





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబ్దుల్లాహ్ ఇబ్న్ యజీద్ అల్-ఖత్మీ ఉల్లేఖన: బరా, అతను అసత్యవాది కాదు నాకు దీనిని ఉల్లేఖించి, ఇలా అన్నారు: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ‘సమిఅల్లాహు లిమన్ హమిద’ అని పలికినప్పుడు, మాలో ఎవ్వరూ కూడా తమ నడుమును వంచేవారు కాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దా లోకి పూర్తిగా వెళ్ళేంత వరకు. ఆ తర్వాత మేము ఆయన వెంబడి సజ్దా చేసేవారము.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుసత్యవంతుడైన బర్రా బిన్ ఆజిబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ రుకూ నుండి తల పైకి లేపి ‘సమియల్లాహు లిమన్ హమిద’ పలికిన తరువాత, ఆయన వెనుక ఉన్నవారు (రుకూ నుండి లేచి నిలబడి) అలాగే నిలబడే వారు; వారిలో ఎవ్వరూ కూడా సజ్దా కోసం వెంటనే వంగేవారు కాదు, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తన నుదుటిని నేలపై పెట్టిన తర్వాతనే (సజ్దా లోకి పూర్తిగా వెళ్ళన తర్వాతనే) వారు కూడా ఆయన వెనుక సజ్దా చేసేవారు.
కుడి వైపున నిద్రపోవడం వల్ల త్వరగా మేల్కొనవచ్చు, ఎందుకంటే గుండె కుడి వైపు నిద్రపోయిన స్థితిలో గుండే తక్కువగా స్థిరంగ ఉంటుంది మరియు గుండె ఎడమ వైపున ఉన్నందు వలన కుడి వైపునకు తిరిగి పడుకోవడం అనేది గుండెకు మరింత విశ్రాంతినిస్తుంది. ఒక వ్యక్తి ఎడమ వైపునకు తిరిగి నిద్రపోతే, శరీరపు బరువు దానిపై పడి ఒత్తిడి కలుగజేస్తుంది, అది హృదయానికి హాని కలిగిస్తుంది. “నేను ఆయిషా రదియల్లాహు అన్హాను అడిగాను, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ఏమి చేసేవారు?” అని. ఆమె ఇలా అన్నారు, “ఇంటిలో ఆయన తన కుటుంబానికి సేవ చేసేవారు అంటే తన ఇంటి పనులలో సహాయం చేసేవారు, మరియు నమాజు సమయం వచ్చినప్పుడు నమాజు కోసం బయటకు వెళ్లేవారు.”
అల్ బుఖారీ నమోదు చేసినారు:విశ్వాసుల మాతృమూర్తి అయిన ఆయషా రదియల్లాహు అన్హాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంటిలో ఎలా ఉండేవారు అని, తన ప్రవర్తన గురించి, తాను చేసే పనుల గురించి అడిగారు. ఆమె ఇలా జవాబిచ్చినారు: "ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇతరుల వలే ఒక మానవమాత్రుడు మాత్రమే. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులు తమ ఇళ్లలో చేసే విధంగానే పని చేసేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన పనులను తానే చేసుకునేవారు మరియు తన కుటుంబానికి కూడా సేవ చేసేవారు (అంటే ఇంటి పనులలో సహాయం చేసేవారు); ఆయన తమ గొర్రెలకు పాలు పితుకుతారు, తన బట్టలు చిరిగిపోతే కుట్టుకుంటారు, తన చెప్పులు తెగిపోతే వాటిని కుట్టి సరిచేసుకుంటారు మరియు ఇంటిలో లోహపు బాల్చీ (బక్కెట్టు) పాడైపోతే దానికి అతుకులు వేసి బాగుచేస్తారు. అయితే నమాజు సమయం ఆసన్నమైనపుడు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆలస్యం చేయకుండా నమాజు కొరకు బయటకు వెళ్ళేవారు.
