





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “బలహీనుడైన విశ్వాసి కంటే బలవంతుడైన విశ్వాసి అల్లాహ్ దృష్టిలో ఎంతో శ్రేష్ఠుడు, ఎంతో ప్రియుడు. మరియు వారిద్దరిలోనూ మేలు ఉంది. నీకు మేలు చేసే దానిని పట్టుకుని ఉండు. సహాయం కోసం అల్లాహ్’ను అడుగు. మరియు నిన్ను నీవు నిస్సహాయునిగా భావించుకోకు. ఒకవేళ నీకు ఏదైనా నష్టం జరిగితే, "నేను ‘ఒకవేళ’ ఇలా ఇలా చేసి ఉంటే బాగుండేది" అని అనకు. అలాకాక "ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ ; అల్లాహ్ తాను కోరినది చేస్తాడు" అని పలుకు. నిశ్చయంగా ‘ఒకవేళ’ అనే మాట షైతాను పనికి మార్గాన్ని తెరుస్తుంది.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: విశ్వాసులందరూ మేలైన వారే. అయితే తన విశ్వాసంలో, సంకల్పములో, సంపదలో మరియు శక్తి కి సంబంధించిన ఇతర అంశాలలో బలంగా ఉన్న విశ్వాసి బలహీనమైన విశ్వాసి కంటే, సర్వశక్తిమంతుడైన అల్లాహ్’కు మరింత ప్రియమైనవాడు, మరియు ఆయన దృష్టిలో ఉత్తముడు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసి కొరకు ఈ విధంగా బోధించినారు: ఇహలోక మరియు పరలోక విషయాలకు సంబంధించి ఒక విశ్వాసి - అన్ని వేళలా సర్వశక్తిమంతుడైన అల్లాహ్’పై ఆధారపడుతూ, ఆయన సహాయం కోరుతూ మరియు అతనిపై సంపూర్ణ భరోసా, నమ్మకంతో - తనకు ప్రయోజనం కలిగించే మార్గాలను ఎంచుకోవాలి. తరువాత – ఇహలోకము మరియు పరలోకములలో తనకు ప్రయోజనం చేకూర్చే విషయాలను ఆచరించడం పట్ల ఒక విశ్వాసి సోమరితనం వహించరాదని, నిస్సహాయతను అవలంబించరాదని, అసమర్థతను ప్రదర్శించరాదని నిషేధించినారు. ఒక విశ్వాసి తన ఆచరణలలో నిజాయితీగా కష్టపడుతూ, అందుకు అందుబాటులో ఉన్న మార్గాలను, సాధనాలను వినియోగించుకుంటూ, అన్ని వేళలా అల్లాహ్ యొక్క సహాయాన్ని, ఆయన నుండి మేలును, శుభాన్ని అర్థిస్తూ ఉన్నట్లయితే – ఆ తరువాత అతడు చేయవలసింది ఏమీ ఉండదు – తమ వ్యవహారాలన్నింటినీ అల్లాహ్ కు అప్పగించడం తప్ప. ఎందుకంటే (ఆ తరువాత) అల్లాహ్ తన కొరకు ఏమి ఎంపిక చేసినా అది శుభప్రదమైనదే అయి ఉంటుందని అతనికి తెలుసు గనుక. ఆ తరువాత - ఒకవేళ అతనిపై ఏదైనా ఆపద వచ్చి పడినా, ఏదైనా నష్టం కలిగినా అతడు ఇలా అనరాదు: “ఒకవేళ నేను ఇలా ఇలా చేసి ఉంటే బాగుండేది”. ఎందుకంటే నిశ్చయంగా ‘ఒకవేళ’ అనే పదం షైతాను పనికి మార్గాన్ని తెరుస్తుంది – విధిరాత పట్ల ఆక్షేపణకు, జరిగిన దానిపట్ల విచారంలో మునిగిపోవడానికి దారి తీస్తుంది. అలాకాక అతడు జరిగిన దానిని శిరోధార్యంగా భావించి, దానిపట్ల పూర్తి సంతృప్తితో “ఇది అల్లాహ్ యొక్క ఆఙ్ఞ, ఆయన తాను కోరినది చేస్తాడు” అనాలి. ఎందుకంటే - ఏది జరిగినా అది అల్లాహ్ కోరుకున్నదానికి అనుగుణంగానే జరుగుతుంది, నిశ్చయంగా ఆయన తాను కోరుకున్నది చేస్తాడు మరియు ఆయన ఆఙ్ఞను రద్దు చేయడం లేదా ఆయన తీర్పులో మార్పు చేయడానికి దానిని అనుసరించడం (ఫాలోఅప్ చేయడం) అనేది ఉండనే ఉండదు.
అబూ వాఖిద్ అల్ లైసీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హునైన్ వైపునకు ప్రయాణమై బయలుదేరినపుడు దారిలో బహుదైవారాధకులు (పవిత్రమైనదిగా భావించే) “జాతు అన్వాత్” అని పిలుచుకునే ఒక వృక్షం పక్క నుండి వెళ్ళడం జరిగింది. బహుదైవారాధకులు తమ ఆయుధాలను ఆ వృక్షంపై ఉంచేవారు. అపుడు సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నారు: “ఓ రసూలల్లాహ్! వారికి “జాతు అన్వాత్” ఏవిధంగా ఉన్నదో, మాకు కూడా ఒక “జాతు అన్వాత్” ను ఏర్పాటు చేయండి”. అది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విస్మయంగా “సుబ్’హానల్లాహ్! ఇది సరిగ్గా ఇజ్రాయీలు సంతతి వారు మూసా (అలైహిస్సలాం) ను అడిగిన విధంగా ఉన్నది - {اجْعَلْ لَنَا إِلَهًا كَمَا لَهُمْ آلِهَةٌ} [الأعراف: 138] [“…..వీరి ఆరాధ్యదైవాల వలే మాకు కూడా ఒక ఆరాధ్యదైవాన్ని నియమించు.”] (సూరహ్ అల్ ఆరాఫ్ 7:138) అన్నారు.
అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి హునైన్ కు బయలుదేరి వెళ్ళారు. అది తాయిఫ్ మరియు మక్కా నగరాల మధ్యనున్న ఒక లోయ. వారి వెంట కొత్తగా ఇస్లాం స్వీకరించి విశ్వాసులుగా మారిన సహాబాలు ఉన్నారు. దారిలో వారు “జాతు అన్వాత్” అని పిలువబడే ఒక వృక్షం ప్రక్క నుండి వెళ్ళడం జరిగింది, దానిపై వేళ్ళాడదీసిన అనేక వస్తువులున్నాయి. బహుదైవారాధకులు ఆ చెట్టును పూజించేవారు మరియు ఆశీర్వాదం కోసం వారి ఆయుధాలను మరియు ఇతర వస్తువులను దానిపై వేలాడదీసేవారు. వారు తమ ఆయుధాలను వ్రేలాడదీయడానికి, తద్వారా శుభాలను ఆశీర్వాదాలను పొందడానికి, తమ కోసం కూడా ఇలాంటి ఒక చెట్టును ఏర్పాటు చేయమని సహాబాలు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను అడిగారు. సహాబాలలో కొందరు ఆ విధంగా దేనినైనా ఏర్పాటు చేసుకోవడం బహుశా అనుమతించబడిన (హలాల్) విషయమేనని అనుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం,వారి అభ్యర్థనను తిరస్కరిస్తూ, వారు అలా అడిగినందుకు విస్మయంగా “సుబ్’హానల్లాహ్” అన్నారు. (కొన్ని సందర్భాలలో) ఆ విధంగా అల్లాహ్ ను కొనియాడడం, స్తుతించడం ఎదుటివారి మాటలను, చర్యలను తిరస్కరించడం అవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారి అభ్యర్థన ఇస్రాయీలు సంతతివారు మూసా అలైహిస్సలాం ను అభ్యర్థించిన దానిని పోలి ఉన్నది అని తెలియజేసారు – { ఇస్రాయీలు సంతతివారు మూసా అలైహిస్సలాం తో ఇలా అన్నారు “…..వీరి ఆరాధ్యదైవాలవలే మాకు కూడ ఒక ఆరాధ్యదైవాన్ని నియమించు.”} విగ్రహాలను ఆరాధిస్తున్న వారిని చూసి, వారు (మూసా అ.స. అనుచరులు), ఆ విగ్రహారాధకులకు మాదిరిగానే తమ కోసం కూడా ఆరాధ్య దైవాన్ని ఏర్పాటు చేయమని కోరినారు. (ఈ ఉదాహరణను ప్రస్తావించి) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలు ఆవిధంగా కోరడం, నిశ్చయంగా వారిని అనుసరించడమే అని తెలియజేసినారు. అప్పుడు ప్రవక్త హెచ్చరికగా, ఈ సమాజం యూదులు మరియు క్రైస్తవుల మార్గాలను అనుసరిస్తుందని మరియు వారి చర్యలను నకలు చేస్తుందని తెలియజేసారు.
అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ఏదో ఒక విషయాన్ని గురించి మాట్లాడినాడు. తరువాత అతడు ‘అల్లాహ్ మరియు మీరు కోరిన విధంగా జరుగుతుంది’ అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఏమిటీ, నువ్వు నన్ను అల్లాహ్’కు సమానుడిగా చేస్తున్నావా? ఇలా అను: “ఏకైకుడైన అల్లాహ్ కోరిన విధంగానే జరుగుతుంది.”
అన్నసాయీ కుబరాలో, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఒక మనిషి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, తనకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని గురించి మాట్లాడినాడు. తరువాత ఇలా అన్నాడు “అల్లాహ్ మరియు మీరు కోరిన విధంగా జరుగుతుంది” అని. అతడు అలా అనడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించి, అతనికి ఇలా తెలియజేసినారు: సృష్ఠికర్త అయిన అల్లాహ్ ఇచ్ఛను (ఇష్టమును) ఆయన సృష్టించిన సృష్టితాల ఇచ్ఛతో “వావ్” (و మరియు) అనే సముచ్చయం (conjunction) తో కలిపి ఒకటిగా చేయడం “చిన్న స్థాయి షిర్క్ – బహుదైవారాధన- అవుతుంది. ఒక ముస్లిం అలా అనరాదు.” తరువాత ఆయన అతడిని సరైన పదాలు పలుకుట వైపునకు మార్గనిర్దేశం చేసినారు: “అల్లాహ్ సంకల్పించినది మాత్రమే జరుగుతుంది” అని పలుకమని, అల్లాహ్’ను ఆయన సంకల్పములో ఏకైకునిగా స్థిరపరిచినారు. ‘మరియు’ అనే సముచ్చయ పదాలను ఉపయోగించి ఆయన సంకల్పాన్ని ఇతరుల సంకల్పాలతో ఏకం చేయలేదు.
