





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “మీ ఈ (ప్రపంచపు) అగ్ని, నరకాగ్ని యొక్క డెభ్భై భాగాలలో ఒకటి.” అది విని మాలో ఒకరు “ఓ రసూలుల్లాహ్! (అవిశ్వాసులను శిక్షించడానికి) ఈ అగ్ని సరిపోతుంది కదా!” అని అడిగారు. దానికి ఆయన “ఈ అగ్ని కంటే నరకాగ్ని ఇంకా అరవై తొమ్మిది భాగాలు ఎక్కువ ఉంటుంది. దాని ప్రతి భాగమూ ఈ అగ్ని అంత వేడిని కలిగి ఉంటుంది” అన్నారు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో, ఈ ప్రపంచపు అగ్ని, నరకాగ్ని యొక్క డెభ్భై భాగాలలో ఒక భాగము అని తెలియ జేస్తున్నారు. నరకాగ్ని యొక్క వేడి, ఈ ప్రపంచపు అగ్ని వేడి కంటే అరవైతొమ్మిది రెట్లు ఎక్కువగా ఉంటుంది. దాని ప్రతి భాగమూ ఈ ప్రపంచపు అగ్ని అంత వేడిని కలిగి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నారు “ఓ రసూలుల్లాహ్! నరకంలోనికి ప్రవేశించే వారిని శిక్షించడానికి ఈ అగ్ని (అంత వేడి) సరిపోతుంది కదా!” దానికి ఆయన “ఈ ప్రపంచపు అగ్ని కంటే, నరకాగ్ని అరవై తొమ్మిది రెట్లు ఘనమైనది. దాని ఒక్కొక్క భాగము యొక్క వేడి ఈ ప్రపంచపు అగ్ని అంత ఉంటుంది” అన్నారు.
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “సత్యసంధుడూ, అత్యంత విశ్వసనీయుడూ అయిన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాతో ఇలా అన్నారు “మీలో ప్రతి ఒక్కరి సృష్టి అతడి తల్లి గర్భములో నలభై దినములు, నలభై రాత్రులు (అతడి శరీరానికి కావలసిన వాటిని) సమీకరించడం ద్వారా జరుగుతుంది. తరువాత అంతే కాలము కొరకు (40 దినముల కొరకు) అతడు ఒక రక్తపు ముద్దలా అవుతాడు. తరువాత అతడు అంతే కాలం కొరకు ఒక మాంసపు ముద్దలా అవుతాడు. అపుడు (అల్లాహ్ తరఫున) ఒక దైవదూత అతని వద్దకు పంపబడతాడు. అతడు నాలుగు విషయాలు రాయుట కొరకు ఆఙ్ఞాపించ బడతాడు; అతడి జీవనోపాధి, అతని జీవనకాలము (అతడు ఎంత కాలం జీవిస్తాడు, ఎప్పుడు మరణిస్తాడు), అతడి ఆచరణలు మరియు అతడు చెడ్డవాడా లేక ధన్యజీవియా అనే విషయాలు. అపుడు అతని లోనికి ఆత్మ ఊదబడుతుంది. మీలో ఎవరైనా స్వర్గవాసుల లక్షణమైన సత్కార్యాలు అంత వరకు చేస్తూ ఉంటాడు, ఎంతవరకూ అంటే అతనికీ స్వర్గానికీ మధ్య కేవలం ఒక మూరెడు దూరం మాత్రమే మిగిలి ఉంటుంది. అపుడు అతడి కొరకు రాయబడినది అతడిని అధిగమిస్తుంది. అపుడు అతడు నరకవాసుల ఆచరణలను ఆచరించడం మొదలు పెడతాడు, మరియు నరకాగ్ని లోనికి ప్రవేశిస్తాడు. అలాగే మీలో ఎవరైనా నరకవాసుల లక్షణమైన పాపకార్యాలు అంత వరకు చేస్తూ ఉంటాడు, ఎంతవరకూ అంటే అతనికీ నరకానికీ మధ్య కేవలం ఒక మూరెడు దూరం మాత్రమే మిగిలి ఉంటుంది. అపుడు అతడి కొరకు రాయబడినది అతడిని అధిగమిస్తుంది. అపుడు అతడు స్వర్గవాసుల ఆచరణలను ఆచరించడం మొదలు పెడతాడు, మరియు దాని లోనికి