





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “నిశ్చయంగా చేతబడి (మంత్రతంత్రాలు), తాయెత్తులు, వశీకరణ మొదలైనవన్నీ బహుదైవారాధనలే”.
అబూదావూద్, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని విషయాలను గురించి తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఈ పనులకు పాల్బడితే వారు ‘షిర్క్’నకు పాల్బడినట్లే. అవి: మొదటిది: అల్-రుఖయ్య: ఇస్లాంకు పూర్వం అఙ్ఞానకాలంలో జబ్బున పడిన వారిని నయం చేయుటకు బహుదైవారాధనకు చెందిన పదాలతో (మంత్రాల లాగా) కొన్ని మాటలు పలుకబడేవి (ఇస్లాం లో ఈ విధంగా బహుదైవారధనకు చెందిన పదాలతో నయం చేయటానికి ప్రయత్నం చేసినట్లయితే అది బహుదైవారాధనగా (“షిర్క్” గా) పరిగణించబడుతుంది). రెండవది: అల్ తమాఇమ్ (తాయెత్తులు). అవి పూసలతో చేసినవి కావచ్చు లేక ఇంక దేనితో నైనా చేసినవి కావచ్చు: కీడును దూరం చేయడానికి తాయెత్తులను చిన్న పిల్లలకు, జంతువులకు, వాహనాలకు మొదలైన వాటికి కడుతూ ఉంటారు. మూడవది: అల్-తివాలహ్ (వశీకరణం): ఈ ప్రక్రియను ఒకరి భార్యను మరొకరు వశపరుచు కోవడానికి వాడుతారు. ఇవి బహుదైవారాధనగా (షిర్క్ గా) పరిగణించబడతాయి. ఎందుకంటే, షరియత్ లో లేని, షరియత్ ఆదేశించని ఒక విషయాన్ని మూలకంగా/సాధనంగా తీసుకుని దానిపై ఆచరించడం జరుగుతున్న ది. దానికి షరియత్ లో ఆధారాలు ఉండవు, అలాగే అది ఙ్ఞానేంద్రియాల ద్వారా అనుభవం లోనికి వచ్చిన విషయం కూడా అయిఉండదు. షరియత్ ఆమోదించిన విధానాలలో ఖుర్’ఆన్ పఠనం, అనుభవం ద్వారా నిరూపణ అయి ఉన్న మందులను ఉపయోగించడం ఉన్నాయి. ఇవి ఆమోద యోగ్యమైనవి, విశ్వాసయోగ్యమైనవి. ప్రయోజనం కలగడం, కలుగకపోవడం, లేదా కీడు కలగడం అనేవి అల్లాహ్ చేతిలోని విషయం.
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "చనిపోయిన వారి పట్ల చెడుగా మాట్లాడకండి. ఎందుకంటే వారి ఆచరణల ఫలాలను వారు పొందినారు".
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం చనిపోయిన వారి పట్ల చెడుగా మాట్లాడరాదని, వారి గౌరవానికి భంగం కలిగించరాదని వివరిస్తున్నారు. అలా చేయడం నైతిక విలువల అధమ స్థాయిని సూచిస్తుంది. ఎందుకంటే చనిపోయిన వారు తమ సత్కర్మల లేక దుష్కర్మల ఫలాన్ని పొందడానికి వెళ్ళిపోయినారు. వారి పట్ల చెడుగా మాట్లాడుట, వారి గౌరవానికి భంగం కలిగే రీతిలో మాట్లాడుట వారిని చేరదు, కానీ బ్రతికి ఉన్నవారిని బాధిస్తుంది.
జుందుబ్ బిన్ అబ్దుల్లాహ్ అల్ ఖస్రియ్యి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే ఫజ్ర్ సలాహ్’ను (ఫజ్ర్ నమాజును) ఆచరిస్తారో, వారు అల్లాహ్ రక్షణలో ఉన్నారు. కనుక మీలో ఎవరూ కూడా అల్లాహ్ రక్షణలో ఉన్న వానికి ఏ విధంగానూ హాని తలపెట్టరాదు. ఎవరైతే హాని తలపెడతాడో, అతడిని అల్లాహ్ యొక్క ఆగ్రహం చుట్టుకుంటుంది. అతడు ముఖం మీద పడవేసి నరకాగ్ని లోనికి విసిరి వేయబడతాడు”.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఎవరైతే ఫజ్ర్ సలాహ్ ఆచరిస్తారో వారు అల్లాహ్ యొక్క సంరక్షణలో, ఆయన పహరాలో మరియు ఆయన సహాయములో ఉంటారు - అని తెలియజేస్తున్నారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసారు – ఫజ్ర్ సలాహ్ ను వదిలి వేయడం ద్వారా లేదా భక్తులపై దాడి చేయడం లేదా వారిపై దౌర్జన్యం చేయడం ద్వారా, అల్లాహ్ యొక్క ఈ వాగ్దానాన్ని భంగ పరచడం లేదా వ్యతిరేకించడం మొదలైనవి చేయరాదని హెచ్చరించినారు. ఎందుకంటే ఎవరైతే అలా చేస్తాడో, అతడు అల్లాహ్ యొక్క వాగ్దానాన్ని భంగ పరిచాడన్నమాట. అటువంటి వాడిని ‘నా హక్కును నీవు ఎందుకు నిర్లక్ష్యం చేసావు’ అని అల్లాహ్ ప్రశ్నిస్తాడు. అల్లాహ్ ఆ విధంగా ఎవరినైతే అడుగుతాడో, అల్లాహ్ అతడిని ముఖంపై పడవేసి నరకాగ్నిలోనికి విసరివేస్తాడు.
అబీ హురైరాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “దానము చేయుట సంపదను తగ్గించదు. ఇతరులను క్షమించే గుణం కారణంగా అల్లాహ్ దాసుని గౌరవాన్ని పెంపొందింప జేస్తాడు మరియు ఎవరైతే కేవలం అల్లాహ్ కొరకు అణకువ, వినయం అలవర్చుకుంటాడో, అల్లాహ్ అతడి స్థానాన్ని ఉన్నతం చేస్తాడు”.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానము చేయుట సంపదను తగ్గించదు అని తెలియజేస్తున్నారు. దానము సంపదను, దాని (వలన కలిగే) కీడు, చెడుల నుండి కాపాడుతుంది. చేసిన దానానికి బదులుగా అల్లాహ్ ఆ సంపద యొక్క యజమానికి గొప్ప శుభాలను ప్రసాదిస్తాడు. ఆ విధంగా అది అతని సంపన్నతలో వృద్ధియే గానీ తగ్గింపు కాదు. క్షమాగుణం అంటే ప్రతీకారం తీర్చుకునే శక్తి లేదా శిక్షించే సామర్థ్యము కలిగి ఉండీ కూడా క్షమించడం – అది అతడిని ఇంకా బలవంతుడిని చేస్తుంది మరియు అతని గౌరవాన్ని ఇనుమడింప జేస్తుంది. ఎవరికో భయపడి లేదా ఎవరో కోరినారని ఎవరూ అల్లాహ్ ఎదుట అణకువ, వినయం అలవర్చుకోరు లేదా అల్లాహ్ ఎదుట అవమానం పాలు కారు లేదా అతడి నుండి ఏదైనా ఆశించి ఈ పనులు చేయరు. అల్లాహ్ కొరకు అణకువ, వినయం అలవర్చుకొనుట కేవలం అల్లాహ్ తన స్థానాన్ని ఉన్నతం చేయుట కొరకు మరియు అల్లాహ్ తనకు గౌరవం ప్రసాదించుట కొరకు మాత్రమే కావాలి.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “మీలో, విశ్వాసములో అత్యుత్తముడు ఎవరంటే, ఎవరైతే అత్యుత్తమమైన నడవడిక కలవాడో. అలాగే మీలో అత్యుత్తమములు ఎవరంటే, ఎవరైతే తమ స్త్రీల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తారో”.
అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – విశ్వాసములో సంపూర్ణత కలిగిన విశ్వాసి ఎవరంటే, ఉత్తమ వ్యక్తిత్వము, శీల సంపద కలిగిన వాడు, చిరునవ్వుతో ప్రకాశవంతమైన ముఖము కలిగినవాడు, సత్కార్యములు చేయువాడు, అందరితో మంచిగా సంభాషణ చేయువాడు, కీడు మరియు చెడులనుండి దూరంగా ఉండేవాడు – అని తెలియ జేస్తున్నారు. అలాగే విశ్వాసులలో ఉత్తముడు ఎవరంటే ఎవరైతే తన స్త్రీలతో ఉత్తమంగా ఉంటాడో అన్నారు, అంటే ఉదాహరణకు తన భార్యలతో, కూతుళ్ళతో, తన అక్కలు, చెల్లెళ్ళతో మరియు తన బంధువులలోని స్త్రీలతో. ఎందుకంటే వీరంతా – ఉత్తమంగా వ్యవహరించడానికి మిగతా వారి కంటే ముందు అర్హులు.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఈ ప్రపంచము ఒక సంతోషము మరియు ఆనందము మాత్రమే. వాటిలో ఉత్తమమైనది ధర్మపరాయణురాలైన భార్య”.
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో ఇలా తెలియజేశారు: ఈ ప్రపంచము మరియు దానిలో ఉన్నదంతా ఒక (పరిమిత కాలపు) సంతోషము, ఆనందము మాత్రమే. తరువాత అది అంతమైపోతుంది. మరియు దాని ఉత్తమమైన ఆనందము ధార్మికురాలైన భార్య. అతడు ఆమెను చూస్తే అతనికి సంతోషం కలుగుతుంది, అతడు ఆమెను ఏదైనా ఆదేశిస్తే, ఆమె దానిని వెంటనే పూర్తి చేస్తుంది. ఒకవేళ అతడు ఇంటికి దూరంగా ఉంటే ఆమె అతడిని పరిరక్షిస్తుంది – (తన శీలాన్ని కాపాడుకుంటూ) తనను తాను రక్షించుకొనుట ద్వారా, మరియు అతడి సంపదను కాపాడుట ద్వారా.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రకటన: “ఓ ఆదము కుమారుడా! (అల్లాహ్ మార్గములో) ఖర్చు చేయి, నీపై ఖర్చు చేయబడుతుంది (అంటే అల్లాహ్ నీపై ఖర్చు చేస్తాడు, ప్రసాదిస్తాడు అని అర్థము).
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా పలికాడు “ఓ ఆదము కుమారుడా! నీ ఖర్చుల నుండి, నీవు విధిగా చేయవలసిన మరియు వాంఛనీయమైన వాటి కొరకు (అల్లాహ్ మార్గములో) ఖర్చు చేయి. నీవు ఖర్చు చేసిన దానికి ప్రతిగా మరింత ప్రసాదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను మరియు (తీర్పు దినమున) నేను నీకు ప్రతిఫలాన్ని ఇస్తాను”.
ఉఖబా ఇబ్న్ ఆమిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(వివాహ సమయాన వధూవరులు ఒకరిపైనొకరు) విధించుకునే షరతులలో, (మీ) సంభోగమును ఆమోదయోగ్యం (హలాల్) చేయు షరతులు నెరవేర్చుటకు అర్హమైనవి.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: (వివాహములో) దాంపత్య జీవితం అనుభవించుటను ధర్మ సమ్మతం చేసే షరతును అన్నింటి కంటే ముందుగా నెరవేర్చవలెను. వివాహ సమయాన ‘అఖ్దున్నికాహ్’ (వివాహ కాంట్రాక్ట్) లో ఈ విధముగా కాబోయే జీవిత భాగస్వాములు షరతులను విధించుట ధర్మసమ్మతమే.
