





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అదీ ఇబ్న్ హాతిం (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవ్వరితోనూ అల్లాహ్ మాట్లాడకుండా ఉండడు (మీలో ప్రతి ఒక్కరితో అల్లాహ్ మాట్లాడుతాడు); మరియు అతనికీ, అల్లాహ్ కు మధ్య అనువాదకుడు కూడా ఉండడు. అతడు తన కుడివైపు చూస్తాడు అక్కడ అతడు తాను ముందుకు పంపిన దానిని తప్ప (తన ఆచరణలను తప్ప) మరేమీ చూడడు, మరియు అతడు తన ఎడమవైపు చూస్తాడు, అక్కడ అతడు ముందుకు పంపిన దానిని తప్ప (తన ఆచరణలను తప్ప) మరేమీ చూడడు. మరియు అతను తన ముందు వైపునకు చూస్తాడు; అతనికి ఎదురుగా నరకాగ్ని తప్ప మరేమీ కనిపించదు. కనుక నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి – అది ఖర్జూరములో సగభాగముతోనైనా సరే.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఇలా తెలియజేస్తున్నారు. ప్రతి విశ్వాసి తీర్పు దినమున ఏకంగా అల్లాహ్ ఎదురుగా నిలబడతాడు, మరియు అల్లాహ్ అతనితో మధ్యవర్తి లేకుండా మాట్లాడతాడు మరియు పదాలను అనువదించడానికి వారి మధ్య అనువాదకుడు కూడా ఉండడు. కనుక అతడు తీవ్రమైన భయంతో తన ముందు ఉన్న నరకాగ్ని నుండి రక్షణ పొందటానికి మార్గము ఏమైనా దొరుకుతుందేమో అనే ఆశతో కుడి వైపునకు మరియు ఎడమ వైపునకు చూస్తాడు. అతడు తన కుడివైపుకు చూసినపుడు, అతనికి తాను చేసిన మంచి పనులు తప్ప మరేమీ కనిపించవు. అతడు తన ఎడమవైపుకు చూసినపుడు, అతనికి తాను చేసిన చెడు పనులు తప్ప మరేమీ కనిపించవు. తన ఎదురుగా చూసినపుడు, అతనికి నరకాగ్ని తప్ప మరేమీ కనిపించదు, అతడు దాని నుండి తప్పించుకోలేడు ఎందుకంటే అతడు దానిపై ఉన్న ఒక వంతెనను (పుల్ సిరాత్ ను) దాటవలసి ఉంటుంది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మీకు మరియు నరకాగ్నికి మధ్య దాతృత్వం మరియు సత్కార్యాల కవచాన్ని ఉంచండి, అది సగం ఖర్జూరం అంత చిన్నది అయినా సరే.
ఉఖబహ్ ఇబ్నె ఆమిర్ అల్ జుహనీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “కొంతమంది ప్రజల సమూహం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చింది. వారిలో ఒక్కరితో తప్ప, తొమ్మిది మందితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతిపై ‘విధేయతా ప్రమాణం’ (బైఅత్) చేయించుకున్నారు. అపుడు వారు ఇలా అన్నారు: “ఓరసూలుల్లాహ్! తొమ్మిది మందితో ప్రమాణం చేయించుకున్నారు, అతడిని వదలివేసారు?” అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అతనిఒంటిపై తాయత్తు ఉన్నది” అన్నారు. అతడు తన చేతిని చొక్కా లోనికి పోనిచ్చి, దానిని త్రెంచివేసాడు. తరువాత అతనితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధేయతా ప్రమాణం (బైఅత్) చేయించుకున్నారు. తరువాత ఇలా అన్నారు: “ఎవరైతే తాయత్తును వేలాడదీసుకుంటారో, నిశ్చయంగా అతడు ‘షిర్క్’నకు (బహుదైవారాధనకు) పాల్బడినట్లే.”
ఆహ్మద్ నమోదు చేసినారు:కొద్ది మంది ప్రజల సమూహం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చింది, వారు మొత్తం పది మంది ఉన్నారు. ఆయన వారిలో తొమ్మిది మంది నుండి ఇస్లాం పట్ల విధేయత చూపాలని, ఆయనను అనుసరించాలని విధేయతా ప్రమాణం తీసుకున్నారు. కాని పదవ వ్యక్తి నుండి ప్రమాణం తీసుకోలేదు. దీని వెనుక ఉన్న కారణం గురించి అడిగినప్పుడు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అతడు దిష్టి తగలకుండా ఉండడానికో, లేదా ఏదైనా చెడు లేదా కీడును దూరం చేయడానికో, పూసలు లేక అటువంటి దానితో చేయబడిన తాయత్తును వేలాడదీసుకునో లేక కట్టుకునో ఉన్నాడు. కాబట్టి, ఆ వ్యక్తి తాయెత్తు ఉన్న ప్రదేశంలోనికి తన చేతిని పోనిచ్చి, దానిని కత్తిరించి, దానిని వదిలించుకున్నాడు, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని విధేయతా ప్రతిజ్ఞను అంగీకరించి, తాయెత్తులకు వ్యతిరేకంగా హెచ్చరిస్తూ దానికి సంబంధించిన ఆదేశాన్ని స్పష్టం చేస్తూ ఇలా అన్నారు: “ఎవరైతే తాయత్తును వేలాడదీసుకుంటాడో, నిశ్చయంగా అతడు ‘షిర్క్’నకు (బహుదైవారాధనకు) పాల్బడినట్లే.”