ప్రవేశిస్తాడు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హుమా ఇలా అంటున్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఒక విషయం తెలియ జేసారు. ఆయన సత్యసంధుడూ, అత్యంత విశ్వసనీయుడూ, అలా అని అల్లాహ్ కూడా ధృవపరిచినాడు. ఆయన ఇలా అన్నారు: మీలో ప్రతి ఒక్కరి సృష్టి (దానికి కావలసిన విషయాల) సమీకరణ ద్వారా జరుగుతుంది. మనిషి తన భార్యతో సంభోగించినపుడు ఆమె గర్భములో చిందిన అతడి వీర్యము నుండి ఒక ‘నుత్ఫహ్’ (వీర్యములో ఫలవంతమైన చిన్న భాగము) నలభై దినములలో సమీకరించబడుతుంది. తరువాత అది ఒక జలగ మాదిరి గోచరించే, మరియు స్తబ్దముగా ఉన్న మందమైన రక్తపు ముద్దగా మారుతుంది. ఇది రెండవ నలభై దినముల కాలములో జరుగుతుంది. తరువాత అది మందముగా, దొడ్డుగా ఉండే, మరియు నమల బడిన ఒక మాంసపు ముద్దగా అవుతుంది. ఇది మూడవ నలభై దినముల కాలములో జరుగుతుంది. తరువాత, చివరి నలభై దినములలో చివరి భాగము ముగిసిన తరువాత అతని లోనికి ఆత్మను ఊదడానికి అల్లాహ్ ఒక దైవదూతను పంపుతాడు. ప్రభువైన అల్లాహ్ అతనికి సంబంధించి నాలుగు ఆజ్ఞలు రాయమని ఆ దైవదూతను ఆదేశిస్తాడు: అతని జీవనోపాధిని గురించి – అతడి జీవిత కాలములో అల్లాహ్ అనుగ్రహాల నుండి ఏ అనుగ్రహాలను ఎంత మొత్తములో పొందుతాడు అనే వాటి గురించి; అతడి జీవితకాలమును గురించి – ఈ ప్రపంచములో అతడు ఎంతకాలము నివసిస్తాడు అనే విషయము. అతడి ఆచరణలను గురించి – అతడు ఎలాంటి వాడు? అవినీతిపరుడా, చెడ్డవాడా; లేక ధన్య జీవా (పుణ్యాత్ముడా) అనే విషయం. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒట్టు పెట్టుకుని మరీ ఇలా అన్నారు – నిశ్చయంగా ఒక మనిషి స్వర్గవాసుల ఆచరణలను చేస్తూ ఉంటాడు. అతడు చేసేవన్నీ మంచిపనులు, సత్కార్యాలు అయి ఉంటాయి. ప్రజలకు అలాగే కనపడుతాడు. ఆ విధంగా అతడు ఎంత వరకూ అలా ఉంటాడూ అంటే, భూమి నుండి అతనికీ స్వర్గానికీ మధ్య కేవలం ఒక మూర అంత దూరం మాత్రమే మిగిలి ఉంటుంది. అపుడు (విధివ్రాత) గ్రంథములో అతని కొరకు రాయబడిన ‘ఖద్ర్’ అతడిని అధిగమిస్తుంది. అతడు నరకవాసుల ఆచరణలను ఆచరించడం మొదలు పెడతాడు. అదే అతని ముగింపు అవుతుంది, మరియు అతడు నరకం లోనికి ప్రవేశిస్తాడు. ఎందుకంటే, అతని సదాచరణలు స్వీకరించబడడానికి నియమం ఏమిటంటే అతడు వాటిపై స్థిరంగా ఉండాలి, వాటి నుండి ఇతర ఆచరణలకు మరల రాదు. మరో వైపు, జనులలో నుండి ఒకడు నరకవాసుల ఆచరణలను చేస్తూ ఉంటాడు. ఎంతవరకూ అంటే, ఇక అతడు నరకం లోనికి ప్రవేశిస్తాడు, భూమిపైనుండి అతనికీ నరకానికీ మధ్య కేవలం ఒక మూర దూరం మాత్రమే మిగిలి ఉంటుది. అపుడు (విధివ్రాత) గ్రంథములో అతని కొరకు రాయబడిన ‘ఖద్ర్’ అతడిని అధిగమిస్తుంది. అతడు స్వర్గవాసుల ఆచరణలను ఆచరించడం మొదలు పెడతాడు, మరియు అతడు స్వర్గము లోనికి ప్రవేశిస్తాడు.
