





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైనా సలాహ్ ఆచరించవలసి ఉందన్న విషయాన్ని మరిచిపోయినట్లయితే, అతడు తనకు గుర్తుకు వచ్చిన వెంటనే ఆ సలాహ్ ను ఆచరించాలి. ఇది తప్ప దీనికి పరిహారము లేదు. {وَأَقِمِ الصَّلاةَ لِذِكْرِي} [طه: 14] (మరియు నన్ను స్మరించుట కొరకు నమా'జ్ను స్థాపించు.) [సూరహ్ తాహా 20:14):”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ఎవరైనా విధిగా ఆచరించవలసిన నమాజులలో ఏదైనా నమాజును దాని సమయం దాటిపోయేంత వరకు ఆచరించుట మరిచిపోతే, అతడు గుర్తుకు వచ్చిన వెంటనే ఆ నమాజును (ఖజా నమాజుగా) ఆచరించుటకు ఉపక్రమించాలి. ఆ విధంగా పూర్తి చేయకుండా మిగిలి పోయిన నమాజును గుర్తుకు వచ్చిన వెంటనే ఆచరించుట తప్ప, ఒక ముస్లిము ఆ నమాజును సమయం మించిపోయేంత వరకు మరిచిపోవటం (అలక్ష్యము) వలన జరిగిన పాపము అతని నుండి తొలగిపోవుట, లేదా కప్పివేయబడుట జరుగదు. అల్లాహ్ దివ్య ఖుర్’ఆన్ లో ఇలా ఆదేశించినాడు: {… وَأَقِمِ ٱلصَّلَوٰةَ لِذِكْرِىٓ} (మరియు నన్ను స్మరించుట కొరకు నమా'జ్ను స్థాపించు.) [సూరహ్ తాహా 20:14): అంటే, విధిగా ఆచరించవలసిన నమాజులలో దేనినైనా ఆచరించుట మరిచిపోతే, గుర్తుకు వచ్చిన వెంటనే అల్లాహ్ ను స్మరించుటకొరకు ఆ నమాజు స్థాపించుట కూడా విధి అని అర్థము.
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సైనిక దాడిలో, చంపబడి ఉన్న ఒక స్త్రీ శవాన్ని ఆయన చూసినారు. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలను, పిల్లలను చంపడాన్ని ఖండించారు, బహిరంగంగా నిందించినారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఒక సైనిక దండయాత్రలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక స్త్రీ చంపబడి ఉండడాన్ని చూసినారు. అపుడు ఆయన (యుద్ధములో) స్త్రీలను మరియు యుక్త వయస్సుకు చేరని పిల్లను చంపడాన్ని ఖండించారు,
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “(ఏ విషయం కొరకైనా) మొక్కుకోవడాన్ని (మొక్కుబడులను) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారు; మరియు ఇలా అన్నారు: “మొక్కుకోవడం ఏ మంచినీ, శుభాన్నీ తీసుకొని రాదు, అది కేవలం పిసినారి నుండి ఎంతో కొంత బయటకు తీసే మార్గము మాత్రమే.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విషయం గురించైనా మొక్కుకోవడాన్ని నిషేధించినారు. మొక్కుకొనుట అంటే ఒక వ్యక్తి, షరియత్ ప్రధాత అయిన అల్లాహ్ ద్వారా అతనిపై ‘విధి’ చేయబడని విషయాన్ని తనపై విధిగావించుకొనుట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మొక్కుబడులు (విధిలిఖితమైన) ఏ విషయాన్నీ ముందుకు జరుపలేవు, అలాగే వెనుకకూ జరుపలేవు. అవి, తనపై విధిగావించబడిన వాటిని తప్ప (స్వచ్ఛంద ఆరాధనలు) ఏవీ చేయని పిసినారి నుండి నిశ్చయంగా ఎంతో కొంత బయటకు తీయగలవు. మొక్కుబడులు అతని విధివ్రాతలో లేని ఏ విషయాన్నీ అతని కొరకు తీసుకుని రాలేవు.”
