





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
జాబిర్ ఇబ్నె అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఒక ప్రయాణంలో ఉండగా చాలామంది ఒకచోట కూడి ఒక వ్యక్తికి నీడను కల్పిస్తున్నారు,అది చూచి ప్రవక్త అది ఏమిటి ?అని అడిగారు అక్కడ ఉన్నవారు ‘అతడు ఉపవాసి’ అని చెప్పారు, ప్రవక్త సమాధానమిస్తూ; ప్రయాణంలో ఉపవాసం పాటించడం పుణ్యప్రదము మరియు తఖ్వా కాదు అని చెప్పారు, ముస్లిం హదీథు నమోదు ప్రకారం ‘అల్లాహ్ మీ కొరకు అనుగ్రహించిన అనుమతిని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి’ అని ఉంది.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఒక ప్రయాణంలో ఉండగా, ప్రజలు ఒక వ్యక్తి చుట్టూ గుమిగూడి అతనికి ఎండ వేడిమి మరియు తీవ్రమైన దాహం నుండి నీడ కల్పిస్తున్నట్లు చూశారు. ఆయన, 'అతనికి ఏమైంది?' అని అడిగారు. వారు, 'అతను ఉపవాసంలో ఉన్నాడు' అని చెప్పారు. అప్పుడు ఆయన ఇలా అన్నారు: ప్రయాణం లో ఉపవాసం పాటించడం పుణ్యప్రదము మరియు తఖ్వా కాదు, అల్లాహ్ మీ కొరకు అనుగ్రహించిన అనుమతిని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
మక్కా విజయం (ఫతహ్ మక్కా) జరిగిన సంవత్సరం, ఆ సందర్భముగా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఉన్నపుడు ఆయన ఇలా అనగా తాను విన్నాను అని జాబిర్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖిస్తున్నారు: “నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు – సారాయి, చనిపోయిన జంతువులు, పందులు మరియు విగ్రహాలను అమ్మడాన్ని నిషేధించినారు”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఈ విధంగా నివేదించబడినది “ఓ రసూలల్లాహ్ (స)! మరి చనిపోయిన జంతువులనుండి తీసే కొవ్వు గురించి మీ అభిప్రాయం ఏమిటి? అది ఓడలకు, మరియు చర్మాలకు (అవి పాడుకాకుండా) పూయబడుతుంది; మరియు ప్రజలు దానిని దీపాలలో (చమురుగా) వాడుతారు”. దానికి ఆయన (స) “లేదు, అది హరాం” అన్నారు. తరువాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భముగా ఇలా అన్నారు: “యూదులను అల్లాహ్ నాశనం చేయుగాక! నిశ్చయంగా అల్లాహ్ (చనిపోయిన జంతువుల) కొవ్వును వారికి నిషేధించినాడు. కానీ వారు దాని కరిగించారు, దానిని అమ్మినారు మరియు దానినుండి వచ్చిన సొమ్మును తిన్నారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుజాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) మక్కా విజయం సంవత్సరములో, ఆ సందర్భముగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఉన్నపుడు, ఆయన ఇలా అనడం విన్నారు: “నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మద్యము, మృత జంతువులు, పందులు, మరియు విగ్రహాల అమ్మకాలను నిషేధించినారు.” ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడగడం జరిగింది: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మరి చనిపోయిన జంతువుల కొవ్వును అమ్మడానికి అనుమతి ఉందా? ఎందుకంటే దానిని ఓడలకు పూత పూయడానికి, చర్మాలకు (అవి చెడిపోకుండా) గ్రీజులాగా రాయడానికి, మరియు ప్రజలు తమ దీపాలను వెలిగించడానికి ఉపయోగిస్తారు” అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేదు అది నిషేధము” అన్నారు. ఆ సందర్భముగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అల్లాహ్ యూదులను నాశనం చేసి వారిని శపించాడు. అల్లాహ్ వారిపై పశువుల కొవ్వులను నిషేధించినప్పుడు, వారు దానిని కరిగించి, దానిని అమ్మి, దాని ధరను తిన్నారు.