తావూస్ అల్ యమానీ (తాబయీ) రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సహాబాలలో కొంతమందిని నేను ఎరుగుదును. వారు ఇలా అనేవారు “ప్రతి విషయమూ (అల్లాహ్) ఆదేశం మేరకే జరుగుతుంది” అని. తావూస్ ఇంకా ఇలా అన్నారు “అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఇలా పలుకగా నేను విన్నాను “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ప్రతి విషయమూ (అల్లాహ్) ఆదేశానుసారం జరుగుతుంది; చివరికి శక్తి (కలిగి ఉండుట), అశక్తత, లేక (అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ బహుశా ఇలా అన్నారు) అశక్తత మరియు శక్తి (కలిగి ఉండుట) కూడా”.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ప్రతి విషయమూ విధి లిఖితమై ఉన్నది (ముందుగానే లిఖించబడి ఉన్నది) అని తెలియ జేస్తున్నారు. చివరికి అశక్తత కూడా - అంటే చేయవలసిన ఆచరణను చేయకుండా వదిలి వేయడం, శక్తి లేకపోవడం, అనాసక్తత, సోమరితనం మొదలైనవి, లేక అవసరం లేకపోయినా దాని సమయం గడిచి పోయేటంత వరకూ అందులో జాప్యం చేయడం – అవి ప్రాపంచిక జీవితానికి సంబంధించిన ఆచరణలైనా, లేక పరలోక జీవితానికి సంబంధించిన ఆచరణలైనా. అదే విధంగా తెలివి, బుద్ధీ, ఙ్ఞానము కూడా ముందుగానే లిఖించబడి ఉంటాయి. అంటే, ప్రాపంచిక జీవితానికి సంబంధించిన ఆచరణలైనా, లేక పరలోక జీవితానికి సంబంధించిన ఆచరణలైనా వాటిని ఆచరించుటలో ఆతురత, వేగము, వాటిని ఙ్ఞానపూర్వకముగా ఆచరించుట మొదలైనవి. ఈ హదీసులో, సర్వోన్నతుడూ, సర్వశక్తిమంతుడూ అయిన అల్లాహ్ ప్రతి విషయానికి సంబంధించి సమర్థత, సామర్థ్యాలను, శక్తి, అశక్తత లను ముందుగా విధి లిఖితములో లిఖించినాడు – ప్రతి విషయమూ కూడా అల్లాహ్ యొక్క ఙ్ఞానములో ఉంటుంది, మరియు ఆయన ఇచ్ఛకు లోబడి ఉంటుంది అని తెలుస్తున్నది.
మతర్ ఇబ్న్ ఉకామిస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా ‘ఫలానా భూమిపై (ఫలానా ప్రదేశములో) చనిపోతాడు” అని విధివ్రాతలో లిఖించి ఉంటే, అతడు అక్కడికి వెళ్ళడానికి ఏదైనా కారణాన్ని అతని కొరకు పొందుపరుస్తాడు”.
