





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ఇమ్రాన్ బిన్ హుస్సైన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను మొలల వ్యాధితో బాధపడుతున్నాను. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను నా నమాజు గురించి ప్రశ్నించాను. దానికి వారు ఇలా అన్నారు.” “నిలబడి ఆచరించు, అలా చేయలేకపోతే కూర్చుని ఆచరించు, అలా కూడా చేయలేకపోతే ఒకవైపునకు తిరిగి పడుకుని ఆచరించు”.
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు: శక్తి, సమర్థత లేని పరిస్థిలో తప్ప, నమాజుకు సంబంధించి ప్రాథమిక నియమం ఏమిటంటే నిలబడి నమాజును ఆచరించడం. నిలబడే శక్తి, సమర్థత లేని పరిస్థితిలో అతడు కూర్చుని ఆచరించాలి, ఒకవేళ అతడు కూర్చుని కూడా ఆచరించలేకపోతే అపుడు ఒకవైపునకు తిరిగి పడుకుని ఆచరించాలి.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “అంధుడైన ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నన్ను మస్జిదుకు తీసుకుని వచ్చేవారు ఎవరూ లేరు” అని, తన ఇంటిలోనే నమాజు ఆచరించుటకు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నుండి అనుమతి కోరాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతించినారు. ఆ వ్యక్తి వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తిని వెనుకకు పిలిచి “నీకు అదాన్ వినబడుతుందా?” అని ప్రశ్నించారు. దానికి అతడు “అవును” అని జవాబిచ్చాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అయితే దానికి (అనుగుణంగా) స్పందించు” అన్నారు (మస్జిదుకు వచ్చి నమాజు ఆచరించు)”.
ముస్లిం నమోదు చేసినారు:అంధుడైన ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! నాకు సహాయం చేయడానికి గానీ, ప్రతిరోజూ ఐదు పూటల నమాజు కొరకు నా చేయి పట్టుకుని మస్జిదునకు తీసుకు వచ్చే వారెవ్వరూ లేరు” అని జమాఅత్ ను వదలడానికి (తన ఇంటిలోనే నమాజు ఆచరించడానికి) ఆయన అనుమతి కోరాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతించినారు. అతడు వెనుతిరగగా ఆయన అతనితో “సలాహ్ కొరకు ఇవ్వబడే అదాన్ ను నీవు వినగలవా?” అని ప్రశ్నించారు. అతడు “అవును, వినగలను” అని జవాబిచ్చినాడు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అయితే దానికి (అనుగుణంగా) స్పందించు (అంటే మస్జిదుకు వచ్చి జమాతుతో నమాజు ఆచరించు)” అన్నారు.
అలీ బిన్ అబూ తాలిబ్ మరియు ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హుమా మర్ఫూ ఉల్లేఖనం:మీలో ఒకరు నమాజు కు వచ్చినప్పుడు, ఇమామ్ నమాజు యొక్క ఒక స్థితిలో ఉన్నాడు అప్పుడు అతను ఇమాము చేస్తున్న దాన్ని అనుసరించవలసి ఉంటుంది.
దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారుమీరు నమాజుకు వచ్చినప్పుడు నమాజులో ఖియామ్,రుకూ,సజ్దా మరియూ కుఊద్ లో నుంచి ఇమామ్ ను ఏ స్థితిలో పొందితే అదే స్థితిలో కలుసుకోవాలి,ఇమామ్ లేచే వరకు వేచిచూడకూడదు,కొంతమంది అజ్ఞానులు ఇలా చేస్తూ ఉంటారు.