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ బిన్ అల్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం : “మస్జిదులోనికి ప్రవేశించునపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు “అఊదుబిల్లాహిల్ అజీం, వబి వజ్’హి హిల్ కరీం; వ సుల్తానిల్ ఖదీమ్; మినష్’షైతానిర్రజీమ్” (నేను అల్లాహ్ యొక్క కరుణాపూరితమైన వర్చస్సు ద్వారా; (సర్వసృష్టిపై) ఆయన శాశ్వతమైన ఆధిపత్యము ద్వారా; శపించబడిన షైతాను బారి నుండి మహిమాన్వితుడైన అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను)”. అది విని అక్కడ ఉన్న అతను “అంతేనా?” అన్నాడు. దానికి నేను “అవును” అన్నాను. అపుడు అతడు ఇలా అన్నాడు “ఆ పదాలు పలికినపుడు షైతాను ఇలా అంటాడు “ఇతడు రోజంతా నా నుండి రక్షించబడినాడు.”
అబూదావూద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదులోని ప్రవేశించునపుడు ఇలా పలికేవారు: “అఊదుబిల్లాహిల్ అజీమ్” (నేను సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క శరణు కోరుతున్నాను) అంటే “నేను అల్లాహ్ యొక్క గుణవిశేషణాల ద్వారా ఆయన రక్షణ, ఆశ్రయం మరియు శరణు కోరుకుంటున్నాను” అని అర్థం. “వబి వజ్’హి హిల్ కరీం” (మరియు ఆయన యొక్క కరుణాపూరితమైన ముఖ వర్చస్సు ద్వారా) అంటే అల్లాహ్ సర్వశక్తిమంతుడు, ఆయన ఉదారంగా, సమృద్ధిగా ఇచ్చేవాడు అని అర్థం. (మరియు ఆయన అధికారం) అంటే - ఆయన సృష్టిలో ఆయన కోరుకున్న వారిపై ఆధిపత్యం మరియు శక్తి గలవాడు అని అర్థం. (అల్ ఖదీమ్) – అంటే ఆయనే సర్వ ప్రాచీనుడు; ఆయనే సర్వ శాశ్వతుడు అని అర్థం. (మినష్’షైతానిర్రజీం - శపించబడిన షైతాను నుండి) అంటే అల్లాహ్ యొక్క కరుణ నుండి, ఆయన యొక్క దయ నుండి బహిష్కరించబడిన వాడైన షైతాను అని అర్థం. అంటే దాని అర్థం: ఓ అల్లాహ్! అతని గుసగుసల నుండి, అతని ప్రలోభాల నుండి, అతని అడుగుల నుండి, అతని ప్రమాదాల నుండి, అతని సూచనలు మరియు అతని తప్పుదోవ నుండి నన్ను రక్షించు, ఎందుకంటే అతడు అపమార్గాన్ని పట్టించేవాడు మరియు అతడు అపమార్గానికీ, అజ్ఞానానికి ప్రేరేపకుడు. అక్కడ ఉన్నవారిలో ఒకతను అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ బిన్ అల్ ఆస్ రదియల్లాహు అన్హు తో ఇలా అన్నాడు: “అంతేనా?” అని. అంటే “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంతే అన్నారా?” అని అన్నాడని అర్థం. దానికి అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు “అవును” అని జవాబిచ్చారు. కనుక మస్జిదులో ప్రవేశించు వ్యక్తి ఈ దుఆ (ప్రార్థన) చేసినప్పుడు, షైతాను ఇలా అంటాడు, “ఈ ప్రవేశించిన వ్యక్తి తనను తాను అన్ని సమయాలలో - పగలు మరియు రాత్రి – తనను తాను నా నుండి రక్షించుకున్నాడు” అని.