జిర్ ఇబ్న్ హుబైష్ ఉల్లేఖన: నేను మేజోళ్ళపై మసహ్ గురించి అడుగుదామని సఫ్వాన్ బిన్ అస్సాల్ అల్-మురాదీ వద్దకు వెళ్ళాను. ఆయన నన్ను "జిర్! ఏమిటి ఇలా వచ్చావ్?” అనడిగారు. అందుకు నేను “జ్ఞానసముపార్జన కోసం” అని జవాబిచ్చాను. అది విని ఆయన “దైవదూతలు జ్ఞానం ఆర్జించే వ్యక్తి పట్ల ప్రసన్నులై తమ రెక్కల్ని పరుస్తారు" అని చెప్పారు. నేను ఆయనతో "మల మూత్ర విసర్జన అనంతరం మేజోళ్ళపై మసాహ్ చేసే విషయంలో నాకు సందేహముంది. తమరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు కదా! అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం గురించి బోధిస్తుండగా మీరేమైనా విన్నారేమో అడుగుదామని వచ్చాను” అని విన్నవించుకున్నాను. దానికి ఆయన "అవును, ప్రయాణంలో ఉన్నప్పుడు మూడు పగళ్ళు మరియు మూడు రాత్రుల వరకు జనాబత్ అశుద్ధావస్థ ఎదురైతే తప్ప, మలమూత్ర విసర్జన మరియు నిద్ర కారణంగా మేజోళ్ళు తీయవలసిన అవసరం లేదని ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించేవారు, అని వివరించారు. ఆ తరువాత నేను “మరి ప్రేమ (అభిమానం) గురించి ఆయన ఏమైనా ప్రబోధిస్తుండగా మీరు విన్నారా?” అనడిగాను. దానికి కూడా ఆయన “అవును, ఒకానొక ప్రయాణంలో మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఆయన దగ్గరే ఉన్నాము. అప్పుడు పల్లెటూరి వ్యక్తి ఒకడు ‘ఓ ముహమ్మద్!' అని బిగ్గరగా అరిచాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంతే స్వరంతో “ఇక్కడున్నాను" అని బదులు పలికారు. మేము అతనికి, “నీ ధోరణి కడు శోచనీయం. కాస్త గొంతు తగ్గించి మాట్లాడు. నువ్వు ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో ఉన్నావు. ఆయన సమక్షంలో నువ్విలా బిగ్గరగా మాట్లాడటం నిషిద్ధం” అని హితవు పలికాము. కాని అతను "దైవసాక్షి! నేను తగ్గించను” అన్నాడు. ఆ పల్లెటూరి వ్యక్తి “మనిషి కొందరిని ప్రేమిస్తాడు, కానీ వారిని కలుసుకోలేకపోతాడు” అని అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, “మనిషి ప్రళయ దినాన తాను ప్రేమించిన వారితో పాటే ఉంటాడు” అని చెప్పారు. తరువాత ఆయన మాతో మాట్లాడుతూ పడమటి దిక్కున ఉన్న ఓ ద్వారాన్ని గురించి ప్రస్తావించారు. దాని వెడల్పు నలభై లేక డెభ్భై సంవత్సరాల ప్రయాణమంత ఉంటుంది లేదా దాని వెడల్పులో ఒక రౌతు నలభై లేక డెభ్భై సంవత్సరాలు ప్రయాణించగలడు.
అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:జర్ర్ బిన్ హుబైష్, సఫ్వాన్ బిన్ అస్సాల్ రదియల్లాహు అన్హు వద్దకు మేజోళ్లపై మసాహ్ గురించి అడగడానికి వచ్చారు. అప్పుడు సఫ్వాన్ అడిగారు: ఓ జర్ర్, ఏ విషయం నిన్ను ఇక్కడికి తీసుకు వచ్చింది? దానికి జర్ర్ ఇలా బదులిచ్చారు: జ్ఞానాన్వేషణ. అప్పుడు ఆయన అన్నారు: నిశ్చయంగా, జ్ఞాన విద్యార్థి చేసే దాని పట్ల సంతోషం మరియు గౌరవంతో దైవదూతలు తమ రెక్కలను పరుస్తారు. అప్పుడు జర్ర్ అన్నారు: మలమూత్ర విసర్జనల తరువాత మేజోళ్లపై మసాహ్ చేసే విషయంలో నా మనస్సులో సందేహం కలిగింది. మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులలోని వారు కదా! అందుకని నేను మిమ్మల్ని అడగడానికి వచ్చాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి ఏమైనా ప్రస్తావించగా మీరు విన్నారా? సఫ్వాన్ అన్నారు: "అవును, ప్రయాణంలో ఉన్నప్పుడు లైంగిక అశుద్ధావస్థ (జనాబత్) ఎదురైతే తప్ప, మలమూత్ర విసర్జనకి, నిద్రించి లేచినందుకు మూడు పగళ్ళు మరియు మూడు రాత్రుల వరకు మేజోళ్ళు తీయవలసిన అవసరం లేదని ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించేవారు." అప్పుడు నేను, "మీరు ప్రేమాభిమానం గురించి ఆయన ఏమైనా ప్రస్తావించగా విన్నారా?" అని అడిగాను. అతను ఇలా అన్నాడు: అవును, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఒక ప్రయాణంలో ఉన్నాము. మేము ఆయన వద్ద ఉండగా ఒక పల్లెవాసి బిగ్గరగా పిలిచాడు: ఓ ముహమ్మద్! దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అతని స్వరానికి తగ్గట్టుగా హెచ్చు స్వరంతో సమాధానమిచ్చారు: అవుడు మేము అతనితో "ఇలా రా" అన్నాము: ఇంకా ఇలా అన్నాము, "నీకు వినాశం! నీ స్వరం తగ్గించు, ఎందుకంటే నీవు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఉన్నావు, ఆయన వద్ద స్వరం పెంచి మాట్లాడటం నిషేధించబడింది."a b 5⅝ అప్పుడు అతను తన మొరటు స్వభావంతో, “అల్లాహ్ సాక్షిగా! నేను నా స్వరాన్ని తగ్గించను” అన్నాడు. ఆ పల్లెటూరి వ్యక్తి, “ఓ రసూలుల్లాహ్! ఒక వ్యక్తి సత్పురుషులను ప్రేమిస్తాడు, కానీ వారిలాంటి కర్మలు చేయలేడు. మరి అతడి సంగతి ఏమిటి?” అని అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, “మనిషి ప్రళయ దినాన తాను అభిమానించిన వారితోపాటే ఉంటాడు” అని చెప్పారు. జిర్ర్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: ఆ తరువాత సఫ్వాన్ మాతో మాట్లాడుతూ, సిరియా వైపు ఉన్న పశ్చాత్తాప ద్వారం (బాబ్ లిల్ తౌబహ్) గురించి ప్రస్తావించారు. అల్లాహ్ భూమ్యాకాశాలను సృష్టించిన రోజే దానిని కూడా సృష్టించాడు. దాని వెడల్పులో ఒక రౌతు నలభై లేక డెభ్భై సంవత్సరాలు ప్రయాణించగలడు. సూర్యుడు పడమటి నుండి ఉదయించే వరకు అది మూసుకోదు.
అబూ దర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “ఓ అబూ దర్! నీవు ఏదైనా రసంతో కూడిన వంట వండుతుంటే, దానిలో నీటిని (నీటి శాతాన్ని) పెంచు, మరియు (వంటలో కొంత నీ పొరుగువారికి ఇవ్వు) వారితో మంచిగా వ్యవహరించు.
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అబూ దర్ అల్-గిఫారి (రదియల్లాహు అన్హు)ని ఉడకబెట్టిన పులుసు వండేటప్పుడు, దానిలో నీటిని (నీటి శాతాన్ని) మరియు దాని నిల్వను పెంచాలని మరియు అతను తన పొరుగువారిని జాగ్రత్తగా చూసుకోవాలని మరియు దానితో వారిని పరామర్శించాలని ఉద్బోధించినారు.