అబూ జుబైర్ రజియల్లాహు అన్హు సలాహ్ (నమాజు) ముగించిన ప్రతిసారీ ఈ విధంగా అల్లాహ్ ను స్తుతించేవారు: “లా ఇలాహా ఇల్లల్లాహు వహ్’దహు లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హమ్’దు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహు, వలా న’బుదు ఇల్లా ఇయ్యాహు, లహున్నే’మతు, వ లహుల్ ఫధ్’లు, వ లహుథ్థనాఉల్ హసను, లా ఇలాహ ఇల్లల్లాహు, ముఖ్లిసీన, లహుద్దీన, వలౌ కరిహల్ కాఫిరూన్” (అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు, ఆయనకు ఎవ్వరూ సాటి (సమానులు) లేరు, విశ్వసామ్రాజ్యము ఆయనదే, మరియు సకల ప్రశంసలూ ఆయనకే; ఆయన ప్రతి విషయముపై అధికారము కలవాడు. అల్లాహ్ (అనుమతి) తో తప్ప ఏ శక్తీ, సామర్థ్యము, ఆధిపత్యము సాధ్యము కాదు, అల్లాహ్ తప్ప నిజఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు మేము కేవలం ఆయనను తప్ప వేరెవ్వరినీ ఆరాధించము, సకల సంపద, దాతృత్వము, వదాన్యత ఆయనదే, దయ, కరుణ, కటాక్షము ఆయనవే; అన్నిరకాల శ్రేష్ఠమైన, విశిష్టమైన స్తోత్రములు, ప్రశంసలూ ఆయనకే చెందుతాయి, మరియు అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. అవిశ్వాసులు ఎంత ద్వేషించినా, ఏవగించుకున్నా మా భక్తిని, అంకితభావాన్ని, సకల ఆరాధనా రీతులను కేవలం ఆయనకు మాత్రమే ప్రత్యేకించినాము). అబ్దుల్లాహ్ ఇబ్న్ అజ్జుబైర్ ఇలా అన్నారు: “ సలాహ్ (నమాజు) ముగించిన ప్రతిసారీ రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ పదాలతో అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడేవారు.”
ముస్లిం నమోదు చేసినారు:ప్రతి ఫర్జ్ సలాహ్ ను (ప్రతి ఫర్జ్ నమాజును) సలాంతో ముగించిన తరువాత ప్రతిసారీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఘనమైన ఈ స్తోత్రాన్ని పఠించే వారు; దాని అర్థం ఏమిటంటే: “లా ఇలాహ ఇల్లల్లాహ్” అంటే “అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజఆరాధ్యుడు ఎవరూ లేరు”. “వహ్’దహు, లా షరీకలహు” అంటే “ఆయన ఏకైకుడు”, “ఆయనకు ఎవ్వరూ సాటి లేరు” అని అర్థం; అంటే ఆయన ‘ఉలూహియత్’లో (ఉలూహియత్: ‘సకల ఆరాధనలకు ఏకైక నిజ ఆరాధ్యుడు, అంటే ఆయన ‘ఇలాహ్’ కావడంలో); ఆయన ‘రుబూబియత్’లో (రుబూబియత్: విశ్వ సామ్రాజ్యానికి ‘ప్రభువు’ (రబ్) కావడంలో, అంటే ఆయన ప్రభుతలో), మరియు ఆయన ‘అస్మా వస్సిఫాత్’లో (అస్మా వస్సిఫాత్: ఆయన నామములు (పేర్లు) మరియు గుణగణములలో) తనకు సాటి, సమానులూ ఎవ్వరూ లేనివాడని అర్థము. “లహుల్ ముల్క్” అంటే: బ్రహ్మాండమైన విస్తృతి కలిగి, సార్వజనికమైన, విశాలమైన, భూమీ మరియు ఆకాశాలు కలిగిన ఈ సంపూర్ణ బృహద్విశ్వము, అంటే ఈ భూమీ, ఆకాశాలు మరియు వాటి మధ్య నున్న ప్రతిదీ ఆయనకు చెందినదే, ప్రతిదానిపై అధికారము ఆయనదే. “వ లహుల్ హందు” అంటే: ఆయన ఘనతకు తగిన ప్రతి విషయము నూ అల్లాహ్ ఎలాంటి లోపమూ లేని పరిపూర్ణత గలవాడు. కనుక మంచి పరిస్థితులలో గానీ, లేక చెడు పరిస్థితులలో గానీ - ప్రేమ, గౌరవం మరియు పూజ్య భావనతో చేసే పరిపూర్ణమైన ప్రతి ప్రశంస, స్తుతి ఆయనకు