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు “ఖుత్బతుల్ హాజహ్” నేర్పించినారు. “ఇన్నల్ హంద లిల్లాహి, నస్తయీనుహు, వ నస్తఘ్’ఫిరుహు, వ నఊజుబిహి మిన్ షురూరి అన్’ఫుసినా, మయ్యహ్’దిల్లాహు ఫలా ముజిల్లలహు, వమయ్యుజ్’లిల్ ఫలా హాదియలహు, వ అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహు, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. {యాఅయ్యుహన్నాసుత్తఖూ రబ్బకుముల్లజీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదతిన్, వ ఖలఖ మిన్’హా జౌజహా, వ బస్స మిన్’హుమా రిజాలన్ కసీరన్, వ నిసాఅన్, వత్తఖుల్లాహల్లజీ తసాఅలూనబిహి, వల్ అర్హామ్, ఇన్నల్లాహ కాన అలైకుం రఖీబా}[సూరహ్ అన్ నిసా:1]; {యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖతు ఖాతిహి, వలా తమూతున్న ఇల్లా వ అన్’తుమ్ ముస్లిమూన్.} [సూరహ్ ఆలి ఇమ్రాన్:102]; {యా అయుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ, వఖూలూ ఖౌలన్ సదీదన్}; {“యుస్’లిహ్’లకుం ఆ’మాలకుం, వ యఘ్’ఫిర్’లకుం, జునూబకుం, వమన్’యుతిఇల్లాహ వ రస్సులహు ఫఖద్ ఫాజ ఫౌజన్ అజీమా} [అల్ అహ్’జాబ్ 70, 71] (నిశ్చయంగా సకలస్తోత్రములూ, మరియు ప్రశంసలన్నియూ కేవలం అల్లాహ్ కొరకే, మేము అయనను మాత్రమే సహాయం కొరకు వేడుకుంటాము, మరియు మమ్ములను క్షమించమని ఆయను మాత్రమే వేడుకుంటాము, మాలోని కీడు నుండి ఆయన రక్షణ కోరుకుంటాము, ఎవరినైతే అల్లాహ్ సన్మార్గానికి మార్గదర్శకం చేసినాడో, అతడిని ఎవరూ మార్గభ్రష్ఠుడిని చేయలేరు, మరియు ఎవరినైతే ఆయన మార్గభ్రష్ఠత్వములో వదిలివేసినాడో, ఎవరూ అతనికి సన్మార్గ దర్శకం చేయలేరు. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడెవరూ లేరు అని నేను సాక్ష్యమిస్తున్నాను. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడని మరియు ఆయన సందేశహరుడనీ నేను సాక్ష్యమిస్తున్నాను. {ఓ మానవులారా! మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని (ఆ ప్రాణి) నుండి దాని జంట (హవ్వా)ను సృష్టించాడు మరియు వారిద్దరి నుండి అనేక పురుషులను మరియు స్త్రీలను వ్యాపింప జేశాడు. మరియు ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి, ఎవరి ద్వారా (పేరుతో) నైతే మీరు మీ పరస్పర (హక్కులను) కోరుతారో; మరియు మీ బంధుత్వాలను గౌరవించండి (త్రెంచకండి). నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని ఉన్నాడు} [సూరతున్’నిసా 4:1]; { ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు కర్తవ్యపాలనగా అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు అల్లాహ్ కు విధేయులుగా (ముస్లింలుగా) ఉన్న స్థితిలో తప్ప మరణించకండి} [సూరతుల్ ఆలి ఇమ్రాన్ 3:102]; {ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు మాట్లాడినప్పుడు యుక్తమైన మాటనే పలకండి; ఆయన మీ కర్మలను సరిదిద్దుతాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు ఎవడైతే అల్లాహ్ కు విధేయుడై సందేశహరుని ఆజ్ఞను పాలిస్తాడో! నిశ్చయంగా, అతడే గొప్ప విజయం పొందినవాడు} [సూరతుల్ అహ్’జాబ్ 30:70,71]
అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఇందులో అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు) – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనకు “ఖుత్బతుల్ హాజహ్” నేర్పించినారని తెలియజేస్తున్నారు. “ఖుత్బతుల్ హాజహ్” అంటే “అవసర సమయపు ప్రసంగం” అని తెలుగులో అనువదించవచ్చు. సాధారణంగా ఏదైనా అవసరానికి సంబంధించి ప్రసంగం ఇవ్వబడే సమయములో, ప్రధాన ప్రసంగానికి ముందు ఈ ‘ఖుత్బతుల్ హాజహ్’ ప్రసంగం చదువబడుతుంది. తరువాత ప్రధాన ప్రసంగం మొదలవుతుంది. ఉదాహరణకు వివాహ సమయమున ఇవ్వబడే ప్రసంగం, శుక్రవారం నాడు ‘జుమా ఖుత్బా’ ప్రారంభానికి ముందు. ఈ ఖుత్బతుల్ హాజహ్ చాలా గొప్ప అర్థాలు కలిగి ఉంది. ఉదాహరణకు సకలస్తోత్రములు మరియు సమస్తమైన ప్రశంసలు అన్నీ కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకము అనుట, కేవలం ఆయన నుండి మాత్రమే సహాయం కోరుకొనుట, పాపములకు క్షమాభిక్ష కొరకు కేవలం ఆయనను మాత్రమే వేడుకొనుట, మరియు పాపముల నుండి దూరంగా ఉండుట కొరకు ఆయన సహాయం కోరుట, మనలోని కీడులనుండి, మరియు ఇతర కీడుల నుండి ఆయన రక్షణ కోరుకొనుట మొదలైనవన్నీ. అలాగే ఇందులో సన్మార్గదర్శకం కేవలం అల్లాహ్ నుండి మాత్రమే అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. ఎవరినైతే అల్లాహ్ సన్మార్గానికి మార్గదర్శకం చేసినాడు, అతడిని ఎవరూ మార్గభ్రష్టుడిని చేయలేరు. అలాగే ఎవరినైతే అల్లాహ్ అపమార్గములో వదలివేసినాడొ, అతడిని ఎవరూ సన్మార్గానికి తీసుకు రాలేరు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘తౌహీదు’ యొక్క సాక్ష్యమును – అంటే ‘అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు’ అని సాక్ష్యమిచ్చుటను – ప్రస్తావించినారు, అలాగే ‘రిసాలహ్ యొక్క సాక్ష్యమును’ – అంటే ‘ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని సాక్ష్యమిచ్చుటను – ప్రస్తావించినారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుత్బతుల్ హాజహ్ ను మూడు ఖుర్’ఆన్ ఆయతులను పఠించి ముగుంచినారు. ఆ ఆయతులలో అల్లాహ్ ఆదేశించిన పనులను, కేవలం ఆయన సామీప్యము, ఆయన సాన్నిధ్యము, కరుణ కొరకు మాత్రమే ఆచరించాలని, ఆయన నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండాలని, ఆ విధంగా అల్లాహ్ పట్ల ‘తఖ్వా’ (భయభక్తులు) కలిగి ఉండాలని – ఎవరైతే అలా చేస్తారో వారి ఆచరణలు, వారి మాటలు సరియైనవిగా, న్యాయ బధ్ధమైనవిగా ఉంటాయి. వారి పాపాలు క్షమించబడతాయి, వారికి ఈ ప్రపంచములో మంచి జీవితం ప్రసాదించబడుతుంది, మరియు పరలోకములో విజయులై స్వర్గములో ప్రవేశింపజేయబడతారు.
అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “వలీ (వధువు తరఫున ఆమె సంరక్షకుడు) లేకుండా వివాహము పూర్తి కాదు”.
అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా స్పష్ఠపరిచినారు – (వివాహ సమయమున) ఆమె తరఫున ఆమె సంరక్షకుడు ఉంటే తప్ప, ఒక స్త్రీ యొక్క వివాహము సక్రమమైనది కాదు. అతడే “వివాహపు కరారునామా” (Marriage Contract) ను నెరవేరుస్తాడు.
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: ఒప్పందం కుదుర్చుకున్నవ్యక్తిని హతమార్చినవాడు (హంతకుడు) స్వర్గము యొక్క సుగంధాన్ని కూడా వాసన చూడలేడు; నిశ్చయంగా స్వర్గపు సుగంధము నలభై సంవత్సరాల (ప్రయాణపు) దూరము నుండి కూడా చూడగలిగినప్పటికీ. (ముఆహద్: ముస్లిముల రాజ్యములోనికి - తన ప్రాణానికి రక్షణ ఉంటుంది అనే ఒప్పందముపై - ప్రవేశించిన వ్యక్తి).