అబూ సయీద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “జిబ్రయీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అడిగినారు: “ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు అనారోగ్యం పాలైనారా?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అవును” అని బదులిచ్చినారు. అపుడు జిబ్రయీల్ అలైహిస్సలాం ఇలా పలికినారు: “బిస్మిల్లాహి అర్’ఖీక, మిన్ కుల్లి షైఇన్ యు’జీక, మిన్ షర్రి కుల్లి నఫ్సిన్ అవ్ ఐనిన్ హాసిదిన్, అల్లాహు యష్ఫీక, బిస్మిల్లాహి అర్’ఖీక” (అల్లాహ్ నామమున నేను మీపై ఒక ప్రార్థనను (రుఖయహ్’ను) పఠిస్తున్నాను; మీకు హాని కలిగించే ప్రతి దాని నుండి, ప్రతి ఆత్మ యొక్క చెడు నుండి లేదా అసూయపడేవారి కంటి నుండి అల్లాహ్ మిమ్మల్ని స్వస్థపరచుగాక. అల్లాహ్ నామమున నేను మీపై ఒక ప్రార్థనను (రుఖయహ్’ను) పఠిస్తున్నాను)”
ముస్లిం నమోదు చేసినారు:జిబ్రయీల్ అలైహిస్సలాం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి వారిని ఇలా అడిగినారు: “ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ! మీరు అనారోగ్యంతో ఉన్నారా?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అవును” అన్నారు. అపుడు జిబ్రయీల్ అలైహిస్సలాం ఇలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అస్వస్థతగా ఉన్న వారి కొరకు పఠించే ఒక ప్రార్థన (రుఖయహ్) ను పఠించారు: (బిస్మిల్లాహి) అల్లాహ్ నామమున, ఆయన సహాయాన్ని కోరుతూ, (అర్’ఖీక) మీ కొరకు ఆయన శరణు వేడుకుంటూ మీ కొరకు ఒక ప్రార్థనను – రుఖయహ్ ను – పఠిస్తున్నాను. (మిన్ కుల్లి షైఇన్ యు’జీక) మీకు హాని కలిగించే ప్రతి విషయము నుండి – అది చిన్నది గానీ, పెద్దది గానీ -; (మిన్ షర్రి కుల్లి నఫ్సిన్) ప్రతి చెడు ఆత్మ యొక్క చెడు నుండి; (ఔ ఐని హాసిదిన్) లేదా అసూయపడే వారి కంటి నుండి, అది కలిగించే చెడు నుండి, అల్లాహ్ మిమ్మల్ని (యష్ఫీక) స్వస్థపరుచు గాక, ఆయన మిమ్మల్ని అన్ని వ్యాధుల నుండి రక్షించు గాక, కాడుగాక, (బిస్మిల్లాహి అర్’ఖీక) అల్లాహ్ నామమున నేను మీపై ఒక ప్రార్థనను (రుఖయహ్’ను) పఠిస్తున్నాను”. జిబ్రయీల్ (అలైహిస్సలాం) దానిని నొక్కి చెప్పడం కొరకు ఆ పదాలను పునరావృతం చేసినారు. ఆయన ఆ ప్రార్థనను ఆ పదాలతోనే ప్రారంభించినారు మరియు ఆ పదాలతోనే ముగించినారు; నిశ్చయంగా ఆయన (సర్వ స్తోత్రములకు అర్హుడైన అల్లాహ్) తప్ప ప్రయోజనం కలిగించే వారెవరూ లేరు అని సూచిస్తూ.