చెందినదే. “వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్” అంటే: “ఆయన ప్రతి విషయముపై అధికారము కలవాడు” అని అర్థము. అంటే, ఏ విషయానికి సంబంధించి అయినా ఆయన శక్తి అపారమైనది, పరిపూర్ణమైనది, పరిమితులు లేనిది. ఆయన సామర్థ్యము పరిధిలో లేని ఏ విషయమూ లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. “లా హౌల వలా ఖువ్వత ఇల్లాబిల్లాహ్” అంటే: “అల్లాహ్ (అనుమతి) తో తప్ప ఏ శక్తీ, సామర్థ్యము, ఆధిపత్యము సాధ్యము కాదు” (అంటే, శక్తీ, సామర్థ్యము,ఆధిపత్యము అన్నీ అల్లాహ్’తోనే సాధ్యము) అని అర్థము. ఒక స్థితి నుండి మరొక స్థితికి లేదా ఒక పరిస్థితి నుండి మరొక పరిస్థితికి మారాలన్నా, మరియు అల్లాహ్ కు అవిధేయుడిగా ఉన్న స్థితి నుండి విధేయుడి స్థితికి చేరుకోవాలన్నా, ఆ శక్తీ సామర్థ్యము కేవలం అల్లాహ్’తోనే సాధ్యము (అంటే ఆయన వాటిని ప్రసాదిస్తేనే సాధ్యము). ఆయనే సహాయం చేసేవాడు మరియు ఆయన పైనే మన నమ్మకం, భరోసా. “లా ఇలాహ ఇల్లల్లాహు, వలా న’బుదు ఇల్లా ఇయ్యాహు” అంటే: “అల్లాహ్ తప్ప నిజఆరాధ్యుడు ఎవరూ లేరు మరియు మేము కేవలం ఆయనను తప్ప వేరెవ్వరినీ ఆరాధించము” అని అర్థము. ఈ అర్థములో బరువు (దృష్టి) మొత్తము అల్లాహ్ యొక్క తౌహీద్ పై, మరియు తద్వారా అనేక దేవుళ్ల ఆరాధన (బహుదైవారాధన) యొక్క ఖండన అను విషయములపై కేంద్రీకృతమై ఉన్నది. అందుకనే ఆయన తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు. “లహున్నే’మతు, వలహుల్ ఫధ్’లు” అంటే: “సకల సంపదలు, సకల శుభాలు, దాతృత్వము, వదాన్యత ఆయనదే, దయ, కరుణ, కటాక్షము ఆయనవే” అని అర్థము. అనగా, సంపదల మరియు శుభాల సృష్ఠికర్త ఆయనే, వాటి స్వామి, ప్రభువు, యజమాని ఆయనే. వాటిని తన దాసులలో తాను కోరిన వారికి, తాను తలచిన వారికి ప్రసాదించి వారిని అనుగ్రహిస్తాడు. “వ లహుస్సనాఉల్ హసను” అంటే: “అన్నిరకాల శ్రేష్ఠమైన, విశిష్టమైన స్తోత్రములు, ప్రశంసలూ ఆయనకే చెందుతాయి” అని అర్థము. అంటే స్వయంగా ఆయన అస్తిత్వానికి సంబంధించి, ఆయన గుణగణములకు సంబంధించి, ఆయన శుభాలకు సంబంధించి, ఆయన ఘనతకు సంబంధించి - ఏ స్థితిలోనైనా, ఏ సందర్భములోనైనా చేసే అన్నిరకాల శ్రేష్ఠమైన, విశిష్టమైన స్తోత్రములు, ప్రశంసలూ ఆయనకే చెందుతాయి. “లా ఇలాహ ఇల్లల్లాహు, ముఖ్లిసీన, లహుద్దీన” అంటే: "అల్లాహ్ తప్ప నిజఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. మా భక్తిని, అంకితభావాన్ని, సకల ఆరాధనా రీతులను కేవలం ఆయనకు మాత్రమే ప్రత్యేకించినాము” అని అర్థము. అనగా, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించేవారు (మువహ్హిదీన్ - ఏకదైవారాధకులు) తమ భక్తిని, అంకితభావాన్ని, సకల ఆరాధనా రీతులను ఎటువంటి ప్రదర్శనా భావము లేకుండా, ఎలాంటి కపటత్వము లేకుండా ఆయనకు మాత్రమే ప్రత్యేకిస్తారు. “వలౌ కరిహల్ కాఫిరూన్” అంటే: “అవిశ్వాసులు ఎంత ద్వేషించినా, ఏవగించుకున్నా” అని అర్థము. అనగా, అనేక దేవుళ్లను కాకుండా కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుటలో దృఢత్వాన్ని, స్థిరచిత్తాన్ని కలిగి ఉండుట - అలా చేయడం అవిశ్వాసులకు ఎంత అయిష్టమైనదైనా సరే.