బుస్ర్ ఇబ్న్ సఈద్, తనను జైద్ ఇబ్న్ ఖాలిద్ అల్ జుహనీ రదియల్లాహు అన్హు 'నమాజు ఆచరిస్తున్న వ్యక్తి ముందు నుంచి నడిచి వెళ్ళే వ్యక్తికి సంబంధించి రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి ఏమి విన్నారో తెలుసుకుని రమ్మని' అబూ జుహైమ్ రదియల్లాహు అన్హు వద్దకు పంపినారు అని తెలిపినారు; అపుడు అబూ జుహైమ్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించినారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నమాజు ఆచరిస్తున్న వ్యక్తికి ఎదురుగా నడిచి వెళ్ళుచున్న వ్యక్తికి తాను చేస్తున్నది ఎంత పెద్ద అపరాధమో తెలిస్తే, నమాజు ఆచరిస్తున్న వ్యక్తి ముందు నుంచి నడిచి వెళ్ళడం కంటే, అతడు నలభై వరకు అక్కడే నిలబడి ఉండడానికి ఇష్టపడతాడు, తప్ప అతని ముందు నుంచి నడిచి వెళ్ళడానికి ఇష్టపడడు”. అబూ అన్’నద్ర్ ఇలా అన్నారు: “అతడు నలభై రోజులు అన్నాడో లేదా నెలలు అన్నాడో లేదా సంవత్సరాలు అన్నాడో ఖచ్చితంగా చెప్పలేను.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఫర్జ్ లేదా నఫీల్ నమాజు ఆచరిస్తున్న వ్యక్తి ముందు నుంచి నడిచి వెళ్ళరాదు అని ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం హెచ్చరించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఉద్దేశపూర్వకంగా అలా చేసిన వ్యక్తి, దాని వలన తనకు కలిగే పాపం ఏమిటో తెలిస్తే, అతను నలభై అయినా అక్కడే నిలబడి ఉండడాన్ని ఎంచుకుంటాడు, ఎందుకంటే అది ఆ నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి నడిచి వెళ్ళడం కంటే అతనికి మంచిది”. ఈ హదీథు ఉల్లేఖకర్త అయిన అబూ నద్ర్ ఇలా అన్నారు: “ఆయన నలభై దినములు అన్నాడో లేదా నెలలు అన్నాడో లేదా సంవత్సరాలు అన్నాడో ఖచ్చితంగా నాకు తెలియదు.”
లఖీత్ ఇబ్న్ సబిరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: లఖీత్ ఇబ్న్ సబిరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “బనూ అల్ మున్తఫిఖ్ తెగవారు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినపుడు నేను వారికి నాయకునిగానో లేదా వారిలో ఒకనిగానో ఉన్నాను. మేము చేరుకున్నపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటిలో లేరు. ఇంటిలో విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఉన్నారు. ఆమె మా కోసం ‘ఖజీరా’ అనే వంటకం తయారు చేయాలని ఆదేశించినారు, ఆ వంటకం తయారైంది కూడా. తరువాత ఖర్జూరాలు ఉన్న ఒక పళ్ళెమును మా ముందు ఉంచడం జరిగింది. అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటికి వచ్చినారు, వచ్చి “మీకు ఏదైనా వడ్డించబడిందా లేదా మీ కోసం ఏదైనా తయారు చేయడానికి ఆదేశించడం జరిగిందా?” అని అడిగారు. మేము “అవును, ఓ రసూలుల్లాహ్! అలా ఆదేశించబడింది” అని జవాబిచ్చాము. మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి కూర్చుని ఉన్నప్పుడు, అకస్మాత్తుగా ఒక గొర్రెల కాపరి గొర్రెలను తోలుకుంటూ వచ్చి వాటిని మందలో కలపడానికి తీసుకు వెళుతున్నట్లు చూశాము. అతని వెంట కొత్తగా పుట్టిన గొర్రెపిల్ల ఉన్నది, అది అరుస్తూ ఉన్నది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని “ఓ ఫలానా! అది (ఆ తల్లి గొర్రె) ఏమి ఈనింది?” అని అడిగారు. దానికి అతడు: “ఆడ గొర్రెపిల్ల” అని జవాబిచ్చాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అయితే ఆ గొర్రెపిల్లకు బదులుగా ఒక పెద్ద గొర్రెను వధించు” అన్నారు. తరువాత (మాతో) “పెద్ద గొర్రెను మీకోసం వధిస్తున్నామని అనుకోకండి. మా వద్ద వంద గొర్రెలున్నాయి. ఆ సంఖ్య పెరగడం మాకు ఇష్టం లేదు. ఆ సంఖ్యను నిలకడగా అలాగే ఉంచడానికి, కొత్తగా గొర్రెపిల్ల పుట్టినపుడల్లా ఒక పెద్ద గొర్రెను వధిస్తూ ఉంటాము” అన్నారు. తరువాత నేను ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నాకు ఒక భార్య ఉంది, ఆమె నాలుకలో ఏదో తప్పు ఉంది, అంటే ఆమె దుర్భాషలాడుతుంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "అయితే ఆమెకు విడాకులు ఇవ్వు". నేను ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! మేము చాలా కాలంగా కలిసి ఉన్నాము, ఆమె ద్వారా నాకు పిల్లలు ఉన్నారు”. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "అయితే, ఆమెను ఆజ్ఞాపించు, ఆదేశించు" అంటే: ఆమెకు సలహా ఇవ్వు. "ఆమెలో మంచితనం ఉంటే, ఆమె కట్టుబడి ఉంటుంది. అయితే నీవు నీ బానిసను కొట్టినట్లు నీ భార్యను కొట్టకు." తరువాత నేను ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నాకు ‘ఉదూ’ గురించి చెప్పండి. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఉదూను సమగ్రంగా, పరిపూర్ణంగా చేయి; ఒక్కొక్క వేలు మధ్య వేలుతో శుభ్రం చేయి, ముక్కు లోనికి నీరు బాగా ఎక్కించి నీటిని చీది వేయి, నీవు ఉపవాసపు స్థితిలో ఉంటే తప్ప”.
అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ మరియు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:ఈ హదీథులో లఖీత్ బిన్ సబ్రహ్ రదియల్లాహు అన్హు ఇలా తెలియజేస్తున్నారు: తన బనూ మున్తఫిఖ్ తెగ నుండి తాను మరి కొందరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కలవడానికి వెళ్ళినాము. ఆ సంఘటనను వివరిస్తూ అతను ఇలా అన్నాడు: మేము వెళ్ళినపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంట్లో లేరు, కానీ విశ్వాసుల మాతృమూర్తి అయిన ఆయిషా రదియల్లాహు అన్హా ఉన్నారు. ఆమె మా కోసం పిండి మరియు కొవ్వుతో ఒక సూప్ తయారు చేయమని ఆదేశించినారు మరియు మాకు ఒక పళ్ళెంలో ఖర్జూర పండ్లు వడ్డించబడినాయి. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి మమ్మల్ని: “మీకు ఏమైనా వడ్డించబడిందా?” అని అడిగినారు. మేము “అవును, వడ్డించబడింది” అన్నాము. లఖీత్ ఇంకా ఇలా అన్నారు: “మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షములో కూర్చుని ఉండగా, ఒక గొర్రెల కాపరి, చేతులలో అరుస్తూ ఉన్న ఒక చిన్న గొర్రెపిల్లను ఎత్తుకుని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొర్రెలను తోలుకుంటూ వచ్చి వాటిని మందలో కలిపి, అవి నిద్రించే స్థలానికి తోలుతున్నాడు; అతడిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అది (తల్లి గొర్రె) దేనిని జన్మించింది?” అని