అబూ హుమైద్ అస్సాయిదీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం బనీ సులైమ్ తెగవారి నుండి జకాత్ వసూలు చేయడానికి ఇబ్న్ అల్-లుతబియ్యహ్ అనే వ్యక్తిని నియమించారు. అతను తిరిగి వచ్చినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని లెక్క అడిగారు. అతను, 'ఇది మీ జకాత్ సంపద, మరియు ఇది నాకు బహుమతిగా ఇవ్వబడింది' అని అన్నాడు. దానిపై, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు "నీవు చెబుతున్నది నిజమే అయితే, నీకు బహుమతులు వచ్చే వరకు నువ్వు నీ తండ్రి మరియు తల్లి ఇంట్లో ఎందుకు ఉండలేదు?" తరువాత ప్రవక్త మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించినారు, అల్లాహ్ను స్తుతించి, ఆయనను కీర్తించిన తర్వాత, ఆయన ఇలా అన్నారు: "అమ్మా బా'దు", అల్లాహ్ నా ఆధీనంలో ఉంచిన దానిలో కొంత పనిని నిర్వహించడానికి నిశ్చయంగా నేను మీలో ఒక వ్యక్తిని నియమిస్తాను, ఆపై అతను నా వద్దకు వచ్చి ఇలా అంటాడు “ఇది మీ (జకాతు) సంపద మరియు ఇది బహుమతి, బహుమతిగా నాకు ఇవ్వబడింది”. మరి అతనికి (ఎవరైనా) బహుమతులు ఇస్తారా లేదా అని చూడటానికి అతను తన తండ్రి మరియు తల్లి ఇంట్లో ఎందుకు (నిరీక్షించి) ఉండలేదు? అల్లాహ్ సాక్షిగా (చెబుతున్నాను), మీలో ఎవరైనా చట్టవిరుద్ధంగా ఏదైనా తీసున్నట్లయితే, దానిని మోసుకుంటూ పునరుత్థాన దినమున అల్లాహ్ను కలుస్తారు. మీలో ఎవరూ అల్లాహ్ను కలుసుకోవడానికి వెళ్ళినపుడు, రంకెలు పెడుతున్న ఒంటెను, అరుస్తూ ఉండే ఆవును లేదా ‘బేబే’ అని అరుస్తున్న గొర్రెను మోసుకెళ్లడం నేను చూడదల్చుకోలేదు." అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులను తన చంకల తెల్లదనం కనిపించే వరకు పైకెత్తి, "ఓ అల్లాహ్! నేను (నీ సందేశాన్ని) అందజేయలేదా?" అని అన్నారు. ఉల్లేఖకుడైన అబూ హుమైద్ అస్సాయిదీ ఇంకా ఇలా అన్నారు: “నా కళ్ళు చూశాయి మరియు (ఆ హదీథును) నా చెవులు విన్నాయి.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇబ్న్ అల్-లుతబియ్యహ్ అనే వ్యక్తిని బనూ సులైమ్ తెగవారి నుండి జకాత్ వసూలు చేసి తీసుకు రావడానికి నియమించినారు. పని ముగించుకుని అతడు మదీనాకు తిరిగి వచ్చినపుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని ఎంత జకాతును వసూలు చేసినాడు మరియు అందులో అతడు (తన రోజువారి ఖర్చుల కొరకు) ఎంత ఖర్చు పెట్టినాడు అని లెక్క అడుగగా, ఇబ్న్ లుతబియ్యహ్ ఇలా అన్నాడు: “ఇది (బనూ సులైమ్ తెగ వారి నుండి) నేను జకాతుగా వసూలు చేసిన మీ సంపద మరియు (అది గాక నా దగ్గరున్న) ఈ సంపద నాకు బహుమతిగా ఇవ్వబడింది.” అది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: నీవు సత్యవంతునివే అయితే, నీకు ప్రజలు బహుమతులు ఇస్తారో లేదో చూడటానికి నీవు నీ తండ్రి మరియు తల్లి ఇంట్లో ఎందుకు కూర్చోవు? ఆ సంపద నీకు బహుమతిగా రావడానికి కారణం నీకు అప్పగించబడిన బాధ్యతలు మరియు విధులే. నీవు నీ ఇంట్లోనే కూర్చొని ఉండి ఉంటే, నీకు ఏమీ బహుమతిగా ఇవ్వబడేది కాదు. కనుక, కేవలం అది బహుమతి రూపంలో నీకు చేరింది అనే కారణంగా నీవు దానిని చట్టబద్ధంగా పరిగణించడానికి అనుమతి లేదు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోపంగా ఉన్నప్పటికీ వేదిక (మెంబరు) పైకి ఎక్కి ప్రసంగించినారు. ముందుగా అల్లాహ్ ను స్తుతించి, ఆయనకు కృతఙ్ఞతలు అర్పించి ఇలా అన్నారు: “అమ్మా బ’ద్! నిశ్చయంగా అల్లాహ్ నాకు అప్పగించిన బాధ్యతలలో జకాతు వసూలు మరియు యుద్ధములో జయించిన సంపద విషయములలో ఒకరిని దాని కొరకు నియమించాను. అతడు ఆ పని నుండి తిరిగి వచ్చి ఇలా అంటాడు: “ఇది మీ కొరకు, మరియు ఇది నా బహుమతి. బహుమతిగా నాకు ఇవ్వబడింది” అని. “తన బహుమతి తనకు వస్తుందో లేదో చూడటానికి అతను తన తండ్రి మరియు తల్లి ఇంట్లో ఎందుకు కూర్చోడు? అల్లాహ్ సాక్షిగా, తీర్పు దినమున తన మెడపై మోసుకుంటూ అల్లాహ్ను కలుసుకోవడం తప్ప ఎవరూ తనకు ఇచ్చిన దాని నుండి చట్టవిరుద్ధంగా ఏమీ తీసుకోరు - అది మూలుగుతూ ఉండే ఒంటె అయినా, మూలుగుతూ ఉండే ఆవు అయినా, లేదా అరచే గొర్రె అయినా. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, బలంగా తన రెండు చేతులను పైకెత్తినారు, అక్కడ కూర్చున్న వారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చంకలలోని తెల్లదనాన్ని చూడగలిగినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులను పైకెత్తి ఇలా అన్నారు: “ఓ అల్లాహ్! నేను నీ తీర్పును వారికి అందజేసినాను.” ఈ హదీథు ఉల్లేఖకుడైన అబుయ్ హుమైద్ అస్సాదీ (రదియల్లాహు అన్హు) ఇది (ఈ హదీథు) తన కనులు చూసినది మరియు తన చెవులు విన్నది అని తెలియజేసినారు.
ఇయాస్ ఇబ్న్ అబ్దుల్లాహ్ ఇబ్న్ అబూ దుబాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “అల్లాహ్ యొక్క దాసురాళ్ళను కొట్టకండి”. తరువాత ఉమర్ రదియల్లాహు అన్హు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అన్నారు: “స్త్రీలు తమ భర్తల పట్ల ధైర్యంగా మారారు (భర్తలకు తిరగబడి జవాబిస్తున్నారు)”. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దండించడానికి అనుమతించినారు. కానీ తరువాత చాలామంది స్త్రీలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబము వద్దకు వచ్చి తమ భర్తలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయసాగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిశ్చయంగా చాలామంది స్త్రీలు తమ భర్తలపై ఫిర్యాదు చేస్తూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలల్ం కుటుంబము వద్దకు వచ్చినారు. ఆ పురుషులు మీలో ఉత్తములు కారు.”
అబూదావుద్ మరియు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం భార్యలను కొట్టడాన్ని నిషేధించారు. అప్పుడు అమీరుల్ ము’మినీన్ ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వచ్చి ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, స్త్రీలు తమ భర్తల పట్ల ధైర్యంగా మారారు (వారు భర్తలకు ఎదురు జవాబిస్తున్నారు) మరియు వారిలో మర్యాద, సభ్యత క్షీణించింది”. అది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ భర్తల బాధ్యతలను నెరవేర్చడానికి నిరాకరించడం, అతనికి అవిధేయత చూపడం వంటి కారణాలు ఉంటే వారిని కొట్టడానికి అనుమతి ఇచ్చారు, కానీ తీవ్రంగా కాదు. ఆ తరువాత చాలామంది స్త్రీలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యల వద్దకు వచ్చి తమ భర్తలు తమను విపరీతంగా కొడుతున్నారని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతిని దుర్వినియోగం చేస్తున్నారని, తమ భర్తలపై ఫిర్యాదు చేసారు. అది తెలిసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మీలో ఆ పురుషులు, ఎవరైతే తమ భార్యలను తీవ్రంగా కొడుతున్నారో, వారు ఉత్తములు కారు.”
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించగా విన్నారు: "ఒక ముస్లిం తన వీలునామా రాసి తనతో ఉంచుకోకుండా మూడు రాత్రులు ఉండడం సముచితం కాదు." అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అనడం నేను విన్నప్పటి నుండి, నా వీలునామా నాతో లేకుండా ఒక్క రాత్రి కూడా గడిచిపోలేదు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఒక ముస్లింకు వీలునామా రాసి ఇవ్వడానికి ఏవైనా హక్కులు లేదా ఆస్తులు ఉంటే, అది చిన్నదైనా సరే, తన వీలునామా రాసి సిద్ధంగా ఉంచుకోకుండా మూడు రాత్రులు గడపరాదని ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదిఅల్లాహు అన్హుమా ఇలా అన్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అలా చెప్పగా విన్నప్పటి నుండి, నా వీలునామా నా వద్ద సిద్ధంగా లేకుండా నేను ఒక్క రాత్రి కూడా గడపలేదు.