అబూ మూసా అల్ అష్’అరీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : నేను, కొంతమంది అష్’అరీ తెగ వారితో కలిసి, “మాకు సవారీ వాహనాలు (ఉదా: ఒంటెలు, గుర్రాలు మొ.) కావాలి” అని కోరుతూ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళినాము. ఆయన “అల్లాహ్ సాక్షిగా! మీరు సవారీ అయి వెళ్ళడానికి నేను ఏమీ ఇవ్వను, మిమ్ములను సవారీ చేయడానికి నావద్ద ఏమీ లేదు” అన్నారు. అల్లాహ్ కోరినంత కాలము మేము ఎదురు చూసాము. అపుడు వారి వద్దకు మూడు ఒంటెలు తీసుకురాబడినాయి. ఆ మూడు ఒంటెలను తీసుకు వెళ్ళమని ఆయన మమ్మల్ని ఆదేశించినారు. మేము వాటిని తీసుకుని వెళ్ళినాము. అపుడు మాలో కొందరు “అల్లాహ్ మనలను అనుగ్రహించడు, మనం రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, మనకు సవారీ సమకూర్చమని కోరినాము. కానీ ఆయన అల్లాహ్ పై ప్రమాణం చేసి మరీ మనకు సవారీ ఇవ్వను అని అన్నారు; కానీ తరువాత ఇచ్చినారు” అన్నారు. అబూ మూసా (రదియల్లాహు అన్హు) ఇంకా ఇలా అన్నారు: “మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తిరిగి వచ్చి (మా మధ్య) జరిగిన విషయాన్ని వారికి తెలియజేసినాము. దానికి ఆయన ఇలా అన్నారు: “మీకు సవారీలను నేను సమకూర్చలేదు; కానీ అల్లాహ్ సమకూర్చినాడు. అల్లాహ్ సాక్షిగా – అల్లాహ్ దయతలిచినట్లయితే (ఇన్ షా అల్లాహ్) – ఎప్పుడు ప్రమాణం చేసినా, ప్రమాణం చేసిన దాని కంటే మరో విషయం శుభప్రదంగా కనిపిస్తే, నేను ప్రమాణం చేసిన దాని కొరకు పరిహారం చెల్లించి, ఆ శుభప్రదమైన విషయాన్నే ఎన్నుకుంటాను.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో అబూ మూసా అల్ అష్’అరీ రదియల్లాహు అన్హు తాను తన తెగకు చెందిన మరి కొంతమందితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినానని ఉల్లేఖిస్తున్నారు. వారి ఉద్దేశ్యం జిహాద్’లో పాల్గొనడానికి స్వారీ వాహనాలుగా తమకు ఒంటెలను సమకూర్చమని వారిని కోరడం. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వారీ వాహనాలను సమకూర్చను అని అల్లాహ్ పై ప్రమాణం చేసి చెప్పి, వారికి ఇవ్వడానికి తన వద్ద ఏమీ లేదు అని అన్నారు. అపుడు వారు కొద్దికాలం వేచి ఉన్నారు, అప్పుడు మూడు ఒంటెలు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాయి; ఆయన వాటిని వారి వద్దకు పంపారు. వారిలో కొందరు ఒకరితో ఒకరు ఇలా అన్నారు: “ఈ ఒంటెల ద్వారా అల్లాహ్ మనలను అనుగ్రహించడు, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మమ్మల్ని అల్లాహ్ పై ప్రమాణం చేసి మనకు వాహనాలను సమకూర్చను అని అన్నారు”. దానితో వారందరూ ఆయన వద్దకు వచ్చి తమ మధ్య జరిగిన సంభాషణను ఆయన వద్ద ప్రస్తావించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మీకు వాహనాలను సమకూర్చినది సర్వోన్నతుడైన అల్లాహ్ మాత్రమే. ఎందుకంటే సహాయాన్ని మరియు ఉపాధిని కల్పించే (మరియు కల్పించే వాడు) ఆయనే, నా చేతుల ద్వారా ఇది జరగడానికి నేను ఒక కారణాన్ని మాత్రమే. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను - అల్లాహ్ దయతలిచినట్లయితే (ఇన్ షా అల్లాహ్) – నేను ఏదైనా విషయం కొరకు, చేయడానికి గానీ లేక వదిలివేయడానికి గానీ ప్రమాణం చేస్తే, తరువాత నేను ప్రమాణం చేసిన దాని కంటే వేరొక విషయాన్ని మంచిదిగా, శుభప్రరదమైనదిగా నేను చూసినట్లయితే, నేను ఆ శుభప్రదమైన విషయాన్నే ఎంచుకుంటాను, నేను ముందు ప్రమాణం చేసిన విషయాన్ని వదిలివేసి, అందుకు గానూ పరిహారం చెల్లిస్తాను.”