అత్తిర్మిదీ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఒకవేళ అల్లాహ్, తన దాసులలో ఎవరినైనా, భూమిపై ఫలానా ప్రదేశములో చనిపోతాడు, అని నిర్ణయించి ఉంటే, విధివ్రాతలో రాసి ఉంటే, ఆ దాసుడు అక్కడ నివసిస్తున్న వాడు కాకపోయినా, అతడు అక్కడి వెళ్ళే ఒక అవసరాన్ని (ఒక కారణాన్ని) ఏర్పరుస్తాడు. అప్పుడు అతని ఆత్మ అక్కడ (ఆ ప్రదేశములో) తీయబడుతుంది.
అనస్ ఇబ్న్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “మేము మస్జిదులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉండగా, ఒక వ్యక్తి తన ఒంటెపై సవారై వచ్చినాడు. అతడు మస్జిదు (ప్రాంగణము)లో తన ఒంటెను కూర్చొనేలా చేసి, దాని ముందరి కాళ్ళు కట్టివేసి, (మా వద్దకు వచ్చి) “మీలో ముహమ్మద్ ఎవరు?” అని ప్రశ్నించాడు. ఆ సమయములో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతిపై ఆనుకుని కూర్చుని ఉన్నారు. మేము “ఇదిగో తెల్లని మేని ఛాయతో, చేతిపై ఆనుకుని కూర్చుని ఉన్నది ఆయనే” అన్నాము. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఉద్దేశ్యించి “ఓ అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడా!” అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “చెప్పు, నీకు సమాధానం చెప్పడానికి నేనిక్కడే ఉన్నాను” అన్నారు. అపుడు అతడు “నిన్నొక విషయం అడుగుతాను. కఠినంగా ప్రశ్నిస్తాను. కనుక “కోపగించుకోకు” అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నువ్వు ఏం అడగాలను కుంటున్నావో అడుగు” అన్నారు. అతడు “నీ ప్రభువు సాక్షిగా, మరియు నీకంటే ముందు గడిచిపోయిన వారి ప్రభువు సాక్షిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను – అల్లాహ్ నిన్ను సర్వ మానవాళి కొరకు (తన) సందేశహరునిగా పంపించినాడా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. అతడు “అల్లాహ్ సాక్షిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను “దినము రాత్రిలో (రాత్రింబవళ్ళలో) ఐదు సార్లు సలాహ్ (నమాజు) ఆచరించాలని నిన్ను ఆదేశించినాడా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. ఆ మనిషి తిరిగి “అల్లాహ్ సాక్షిగా నిన్ను అడుగుతున్నాను, సంవత్సరం మొత్తములో (ఫలానా) ఈ నెలలో ఉపవాసాలు పాటించాలని అల్లాహ్ నిన్ను ఆదేశించినాడా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. అతడు “అల్లాహ్ సాక్షిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను, మాలోని సంపన్నుల నుండి దానము తీసుకుని, దానిని మాలోని పేదవారికి పంచమని అల్లాహ్ నిన్ను ఆదేశించినాడా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు “నీవు ఏ సందేశముతో పంపబడినావో, నేను దానిని పూర్తిగా విశ్వసిస్తున్నాను. నేను ‘జిమామ్ ఇబ్న్ సాలబా’, నేను నా తెగ వారి ప్రతినిధిగా ఇక్కడికి పంపబడినాను. నా తెగ బనూ సాద్ ఇబ్న్ బక్ర్ వారి సోదరుణ్ణి” అన్నాడు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో అనస్ ఇబ్న్ మాలిక్ రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు: మస్జిదులో సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉండగా, ఒక వ్యక్తి తన ఒంటెపై వచ్చి, దానిని అక్కడే కూర్చొనేలా చేసి దానిని కట్టివేసాడు. అపుడు అతడు “మీలో ముహమ్మద్ ఎవరు?” అని అడిగాడు. ఆ సమయములో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా మధ్య, తన చేతిపై ఆనుకుని కూర్చుని ఉన్నారు. మేము “అదుగో, తెల్లని మేని ఛాయతో, చేరగిలబడి కూర్చొన్నది ఆయనే” అన్నాము. ఆ మనిషి ఆయనతో “ఓ అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడా” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో “నేను వింటున్నాను, అడుగు ఏం అడగాలను కుంటున్నావో, నేను సమాధానం ఇస్తాను” అన్నారు. అపుడు ఆ వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో “నేను నిన్ను ప్రశ్నిస్తాను. కఠినంగా ఉంటాను. కనుక ఏమీ భావించకు” అన్నాడు. అంటే: నాపై కోపం తెచ్చుకోకు, మరియు మనసులో కష్టం పెట్టుకోకు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో “అడుగు, ఏం అడగాలని అనుకుంటున్నావో” అన్నారు. అతడు “నీ ప్రభువు సాక్షిగా, నీ కంటే ముందు గతించిన వారి ప్రభువు సాక్షిగా అడుగుతున్నాను; అల్లాహ్ నిన్ను (తన సందేశహరునిగా) ప్రజల వద్దకు పంపినాడా?” అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ ఇలా అన్నాడు “అల్లాహ్ ను సాక్షిగా పెట్టి ప్రశ్నిస్తున్నాను” – అంటే “అల్లాహ్ సాక్షిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను” అని అర్థము – “ప్రతి దినము, రాత్రిలో ఐదు సార్లు సలాహ్ ఆచరించమని (నమాజు చదవమని) అల్లాహ్ నిన్ను ఆదేశించినాడా?” అంటే అవి విధిగా ఆచరించవలసిన నమాజులు అన్నమాట. దానికి ఆయన “అల్లాహ్ సాక్షిగా అవును” అని జవాబిచ్చారు. అతడు తిరిగి “అల్లాహ్ సాక్షిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను సంవత్సరము మొత్తములో, ఫలానా మాసములో ఉపవాసాలు పాటించమని అల్లాహ్ నిన్ను ఆదేశించినాడా?” – అంటే అది రమదాన్ మాసము. ఆయన “అల్లాహ్ సాక్షిగా, అవును” అన్నారు. అతడు తిరిగి “అల్లాహ్ సాక్షిగా ప్రశ్నిస్తున్నాను; మాలోని సంపన్నుల నుండి దానము తీసుకుని, మాలోని పేదవారికి పంచమని అల్లాహ్ నిన్ను ఆదేశించినాడా?” – అంటే అది జకాతు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ సాక్షిగా, అవును” అని సమాధానం ఇచ్చారు. వెంటనే జిమామ్ రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించారు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో తాను తన తెగ ప్రజలను ఇస్లాం వైపునకు ఆహ్వానిస్తానని అన్నాడు. తరువాత అతడు తనను తాను జిమామ్ ఇబ్న్ సాలబా, అని బనూ సాద్ బిన్ బక్ర్ తెగకు చెందిన వాడినని పరిచయం చేసుకున్నాడు.
జియాద్ ఇబ్న్ లబీద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదో విషయాన్ని చెబుతూ చివరన “అది (ఈ ప్రపంచము నుండి) ఙ్ఞానము అంతరించి పోయినపుడు జరుగుతుంది” అన్నారు. నేను “ఓ రసూలుల్లాహ్ (ల్లల్లాహు అలైహి వసల్లం ! ఙ్ఞానము ఎలా అంతరించి పోతుంది. మేము ఖుర్’అన్ చదువు తున్నాము, మా పిల్లలకు బోధిస్తున్నాము, వారు వారి సంతానికి నేర్పుతారు. అలా తీర్పు దినము వరకు జరుగుతుంది. మరి ఙ్ఞానము ఎలా అంతరించిపోతుంది?” అన్నాను. దానికి వారు ఇలా అన్నారు “నీ తల్లి నిన్ను కోల్పొవు గాక, ఓ జియాద్! ఈ మదీనా నగరంలో నువ్వొక మంచి ఙ్ణానవంతుడవని, మంచి పరిఙ్ఞానం కలిగిన వాడివి అని అనుకున్నాను. యూదులూ మరియు క్రైస్తవుల విషయంలో ఇలా జరగ లేదా, వారు తౌరాతు మరియు ఇంజీలు గ్రంథాలను చదువుతారు ఐనా వాటిలోని ఒక్క విషయం పై కూడా ఆచరించరు”.
ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి సహబాల మధ్య కూర్చుని ఇలా అన్నారు: ఇది ప్రజల మధ్య నుండి ఙ్ఞానము అంతరించిపోయే సమయం. జియాద్ ఇబ్న్ లబీద్ రజియల్లాహు అన్హు ఆశ్చర్యపోయి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించారు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ని ఇలా ప్రశ్నించాడు: “మానుండి ఙ్ఞానము ఎలా లేపుకోబడుతుంది? మేము ఖుర్’ఆన్ ను చదివాము, కంఠస్థము చేసినాము, ప్రతి దినము పారాయణము చేస్తాము, మా భార్యలకు బోధించినాము, మా పిల్లకు బోధించినాము, వారు వారి పిల్లలకు బోధిస్తారు (మరి ఙ్ఞానము ఎలా అంతరించి పోతుంది?) దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆశ్చర్యంగా ఆయన వైపు చూస్తూ “నీ తల్లి నిన్ను కోల్పోవుగాక ఓ జియాద్! నేను నిన్ను మదీనా నగరంలో మంచి ఙ్ఞానవంతులలో ఒకడివని భావిస్తున్నాను” అన్నారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి వివరించారు: “ఙ్ఞానం అంతరించి పోవడమంటే, ఖుర్’ఆన్ అంతరించి పోతుందని అర్థం కాదు. ఆచరణ అనేది లేకపోవడం వల్ల ఙ్ఞానం అంతరించి పోతుంది.” యూదులూ మరియు క్రైస్తవుల వద్ద ఉన్న తౌరాతు మరియు ఇంజీలు గ్రంథాల విషయం కూడా ఇదే. వారికి ప్రయోజనం కలిగించేది ఏదైనా ఉంటే అది వారు వాటి ద్వారా ఆర్జించిన ఙ్ఞానము ఆధారంగా ఆచరించడమే. (కానీ వారు జ్ఞానము ఆధారంగా ఆచరించరు).
అబుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నలభై సంవత్సరాల వయసులో ఉన్నపుడు వారిపై వహీ (అల్లాహ్ యొక్క సందేశము) అవతరణ జరిగింది. తరువాత మక్కాలో పదమూడు సంవత్సరాలు నివసించినారు. తరువాత వలస వెళ్ళమని (అల్లాహ్ చే) ఆదేశించబడినారు. ఆయన మదీనా కు వలస వెళ్ళినారు. అక్కడ పది సంవత్సరాలు గడిపినారు. తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమవదించినారు”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఇలా తెలియ జేస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దివ్య (ఖుర్’ఆన్) అవతరణ జరిగింది. అది వారు నలభై సంవత్సరాల వయసులో ఉండగా మొదలైంది. అవతరణ మొదలైన తరువాత వారు మక్కాలో పదమూడు సంవత్సరాలు నివసించినారు. అపుడు మదీనాకు వలస వెళ్ళమని ఆదేశించబడినారు. అక్కడ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పది సంవత్సరాలు గడిపినారు. తరువాత వారు అరవై మూడు సంవత్సరాల వయసులో పరమవదించినారు.