ఉమ్మె అతియా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికారు: “ఒక స్త్రీ తన భర్త కొరకు తప్ప, మరింకే చనిపోయిన వ్యక్తి కొరకు కూడా మూడు దినముల కంటే ఎక్కువ దుఃఖించరాదు. ఆమె భర్త చనిపోతే మాత్రం ఆమె నాలుగు నెలల పది దినములు దుఃఖ దినములుగా సంతాపములో గడపాలి. ఆమె (ఆ దుఃఖదినములలో) రంగులద్దిన వస్త్రాలు ధరించరాదు, ‘అస్బ్’ (అంత ఆకర్షణీయం కాని) వస్త్రాలు తప్ప. ‘కొహ్’ల్’ (కాటుక, సుర్మా లేదా అటువంటి పదార్థాలు) పూయరాదు. ఆమె రుతుస్రావానికి గురైతే దాని నుండి శుద్ధి అయిన తరువాత తప్ప సుగంధద్రవ్యాలను (అత్తరు, పెర్’ఫ్యూమ్ మొ.) తాకరాదు, అయితే (శుద్ధి అయిన తరువాత) ఆమె ‘ఖుస్త్’ లేదా ‘అజ్’ఫార్’ వంటి సుగంధ ద్రవ్యాలను పూయవచ్చును.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం, స్త్రీలు మరణించిన వ్యక్తి కోసం, అది తండ్రి అయినా, సోదరుడు అయినా, కొడుకు అయినా లేదా మరెవరైనా అయినా సుగంధ ద్రవ్యాలు, కోహ్ల్, నగలు లేదా అందమైన దుస్తులు ధరించకుండా మూడు రోజుల కంటే ఎక్కువ కాలం దుఃఖించడాన్ని నిషేధించారు, కేవలం భర్త విషయం లో తప్ప; భర్త చనిపోయినట్లయితే సంతాప కాలం నాలుగు నెలల పది రోజులు. భర్త కోసం పాటిస్తున్న దుఃఖదినముల సమయంలో ఆమె అలంకరణ కోసం రంగు వేసిన లేదా అద్దిన దుస్తులను ధరించరాదు, 'అసబ్ (మాదిరి) వస్త్రం' తప్ప, అసబ్ వస్త్రం అనేది నేయడానికి ముందు రంగు వేయబడిన యెమెన్ వస్త్రం. ఆ దుఃఖ దినముల సమయములో అలంకరణ కోసం తన కళ్ళకు కొహ్’ల్ (కాటుక, సుర్మా లేదా అటువంటి పదార్థాలు) రాసుకోకూడదు, లేదా పరిమళ ద్రవ్యాలు లేదా ఇతర సువాసనలను ఉపయోగించకూడదు, ఆమె ఋతుస్రావానికి గురైతే తన శరీరాన్ని కడుక్కున్న తరువాత (గుస్ల్ చేసిన తరువాత) తప్ప. ఋతుస్రావం నుండి పరిశుద్ధత పొందిన తరువాత ఆమె ‘ఖుస్త్’ లేదా ‘అజ్’ఫార్’ అనే ధూపపు ముక్కలను, సుగంధ ద్రవ్యంగా కాకుండా ఏదైనా అప్రియమైన వాసనను తొలగించే సాధనాలుగా ఉపయోగించవచ్చు. ‘ఖుస్త్’ లేదా ‘అజ్’ఫార్’ అనేవి ప్రసిద్ధి చెందిన సుగంధ ధూపసామాగ్రికి చెందినవి. ఆమె వాటిని ఋతుస్రావపు రక్తంతో ప్రభావితమైన యోని ప్రాంతంపై సున్నితంగా పూయవచ్చు, సుగంధ ద్రవ్యాలను పూసుకున్నట్లు కాకుండా.