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక అతి తీవ్రమైన హెచ్చరికను గురించి తెలియజేస్తున్నారు – అది ఎవరైతే ఒక ‘ముఆహద్’ ను – అంటే అతడు అవిశ్వాసుల ప్రదేశము నుండి, ఇస్లామీయ రాజ్యము లోనికి ఏదైనా ఒప్పందంపై, మరియు రక్షణ ఒడంబడికపై ప్రవేశించిన అవిశ్వాసి అయి ఉంటాడు, అతడిని – చంపినట్లయితే, ఆ హంతకుడు స్వర్గపు సుగంధాన్ని కూడా వాసన చూడలేడు; స్వర్గపు సుగంధము, నిజానికి, నలభై సంవత్సరాల (ప్రయాణమంత) దూరమునుండి కూడా చడగలిగినదై ఉన్నప్పటికీ.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం – ఒక తీర్పును ప్రభావితం చేసేందుకు లంచం ఇచ్చే వానిని మరియు లంచం పుచ్చుకునే వానిని – ఇద్దరినీ శపించినారు.”
అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీసులో – లంచము ఇచ్చే వాడు, మరియు లంచము పుచ్చుకునే వాడు – ఇద్దరూ - సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడూ అయిన అల్లాహ్ యొక్క కరుణనుండి, దూరమగు గాక అని శపించినారు. ఇందులో న్యాయమూర్తులకు ఇచ్చే లంచము కూడా ఉన్నది. తనకు హక్కు లేని విషయములో తన పక్షమున తీర్పు ఇచ్చేలా చేయుటకు అతడు లంచము ఇస్తాడు.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు మక్కా నుండి మదీనాకు తిరిగి వచ్చాము. దారిలో నీరు ఉన్న ఒక ప్రదేశానికి చేరుకున్నపుడు, అస్ర్ సమయాన కొంతమంది త్వరత్వరగా వెళ్ళి హడావిడిగా వుదూ చేసుకున్నారు. మేము వారి దగ్గరికి వెళ్ళినాము, వారి మడమలు మాకు కనిపిస్తూనే ఉన్నాయి, వాటికి (వుదూ) నీరు చేరని కారణంగా అవి పొడిగా ఉన్నాయి. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నరకాగ్ని కారణంగా ఈ మడమలకు నాశనం (కాచుకుని) ఉన్నది; వెళ్ళి పూర్తిగా (ఏ లోపమూ లేకుండా) వుదూ చేయండి.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలతో మక్కా నుండి మదీనాకు ప్రయాణించినారు. దారిలో వారు నీళ్ళున్న ప్రదేశాన్ని కనుగొన్నారు. దానితో సహాబాలలో కొంతమంది గబగబా వెళ్ళి అస్ర్ నమాజు కొరకు ఉదూ చేసుకున్నారు. అయితే వారి పాదాల వెనుక భాగము (మడమలు) నీరు చేరని కారణంగా పొడిగా కనిపించింది. దానితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వుదూ చేసేటప్పుడు పాదాల వెనుక భాగాన్ని సరిగా కడుక్కోకుండా నిర్లక్ష్యం చేసిన వారికి అగ్నిలో శిక్ష మరియు వినాశనం ఉన్నాయి”. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్షుణ్ణంగా ఉదూ పూర్తి చేయమని వారిని ఆదేశించినారు.
ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ముఅజ్జిన్ (మస్జిద్ లో అజాన్ పలుకు వ్యక్తి) “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలికినపుడు మీలో ఎవరైతే “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలుకుతాడో, తరువాత అతడు “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్” అని పలికినపుడు, “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “అష్’హదు అన్న ముహమ్మదుర్’రసూలుల్లాహ్” అని పలికినపుడు, “అష్’హదు అన్న ముహమ్మదుర్’రసూలుల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “హయ్య అలస్సలాహ్” అని పలికినపుడు, “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “హయ్య అలల్’ఫలాహ్” అని పలికినపుడు, “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలికినపుడు, “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలుకుతాడో, తరువాత (చివరికి) అతడు (ముఅజ్జిన్) “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పలికినపుడు, (మీలో ఎవరైతే) “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని హృదయపూర్వకంగా పలుకుతాడో అతడు స్వర్గములో ప్రవేశిస్తాడు.”