ఖతాదహ్ రహిమహుల్లాహ్ ఉల్లేఖనం : “అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు మాతో ఇలా అన్నారు: “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాడు “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం ! తీర్పు దినమున అవిశ్వాసి తన ముఖము పై (నడిచేలా) ఎలా సమీకరించబడతాడు?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ అతడిని ఈ భూమి మీద కాళ్ళపై నడిచేలా చేయగలిగిన శక్తిమంతుడు (అయిన అల్లాహ్), తీర్పు దినమున అతడిని ముఖముపై నడిచేలా చేయలేడా?” అన్నారు. ఖతాదహ్ ఇలా అన్నారు “అవును, మా ప్రభువు (అయిన అల్లాహ్) గౌరవం సాక్షిగా (ఆయన అలా చేయగల శక్తిశాలి)”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడగడం జరిగింది “తీర్పు దినము నాడు అవిశ్వాసిని (అవిశ్వాసులను) అతని ముఖం పై (నడిచేలా) ఎలా సమీకరించబడతాడు? అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అతడిని ఈ ప్రపంచములో రెండు కాళ్ళపై నడిచేలా చేయగలిగిన అల్లాహ్, తీర్పు దినమున అతని ముఖం పై నడిచేలా చేయలేడా?” అన్నారు. అల్లాహ్ అన్నీ చేయగల సమర్థుడు.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చిన్నాన్న తో ఇలా అన్నారు “ (ఓ చిన్నాన్నా!) ‘అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు’ అనండి (చాలు). తీర్పు దినమున దాని ద్వారా నేను మీ కొరకు సాక్ష్యము పలుకుతాను”. దానికి ఆయన ఇలా అన్నాడు “(ఎదురుగా నిలబడిన) మృత్యువు భయం నేను అలా చేసేలా ప్రేరేపించింది అని ఖురైషీయులు నన్ను నిందిస్తారనే (అవమానిస్తారనే) భయం గానీ లేక పోతే, నిశ్చయంగా దానితో (ఆ పదాలతో) నీ కళ్ళకు ఆనందం, సంతోషం కలిగించేవాడిని”. అపుడు అల్లాహ్ ఈ ఆయతును అవతరింప జేసినాడు { (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీవు, నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వం చేయలేవు, కాని అల్లాహ్ తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు ఆయనకు మార్గదర్శకత్వం పొందేవారెవరో బాగా తెలుసు} (సూరహ్ అల్ ఖసస్ 28:56)
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసు ద్వారా మనకు తెలుస్తున్న విషయాలు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చిన్నాన్న అయిన అబూ తాలిబ్ మరణయాతనలో (మంచంపై చివరిఘడియలో) ఉన్న స్థితిలో ‘అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు’ అని పలకమని, తీర్పు దినమున అతని కొరకు సిఫారసు చేస్తానని, మరియు ఆయన ఇస్లాం స్వీకరణకు తాను సాక్షిగా ఉంటానని కోరినారు. కానీ ఆయన షహాదహ్ పఠించడానికి నిరాకరించినాడు. ఖురైషీయులు తనను అవమానిస్తారనే భయంతో మరియు తనను గురించి “మృత్యువు భయంతో మరియు బలహీనత కారణంగా అతడు ముస్లింగా మారినాడు” అని అంటారనే భయంతో. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఆయన ఇలా అన్నారు “ఈ భయం కారణంగా కాకపోతే నేను షహాదహ్ పలికి నీ హృదయానికి సంతోషం కలించే వాడినే. నీవు సంతృప్తి చెందే వరకూ (షహాదహ్ పలుకుతూ) నీ కోరిక తీర్చేవాడినే”. అప్పుడు సర్వోన్నతుడైన అల్లాహ్ ఆ ఆయతును అవతరింపజేసినాడు. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనకు ఇష్టమైన వారికి ఇస్లాం ప్రసాదించే హక్కు లేదని. కేవలం అల్లాహ్ మాత్రమే తాను కోరిన వారికి ప్రసాదిస్తాడని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు బోధనల ద్వారా, వివరించడం ద్వారా వారికి ‘అల్ సిరాత్ అల్ ముస్తఖీమ్’ (ఋజుమార్గం) వైపునకు మార్గదర్శకం చేస్తాడని తెలియజేసినాడు.