ఉమ్ముల్ ము’మినీన్ (విశ్వాసుల మాతృమూర్తి) ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించినారు: రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నా వద్దకు వచ్చారు. ఇంటిలో ఒక బీరువా లాంటిది ఉన్నది, దానిపై నేను సన్నని వస్త్రపు తెర లాంటి దానిని వేళాడదీసి ఉంచినాను. దానిపై జీవుల చిత్రాలు చిత్రించి ఉన్నాయి. ఆయన దానిని చూస్తూనే చించి వేసారు. ఆయన ముఖము రంగు మారింది. ఆయన “ఓ ఆయిషా! పునరుత్థాన దినాన అల్లాహ్ వద్ద అతి కఠినమైన శిక్ష, సృష్టి కర్తగా (ఆయన చేసే పనిని) ఆయనను అనుకరించే వారికి ఉంటుంది” అన్నారు.” ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు “మేము దానిని ముక్కలుగా చించివేసి దానితో ఒకటో, రెండో తలదిండ్లు తయారు చేసుకున్నాము.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంటిలో ఆయిషా రజియల్లాహు అన్హా ఉన్న చోటుకి వెళ్ళారు. అక్కడ ఒక సామానులు పెట్టుకునే బీరువాలాంటిది ఉన్నది, దానిపై ఆమె సన్నని వస్త్రపు తెర లాంటి దానిని వేళాడదీసి ఉంచినారు. దానిపై జీవుల చిత్రాలు చిత్రించి ఉన్నాయి. అల్లాహ్ కోసం కోపంతో ఆయన ముఖపు రంగు మారిపోయింది, మరియు ఆయన దానిని (ఆ తెరను) తీసివేసారు. ఆయన ఇలా అన్నారు: “ప్రళయ దినాన అత్యంత కఠినమైన శిక్షను అనుభవించే వ్యక్తులు ఎవరంటే తాము చిత్రించిన చిత్రాలతో అల్లాహ్ యొక్క సృష్టిని అనుకరించటానికి ప్రయత్నించేవారు.” ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా అన్నారు: “మేము దానితో ఒకటో లేక రెండో తలదిండ్లు తయారు చేసుకున్నాము."
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అల్లాహ్ ఇలా పలికినాడు: “ఆదం కుమారుడు నాపట్ల అసత్యం పలుకుతున్నాడు, అలా చేయడానికి అతనికి ఏ హక్కూ లేదు; మరియు అతడు నన్ను అవమాన పరుస్తున్నాడు, అలా చేయడానికి అతనికి ఏ హక్కూ లేదు. నా పట్ల అతడు అసత్యం పలకడం ఏమిటంటే – “చనిపోయిన తరువాత (పునరుత్థాన దినమున) నన్ను తిరిగి సజీవుడిని చేయలేడు” అని అతడు అనడం. నిజానికి మొట్టమొదటి సారి అతడిని సృష్టించడం కంటే; అతడిని పునరుజీవింపజేయడం కష్టమైనదేమీ కాదు. నన్ను అతడు అవమాన పరచడం ఏమిటంటే – అతడు “అల్లాహ్ ఒక కుమారుడిని కలిగి ఉన్నాడు” అని అనడం, వాస్తవానికి నేను నేనే, ఏకైకుడను, ఎవరి అక్కరా లేని వాడను, నాకు సంతానము లేదు (నాకు ఎవరూ సంతానం కాదు), మరియు నేను ఎవరి సంతానమూ కాదు, మరియు (సర్వలోకాలలో) నన్ను పోలినది ఏదీ లేదు.”
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ హదీథ్ అల్ ఖుద్సీలో – అల్లాహ్ అవిశ్వాసులూ మరియు బహుదైవారాధకులను గురించి తెలిపినాడు, వారు తనపట్ల అసత్యాలు పలుకుతున్నారని, తనకు బలహీనతలు, లోపాలు, కొరతలు ఆపాదిస్తున్నారని తెలియజేసినాడని; వారు అలా అనడానికి వారికి ఏ హక్కూ లేదు – అని అల్లాహ్ తెలియజేసినాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలికినారు. అల్లాహ్’ను గురించి వారి అబద్ధాల విషయానికొస్తే: అల్లాహ్ వారిని శూన్యం నుండి మొదటిసారి సృష్టించినట్లు వారి మరణానంతరం వారిని తిరిగి తీసుకురాలేడని వారి వాదన. వారి వాదనను అల్లాహ్ వారిపై తిప్పి కొట్టినాడు. ఆయన ఇలా సమాధానమిచ్చాడు: శూన్యం నుండి సృష్టిని ప్రారంభించినవాడు వారిని తిరిగి తీసుకు రాగలడు, అది ఆయనకు మరింత సులభం. సృష్టి మరియు పునరుత్థానం రెండూ అల్లాహ్ కు సమానమైనవే. అల్లాహ్ అన్ని విషయాలపై అధికారం కలవాడు. అల్లాహ్’ను అవమానించే విషయానికొస్తే: వారి మాటలు: ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు అని అనడం. వాటిని ఆయన వారిపై త్రిప్పి కొట్టినాడు; నిశ్చయంగా తాను ఒకే ఒక్కడు, ఏకైకుడు, అద్వితీయుడు, ప్రతివిషయానికి సంబంధించి పరిపూర్ణమైనవాడు, అంటే ఉదాహరణకు ఆయన నామముములలో, ఆయన గుణ విషేశాలలో, ఆయన చర్యలలో అన్నింటిలో ఆయన పరిపోర్ణమైనవాడు, ఎటువంటి లోపమూ లేనివాడు, ఏటువంటి కొరతా లేనివాడు, లోపాలకూ, కొరతలకూ అతీతుడు, స్వయం సమృధ్ధుడు, ఆయన ఎవరి అవసరమూ లేనివాడు; కానీ ఆయన అవసరం ప్రతివారికీ ఉంది. ఆయన ఎవరి తండ్రీ కాదు, ఆయన ఎవరి సంతానమూ కాదు. సర్వలోకాలలో ఆయనను పోలినది ఏదీ లేదు. పరమపవిత్రుడూ, సర్వోన్నతుడు.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా అల్లాహ్ ఇలా పలికినాడు: ‘ఎవరైతే నా వలీ పట్ల (వలీ – ధర్మనిష్టాపరుడైన అల్లాహ్ యొక్క దాసుడు) శతృత్వం వహిస్తాడో నేను అతనిపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను. నేను ఏదైతే అతనిపై ‘ఫర్జ్’ చేసినానో అది నాకు అత్యంత ఇష్టమైనది; నా దాసుడు దాని ద్వారా తప్ప నాకు చేరువ కాలేడు. ఇంకా అతడు ‘నఫీల్’ ఆచరణలు ఆచరిస్తూ నాకు ఇంకా చేరువ అవుతూనే ఉంటాడు, ఎంతగా అంటే, నేను అతడిని ప్రేమించేంత వరకు. నేను అతడిని ప్రేమించినట్లయితే నేను అతడి వినికిడి శక్తినవుతాను, దేని ద్వారానైతే అతడు వింటాడో, నేను అతడి దృష్టినవుతాను, దేనిద్వారానైతే అతడు చూడగలుగుతాడో, నేను అతడి చేతినవుతాను, దేని ద్వారానైతే అతడు (శత్రువులను) ప్రతాడించుతాడో, నేను అతడి కాలునవుతాను, దేని ద్వారానైతే అతడు నడుస్తాడో. అతడు దేని కొరకైనా అర్థించినట్లయితే, నేను అతనికి తప్పనిసరిగా ప్రసాదిస్తాను; అతడు నా నుండి రక్షణ కోరితే, నేను అతనికి రక్షణ ప్రసాదిస్తాను. ఒక విశ్వాసి ప్రాణాలను తీసే విషయంలో సంకోచించినంతగా, నేను ఏ విషయములోనూ సంకోచించను. ఎందుకంటే అతడు మృత్యువును ఇష్టపడడు, మరియు అతనికి కష్టం కలిగించడాన్ని నేను ఇష్టపడను.”
