంగా దైవప్రవక్త తెలియజేశారు"నిశ్చయంగా ఎంత పెద్ద ఆపద వస్తే దానికి అంతటి పుణ్యం ఉంటుంది,నిస్సందేహంగా అల్లాహ్ తఆలా ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని పరీక్షకు గురిచేస్తాడు,ఎవరైతే దీంట్లో సహనంగా ఓర్పుతో ఉంటాడో అల్లాహ్ అతనిపట్ల సంతోష పడుతాడు మరెవరైతే విముఖత చూపుతాడో అల్లాహ్ కూడా అతనిపట్ల క్రోధాన్ని చూపుతాడు
దాన్ని ఇబ్నె మాజ ఉల్లేఖించారు - దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారుమహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఈ హదీసు ద్వారా తెలియజేసారు - ముస్లిముకు తన ధన ప్రాణాల విషయంలో ఆపదలకు పరీక్షలకు గురి అవ్వాల్సి వస్తుంది,ఈ అపదల్లో సహనం ఓర్పువహించిన వాడికి అల్లాహ్ పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు,ఆపద తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే అంతే ఎక్కువగా అల్లాహ్ తరుపున పుణ్యం ప్రాప్తిస్తుంది,ఆపై దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెలిపారు – మోమిన్ కు వచ్చే ఆపదలు అల్లాహ్ కు అతని పట్ల గల ప్రేమ కు సంకేతాలు,అల్లాహ్ వ్రాసిన విధి వ్రాతలో ఏ విషయాలైతే నిక్షిప్త మయ్యాయో అవి జరిగి తీరుతాయి,అలాంటి సందర్భంలో ఎవరైతే ప్రసన్నుడిగా వాటిపై ఓర్పు వహిస్తారో నిశ్చయంగా అల్లాహ్ దానిపై ప్రసన్నత పొంది పుణ్యాన్ని నొసగుతాడు మరెవరైతే విధివ్రాత పట్ల అసహ్యంగా,ఆక్రోశానికి గురవుతాడో,అతనిపట్ల అల్లాహ్ క్రోధానికి గురి అయి తగిన విధంగా అతన్ని శిక్షిస్తాడు.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “పరమ శుభదాయకుడు, పరమోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా తెలిపినాడు ‘సాటి కల్పించబడే వారందరికన్నా నేను అత్యంత స్వయం సమృధ్ధుడను. సహాయకునిగా, సహ్యోగిగా ఎవరినీ కలిగి ఉండవలసిన అవసరం లేని వాడను. కనుక ఎవరైనా ఏదైనా ఆచరణ ఆచరించి, అందులో ఇతరులతో నాకు సాటి కల్పించినట్లయితే , అతడిని,అతడు సాటి కల్పించిన వాటిని నేను వదిలి వేస్తాను’.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు – ‘’అష్-షిర్క్’ కు (బహుదైవారాధనకు) సంబంధించి అల్లాహ్ ఇలా అంటున్నాడు; "తన సహాయకునిగా, సహ్యోగిగా ఎవరినైనా కలిగి ఉండవలసిన అవసరం ఏమాత్రమూ లేని వాడు ఆయన; ఎందుకంటే ఏ విషయానికి సంబంధించైనా ఆయన అత్యంత స్వయం సమృధ్ధుడు. అందుకని ఎవరైనా విధేయతకు సంబంధించి ఏదైనా ఆచరణ అల్లాహ్ కొరకు ఆచరించి అందులో ఇతరులను కూడా అల్లాహ్ కు సాటి కల్పించినట్లయితే, అల్లాహ్ దానిని వదిలి వేస్తాడు, స్వీకరించడు, మరియు ఆ ఆచరణను అంటే అతడిని, సాటి కల్పించిన వానికే వదిలివేస్తాడు. కనుక విధేయతకు చెందిన ఏ ఆచరణ అయినా, అది కేవలం సర్వోన్నతుడైన అల్లాహ్ కొరకు మాత్రమే అయి ఉండాలి. ఎందుకంటే పరమ పవిత్రుడైన ఆయన కేవలం తన కొరకు మాత్రమే ప్రత్యేకించబడిన ఆచరణను తప్ప మరి దేనినీ స్వీకరించడు.
జుందుబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ఆయన ఇలా అన్నారు: “తాను చనిపోవడానికి ఐదు రాత్రులకు ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు “నేను మీలో నుండి ఎవరినైనా నా ఆప్తమిత్రునిగా చేసుకున్నాను అనే విషయం నుండి నన్ను నేను అల్లాహ్ ముందు విముక్తుణ్ణి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ విధంగానైతే అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం ను తన ఆప్తమిత్రునిగా (ఖలీల్ గా) తీసుకున్నాడో, నన్ను కూడా అల్లాహ్ తన ఆప్తమిత్రునిగా తీసుకున్నాడు. ఒకవేళ నా సహచర సమాజం (ఉమ్మత్) నుండి నేను ఎవరినైనా నా ఆప్తమిత్రునిగా చేసుకోవాలని అనుకుంటే, నేను అబూబక్ర్ రజియల్లాహు అన్హును నా ఆప్త మిత్రునిగా చేసుకుని ఉండే వాడిని. తస్మాత్, జాగ్రత్త! మీకు పూర్వం గడిచిన తరాల వారు తమ ప్రవక్తల సమాధులను, మరియు సత్పురుషుల సమాధులను మస్జిదులుగా (సజ్దా చేసే స్థలాలుగా) చేసుకునేవారు. ఖబడ్దార్! మీరు సమాధులను మస్జిదులుగా చేసుకోకండి. నేను మిమ్ములను అలా చేయడం నుండి నిషేధిస్తున్నాను”.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సర్వోన్నతుడైన అల్లాహ్ వద్ద తన స్థానము ఎంత ఉన్నతమైనదో తెలియ జేస్తున్నారు. (తన పట్ల అల్లాహ్ యొక్క) ప్రేమాభిమానములు అత్యున్నత స్థానమును చేరుకున్న విషయాన్ని తెలియ జేస్తున్నారు, ఏ విధంగానైతే ఇబ్రాహీం అలైహిస్సలాం ఆ స్థానాన్ని పొందినారో. అందుకని తనకు ఒక ఆప్తమిత్రునిగా అల్లాహ్ తప్ప మరొకరు ఉండడం అనే విషయాన్ని నిరాకరించినారు. ఎందుకంటే ఆయన హృదయం సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క ప్రేమతో, ఆయన ఘనతతో, ఆయన ఉనికితో ఎంత సంపూర్ణంగా నిండి పోయి ఉన్నది అంటే, ఇక అల్లాహ్ తప్ప మరొకరికి ఏమాత్రమూ స్థానము లేనంతగా. మరియు ఒకవేళ ఈ సృష్టిలో తనకు ఎవరైనా ఆప్త మిత్రుడు ఉండి ఉండేటట్లయితే, అది అబూ బక్ర్ అస్సిద్దీఖ్ రజియల్లాహు అన్హు అయి ఉండే వారని తెలియజేస్తున్నారు. ఇంకా, యూదులు మరియు క్రైస్తవులు తమ ప్రవక్తల మరియు సత్పురుషుల పట్ల ఉండవలసిన ప్రేమాభిమానాల విషయంలో అనుమతించిబడిన హద్దులు దాటి, వారి సమాధులను ఏవిధంగానైతే పూజా స్థలాలుగా చేసుకున్నారో; అల్లాహ్ ను వదిలి ఆ సమాధులను, పూజించబడే దైవాలుగా మార్చివేసారో, అలా చేయడం నుండి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రంగా హెచ్చరించినారు. ఇంకా వారు (యూదులు, క్రైస్తవులు) తమ ప్రవక్తల, సత్పురుషుల సమాధులపై (పెద్ద పెద్ద ఆకారాలలో) ఆరాధనాలయాలు (పూజా గృహాలు), దేవాలయాలు నిర్మించినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్’ను వారి మాదిరిగా చేయడం నుండి నిషేధించినారు.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా అల్లాహ్ అభిమానవంతుడు, విశ్వాసి కూడా అభిమానవంతుడే. అల్లాహ్ యొక్క అభిమానము అంటే దాసుడు అల్లాహ్ నిషేధించిన వాటికి పాల్బడుట (అనగా అల్లాహ్ యొక్క అభిమానము భంగపడినట్లు).”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసు లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: నిశ్చయంగా అల్లాహ్ అభిమానవంతుడు, ఆయన కొన్ని విషయాలను అసహ్యించుకుంటాడు, కొన్ని విషయాలను అయిష్టపడతాడు; అలాగే విశ్వాసి కూడా అభిమానవంతుడు, అతడూ కొన్ని విషయాలను అసహ్యించుకుంటాడు, కొన్ని విషయాలను అయిష్టపడతాడు. అల్లాహ్ యొక్క అభిమానము ఎప్పుడు భంగపడుతుందంటే, విశ్వాసి అల్లాహ్ నిషేధించిన కార్యాలకు పాల్బడినప్పుడు, ఉదాహరణకు: వ్యభిచారము, స్వలింగ సంపర్కము, దొంగతనము, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు సేవించడం, ఇంకా అటువంటి అనైతిక కార్యాలకు పాల్బడుట.