అబూ సఈద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “పరమ పవిత్రుడు, సర్వశుభాల అధికారి, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ స్వర్గవాసులతో ఇలా అంటాడు: “ఓ స్వర్గవాసులారా!”; వారు “ఓ మా ప్రభూ! మేము హాజరుగా ఉన్నాము, నీ ఇష్టానికి, సంతోషానికి అనుగుణంగా ఉన్నాము” అని జవాబిస్తారు. అపుడు ఆయన “మీరు సంతృప్తిగా ఉన్నారా?” అని అడుగుతాడు; దానికి వారు “నీ సృష్ఠిలో ఎవ్వరికీ ప్రసాదించని దానిని నిశ్చయంగా నీవు మాకు ప్రసాదించినపుడు, మేము సంతృప్తిగా ఎందుకు ఉండము?” అని జవాబిస్తారు. అపుడు ఆయన “నేను మీకు దానికంటే కూడా ఉత్తమమైన దానిని ప్రసాదిస్తాను” అంటాడు. వారు “ఓ మా ప్రభూ! దీనికంటే ఉత్తమమైనది ఇంకేముంటుంది?” అంటారు. అప్పుడు ఆయన ఇలా అంటాడు: “నేను మీకు నా ప్రమోదాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తాను మరియు ఆ తర్వాత నేను మీ పట్ల ఎన్నటికీ అసంతృప్తి చెందను.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: స్వర్గములో స్వర్గవాసులు ఉంటూ ఉండగా వారితో సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు: “ఓ స్వర్గవాసులారా!”; దానికి వారు “మేము హాజరుగా ఉన్నాము ఓ మా ప్రభూ!, నీ ఇష్టానికి, సంతోషానికి అనుగుణంగా ఉన్నాము” అని జవాబిస్తారు. అపుడు ఆయన వారిని “మీరు సంతృప్తిగా ఉన్నారా?” అని ప్రశ్నిస్తాడు. దానికి వారు “అవును ఓ మా ప్రభూ! మేము సంతృప్తిగా ఉన్నాము; నీ సృష్టిలో ఎవ్వరికీ ప్రసాదించని దానిని నిశ్చయంగా నీవు మాకు ప్రసాదించినపుడు, మేము సంతృప్తిగా ఎందుకు ఉండము?” అని జవాబిస్తారు. అపుడు పరమ పవిత్రుడు అయిన ఆయన “మీకు అంత కంటే ఉత్తమమైన దానిని ప్రసాదించనా?” అని అడుగుతాడు. వారు: “ఓ మా ప్రభూ! దీనికంటే ఉత్తమమైనది ఏముంటుంది?” అంటారు. (అల్లాహ్) ఇలా అంటాడు: "నేను మీపై నా శాశ్వతమైన అనుగ్రహాన్ని అవతరింపజేస్తాను. ఆ తరువాత నేను మీపై ఎలాంటి ఆగ్రహాన్ని చూపను.”
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా తాను విన్నాను అని అబూదర్ గఫ్ఫారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖిస్తున్నారు: “ఎవరైనా మరొక వ్యక్తిపై “ఫుసూఖ్” (దుష్టత్వము) నింద మోపితే (అంటే ఆ వ్యక్తి “ఫాసిఖ్” (దుష్టుడు) అని నింద మోపితే), లేక అతనిపై “కుఫ్ర్” (సత్యతిరస్కారపు) నింద మోపితే (అంటే అతడు ‘కాఫిర్’ (సత్యతిరస్కారి) అని నింద మోపితే) – ఒకవేళ నింద మోపబడిన ఆ సహచరుడు వాస్తవానికి అటువంటి వాడు కాకపోతే – అది ఆ నింద మోపిన వాని వైపునకే తిరిగి వస్తుంది.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరిస్తున్నారు: ఎవరైనా మరొకరిని “నీవు “ఫాసిఖ్” (పాపివి, దుష్టుడవు) అని లేక “నీవు “కాఫిర్” (సత్యతిరస్కారివి, అవిశ్వాసి) అని అన్నట్లయితే; ఒకవేళ ఆ నిందమోపబడిన వ్యక్తి వాస్తవానికి అటువంటి వాడు కాకపోతే’, తాను ఆపాదించిన ఆ గుణాలకు స్వయంగా తానే అర్హుడు అవుతాడు; మరియు అతని మాటలు అతని వైపునకే తిరిగి వస్తాయి. ఒకవేళ ఆ విధంగా ఆపాదించబడిన వ్యక్తి నిజంగానే అలాంటి వాడే అయినట్లయితే, ఆపాదించిన వాని వైపునకు ఏమీ తిరిగి రాదు, ఎందుకంటే అతడు సత్యమే పలికినాడు గనుక.