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ ‘హదీసుల్ ఖుద్సీ’ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – సర్వ శక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా అన్నాడని తెలియజేస్తున్నారు: ఎవరైతే నా ఔలియాలలో ఏ వలీనైనా (వలీ: దైవభీతిపరుడు, ధర్మనిష్ఠాపరుడు అయిన అల్లాహ్ యొక్క దాసుడు; ‘వలీ’ ఏక వచనం, ‘ఔలియా’ బహువచనం –) బాధపెడతారో, అవమానించారో మరియు ద్వేషిస్తారో, నేను అతని పట్ల శత్రుత్వాన్ని ప్రకటిస్తున్నాను. వలీ: అంటే, దైవభీతి కలిగిన, ధర్మనిష్టాపరుడైన, అల్లాహ్’కు ఇష్ఠుడైన ఒక విశ్వాసి: ‘విలాయహ్’ అనే పదానికి అనేక అర్థాలున్నాయి. ఇక్కడ ‘విలాయహ్’ అంటే అటువంటి దాసుని స్థితి, స్థానము. అల్లాహ్ పై అతని విశ్వాసము, దైవభక్తి మరియు అతని ధర్మనిష్ఠల యొక్క స్థాయిపై అతనిపట్ల అల్లాహ్ యొక్క ‘విలాయహ్’ ఆధారపడి ఉంటుంది. ఒక విశ్వాసి, తన ప్రభువు తనపై విధిగావించిన విషయాలను ఆచరించడం ద్వారా తప్ప మరింకే విషయం ద్వారా కూడా తన ప్రభువుకు చేరువ కాలేడు, ఉదాహరణకు: ఆయనకు విధేయత చూపే (ఆయన ఆదేశించిన) ఆచరణలను ఆచరించడం, మరియు ఆయన హరాం చేసిన (నిషేధించిన) విషయాలను వదలి వేయడం మొదలైనవి. అయితే విధిగా ఆచరించవలసిన విషయాలతో పాటు, స్వచ్చందంగా ఆచరించే అదనపు ఆరాధనల ద్వారా అతడు తన ప్రభువుకు మరింత చేరువ అవుతూ ఉంటాడు, తద్వారా అతడు అల్లాహ్ యొక్క ప్రేమను పొందుతాడు. మరి అల్లాహ్ అతడిని ప్రేమించినట్లయితే, అల్లాహ్ అతనికి ఈ క్రింద పేర్కొనబడిన నాలుగు (శరీర) భాగాలను సరైన మార్గనిర్దేశం ఇవ్వడం ద్వారా అతనికి సహాయపడతాడు. అల్లాహ్ అతని వినికిడిలో అతనికి సరిగ్గా మార్గనిర్దేశం చేస్తాడు, అందువలన, అతను అల్లాహ్కు నచ్చినది తప్ప మరేమీ వినడు. అల్లాహ్ అతని కళ్ళకు సరిగ్గా మార్గనిర్దేశం చేస్తాడు, అందువలన, అతను అల్లాహ్ ఇష్టపడే వాటిని మరియు ఆయనకు నచ్చిన వాటిని తప్ప మరేమీ చూడడు. అల్లాహ్ అతని చేతులను సరిగ్గా మార్గనిర్దేశం చేస్తాడు,అందువలన అతను అల్లాహ్కు ఇష్టమైనది తప్ప తన చేతితో ఏమీ చేయడు. అల్లాహ్ అతని పాదాలను సరిగా మార్గనిర్దేశం చేస్తాడు. అందువలన అతడు అల్లాహ్ ఇష్టానికి అనుగుణంగా నడుచుకుంటూ, మంచి పనులు మాత్రమే చేస్తూ ఉంటాడు. వీటన్నింటితో పాటు, అతను అల్లాహ్’ను ఏదైనా అడిగితే, ఆయన అతని అభ్యర్థనను అతనికి ప్రసాదిస్తాడు మరియు అతని ప్రార్థనకు సమాధానం లభిస్తుంది; మరియు అతను అల్లాహ్ను ఆశ్రయించి, రక్షణ కోరుతూ ఆయనను ఆశ్రయిస్తే, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అతనికి అతను భయపడే వాటి నుండి ఆశ్రయం మరియు రక్షణను ప్రసాదిస్తాడు. ఇంకా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు: అతనిపై నా యొక్క దయ, కరుణ కారణంగా – ఒక విశ్వాసి ప్రాణాలను తీసే విషయంలో సంకోచించినంతగా, నేను ఏ విషయములోనూ సంకోచించను. ఎందుకంటే అందులో ఉన్న కష్టం మరియు బాధ కారణంగా అతడు మృత్యువును ఇష్టపడడు, మరియు విశ్వాసిని బాధపెట్టే వాటిని అల్లాహ్ ఇష్టపడడు.