అడిగారు.” దానికి అతడు: “ఆడ గొర్రెపిల్ల” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం: “దాని స్థానములో ఒక పెద్ద గొర్రెను వధించు” అన్నారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ప్రత్యేకంగా మీ కోసమే దీనిని వధించేందుకు శ్రమిస్తున్నామని అనుకోకండి, మా దగ్గర వంద గొర్రెలు ఉన్నాయి, మేము ఆ సంఖ్య పెరగాలని అనుకోవడం లేదు; అందుకనే కొత్తగా గొర్రెపిల్ల పుట్టినపుడల్లా, దాని స్థానంలో ఒక పెద్ద గొర్రెను వధిస్తూ ఉంటాము”. తరువాత లఖీత్ ఇలా అన్నారు: “ఆ పిదప నేను ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నా భార్య గయ్యాళి, చాలా అసభ్యకరమైన భాషలో మాట్లాడుతుంది. ఆమెతో ఎలా వేగాలి? (ఏమి చేయాలి?)” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం: “ఆమెకు విడాకులివ్వు” అన్నారు. నేను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఆమె చాలా కాలంగా నా సహచరిణిగా (భార్యగా) ఉంది; ఆమెతో నాకు పిల్లలు కూడా కలిగారు” అన్నాను. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం: “అయితే ఆమెకు ఉపదేశించు, బోధించు, సలహా ఇవ్వు, ఆదేశించు. ఆమెలో ఏ కొద్దిగా మంచి ఉన్నా ఆమె నీ సలహాకు, ఆదేశానికి ప్రతిస్పందిస్తుంది. ఆమె స్పందించకపోతే, ఆమెను దండించు, కానీ తీవ్రంగా కాదు; నీ బానిసను దండించినంత తీవ్రంగా దండించకు.” తరువాత లఖీత్ ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నాకు ‘ఉదూ’ గురించి తెలియజేయండి.” ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఉదూ చేయునపుడు నీరు అవయవాల తగిన స్థానాలకు పూర్తిగా చేరుకునేలా చేయి, ప్రతి అంగానికి దాని యొక్క హక్కును చెల్లించు; మరియు ఉదూ ఆచరించునపుడు దాని యొక్క ‘ఫరాయిద్’ మరియు ‘సున్నత్’ ఆచరణలలో దేనినీ వదలకు. నీ కాళ్ళను మరియు చేతులను కడుగునపుడు వాటి వేళ్ళను విడదీసి వాటి మధ్యన కూడా కడుగు; మరియు ఉదూ చేయునపుడు ముక్కులోనికి పుష్కలంగా నీరు పోనిచ్చి ముక్కును చీది వేయి, నీవు ఉపవాసపు స్థితిలో ఉంటే తప్ప, ఎందుకంటే ముక్కు ద్వారా నీరు కడుపులోనికి పోకుండా ఉండుటకు గానూ.”
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ఒక ప్రయాణములో మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నాము. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినారు. అప్పుడే మేము హమ్మారా అనే పక్షిని దాని రెండు పిల్లలతో చూసాము. మేము దాని పిల్లలను పట్టుకున్నాము. ఆ పక్షి వచ్చి దాని రెక్కలు ఆడించడం ప్రారంభించింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి వచ్చి, అది చూసి: “ఈ పక్షి తన బిడ్డ కోసం దుఃఖపడేలా చేసింది ఎవరు? ఆమె బిడ్డను ఆమెకు తిరిగి ఇవ్వండి” అన్నారు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మేము కాల్చివేసిన ఒక చీమల పుట్టను చూసి: “దీనిని ఎవరు కాల్చారు?” అని అడిగినారు. దానికి మేము: “మేము కాల్చినాము” అన్నాము. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం: “నరకాగ్ని యొక్క ప్రభువైన అల్లాహ్ తప్ప ఎవ్వరూ అగ్నితో శిక్షించకూడదు” అన్నారు.