అబూ తల్హహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “కుక్క మరియు చిత్రపటం ఉన్న ఇంటిలోనికి దైవదూతలు ప్రవేశించరు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు – ఏ ఇంటిలోనైతే కుక్కగానీ లేక చలనం కలిగిన జీవరాసుల చిత్రపటాలు గానీ ఉన్నట్లైతే ఆ ఇంటిలోనికి అల్లాహ్ యొక్క కారుణ్యదూతలు ప్రవేశించరు. చిత్రపటం అంటే ఆత్మ కలిగిన ప్రాణియొక్క చిత్రపటం అని అర్థం. అటువంటి చిత్రపటం నిషేధము (హరాం), అది అల్లాహ్ యొక్క సృష్ఠి నిర్మాణ లక్షణాన్ని అనుకరించడం అవుతుంది. ఆ విధమైన చిత్రపటాలు బహుదైవారాధనకు దారి తేసే కారణాలలో ఒకటి. కొన్ని చిత్రపటాలైతే అల్లాహ్ కు బదులుగా, లేక అల్లాహ్’తో పాటుగా ఆయనకు సాటిగా పూజించబడుతున్నాయి కూడా. కుక్క ఉన్న ఇంటిలోనికి అల్లాహ్ యొక్క కారుణ్యదూతలు ప్రవేశించకపోవడానికి కారణం: ఎందుకంటే కుక్క అశుద్ధమైన పదార్థాలను తింటుంది; వాటిలో కొన్ని కుక్కలు షైతాన్ పేర్లను కూడా కలిగినవి ఉన్నాయి; మరి దైవదూతలు షైతానుకు వ్యతిరేకం కదా. అంతేగాక, కుక్కలనుండి వచ్చే అప్రియకరమైన దుర్వాసన. దైవదూతలు దుర్వాసనను ఇష్టపడరు, అసహ్యించుకుంటారు. మరియు కుక్కలను ఇంటిలో ఉంచుకోవడం హరాం (నిషేధము). కనుక ఎవరైతే తన ఇంటిలో కుక్కలను ఉంచుకుంటాడో, అతని ఇంటిలోనికి అల్లాహ్ యొక్క కారుణ్యదూతలు ప్రవేశించకుండా, అతని కొరకు దుఆ చేయకుండా, దైవదూతల కారణంగా అతనిపై అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలు మరియు అతని ఇంటిలో అల్లాహ్ యొక్క శుభాలు - వీటన్నింటి నుండి దూరం చేసి శిక్షించబడతాడు.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “తమ వెంట కుక్కను తీసుకు వెళుతున్న ప్రయాణీకుల సమూహాన్ని, మరియు (తమ జంతువుల మెడలో) గంట కలిగిన ఉన్న ప్రయాణీకుల సమూహాన్ని దైవదూతలు అనుసరించరు.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ప్రయాణంలో ఉన్న వారిని, ఒకవేళ వారి వెంట కుక్క గానీ ఉన్నట్లయితే, లేక వారి వెంట ఉన్న జంతువుల మెడలో, ఆ జంతువులు కదిలినపుడల్లా మ్రోగేలా గంట కట్టి ఉంటే, ఆ ప్రయాణీకులను దైవదూతలు అనుసరించరు.
అబ్దుర్రహ్మాన్ ఇబ్న్ సమురహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మిథ్యా దైవాల పేరున (విగ్రహాల పేరున) గానీ, లేక మీ తాతలు, తండ్రుల పేరున గానీ ప్రమాణం చేయకండి (ఒట్టు పెట్టుకోకండి).”
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అత్-తవాగీ” పేరిట ప్రమాణం చేయడాన్ని నిషేధించినారు. “తాగియహ్” అనే పదం యొక్క బహువచనం “అత్-తవాగీ”; ఇవి విగ్రహాలు, అల్లాహ్ ను వదిలి (లేదా అల్లాహ్ తో పాటు) బహుదైవారాధకులు వీటిని పూజించేవారు, ఆరాధించేవారు; ఇవి వారి దౌర్జన్యానికి మరియు అవిశ్వాసానికి కారణం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ తండ్రుల పేరున ప్రమాణం చేయడాన్ని కూడా నిషేధించినారు. ఇస్లాంకు పూర్వం అరబ్బులు గర్వంతో, గొప్పతో తమ తండ్రులపై ప్రమాణం చేయడం ఆనవాయితీగా ఉండేది.
బురైదహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే “అమానహ్” (నమ్మకం, విశ్వాసం మొదలైన విషయాల) పై ప్రమాణం చేస్తారో, అతడు మాలోని వాడు కాడు.”
అబూదావూద్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీథులో నమ్మకము లేదా విశ్వాసము పై (అమానహ్ పై) ప్రమాణం చేయరాదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించినారు, అలా చేయడాన్ని నిషేధించినారు; మరియు అలా చేసేవాడు మాలో ఒకడు కాడని కూడా హెచ్చరించారు.