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ప్రజలలో రెండు విషయాలు ‘కుఫ్ర్’ (అవిశ్వాసము) యొక్క చిహ్నాలుగా ఉన్నాయి - వంశావళిని కించపరచడం, ఎవరైనా చనిపోయినపుడు ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టడం.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం: అవిశ్వాసపు ఆచరణలు అనదగిన ఒక ఆచరణను గురించి, మరియు అఙ్ఞాన కాలపు సంప్రదాయాలలో ఒక దానిని గురించి (రెండు విషయాల గురించి) ఇలా తెలియజేస్తున్నారు: అవి: మొదటిది: ప్రజల వంశావళిని కించపరుస్తున్నట్లుగా మాట్లాడడం; అవమానించడం, వారిని కించపరచడం మరియు వారి పట్ల గర్వంగా ప్రవర్తించడం. రెండవది: ఏదైనా విపత్తు సంభవించినపుడు స్వరాన్ని పెంచి “ఖద్ర్” (విధివ్రాత) పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం, తీవ్రమైన అసంతృప్తితో బట్టలు చింపుకోవడం.
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీకు తెలుసా పేదవాడు అంటే ఎవరో?” అక్కడ ఉన్న వారు ఇలా అన్నారు: “మాలో పేదవాడు అంటే ధనము లేనివాడు మరియు ఆస్తిపాస్తులు లేనివాడు”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “నిశ్చయంగా నా ఉమ్మత్ (ముస్లిం సమాజము) యొక్క అసలైన పేదవాడు ఎవరంటే – అతడు పునరుథ్థాన దినమున నమాజులతో, ఉపవాసాలతో, దానధర్మాలు, జకాతు దాతృత్వాలతో వస్తాడు; అయితే వీటన్నింటితో పాటు అతడు ఒకరిని అన్యాయంగా అవమానించి ఉంటాడు; మరొకరిని అకారణంగా దూషించి ఉంటాడు; ఇంకొకరి సంపదను అన్యాయంగా తినేసి ఉంటాడు; ఒకరి రక్తాన్ని అధర్మంగా చిందించి ఉంటాడు; మరొకరిని అకారణంగా కొట్టి ఉంటాడు. అతడు వీటన్నింటితో పాటు కూడా వస్తాడు. అణచివేతకు గురిచేయబడిన ప్రతి ఒక్కరికి ఇతని మంచి పనుల నుండి ఇవ్వబడుతుంది. అంతేగాక ఒకవేళ న్యాయం పూర్తిగాక ముందే ఇతని మంచి పనులు అయిపోతే, అణచివేతకు గురి అయిన వారి పాపాలలో కొన్ని ఇతనిపై వేయబడతాయి మరియు అతడు నరకాగ్నిలో పడవేయబడతాడు.”
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలను అడిగారు – పేదవాడు అంటే ఎవరో తెలుసా మీకు అని. దానికి వారు “మాలో పేదవాడు అంటే సంపద గానీ, ఆస్తిపాస్తులు గానీ లేనివాడు” అని జవాబిచ్చారు. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నా ఉమ్మత్ యొక్క పేదవాడు ఎవరంటే, అతడు పునరుథ్థాన దినమున నమాజులు, ఉపవాసాలు, జకాత్ మరియు దానధర్మాలు వంటి అనేక సత్కార్యాలతో వస్తాడు. కానీ వాటితో పాటు ఒకరిని అవమానపరిచి ఉంటాడు; మరొకరిని దూషించి ఉంటాడు; ఇంకొకరి పట్ల అపవాదులు ప్రచారం చేసి ఉంటాడు; ఒకరి ఆస్తిని తినేసి ఉంటాడు; మరొకరి హక్కును చెల్లించడానికి నిరాకరించి ఉంటాడు; ఒకరి రక్తాన్ని చిందించి అన్యాయం చేసి ఉంటాడు; మరొకరిని అన్యాయంగా కొట్టి అవమానపరిచి ఉంటాడు. పునరుథ్థాన దినమున అతడు అనేక సత్కార్యాలతో పాటు వీటతో కూడా వస్తాడు. ఇతని చేత అణచివేతకు గురైన వానికి ఇతని మంచిపనులలో నుండి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా అతని మంచి చెడుల మధ్య న్యాయం పూర్తిగా జరుగక ముందే ఇతని సత్కార్యాలన్నీ అయిపోతే, ఇతని చేత అణచివేతకు గురైన వాని పాపాలలో కొన్ని ఇతని ఖాతాలలో వేయబడతాయి. అపుడు అతడు నరకాగ్నిలోనికి విసిరి వేయబడతాడు. అపుడు అతని పేరున ఒక్క సత్కార్యం కూడా మిగిలి ఉండదు.
