





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “ఎవరైనా ఒక ముస్లిం యొక్క సంపదను లేదా ఆస్తిని మోసపూరితంగా ఆక్రమించుకునే ఉద్దేశ్యముతో (అబద్ధపు) ప్రమాణం చేస్తాడో, (తీర్పు దినమున) అతనిపై అల్లాహ్ ఆగ్రహంతో ఉన్న స్థితిలో అతడు అల్లాహ్’ను కలుస్తాడు.” అబ్దుల్లాహ్ ఇబ్నె మస్’ఊద్ రదిఅల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: “అల్-అష్’అథ్ ఇలా అన్నాడు: “అల్లాహ్ సాక్షిగా, ఇది నా గురించే. నాకు ఒక యూదుడితో ఉమ్మడి భూమి ఉంది, ఆ యూదుడు తరువాత నా యాజమాన్యాన్ని నిరాకరించాడు; అప్పుడు నేను రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అతనిమీద ఫిర్యాదు చేసినాను. రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీదగ్గర అందుకు రుజువులు ఏవైనా ఉన్నాయా?” అని అడిగారు. నేను “లేవు” అన్నాను. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వస యూదునితో “నీవు ప్రమాణం చేయి” అన్నారు. అందుకు నేను: “ఓ రసూలుల్లాహ్! అతడు ప్రమాణం చేసి నా సంపదను కబ్జా చేసుకుంటాడు (అధీన పరుచుకుంటాడు) అన్నాను. అపుడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ ఆయతును అవతరింపజేసినాడు: {ఇన్నల్లజీన యష్తరూన బి అహ్’దిల్లాహి, వ ఐమానిహిం థమనన్ ఖలీలా.... } ఆయతు చివరి వరకు; [నిశ్చయంగా, ఎవరైతే తాము అల్లాహ్ తో చేసిన ఒప్పందాన్ని మరియు తమ ప్రమాణాలను స్వల్పలాభాలకు అమ్ముకుంటారో…..] (సూరహ్ ఆలి ఇమ్రాన్ 3:77)
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో మరొకరి ఆస్తిని అన్యాయంగా పొందడానికి తను చేస్తున్న ప్రమాణంలో తాను అబద్ధం చెబుతున్నాడని తెలిసి కూడా అల్లాహ్ పై ప్రమాణం చేయవద్దని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హెచ్చరించారు. అలాంటి వ్యక్తి తీర్పుదినము నాడు అల్లాహ్ అతనిపై ఆగ్రహంగా ఉన్నస్థితిలో ఆయనను కలుస్తాడు. అల్-అష'త్ ఇబ్న్ కైస్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేసినారు: తనకు (అంటే అల్-అష'త్ కు) మరియు ఒక యూదు వ్యక్తి మధ్య ఒక భూమి యొక్క యాజమాన్యం విషయంలో తగాదా తలెత్తినపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాటలు పలికినారు. వారిద్దరూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు మధ్యవర్తిత్వం కొరకు వచ్చినారు. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్-అష్' అస్ రదిఅల్లాహు అన్హు తో ఇలా అన్నారు: “నీ వాదనకు మద్దతుగా, భూమి యొక్క యాజమాన్యం నీదే అనడానికి నీవు ఆధారాలు అందించాలి. నీవు అలా చేయలేక పోతే, నీవు ఏ వ్యక్తి పైనైతే నింద మోపుతున్నావో ఆ వ్యక్తి చేత భూమి తనదే అని ప్రమాణం చేయించడం తప్ప మరో మార్గం లేదు”. దానికి అల్ అష్’అస్ రదిఅల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం)! అప్పుడు ఆ యూదుడు ఎటువంటి సంకోచం లేకుండా ప్రమాణం చేసి నా సంపదను స్వాధీనం చేసుకుంటాడు.” అప్పుడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దీనిని నిర్ధారిస్తూ ఖుర్’ఆన్ లో ఈ ఆయతును