Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way






























Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా నివేదిస్తున్నారు: ఫజ్ర్ నమాజుకు ముందు రెండు రకాతుల సున్నతు నమాజు ఆచరించినంత స్థిరంగా, శ్రద్ధగా మరియు జాగ్రత్తగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ స్వచ్ఛంద నమాజును కూడా ఎన్నడూ నిర్వహించలేదు.
ము’అదహ్ అల్ అదవియ్యహ్ అనే స్త్రీ విశ్వాసుల మాతృమూర్తి అయిన ఆయిషా రదియల్లాహు అన్హాను ఇలా ప్రశ్నించినారు: “ఋతుస్రావంలో ఉన్న స్త్రీ తాను ఉండలేక పోయిన ఉపవాసాలను తరువాత పూర్తి చేస్తుంది, కానీ ఆ స్థితిలో చేయలేక పోయిన నమాజులను ఆ తరువాత పూర్తి చేయదు, ఎందుకు?” ఆయిషా రదియల్లాహు అన్హా ఆమెను “నీవు ఖారిజీయులలో ఒకరైన హరూరియ్యహ్’లలో ఒకరివా? వాళ్ళు మొండిగా, కఠినంగా ఉండేవారు, తరుచుగా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు” అని ప్రశ్నించినారు. ఆ స్త్రీ “లేదు, నేను ఖారిజీయురాలిని కాను, ఆసక్తి కొద్దీ ప్రశ్నించినాను” అని బదులిచ్చింది. అప్పుడు ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా అన్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో మాకు ఋతుస్రావం సంభవించినప్పుడు మేము ఉండలేకపోయిన ఉపవాసాలను పూర్తి చేయమని ఆదేశించబడేవారము, కానీ నమాజుల విషయములో అలా ఆదేశించబడలేదు.”
ఉమ్మే ఖైస్ బింత్ మిహ్సన్ రదియల్లాహు అన్హా, అన్నం తినడం ప్రారంభించని తన చిన్న కుమారుడితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ వద్దకు వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ అతడిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు, అప్పుడు ఆ బాలుడు ఆయన దుస్తులపై మూత్రం పోసాడు. దాంతో ఆయన నీటిని తెప్పించి, తన వస్త్రంపై చిలకరించారే గానీ, దానిని కడగలేదు.
ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అన్నాడు: ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! , “ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి నా డబ్బును బలవంతంగా లాక్కోవడానికి వస్తే మీరు ఏమంటారు?” ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "నీవు అతనికి లొంగిపోయి నీ డబ్బు ఇవ్వవలసిన అవసరం లేదు." దానికి ఆ వ్యక్తి ఇలా అన్నాడు: “ఒకవేళ అతడు నాతో పోరాటానికి దిగితే?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అతనితో ఎదురు పోరాటం చేయడానికి నీకు కూడా అనుమతి ఉన్నది.” అపుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు: “ఒకవేళ అతడు నన్ను చంపివేస్తే?” ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “నీవు షహీదుగా (అమరవీరునిగా) పరిగణించబడతావు” అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ ఇలా అన్నాడు: “మరి ఒకవేళ నేను అతడిని చంపివేస్తే?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం: “పునరుత్థాన దినమున ఆ వ్యక్తి నరకాగ్నిలో వేయబడడానికి అర్హుడవుతాడు” అన్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగం చేస్తూ దానధర్మాలు చేయడాన్ని గురించి మరియు భిక్షాటన నుంచి దూరంగా ఉండటం గురించి ప్రస్తావించారు. తరువాత ఆయన ఇలా అన్నారు: “అడుక్కునే కింది చేయి కంటే (అల్లాహ్ మార్గంలో) ఇచ్చే మరియు ఖర్చు చేసే పైచేయి అల్లాహ్’కు ఎంతో ఇష్టమైనది మరియు ప్రియమైనది.”
ఈ హదీథులో రయ్యన్ ద్వారం అని పిలువబడే ఒక స్వర్గ ద్వారం ఉందని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనకు తెలియజేస్తున్నారు; పునరుత్థాన దినమున ఉపవాసం పాటించేవారు దాని ద్వారా ప్రవేశిస్తారు, వారు తప్ప మరెవరూ ప్రవేశించరు. ఆ దినమున "ఉపవాసం పాటించేవారు ఎక్కడ?" అని పిలుపు వస్తుంది, వారు నిలబడి ఆ ద్వారం గుండా స్వర్గములోనికి ప్రవేశిస్తారు, మరెవరూ ప్రవేశించరు. వారిలో చివరి వ్యక్తి కూడా ప్రవేశించిన తర్వాత, అది మూసివేయబడుతుంది. ఇక మరెవరూ ప్రవేశించరు.
ఏదైనా పని చేసి కష్టపడి సంపాదించే వ్యక్తి; ఉదాహరణకు తాడు తీసుకుని, అడివికి వెళ్ళి కట్టెలను కొట్టి, వీపుపై తీసుకువచ్చి వాటిని అమ్మి, ఆ సంపాదన నుండి తాను తింటూ, అందులో నుండి దానధర్మాలు చేస్తూ, ప్రజల నుండి స్వతంత్రంగా జీవించడం, ఆ విధంగా ప్రజలను యాచించడం వలన కలిగే అవమానం నుండి తనను తాను రక్షించుకోవడం అనేది ఎంతో గౌరవప్రదమైనది. ప్రజలను యాచించడం కంటే మంచిది. వారు ఇవ్వవచ్చు లేదా తిరస్కరించవచ్చు, అది అవమానకరం. విశ్వాసి ఎప్పుడూ గౌరవప్రదుడు, అవమానించబడడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిం తన తోటి ముస్లిం సోదరునికి, అతను దౌర్జన్యపరుడైనా (అణచివేతదారుడైనా), అణచివేతకు గురవుతున్నా వాడైనా, అతనికి మద్దతు ఇవ్వమని ఆదేశించారు. అప్పుడు ఒక వ్యక్తి ఇలా అడిగినాడు: “ఓ రసూలుల్లాహ్! అతను అణచివేయబడితే అతని నుండి అన్యాయాన్ని తొలగించడం ద్వారా నేను అతనికి మద్దతు ఇస్తాను, కానీ అతను అణచివేసేవాడైతే? నేను అతనికి ఎలా మద్దతు ఇవ్వగలను?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మీరు అతడిని చేయి పట్టుకుని అతడు హింసకు పాల్బడుట నుండి నిషేధించాలి, అతడిని అదుపు చేయాలి, అతడిని అణచివేత చేయటం నుండి నిరోధించాలి. ఇది అతనితో పాటు ఉండే అతని షైతానుకు మరియు షైతాను యొక్క చెడు ఆఙ్ఞలకు వ్యతిరేకంగా అతనికి మద్దతు ఇచ్చే పద్ధతులలో ఒకటి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఎడమ చేతితో ఒక పట్టు వస్త్రాన్ని లేదా దానిలోని భాగాన్ని తీసుకొని, తన కుడి చేతితో ఆభరణాల నుండి బంగారాన్ని లేదా అలాంటి దానిని తీసుకొని, అప్పుడు ఇలా అన్నారు: పట్టు మరియు బంగారం ధరించడం పురుషులకు నిషిద్ధం. కానీ అవి మహిళలకు అనుమతించబడినాయి.