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “బంగారము మరియు వెండి కలిగి ఉన్న సొంతదారుడు ఎవరైనా వాటి హక్కును (జకాతును) చెల్లించనట్లయితే, తీర్పు దినమున అవి పలకలుగా మార్చబడి నరకాగ్నిలో బాగా కాల్చబడతాయి. వాటితో అతని పక్కలపై, నుదుటిపై, వీపుపై వాతలు పెట్టడం జరుగుతుంది. అవి చల్లారితే వాటిని తిరిగి ఎర్రగా కాల్చడం జరుగుతుంది (తిరిగి అతడిని ఆ విధంగా శిక్షించడం జరుగుతుంది). అప్పుడు ఒక దినము యాభైవేల సంవత్సరాలంత సుదీర్ఘంగా ఉంటుంది. ఆ శిక్ష అల్లాహ్ తన దాసుల మధ్య తీర్పు చేసేటంత వరకూ కొనసాగుతూ ఉంటుంది. తరువాత అతడు అతని గమ్యస్థానమైన స్వర్గం వైపునకో లేక నరకం వైపునకో మార్గం చూసుకుంటాడు (చూపడం జరుగుతుంది). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడగడం జరిగింది: “ఓ రసూలల్లాహ్! మరి ఒంటెల గురించి?” (అంటే ఒంటెలు కలిగి ఉన్న ఆసామి ఎవరైనా వాటి హక్కును (జకాతును) చెల్లించనట్లయితే?) దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “పునరుత్థాన దినమున ఒంటెల యజమానిని, ఎవరైతే వాటి హక్కును చెల్లించడో – వాటి హక్కులలో, వాటికి నీరు త్రాపుట, దినములో పాలుపితుకుట కూడా ఉన్నది – అటువంటి యజమానిని విశాలమైన ఎడారి వంటి మైదానములో తన ముఖముపై, లేదా అతని వీపుపై పడవేయుట జరుగుతుంది. ఆ ఒంటెలు బాగా బలిసినట్టుగా లావుగా ఉంటాయి, వాటిలో చిన్న ఒంటె కూడా మినహాయించ బడదు. అవి తమ కాళ్ళ గిట్టలతో అతడిని తొక్కుతూ, తమ పళ్ళతో అతడిని కరుస్తూ ఉంటాయి. మొదటి ఒంటె నుండి చివరి ఒంటె వరకు వంతుల వారీగా ఇలా జరుగుతుంది. అపుడు ఒక దినము యాభై వేల సంవత్సరాల అంత దీర్ఘంగా ఉంటుంది, ఈ విధంగా అల్లాహ్ దాసుల మధ్య తీర్పు చేసేటంత వరకు జరుగుతుంది. చివరికి అతడు తన అంతిమ గమ్యస్థానం అయిన స్వర్గం వైపునకో లేక నరకం వైపునకో మార్గం చూసుకుంటాడు (దారి చూపబడుతుంది). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను (మరలా) ఇలా అడగడం జరిగింది: “ఓ రసూలల్లాహ్! మరి ఆవులు (పశువులు) మరియు మేకలు, గొర్రెల సంగతేమిటి?” అని (అంటే ఆవులు, మేకలు/గొర్రెలు కలిగి ఉన్న ఆసామి ఎవరైనా వాటి హక్కును (జకాతును) చెల్లించనట్లయితే?) దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “పునరుత్థాన దినమున అతడు విశాలమైన ఎడారి వంటి మైదానములో తన ముఖం మీద పడవేయబడతాడు. అక్కడ వంకరలు తిరిగిన కొమ్ములు లేని ఏ జంతువూ కనిపించదు, అలాగే విరిగిన కొమ్ములు కలిగిన ఏ జంతువు గానీ, కొమ్ములు లేని ఏ జంతువు గానీ కనిపించదు. అవి తమ కొమ్ములతో అతడిని పొడుస్తాయి, తమ కాలి గిట్టలతో అతడిని తొక్కుతాయి. వాటిలో మొదటి పశువు అతడిని దాటిన తరువాత ఆ దినము చివరి పశువు అతడిని దాటేంత వరకు ఇలా జరుగుతుంది. అపుడు ఒక దినము యాభైవేల సంవత్సరాల అంత సుదీర్ఘంగా ఉంటుంది. అల్లాహ్ దాసుల మధ్య తీర్పు ప్రకటించబడే వరకు ఇలా జరుగుతుంది. చివరికి అతని అంతిమ గమ్యస్థానం అయిన స్వర్గం వైపునకో లేక నరకం వైపునకో అతడు తన మార్గం చూసుకుంటాడు (దారి చూపబడుతుంది). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను (మరలా) ఇలా అడగడం జరిగింది: “ఓ రసూలల్లాహ్! మరి గుర్రాల గురించి?” అని (అంటే గుర్రాలు కలిగి ఉన్న ఆసామి ఎవరైనా వాటి హక్కును (జకాతును) చెల్లించనట్లయితే?) దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “గుర్రాలు మూడు రకాలు: అవి ఆ వ్యక్తికి భారంగా పరిణమించవచ్చు, ఆ వ్యక్తికి కవచంగా పరిణమించవచ్చు, మరియు ఆ వ్యక్తిని పుణ్యఫలానికి అర్హుడినిగా చేయవచ్చు. ఎవరైతే ప్రజలకు చూపించడానికి, హోదా మరియు గర్వపడుట కొరకు, మరియు ఇస్లాంకు, ముస్లిములకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి కట్టి ఉంచినట్లయితే, తీర్పు దినమున అవి అతనికి ఒక భారంగా పరిణమిస్తాయి. కవచంగా పరిణమించే గుర్రాల విషయానికి