అవతరింపజేసినాడు. అల్లాహ్ ఇలా అన్నాడు: “నిశ్చయంగా, ఎవరైతే తాము అల్లాహ్ తో చేసిన ఒప్పందాన్ని మరియు తమ ప్రమాణాలను స్వల్పలాభాలకు అమ్ముకుంటారో (లేదా వాటిని మార్చేస్తారో), (ఇక్కడ అల్లాహ్ మోమినులకు తమ ప్రమాణాలను, ఒప్పందాలను నెరవేర్చమని హితబోధ చేస్తున్నాడు) (ఎవరైతే స్వల్పలాభాలకు అమ్ముకుంటారో, లేక మార్చివేస్తారో, మరియు పెంటకుప్ప లాంటి ప్రపంచపు స్వల్పలాభాలకు అల్లాహ్ పేరున అబధ్ధపు ప్రమాణాలు చేస్తారో) అలాంటి వారికి పరలోక జీవితంలో ఎలాంటి భాగం ఉండదు (మరియు ఎటువంటి వాటా ఉండదు) మరియు పునరుత్థాన దినమున అల్లాహ్ వారితో (వారిని సంతోషపరిచే, లేక వారికి ప్రయోజనం చేకూర్చే ఒక్క మాట కూడా) మాట్లాడడు (పైగా వారి పట్ల ఆగ్రహంతో ఉంటాడు) మరియు వారివైపు (దయతో కూడిన మరియు కరుణాపూరితమైన ఒక్క చూపు) కూడా చూడడు మరియు వారిని పరిశుద్ధులుగాచేయడు (వారిని పరిశుద్ధులుగా చేయుటకు ఒక్క మంచి మాట కూడా పలుకడు, వారిని పాపములనుండి, మాలిన్యములనుండి పరిశుద్ధులను చేయుటకు క్షమాభిక్ష కూడా ప్రసాదించడు) మరియు వారికి (వారు చేసిన దానికి గానూ అత్యంత దుఃఖకరమైన శిక్ష) బాధాకరమైన శిక్ష ఉంటుంది.
రాఫిఅ్ బిన్ ఖదీజ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: ఒకసారి ధుల్ హులైఫహ్ వద్ద మేమందరమూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో ఉన్నాము. కరువు స్థితి కారణంగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అయితే (అప్పటికే యుధ్ధసంపదలో భాగంగా) ఒంటెలను, గొర్రెలను స్వాధీనం చేసుకుని ఉన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారందరి వెనుక (దూరంగా) ఉన్నారు. వారు తొందరతొందరగా పశువుల నుండి కొన్నిటిని జిబహ్ చేసి (వధించి), వంట పాత్రలలో వాటి మాంసాన్ని ఉంచి వండడం మొదలుపెట్టారు. (వారందరి వెనుక ఉన్న) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చి ఆ పాత్రలను బోర్లా చేసి వాటిలో (ఉడుకుతూ) ఉన్న మాంసాన్ని పారవేయమని ఆదేశించినారు. తరువాత యుధ్ధసంపదగా తమ ఆధీనం లో ఉన్న పశువులను అందరికీ పంచివేసినారు; పది గొర్రెలను ఒక ఒంటెకు సమానంగా పంచినారు. వాటిలో ఒక ఒంటె పారిపోయింది. జనులు దానిని పట్టుకోవడానికి, అలిసిపోయేదాకా దాని వెంట పరుగెత్తినారు. ఆ సమయం లో వారి దగ్గర కొన్ని గుర్రాలు ఉన్నాయి. వారిలో ఒకరు బాణాన్ని ఎక్కుపెట్టి ఆ ఒంటెపైకి వదిలినాడు. ఆ బాణంతో అల్లాహ్ ఆ ఒంటెను ఆగిపోయేలా చేసినాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “నిశ్చయంగా,ఈ జంతువులలో కొన్ని సహజంగానే అడవి జంతువుల మాదిరి స్వభావాన్ని కలిగి ఉంటాయి, కనుక వాటిలో ఒకదానిపై మీరు నియంత్రణ కోల్పోతే, ఈ విధంగా చేయండి (దానిని నియంత్రణలోనికి తెచ్చుకొండి)" అతడు, అంటే రాఫిఅ్ బిన్ ఖదీజ్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “రేపు మనం శత్రువును ఎదుర్కొనవచ్చు అని సందేహంగానూ, భయంగానూ ఉన్నది, (యుధ్ధం కారణంగా) మా దగ్గర కత్తులు ఉండకపోవచ్చు. అపుడు మరి మేము ‘అల్ ఖసబ్’ తో (ఒక రకమైన రెల్లు బెత్తము, వెదురు