ముస్లిం నమోదు చేసినారు:“అజాన్” అంటే అది ప్రజలకు నమాజు సమయము ప్రారంభమైనది అని తెలియ జేయు ప్రకటన. అజాన్ లోని పదాలు, అవి విశ్వాసము (ఈమాన్) మరియు “అఖీదా” ను తెలిపే సమగ్రమైన అర్థాన్ని కలిగి ఉన్న పదాలు (అఖీదహ్: ధర్మము యొక్క మూల విశ్వాసాల సమాహారము). ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అజాన్ వింటున్నపుడు (వింటున్న వ్యక్తిపై) షరియత్ ప్రకారము ఏమి నిర్దేశించబడినదో వివరిస్తున్నారు – అది ఏమిటంటే అజాన్ వింటున్న వ్యక్తి ముఅజ్జిన్ ఏమి పలుకుతున్నాడో దానిని పునరావృతం చేయడం (తిరిగి పలకడం). ఉదాహరణకు ముఅజ్జిన్ “అల్లాహు అక్బర్” అని పలికితే వింటున్న వ్యక్తి కూడా “అల్లాహు అక్బర్” అని పలకాలి, ఆ విధంగా అదాన్ చివరి వరకూ అన్నమాట; కేవలం ముఅజ్జిన్ “హయ్య అలస్సలాహ్”; “హయ్య అలల్ ఫలాహ్” అని పలికినపుడు తప్ప. అపుడు వింటున్న వ్యక్తి “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకుతాడు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించినారు – ఎవరైతే ముఅజ్జిన్ తో అతడు పలుకుతున్న పదాలను హృదయపూర్వకంగా పున:ఉచ్ఛరిస్తాడో అతడు స్వర్గములోనికి ప్రవేశిస్తాడు అని. అజాన్ పదాల యొక్క అర్థము: అల్లాహు అక్బర్: అంటే అల్లాహ్ అందరికంటే గొప్పవాడు, ఆయన మహిమ కీర్తిమంతమగుగాక, ఆయన అత్యంత ఘనమైన వాడు, ఆయన ప్రతి దానికన్నా కూడా గొప్పవాడు అని అర్థము. అష్’హదు అన్-లా ఇలాహ ఇల్లల్లాహ్: అంటే “అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు” అని నేను సాక్ష్యమిస్తున్నాను” అని అర్థము. అష్’హదు అన్న ముహమ్మదన్ రసూలుల్లాహ్: అంటే “ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశ హరుడు అనే విషయము, మరియు ఆయన అల్లాహ్ చేత పంపబడినాడు అనే విషయము సత్యము అని నేను హృదయపూర్వకముగా అంగీకరిస్తున్నాను మరియు ఆయనకు విధేయత చూపుట విధి అని నా నాలుకతో పలుకుతున్నాను, మరియు సాక్ష్యమిస్తున్నాను” అని అర్థము. హయ్య అలస్సలాహ్: అంటే “సలాహ్ (నమాజు) వైపునకు రండి” అని అర్థము; దానిని విన్న వ్యక్తి: “లాహౌల వలా ఖువ్వత” అని పలుకుతాడు: అంటే దాని అర్థము: “అల్లాహ్ యొక్క అనుగ్రహం ఉంటే తప్ప, ఒక వ్యక్తి అల్లాహ్ ఆరాధనా మార్గములో ఎదురయ్యే ఆటంకాలను తప్పించుకోలేడు, అతడు అశక్తుడు (అతనికా శక్తి లేదు), ఏ కార్యమునైననూ చేయగల సామర్థ్యము అతనికి లేదు” అని అర్థము. హయ్య అలల్ ఫలాహ్: అంటే “సాఫల్యము వైపునకు, విజయము వైపునకు రండి” అని అర్థము; అంటే స్వర్గములోనికి ప్రవేశించుటలో, మరియు నరకాగ్ని నుండి రక్షణ పొందుటలో విజయుడు కావడం.