అబూదావూద్ నమోదు చేసినారు:ఈ హదీథులో అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఇలా ప్రస్తావిస్తున్నారు: ఒకసారి వారందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ప్రయాణిస్తున్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళరు. అప్పుడే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు రెండు పిల్లలు కలిగి ఉన్న ఒక హుమ్మర్ పక్షిని చూసారు. వారు ఆ పక్షి రెండు పిల్లలను పట్టుకున్నారు, దాంతో ఆ పక్షి తన రెండు పిల్లలను కోల్పోయినందుకు భయంతో తన రెక్కలను అల్లాడిస్తూ తిరగడం ప్రారంభించింది. ఇంతలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చినారు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అది చూసి ఇలా అన్నారు: "దాని పిల్లలను తీసుకుని దానికి బాధ కలిగించి, భయపెట్టింది ఎవరు?" తరువాత ఆ పక్షి పిల్లలను దాని వాటి తల్లికి తిరిగి ఇవ్వమని ఆజ్ఞాపించారు. ఆ తరువాత, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అగ్నితో కాలిపోయిన చీమల పుట్టను చూసి, ఆయన ఇలా అన్నారు: “దీనిని ఎవరు కాల్చారు?” కొంతమంది సహచరులు (సహాబాలు) “మేము” అని జవాబిచ్చినారు. వారితో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం: “ప్రాణాలతో జీవించి ఉన్న ఎవరినీ కూడా, అగ్నితో శిక్షించడానికి ఎవరికీ అనుమతి లేదు, దానిని సృష్టించిన అల్లాహ్’కు తప్ప.”
అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “మేము మస్జిదులో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉండగా ఒక ఎడారివాసి వచ్చి మస్జిదులో నిలబడి మూత్రవిసర్జన చేయసాగినాడు. అది చూసి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలు “ఆగు, ఆగు” అనసాగారు. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "అతన్ని అడ్డుకోకండి, అతన్ని ఒంటరిగా వదిలేయండి." సహాబాలు అతను మూత్ర విసర్జన చేసే వరకు వారు అతన్ని ఒంటరిగా వదిలేశారు. అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని పిలిచి ఇలా అన్నారు; లేదా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే అని ఉంటారు: “ఈ మసీదులు ఇలా మూత్ర విసర్జన లేదా మలవిసర్జన కొరకు కాదు, అవి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క స్మరణ కొరకు, సలాహ్ (నమాజు) కొరకు, మరియు ఖుర్ఆన్ పారాయణం కొరకు మాత్రమే”; ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ ఉన్న వారిలో ఒక వ్యక్తిని ఒక బకెట్ నీళ్ళు తెచ్చి అతడు మూత్ర విసర్జన చేసిన ప్రదేశం మీద పోయమని ఆదేశించినారు”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన మస్జిదులో సహబాలతో ఉండగా ఒక బద్దూ (ఎడారివాసి) వచ్చి ఒక మూలన కూర్చుని మూత్రవిసర్జనకు ఉపక్రమించినాడు. సహచరులు అతన్ని మందలిస్తూ: “ఆపు, దూరంగా వెళ్ళు” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఆగండి, అతడిని ఒంటరిగా వదిలివేయండి, అతడిని (మూత్రవిసర్జన నుండి) అడ్డుకోకండి”. దానితో సహాబాలు అతడు మూత్రవిసర్జన పూర్తి చేసేంత వరకు అతడిని ఒంటరిగా వదిలి వేసినారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని తన దగ్గరకు పిలిచి అతనితో ఇలా అన్నారు: “వాస్తవానికి ఈ మస్జిదులు మలవిసర్జన మరియు మూత్రవిసర్జనల కొరకు అనుకూలమైన ప్రదేశాలు కావు. ఇవి కేవలం సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క స్మరణ కొరకు, సలాహ్ (నమాజు) కొరకు మరియు ఖుర్’ఆన్ పఠనం మొదలైన వాటి కొరకు మాత్రమే.” తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో ఒకరిని ఒక బక్కెట్టు నీళ్ళు తెచ్చి అతడు మూత్రవిసర్జన చేసిన ప్రదేశం పై పోయమని ఆదేశించినారు.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత ‘ఇస్తింజా’ చేయడానికి (శుభ్రపరుచుకోవడానికి) పేడ లేదా ఎముకను ఉపయోగించడాన్ని నిషేధించినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఈ రెండూ శుద్ధపరచవు.”