బొంగు లాంటిది, దాని ఒక చివర పదునుగా చెక్కి పనిముట్టుగా, ఆయుధంగా ఉపయోగిస్తారు) జంతువును ‘జిబహ్’ చేయవచ్చునా?” దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “జంతువు శరీరం నుండి రక్తం పూర్తిగా ప్రవహించేలా చేసే ఏ ఉపకరణాన్నైనా ఉపయోగించండి, వాటిని జిబహ్ చేయునపుడు (వధించునపుడు) అల్లాహ్ నామం ఉచ్ఛరించబడితే వాటిని తినండి. అయితే దంతాలతో లేదా గోళ్లతో ‘జిబహ్’ చేయవద్దు (వధించవద్దు); ఎందుకో నేను మీకు చెప్తాను: ఎందుకంటే దంతాలు ఎముకలు కనుక; మరియు గోళ్లు ఇథియోపియన్లు ఉపయోగించే సాధనాలు కనుక.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారురాఫిఅ్ బిన్ ఖదీజ్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేస్తున్నారు: దుల్-హులైఫాలో వారందరూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో ఉన్నారు. అపుడువారు కరువుబారిన పడ్డారు. వారు (అప్పటికే గెలిచిన యొధ్ధములో) బహుదైవారాధకుల నుండి ఒంటెలను మరియు గొర్రెలను యుధ్ధసంపద రూపములో స్వాధీనం చేసుకున్నారు. ఆ యుధ్ధ సంపదను విభజించడానికి ముందే తొందరపడి, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అడగకుండానే, వాటిలో కొన్నింటిని వధించి, వంట పాత్రలను ఏర్పాటు చేసారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహబాల సమూహానికి వెనుక నడుస్తూ వస్తున్నారు. ఎపుడైతె వారికి ఈ విషయం తెలిసిందో, వారు ఆ వంట పాత్రలను బోర్లించేసి అందులోని మాంసాన్ని పారవేయమని ఆదేశించినారు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆ యుధ్ధసంపదను, పది గొర్రెలను ఒక ఒంటెకు సమానంగా, అందరిలో విభజించినారు. వాటిలో ఒక ఒంటె పారిపోయింది. వారు దానిని పట్టుకోలేకపోయారు. వారి వద్ద కొన్ని గుర్రాలే ఉన్నాయి. వారిలో ఒకరు ఒక బాణాన్ని ఎక్కుపెట్టి ఒంటెపైకి వదిలాడు. ఆబాణముతో అల్లాహ్ దానిని ఆగిపోయేలా చేసినాడు. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: ఈ పెంపుడు జంతువులు అడవి మృగాల వంటి లక్షణాలనే కలిగిఉంటాయి. కనుక వీటిలో ఏదైనా మీ అదుపు తప్పితే, మీరు దానినిపట్టుకో లేకపోతే, వాటిని ఇలాగే అదుపులోనికి తెచ్చుకొండి. రాఫిఅ్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “రేపు మేము శత్రువును ఎదుర్కొనవచ్చు. యుధ్ధములో ఉపయోగించిన కారణంగా మా ఖడ్గాలు పదును కోల్పోతయేమోనని భయంగా కూడా ఉంది. మావద్ద కత్తులు కూడా లేవు. మరి అత్యవసరంగా జంతువులను (ఆహారం కొరకు) ‘జిబహ్’ చేయవలసి వస్తే (వధించవలసి వస్తే) మేము పదునైన కర్రతో జిబహ్ చేయవచ్చునా?” దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “(జంతువు శరీరం నుండి) పూర్తిగా రక్తం బయటకు పారేలా చేయగలిగే ఏ పరికరాన్నైనా ఉపయోగించండి; దంతములు మరియు గోళ్ళు తప్ప. అలాగే అల్లాహ్ నామం ఉచ్చరించబడి జిబహ్ చేయబడిన దానిని తినండి. అయితే దంతములు మరియు గోళ్ళు ఎందుకు ఉపయోగించరాదో నేను మీకు చెబుతాను; దంతములు ఎముకలు కనుక మరియు గోళ్ళు అబిస్సీనియా (ఇథియోపియా) బహుదైవారాధకుల సాధనాలు గనుక.”
అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకొను ప్రదేశములోనికి ప్రవేశించినప్పుడు, నేను మరియు ఒక సేవకుడు ఒక నీటితో నిండిన తోలుతిత్తిని, ఒక చేతికర్రను తీసుకుని వెళ్ళే వాళ్ళము, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆ నీటితో తనను తాను శుభ్రపరుచుకునేవారు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఅనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చు కోవడానికి బయటకు వెళ్ళినప్పుడు, తాను మరియు దాదాపు అదే వయస్సు గల ఒక సేవకుడు ఆయనను అనుసరించేవారు. వారు ఒక అంచున ఈటె వంటి పదునైన భాగం ఉన్న ఒక చేతికర్రను వెంట తీసుకువెళ్లేవారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని నేలలో పాతి, తన గోప్యత కొరకు దానిపై ఏదైనా వస్త్రం లాంటిది వ్రేళ్ళాడదీసేవారు, లేదా దానిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాను నమాజు ఆచరించునపుడు తన ముందు సుత్రాగా నేలలో పాతేవారు; అలాగే నీటితో నిండిన ఒక చిన్న తోలు తిత్తిని కూడా తీసుకువెళ్ళేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలకృత్యాలు తీర్చుకొనుట పూర్తి చేసినపుడు వారిలో ఒకరు ఆయనకు ఆ తోలుతిత్తిని అందజేసేవారు, మరియు ఆయన ఆ తోలుతిత్తిలోని నీటితో తనను తాను శుభ్రపరచుకునేవారు.
హుజైఫహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “(ఒకసారి) నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉన్నాను. (దారిలో) ఆయన ఒక తెగవారు తమ చెత్తాచెదారం వేసే స్థలం వద్దకు వచ్చారు. అక్కడ ఆయన నిలబడి మూత్ర విసర్జన చేసారు, నేను ఒక ప్రక్కకు వెళ్ళిపోయాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను దగ్గరికి రమ్మని పిలిచినారు. నేను ఆయన మడమల వెనుక భాగాన నిలబడేటంత దగ్గరగా వెళ్ళాను. తరువాత ఆయన వుజూ చేసి, తన కాళ్ళకు తొడిగుకుని ఉన్న మేజోళ్ళపై (సాక్సులపై) మసహ్ చేసినారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుహుజైఫహ్ ఇబ్నె అల్ యమాన్ రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖిస్తున్నారు – ఒకసారి తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నానని, వారు మూత్రవిసర్జన చేయాలని తలంచి, ఒక తెగ వారి పెరడు భూమిలోని ప్రవేశించినారు. అక్కడ ఆ తెగవారు తమ ఇళ్ళను ఊడ్చిన చెత్త, దుమ్ము ధూళి తదితర చెత్తా చెదారం పడవేస్తారు. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – సాధారణంగా ఎపుడూ కూర్చుని మూత్రవిసర్జన చేసే వారు అయినప్పటికీ – నిలబడి మూత్రవిసర్జన చేసినారని ఉల్లేఖించినారు. హుజైఫహ్ రజియల్లాహు అన్హు ఆయన నుండి దూరంగా జరిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనతో: “దగ్గరికి రా” అన్నారు. అపుడు హుజైఫహ్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మడమల వెనుక, ఆ స్థితిలో ఆయన కబడకుండా ఒక తెరలాగ నిలబడినారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేసినారు. కాళ్ళు కడగవలసి వచ్చినపుడు ఆయన తన కాళ్ళకు తొడుగుకుని ఉన్న మేజోళ్ళపై (సాక్సులపై) మసహ్ చేసి సరిపెట్టినారు. అవి మడమలను కప్పి ఉంచేలా, పలుచని తోలు లేదా అటువంటి దానితో తయారు చేయబడి, కాళ్ళకు తొడుగుకునే మేజోళ్ళు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని తన కాళ్ళ నుండి తొలగించలేదు.