వస్తే, ఎవరైతే గుర్రాలను కలిగి ఉండి, వాటిని అల్లాహ్ మార్గములో ఉపయోగించే నిమిత్తం కట్టి ఉంచుతాడో, మరియు వాటి వీపుల మీద, మరియు వాటి మెడల మీద అల్లాహ్’కు గల హక్కును మరిచిపోడో (అంటే వాటి వీపులను, మెడలను పేద ప్రజలను తమ అవసరాల కొరకు వినియోగించుకోనిస్తాడో) అవి అతనికి కవచంగా పరిణమిస్తాయి. మరి పుణ్యఫలంగా పరిణమించే గుర్రాల విషయానికి వస్తే ఎవరైతే గుర్రాలను కలిగి ఉండి, ముస్లిముల కొరకు, మరియు అల్లాహ్ మార్గంలో జరిగే పోరాటాలలో వాటిని వినియోగించే ఉద్దేశ్యంతో, వాటి కొరకు పచ్చిక బైళ్ళను, తోటలను కేటాయించి, వాటిలో కట్టివేసి వాటిని పెంచుతున్నట్లయితే అవి వాటిలో తిరుగుతూ ఏమి మేసినా (మేసిన ప్రతి ఆకు, ప్రతి గడ్డిపరకా) అది అతనికి పుణ్యఫలంగా రాయబడుతుంది; వాటి పేడ (లద్దె), వాటి మూత్రము కూడా అతని ఖాతాలో పుణ్యఫలంగా వ్రాయబడుతుంది. ఒకవేళ ఆ గుర్రం త్రాడు తెంచుకుని ఒకటి లేక రెండు ఎత్తైన ప్రదేశాలు (గుట్టలు) దాటుకుని వస్తే, అది వేసిన ప్రతి అడుగు అతనికి పుణ్యఫలంగా వ్రాయ బడుతుంది; దాని పేడ (లద్దె), మరియు దాని మూత్రము సైతం అతనికి పుణ్యఫలంగా వ్రాయబడతాయి. ఒకవేళ అతడు ఆ గుర్రాన్ని ఏదైనా నది ఒడ్డు మీద నుండి వెళుతున్నపుడు, (గుర్రానికి) నీళ్ళు తాపించే ఉద్దేశ్యం అతనికి లేకపోయినా, గుర్రం తనంతట తానే నదిలోని నీళ్ళు త్రాగితే, అది ఎన్ని గ్రుక్కల నీళ్ళు త్రాగిందో అవన్నీ అతనికి పుణ్యఫలాలుగా వ్రాయబడతాయి.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంపదలలోని రకాలను మరియు వాటిపై జకాతు చెల్లించని వారికి తీర్పుదినమున విధించబడే శిక్షలను గురించి తెలియజేసినారు. వాటిలో: మొదటిది: బంగారం మరియు వెండి, ఇంకా వాటికి సారూప్యంగా ఉండేవి, డబ్బు మరియు వాణిజ్య వస్తువులు మొదలైనవి. ఈ సంపదలు జకాతుకు లోబడి ఉంటాయి, కానీ వాటి జకాతు చెల్లించబడదు. ఈ సంపదలపై జకాతు చెల్లించనట్లయితే పునరుత్థాన దినమున వాటిని కరిగించి, ప్లేట్ల (ఫలకాల) రూపంలో పోసి, నరకాగ్నిలో ఎర్రగా కాల్చి వాటితో, వాటి యజమానిని శిక్షించడం జరుగుతుంది. వాటితో అతని ప్రక్కల మీద, వీపు మీద మరియు నుదిటి మీద వాతలు పెట్టడం జరుగుతుంది. అవి చల్లబడినప్పుడల్లా, వాటిని మళ్లీ ఎర్రగా కాల్చడం జరుగుతుంది, ఆ విధంగా అతడు తీర్పు దినం అంతటా శిక్షించబడుతూనే ఉంటాడు. ఆ దినము యాభై వేల సంవత్సరాలంత దీర్ఘంగా ఉంటుంది, ఇలా అల్లాహ్ తన సృష్ఠితాల మధ్య తీర్పు చెప్పే వరకు జరుగుతుంది. తరువాత అతను స్వర్గం లేదా నరకాగ్నిలో నివసించేవారిలో ఒకనిగా మారుతాడు. రెండవది: ఒంటెలు కలిగి ఉండి కూడా వాటి జకాత్ మరియు వాటి హక్కును చెల్లించని ఒంటెల యజమాని; వాటి హక్కులలో అక్కడ హాజరైన పేదలకు వాటి పాలు పితికి ఇవ్వడం కూడా ఒకటి. పునరుత్థాన దినమున ఈ ఒంటెలు మునుపెన్నడూ లేనంతగా పెద్దవిగా, లావుగా తీసుకు రాబడతాయి; మరియు విశాలమైన, చదునైన భూమిపై పునరుత్థాన దినాన వాటి యజమాని విసిరివేయబడతాడు. అవి అతనిని తమ కాళ్ళతో తొక్కుతాయి, మరియు పళ్ళతో కొరుకుతాయి. చివరి ఒంటె అతనిని దాటినప్పుడల్లా, మొదటిది ఒంటె వంతు వస్తుంది. అతను పునరుత్థాన దినం అంతటా ఈ విధంగా శిక్షించబడుతూనే ఉంటాడు, ఆ దినము వ్యవధి యాభై వేల సంవత్సరాలు ఉంటుంది, అల్లాహ్ సృష్ఠితాల మధ్య తీర్పు చెప్పే వరకు ఈ శిక్ష కొనసాగుతూనే ఉంటుంది. తరువాత అతడు స్వర్గజనులలోని వానిగానో లేదా నరకవాసులలోని వానిగానో మారిపోతాడు. మూడవది: ఆవులు, మేకలు మరియు గొర్రెలు కలిగి ఉండి, వాటి జకాతును చెల్లించకుండా ఉన్న యజమాని. అతనికి సంబంధించి పునరుత్థాన దినమున ఆ ఆవులు, మేకలు మరియు గొర్రెలు వాటి అసలు సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో తీసుకు రాబడతాయి, వాటిలో ఒక్కటి కూడా తప్పిపోదు. అతడిని నేలపై పడవేసి, చదునుగా ఉండే విశాలమైన మైదానంలో విసిరివేయడం జరుగుతుంది. ఆ ఆవులు, మేకలు