Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way






























Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
ఈ హదీసులో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం - జిల్ హిజ్జహ్ మాసపు మొదటి పది దినములలో చేసే సత్కార్యాలు, సంవత్సరములోని మిగతా దినాలలో చేసే సత్కార్యాలకన్నా కూడా ఉత్తమమైనవి అని తెలియజేస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులు ఆయనను ఈ పది దినములలో కాక మిగతా దినములలో చేసే జిహాదును గురించి ప్రశ్నించడం జరిగింది – మిగతా దినములలో చేసే జిహాదు ఉత్తమైనదా, లేక ఈ పది దినములలో చేసే సత్కార్యాలు ఉత్తమమైనవా అని; నిజానికి, (దీనికి పూర్వమే) వారికి జిహాదు అత్యుత్తమమైన ఆచరణలలో ఒకటి అని పలుమార్లు (నిర్ధారణగా) బోధించడం జరిగింది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ విధంగా జవాబు ఇచ్చినారు: “ఈ పది దినములలో చేసే సత్కార్యాలు, మిగతా దినములలో చేసే జిహాదు కన్నా కూడా ఉత్తమమైనవి – అయితే, (మిగతా దినములలో చేసే జిహాదులో) కేవలం అల్లహ్ కొరకు తన ప్రాణాన్ని, తన ధనాన్ని పణంగా పెట్టి జిహాదులో పాల్గొని, తన ధనాన్ని కోల్పోయి (జిహాదు కొరకు తన ధనాన్ని ఆసాంతం అల్లాహ్ కొరకు ఖర్చు చేసి), తన ప్రాణాన్ని కూడా అల్లాహ్ మార్గములో ధారపోసిన వాని జిహాదు తప్ప.” ఈ పది దినములలో సత్కార్యాలు చేసే వాడు అంత గొప్ప ప్రతిఫలాన్ని పొందే వాడై ఉంటాడు.
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – అస్ర్ నమాజును, ఉద్దేశ్యపూర్వకంగా, దాని నిర్ధారిత సమయాన్ని మించి ఆలస్యం చేయుటను గురించి హెచ్చరిస్తున్నారు. ఎవరైతే అలా చేస్తాడు, అతడు తన ఆచారణలను వ్యర్థం చేసుకున్న వాడు అవుతాడు, నిర్మూలించుకున్న వాడవుతాడు.
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైతే సున్నత్ విధానాన్ని అనుసరించి, ఉదూ చేయునపుడు ఆచరించవలసిన అన్ని విషయాలను ఆచరిస్తూ, పరిపూర్ణంగా ఉదూ చేస్తాడో, అటువంటి ఉదూ అతని వల్ల జరిగిన చెడు పనులు,మరియు పాపములకు పరిహారంగా మారుతుంది – చివరికి అతని కాలి మరియు చేతుల వేళ్ళ క్రిందనుంచి అవి అతడి నుంచి దూరమవుతాయి.
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఒక వ్యక్తి, ఎవరి పోషణకైతే అతను బాధ్యుడో, అంటే ఉదాహరణకు భార్య, తల్లిదండ్రులు, మరియు తన సంతానం మొదలైన వారిపై ఖర్చు చేసి, దాని ద్వారా అతడు అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందుతాడు. మరియు తాను ఖర్చు చేసిన దానికి ప్రతిగా అతడు అల్లాహ్ నుండి ప్రతిఫలాన్ని కోరుకున్నట్లయితే అతడు అల్లాహ్ మార్గములో ఖర్చు చేసిన పుణ్యమును పొందుతాడు – అని తెలియజేస్తున్నారు.
తలలో కొద్ది భాగాన్ని క్షవరం చేసి కొద్ది భాగాన్ని అలాగే వదిలి వేయడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారు. (తలలో కొద్ది భాగాన్ని క్షవరం చేసి, కొద్ది భాగాన్ని అలాగే వదిలి వేయడాన్ని ‘ఖజా’ అంటారు) ఈ నిషేధము పురుషులందరికీ సమానంగా వర్తిస్తుంది, పిల్లలు, యువకులు, మధ్య వయస్కులు, వృధ్ధులు అందరికీ. అయితే స్త్రీలు తమ తలను క్షవరం చేసుకోవడానికి, లేదా చేయించుకోవడానికి అనుమతి లేదు. అది వారి కొరకు పూర్తిగా నిషేధము.
మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ మనకు ఈ హదీసులో సమాధి శిక్షలకు గురయ్యే కారణాల్లో ఒకదానిని తెలియజేశారు.ఇది సర్వసాధారణంగా జరుగుతుంది,తస్మాత్ !అది మూత్ర విసర్జన క్రమంలో పరిశుభ్రతను మరియు స్వచ్ఛతను పాటించకపోవడం.
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాహ్ ఆచరించునపుడు ఏడు శరీర భాగాలపై సజ్దాహ్ చేయమని అల్లాహ్ ఆదేశించినాడని వివరించారు. మొదటిది: నుదురు: ఇది ముఖములో భాగము; ఇది ముక్కు మరియు కనుల పైభాగము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతితో ముక్కును సూచించినారు; నుదురు మరియు ముక్కు రెండూ కలిపి ఏడు శరీర భాగాలలో ఒకటి అని సూచిస్తూ. దానిద్వారా సజ్దాహ్ చేయు వ్యక్తి ముక్కును కూడా నేలను ఆనించాలని ప్రత్యేకంగా సూచించినారు అన్నమాట. రెండవ మరియు మూడవ శరీర భాగములు – రెండు చేతులు. నాలుగవ మరియు ఐదవ శరీరభాగములు: రెండు మోకాళ్ళు. ఆరవ మరియు ఏడవ శరీర భాగములు: రెండు కాళ్ళ వేళ్ళు. ఇంకా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం – సజ్దాహ్ చేయునపుడు ధరించిన దుస్తులను గానీ, లేక తల వెంట్రుకలను గానీ పైకి దోపుకోరాదని ఆదేశించినారు. వాటిని నేలపై పరుచునేలా వదిలివేసి సజ్దాహ్ చేయాలని సూచించినారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఐదు దుఆ లను నమాజులో రెండు సజ్దాల నడుమ పలికేవారు – ఈ దుఆలలో ఉన్న విషయాలు ప్రతి ముస్లింకి అత్యంత అవసరమైనవి. ఈ దుఆలలో ఈ ప్రపంచ జీవితానికి సంబంధించి మరియు పరలోక జీవితానికి సంబంధించిన మంచి విషయాల ప్రస్తావన ఉన్నది. ఉదాహరణకు పాపముల నుండి క్షమాభిక్ష కొరకు వేడుకొనుట, వాటిని కప్పివేయుట కొరకు మరియు వాటినుండి మరలిపోవుట కొరకు వేడుకొనుట, అల్లాహ్ యొక్క కరుణ కొరకు వేడుకొనుట, శ్రేయస్సు కొరకు వేడుకొనుట – అంటే అనుమానాలు, సందేహాలనుండి స్వేచ్ఛ కొరకు, కోరికలు, వాంఛలనుండి స్వేచ్ఛ కొరకు, అనారోగ్యము పాలు కావడం నుండి స్వేచ్ఛ కొరకు మరియు వ్యాధులనుండి స్వేచ్ఛ కొరకు వేడుకొనుట, అలాగే ఉపాధి కొరకు వేడుకొనుట – అంటే ఈమాన్ కలిగి ఉండుట ద్వారా, ఙ్ఞానము ద్వారా, సత్కార్యములు ఆచరించుట ద్వారా మరియు స్వచ్చమైన సంపాదన ద్వారా ఉపాధి ప్రసాదించమని వేడుకొనుట.
నమాజు ముగించినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లు “అస్తగ్’ఫిరుల్లాహ్, అస్తగ్’ఫిరుల్లాహ్, అస్తగ్’ఫిరుల్లాహ్” అని పలికేవారు. తరువాత ఆయన ఈ పదాలతో తన ప్రభువును కీర్తించేవారు: “అల్లాహుమ్మ అంతస్సలామ్, వ మిన్కస్సలామ్, తబారక్త జల్’జలాలి వల్ ఇక్రామ్”. ఎందుకంటే అల్లాహ్ – ఆయనే శాంతి, ఆయన తన గుణగణాలలో పరిపూర్ణుడు. ఎటువంటి లోపము కానీ, దోషము కానీ లేని వాడు; మిగతా ఏ విషయం నుండీ కాకుండా, ఈ ప్రపంచపు కీడు మరియు హాని నుండి, మరియు పరలోకపు కీడు మరియు హాని నుండి మీరు పరమ పవితృడు అయిన ఆయన రక్షణ కోరుతారు. పరమపవిత్రుడు అయిన ఆయన (అల్లాహ్) ఈ రెండు లోకాలలో నిశ్చయంగా ఎన్నో రెట్లు శుభాలను ఉంచాడు. ఆయనే సర్వోన్నతుడు, మరియు ఆయనే దయ, కరుణ, కృప గలవాడు.