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ఒకసారి అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు మదీనా వీధులలోని ఒక వీధిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కలవడం జరిగింది. అపుడు అబూ హురైరహ్ ‘జనాబహ్’ స్థితిలో (అపరిశుద్ద స్థితి: తప్పనిసరిగా తలస్నానం చేసి పరిశుద్ధ పరుచుకోవలసిన స్థితిలో) ఉన్నారు. ఆయన (అక్కడి నుండి మెల్లగా) జారుకుని స్నానం చేసి రావడానికి వెళ్ళిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతను లేకపోవడాన్ని గమనించి, తిరిగి వచ్చినప్పుడు ఇలా అన్నారు: “ఎక్కడికి వెళ్ళిపోయావు ఓ అబూ హురైరహ్?” దానికి ఆయన ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నేను అపరిశుద్ద స్థితిలో ఉండగా మీతో కలిసినాను. నేను గుస్ల్ చేసి (తలస్నానం చేసి) పరిశుద్ధుడిని కానంత వరకు, ఆ స్థితిలో మీ ప్రక్కన ఉండడం నాకు ఇష్టం లేకపోయింది”; అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “సుబ్’హానల్లాహ్! ఒక ముస్లిం ఎన్నటికీ అపరిశుద్ధుడు కాడు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హును మదీనాలోని ఒక వీధిలో కలవడం జరిగింది. అపుడు అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు జనాబహ్ స్థితిలో (అపరిశుద్ద స్థితిలో) ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఉన్న గౌరవం, పూజ్యభావం కారణంగా అపరిశుద్ద స్థితిలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో కూర్చోవడం, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో సంభాషించడం అతనికి ఇష్టం లేకపోయింది. ఆ స్థితిలో తాను అపవిత్రుడిగా ఉన్నాను అని అనుకున్నారు. దాని కారణంగా అతను రహస్యంగా అక్కడి నుండి వెళ్ళిపోయి, తలస్నానం చేసి, తిరిగి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కూర్చొన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని ఎక్కడికి వెళ్ళినావు అని అడిగినారు. అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు తన పరిస్థితి గురించి వివరిస్తూ, జనాబహ్ కారణంగా తాను అపవిత్రంగా ఉన్నందున ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో కూర్చోవడం తనకు ఇష్టం లేకపోయినది అని చెప్పారు. ఆ మాటకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆశ్చర్యపోయి ఇలా అన్నారు: “నిశ్చయంగా విశ్వాసి పవిత్రుడు మరియు ఎట్టి పరిస్థితిలోనూ అపవిత్రుడు కాడు, అతడు జీవించి ఉన్నా లేదా చనిపోయినా కూడా”.
అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: "మృతదేహాన్ని (అంత్యక్రియల కొరకు) త్వరగా తీసుకెళ్లండి ఎందుకంటే అది ధర్మపరునిదైతే, మీరు దానిని శుభానికి పంపుతున్నారు; మరి అది దానికి భిన్నమైనది అయితే, మీరు మీ మెడలో నుండి ఒక చెడును, కీడును తొలగించుకుంటున్నారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అంత్యక్రియల సన్నాహాలు, ప్రార్థనలు (జనాజా నమాజు) మరియు ఖననం చేయడం వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎందుకంటే మృతదేహం ధర్మబధ్ధునిదైతే, సమాధిలో అత్యంత సంతోషకరమైన జీవితానికి మీరు అతడిని చేర్చి ఆశీర్వదించినవారవుతారు. అది (ఆ మృతదేహం) అందుకు భిన్నన్మైనది అయితే మీరు మీ మెడనుండి ఒక చెడును, కీడును తొలగించుకున్న వారవుతారు.
అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ఒక వ్యక్తి జుమా రోజున మస్జిదులోకి దారుల్ ఖదా వైపు ఉన్న ద్వారం నుండి ప్రవేశించాడు, అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం (మెంబరుపై) నిలబడి ఖుత్బహ్ (ఉపన్యాసం) ఇస్తున్నారు, అతను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వైపుకు తిరిగి నిలబడి, ఇలా అన్నాడు: ఓ రసూలుల్లాహ్! (కరువు వలన) సంపద నాశనమైంది మరియు దారులు మూసుకుపోయాయి, మాపై వర్షం కురిపించమని అల్లాహ్ తో దుఆ చేయండి, అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతులు పైకెత్తి, ఇలా దుఆ చేశారు: «అల్లాహుమ్మ అగిస్నా, అల్లాహుమ్మ అగిస్నా, అల్లాహుమ్మ అగిస్నా (ఓ అల్లాహ్! మాకు వర్షం పంపు, ఓ అల్లాహ్! మాకు వర్షం పంపు, ఓ అల్లాహ్! మాకు వర్షం పంపు)». అనస్ తెలిపారు: 'అల్లాహ్ సాక్షిగా! ఆ సమయంలో మేము ఆకాశంలో ఒక్క మేఘాన్ని కూడా, చిన్న మేఘపు తునకను కూడా చూడలేదు. మాకు మరియు సల్ (ఒక పర్వతం పేరు) మధ్య ఇల్లు లేదా నివాసం ఏదీ అడ్డుగా లేదు (ఆకాశం స్పష్టంగా ఉంది).' ఇంకా ఆయన ఇలా తెలిపారు: 'అప్పుడు ఆయన ﷺ వెనుక నుండి ఒక డాలు (shield) అంతటి మేఘం ఉద్భవించింది. అది ఆకాశం మధ్యలోకి రాగానే విస్తరించింది, ఆ తర్వాత వర్షం కురిసింది. అల్లాహ్ సాక్షిగా! మేము ఆరు రోజుల పాటు సూర్యుడిని చూడలేదు.' తరువాత, జుమా రోజున ఒక వ్యక్తి అదే ద్వారం గుండా ప్రవేశించాడు, అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ఖుత్బహ్ ఇస్తున్నారు. అతను ఆయన వైపుకు తిరిగి నిలబడి, ఇలా అన్నాడు: "ఓ రసూలుల్లాహ్! (వరదల వలన) సంపద నాశనమవుతోంది, మరియు మార్గాలు మూసుకుపోయాయి, అల్లాహ్ తో వర్షం శాంతించాలని దుఆ చేయండి". ఇంకా ఆయన తెలిపారు: అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతులను పైకి ఎత్తి, ఇలా దుఆ చేశారు: «అల్లాహుమ్మ హవాలైనా వలా అలైనా, అల్లాహుమ్మ అలల్ ఆకామి వజ్జీరాబి, వ బుతూనీల్ ఔదీయతి, వ మనాబితిష్షజరతి (ఓ అల్లాహ్! మా చుట్టూ కురిపించు, మాపై కాదు. ఓ అల్లాహ్! దానిని చిన్న కొండలపై, గుట్టలపై, లోయల అంతర్భాగాలపై, మరియు చెట్లు మొలిచే స్థలాలపై కురిపించు)». ఆయన తెలిపారు: అప్పుడు వర్షం నిలిచిపోయింది, మరియు మేము ఎండలో నడుచుకుంటూ బయటకు వచ్చాము. షరీక్ ఇలా తెలిపారు: నేను అనస్ బిన్ మాలిక్ ను అడిగాను: అతను మొదటి వ్యక్తేనా? దానికి ఆయన: «నాకు తెలియదు» అన్నారు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఒక పల్లెటూరి వ్యక్తి జుమా రోజున, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఇంటి వైపు ఉన్న మస్జిద్ పశ్చిమ ద్వారం నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ లోకి