అబూ మూసా అల్ అషఅరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను “శౌర్యపరాక్రమాలతో పోరాడేవాడు, జాత్యభిమానము తో పోరాడేవాడు మరియు ప్రదర్శనాబుధ్ధితో పోరాడేవాడు – వీరిలో ఎవరు అల్లాహ్ మార్గములో ఉన్నవాడు?’ అని ప్రశ్నించడం జరిగింది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఎవరైతే అల్లాహ్ యొక్క వాక్కును సర్వోన్నతం చేయడానికి పోరాడుతాడో అతడు అల్లాహ్ యొక్క మార్గములో ఉన్నవాడు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను యోధుల విభిన్న లక్ష్యాలకు సంబంధించి ప్రశ్నించడం జరిగింది – (ప్రజల ముందు) శౌర్యపరాక్రమాలు గలవానిగా పోరాడేవాడు, తన జాతి జనుల కొరకు ఉన్మాదిలాగా పోరాడే వాడు, మరియు ప్రజల దృష్ఠిలో అల్లాహ్ మార్గములో పోరాడేవానిగా గుర్తింపు పొందుటకు లేక అటువంటి ఇతర విషయాన్ని ఆశించి పోరాడే వాడు – వీరిలో ఎవరు అల్లాహ్ మార్గములో ఉన్నవాడు? అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – “అల్లాహ్ మార్గములో పోరాడే యోధుడు ఎవరంటే: ఎవరైతే అల్లాహ్ యొక్క వాక్కును సర్వోన్నతం చేయుటకు పోరాడుతాడో అతడు” అని తెలియజేసారు.
అబీ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నమాజు కొరకు (ముఅజ్జిన్ యొక్క) అజాన్ పిలుపు విన్నపుడు, మీరు కూడా ముఅజ్జిన్ మాదిరిగానే పలకండి”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో – నమాజు కొరకు ముఅజ్జిన్ ఇస్తున్న పిలుపు (అజాన్) వింటున్నపుడు, ఆయన ఏ పదాలనైతే పలుకుతున్నాడో, అవే పదాలు పలుకుతూ అతనికి ప్రత్యుత్తరమివ్వమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనలను ప్రోత్సహిస్తున్నారు. ముఅజ్జిన్ “అల్లాహు అక్బర్” అని పలికితే, తరువాత వెంటనే మనం కూడా “అల్లాహు అక్బర్” అంటాము, అతడు “షహాదతైన్” పలికితే, తరువాత వెంటనే మనం కూడా “షహాదతైన్” పలుకుతాము. అయితే “హయ్య అలస్సలాహ్ – హయ్య లల్ ఫలాహ్” అనే పదాలకు మాత్రం వేరే మినహాయింపు ఉంది – ముఅజ్జిన్ ఆ పదాలు పలికినపుడు మనం “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకుతాము.
అల్ ముగీరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒక ప్రయాణములో నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నాను. (వారు వుదూ చేస్తూ కాళ్ళు కడగడం దగ్గరికి వచ్చేసరికి) నేను, వారు కాళ్ళకు తొడుగుకుని ఉన్న, పలుచని తోలుతో చేసిన మేజోళ్ళను (ఖుఫ్ఫైన్ లను) తొలిగించడానికి ముందుకు వంగాను. అపుడు ఆయన ఇలా అన్నారు “వాటిని అలాగే ఉండనివ్వు (ఓ ముఘీరహ్), నేను వాటిని (పూర్తిగా) వుదూ చేసుకున్న తరువాత కాళ్ళకు తొడిగినాను”. అలా అని వారు తోలుతో చేసిన ఆ మేజోళ్ళపై తడి చేతులతో తడిమినారు (మసహ్ చేసినారు).
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రయాణంలో ఉన్నారు. అపుడు వారు వుజూ చేసినారు. వుజూలో కాళ్ళు కడగడం దగ్గరికి వచ్చేసరికి, వారు పాదాలకు తొడుగుకుని ఉన్న “ఖుఫ్ఫైన్” లను (పలుచని తోలుతో చేసిన మేజోళ్ళను) తొలగించి, వారి పాదాలాను కడగడానికి, ముగీరహ్ రజియల్లాహు అన్హు వంగి తన చేతులను ముందుకు చాచినారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వాటిని అలాగే ఉండనివ్వు, వాటిని తొలిగించకు. ఎందుకంటే నేను వాటిని పూర్తిగా వుదూ ఆచరించి కాళ్ళకు తొడిగినాను”. అలా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఖుఫ్ఫైన్’లపై తడి చేతులతో తడిమినారు (మసహ్ చేసినారు).