మరియు గొర్రెలలో ఒక్కటి కూడా వంగిపోయిన కొమ్ములతో, లేక విరిగి పోయిన కొమ్ములతో లేక అసలు కొమ్ములు లేకుండా ఉండదు; అలాకాక అవి బలంగా, ఎటువంటి లోపము లేకుండా, సంపూర్ణంగా ఖచ్చితమైన ఆకృతిలో ఉంటాయి. అవి అతడిని తమ కొమ్ములతో పొడుస్తూ ఉంటాయి, తమ కాళ్ళ గిట్టలతో అతడిని తొక్కుతూ ఉంటాయి. వాటిలో చివరి జంతువు అతడిని దాటిన తరువాత మొదటి దాని వంతు వస్తుంది. అతను పునరుత్థాన దినం అంతటా ఇదే స్థితిలో ఉంటాడు, ఈ విధంగా శిక్షించబడుతూనే ఉంటాడు, ఆ దినము వ్యవధి యాభై వేల సంవత్సరాలు ఉంటుంది, అల్లాహ్ సృష్ఠితాల మధ్య తీర్పు చెప్పే వరకు ఈ శిక్ష కొనసాగుతూనే ఉంటుంది. తరువాత అతడు స్వర్గజనులలోని వానిగానో లేదా నరకవాసులలోని వానిగానో మారిపోతాడు. నాలుగవది: గుర్రాలు కలిగి ఉన్న యజమాని. ఇవి మూడు రకాలుగా ఉంటాయి: మొదటిది: అవి అతనికి పునరుత్థాన దినమున భారంగా పరిణమిస్తాయి: ఒకవేళ వాటి యజమాని వాటిని ఇతరులకు తన డాబు, దర్పంగా చూపడానికి, హోదా మరియు గర్వము కొరకు; మరియు ఇస్లాం కు మరియు ముస్లిములకు వ్యతిరేకంగా వాటిని ఉపయోగించే ఉద్దేశ్యముతో వాటిని కట్టివేసి పెంచుతున్నట్లయితే పునరుత్థాన దినమున అవి అతనికి భారంగా పరిణమిస్తాయి. రెండవది: అవి అతనికి ఒక కవచంలాగా పరిణమిస్తాయి: గుర్రాల యజమాని వాటిని అల్లాహ్ మార్గములో జిహాద్ కొరకు వినియోగించే ఉద్దేశ్యముతో వాటిని దయతో, కరుణతో పెంచుతూ, వాటిలోని మగ గుర్రాలను సంతానోత్పత్తికి కొరకు కూడా వినియోగించే వ్యక్తి. ఇటువంటి వ్యక్తికి ఆ గుర్రాలు కవచంలాగా పరిణమిస్తాయి. మూడవది: అవి అతనికి పుణ్యఫలంగా పరిణమిస్తాయి: గుర్రాల యజమాని వాటిని ముస్లిముల ప్రయోజనాల కొరకు, అల్లాహ్ మార్గములో జిహాద్ కొరకు వినియోగించే ఉద్దేశ్యముతో వాటిని ఉంచే వ్యక్తి. అతడు వాటి కొరకు పచ్చిక బయళ్ళను కేటాయించి, వాటిలో గుర్రాలను ఉంచి మేపుతాడు. అందులో ఆ గుర్రాలు ఏమి తిన్నా (ప్రతి గడ్డిపరక, ప్రతి ఆకు) అవి అన్నీ అతనికి పుణ్యఫలంగా వ్రాయబడతాయి, అవి వేసిన పేడ (లద్దీ) వాటి మూత్రము కూడా అతనికి పుణ్యఫలంగా వ్రాయబడతాయి. అవి తమ ముకుతాళ్ళను త్రెంచుకోవు, ముకుతాళ్ళు అంటే, వాటిని కట్టివేసి ఉంచడానికి, అవి బయళ్ళలో, ఎత్తైన ప్రదేశాలలో పరుగెత్తేలా చేయడానికి ఉపయోగించే త్రాడు. అవి తిరుగుతూ, పరుగెడుతూ వేసిన ప్రతి డెక్కల గుర్తు (ప్రతి అడుగు యొక్క గుర్తు),అవి వేసిన పేడ, అతనికి పుణ్యఫలంగా వ్రాయబడతాయి. ఒకవేళ అతడు ఆ గుర్రాన్ని ఏదైనా నది ఒడ్డు మీద నుండి తీసుకు వెళుతున్నపుడు, అతనికి (గుర్రానికి) నీళ్ళు తాపించే ఉద్దేశ్యం లేకపోయినా, గుర్రం తనంతతానే నదిలోని నీళ్ళు త్రాగితే, అది ఎన్ని గ్రుక్కల నీళ్ళు త్రాగిందొ అవన్నీ అతనికి పుణ్యఫలాలుగా వ్రాయబడతాయి. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను గాడిదల గురించి ప్రశ్నించడం జరిగింది, వాటి విషయం కూడా గుర్రాల వంటిదేనా అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అన్ని రకాల విధేయత మరియు అవిధేయతలకు సాధారణంగా అన్వయించే ఈ ఆయతు మినహా ప్రత్యేకంగా వాటిని గురించి ప్రస్తావించే ఆదేశం / శాసనం ఏదీ అవతరించబడలేదు. ఆ ఆయతులో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “ఫమన్ య’మల్ మిథ్’ఖాల జర్రతిన్ ఖైరైయ్యరహ్, వమన్ య’మల్ మిథ్’ఖాల జర్రతిన్ షర్రైయ్యరహ్” (అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసిఉన్నా, దానిని చూసుకుంటాడు; మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసిఉన్నా, దానిని చూసుకుంటాడు. (సూరహ్ అ'జ్-'జల్'జలహ్ (99: 7,8)” కనుక ఎవరైతే గాడిదలను అల్లాహ్ యొక్క అవిధేయతకు పాల్బడే కార్యాలలో వినియోగిస్తాడో, అతడు దాని శిక్షను చూసుకుంటాడు, మరియు ఎవరైతే వాటిని అల్లాహ్ యొక్క విధేయతకు పాల్బడే కార్యాలలో వాటిని ఉపయోగిస్తాడో అతడు కూడా దాని ప్రతిఫలాన్ని చూసుకుంటాడు.