దారు ఖుత్నీ నమోదు చేసినారు:మూత్ర విసర్జన లేదా మల విసర్జన ద్వారా ఉపశమనం పొందిన తరువాత ఎవరైనా శుభ్రపరుచు కోవడానికి జంతువు ఎముకను, పేడను లేదా పిడకను ఉపయోగించడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం నిషేధించారు. ఆయన సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా అన్నారు: “అవి అశుద్ధతను దూరం చేయవు అలాగే అవి ఎవరినీ అశుద్ధత నుండి పరిశుద్ధ పరచవు కూడా.”
ఆయిషా, విశ్వాసుల మాతృమూర్తి, (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గోప్యస్థలము (బహిర్భూమి, మరుగుదొడ్డి) నుండి బయటకు వచ్చినపుడు ఇలా అనేవారు “గుఫ్రానక” (ఓ అల్లాహ్! నాకు నీ క్షమాపణ ప్రసాదించు).”
అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:మరుగుదొడ్డి నుండి బయటకు వచ్చినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “గుఫ్రానక” (ఓ అల్లాహ్ నేను నీ క్షమాపణ కోరుతున్నాను) అని పలికేవారు.
సల్మాన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “బహుదైవారాధకులు మాతో (ఎగతాళిగా) ఇలా అన్నారు: “మీ సహచరుడు (మీ ప్రవక్త) మీకు ప్రతి విషయం బోధిస్తున్నట్టు మేము చూస్తున్నాము, చివరికి కాలకృత్యాలు ఎలా తీర్చుకోవాలి అనే(చిన్న) విషయం కూడా?” దానికి ఆయన (సల్మాన్) ఇలా జవాబిచ్చినారు: “అవును; నిశ్చయంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి విషయం బోధిస్తారు; కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత శుభ్రపరుచుకోవడానికి కుడి చేతిని ఉపయోగించరాదని; ఖిబ్లాహ్ వైపునకు ముఖంగానీ వీపుగానీ చేయరాదని నిషేధించినారు; మరియు శుభ్రపరుచుకోవడానికి పేడను, పిడకలను, ఎముకలను ఉపయోగించరాదని నిషేధించినారు; ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా: “శుభ్రపరుచుకోవడానికి మూడు కంటే తక్కువ రాళ్ళను ఉప్యోగించరాదని” ఆదేశించినారు.”
ముస్లిం నమోదు చేసినారు:సల్మాన్ అల్ ఫార్సీ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “బహుదైవారాధకులు ఎగతాళిగా మాతో ఇలా అన్నారు: “మీ ప్రవక్త మీకు ప్రతి విషయాన్ని బోధిస్తారు, చివరికి మూత్రవిసర్జన లేక మలవిసర్జన చేసి ఉపశమనం ఎలా పొందాలి అనే విషయం కూడా!” సల్మాన్ రదియల్లాహు అన్హు ఇలా జవాబిచ్చినారు: “అవును, ఆయన మాకు కాలకృత్యాలు తీర్చుకుని మనం ఉపశమనం పొందే విధివిధానాలను, మర్యాదలను నేర్పించినారు. వాటిలో భాగంగా కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత శుభ్రపరుచుకోవడానికి కుడి చేతిని ఉపయోగించరాదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారు, దానిని అశుద్ధత నుండి దూరంగా ఉంచడానికి మరియు దానిపట్ల ఉన్న గౌరవం కారణంగా; అలాగే కాలకృత్యాలు తీర్చుకొను నపుడు (మల విసర్జన మరియు మూత్ర విసర్జన చేయునపుడు) కాబహ్ గృహం వైపునకు ముఖం చేయరాదు అని నిషేధించినారు; శుభ్రపరుచుకోవడానికి జంతువుల పేడను, పిడకలను లేదా మలాన్ని లేదా ఎముకలను ఉపయోగించరాదు అని నిషేధించినారు; మరియు శుభ్రపరుచుకోవడానికి మూడు రాళ్ళ కంటే తక్కువ ఉపయోగించరాదు అని నిషేధించినారు.”