ఉమ్ముల్ ము’మినీన్ ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ఫాతిమా బింత్ అబీ హుబైష్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించారు: “(ఓ ప్రవక్తా!) బహిష్ఠు కారణంగా (బహిష్ఠు దినములు గడిచిపోయిన తరువాత కూడా) నాకు నిరంతరం రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది. ఆ కారణంగా నేను పరిశుద్ధత పొందలేకపోతున్నాను. నేను సలాహ్ కు (నమాజుకు) దూరంగా ఉండాలా?” దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు “లేదు (నీవు సలాహ్ కు దూరంగా ఉండవలసిన అవసరం లేదు); అది ఒక రక్తనాళము. సాధారణంగా బహిష్ఠు ఎన్ని దినముల కొరకు ఉంటుందో అన్ని దినములు సలాహ్ కు దూరంగా ఉండు. ఆ తరువాత గుసుల్ చేసి నమాజులను ఆచరించు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఫాతిమా బింత్ హుబైష్ రజియల్లాహు అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించారు: “బహిష్ఠు కారణంగా, బహిష్ఠు దినములు పూర్తి అయిన తరువాత కూడా నాకు రక్తస్రావము జరుగుతూనే ఉంటుంది – మరొక బహిష్ఠు వచ్చేంత వరకు. నేను నమాజు దూరంగా ఉండడానికి బహిష్ఠుకు సంబంధించిన నియమాలే నా ఈ స్థితికి కూడా వర్తిస్తాయా? దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెతో ఇలా అన్నారు: “అది ‘ఇస్తిహాజహ్ రక్తస్రావము’ (పసుపు వర్ణపు స్రావముతో కూడిన రక్తము). అది అనారోగ్యకరమైనది; గర్భాశయములో రక్తనాళముల ఒరిపిడి కారణంగా జనించే తేమ కారణంగా స్రవించునటువంటిది. అది బహిష్ఠు రక్తము కాదు.” ప్రతి నెల వచ్చే విధంగా సమయానికి బహిష్ఠు వచ్చినపుడు – అంటే ఇస్తిహాదహ్ రక్తస్రావము మొదలు కావడం కంటే ముందు వరకు - ఆ బహిష్ఠు స్థితిలో ఉన్నన్ని రోజులు నమాజుకు, ఉపవాసములకు మరియు సాధారణంగా బహిష్ఠు స్త్రీ దూరంగా ఉండవలసిన అన్ని పనులకు దూరంగా ఉండాలి. బహిష్ఠు యొక్క సాధారణ కాల పరిమితి పూర్తి అయినపుడు, బహిష్ఠు స్థితి నుండి పరిశుద్ధత పొందాలి. ముందుగా రక్తస్రావము జరిగిన ప్రదేశాన్ని పుష్కలంగా నీటితో కడగాలి, తరువాత శరీరం మొత్తాన్ని సంపూర్ణంగా కడగాలి (గుసుల్ చేయాలి), తరువాత నమాజు ఆచరించాలి.
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీ పంక్తులను (వంకర లేకుండా) సరిచేసుకొోండి, ఎందుకంటే నిశ్చయంగా (వంకర లేకుండా) పంక్తులను సరి చేసుకోవడం సలాహ్ యొక్క (నమాజు యొక్క) పరిపూర్ణతలో భాగము.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుసలాహ్ ఆచరించుటకు నిలబడిన వారిని తమ పంక్తులను (వంకర లేకుండా) సరి చేసుకోమని ఆదేశిస్తున్నారు. ఒకరికొకరు ఒక అడుగు ముందూ లేక వెనుకో నిలబడరాదని, పంక్తులను సరి చేసుకొనుట సలాహ్ యొక్క సంపూర్ణత మరియు పరిపూర్ణతలో భాగం అని, మరియు వరుసలు వంకరగా ఉండటం దానిలోని లోపం మరియు న్యూనత అని తెలియజేస్తున్నారు.