ప్రవేశించాడు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ఖుత్బహ్ ఇస్తున్నారు (ప్రసంగిస్తున్నారు). ఆ వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపు తిరిగి ఇలా అన్నాడు: "ఓ రసూలుల్లాహ్ ప్రవక్తా! పశువులు (ఆకలితో) నశించిపోయాయి, ప్రజలను రవాణా చేసే జంతువులు చనిపోవడం లేదా ఆకలితో బలహీనపడటం వల్ల మార్గాలు మూసుకుపోయాయి, కావున మాపై వర్షం కురిపించమని అల్లాహ్ ను ప్రార్థించండి". అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులను పైకి ఎత్తి, ఇలా ప్రార్థించారు: "ఓ అల్లాహ్! మాపై వర్షాన్ని కురిపించు, ఓ అల్లాహ్! మాపై వర్షాన్ని కురిపించు, ఓ అల్లాహ్! మాపై వర్షాన్ని కురిపించు." అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఇంకా ఇలా తెలిపినారు: అల్లాహ్ సాక్షి! అపుడు ఆకాశంలో ఒక్క మేఘం ముక్క కూడా లేదు, మరియు మస్జిద్ లో ఉన్న మాకు మరియు మస్జిద్ కు పశ్చిమాన ఉన్న సలయి కొండకు మధ్య, ఏ వైపు నుండి మేఘాలు వస్తాయో ఆ వైపున, మా దృష్టికి అడ్డువచ్చే ఏ ఇళ్ళు గానీ, కట్టడాలస గానీ లేవు. అనస్ రదియల్లాహు అన్హు తెలిపారు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వెనక నుండి ఒక డాలు వంటి గుండ్రని మేఘం పైకి వచ్చింది, అది మదీనా ఆకాశం మధ్యలోకి రాగానే వ్యాపించి, వర్షం కురిపించడం మొదలుపెట్టింది. అల్లాహ్ సాక్షి! మేము తరువాతి జుమా వరకు వర్షం కారణంగా సూర్యుడిని చూడలేదు, అప్పుడు ఒక వ్యక్తి అదే ద్వారం గుండా ప్రవేశించాడు. అపుడు కూడా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ఖుత్బహ్ ఇస్తున్నారు. అతను నిలబడి ఆయన వైపు తిరిగి, ఇలా అన్నాడు: ఓ రసూలుల్లాహ్! (భారీ వర్షం, వరదల వలన) సంపద నాశనమైంది, మార్గాలు మూసుకుపోయాయి, మాపై నుండి ఈ వర్షాన్ని ఆపమని అల్లాహ్ తో దుఆ చేయండి. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులు పైకెత్తి, ఇలా ప్రార్ధించారు: ఓ అల్లాహ్! మాపై కాకుండా మా చుట్టు ప్రక్కల వర్షాన్ని కురిపించు. ఓ అల్లాహ్! కొండలు, గుట్టలు, లోయలు మరియు చెట్లు మొలిచే చోట్లలో వర్షాన్ని కురిపించు. అనస్ ఇలా అన్నారు: అపుడు మబ్బులు విడిపోయాయింది, మేము ఎండలో నడుచుకుంటూ బయటకు వచ్చాము.
ఉమ్మె అతియ్యహ్ రదియల్లాహు అన్హా ఉల్లేఖన: “మమ్మల్ని (స్త్రీలను) జనాజాను అనుసరించకుండా (జనాజా వెంట వెళ్ళడం) నిషేధించారు, కానీ, దానిని కఠినంగా మాపై నిషేధించలేదు”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఉమ్ అతియా అల్-అన్సారియహ్ రదియల్లాహు అన్హా ఉల్లేఖన ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం స్త్రీలు జనాజా తీసుకు వెళుతున్న జమఆతును అనుసరించడాన్ని నిషేధించారు; కారణం మృత్యువు కారణంగా తమ వారిలోని ఒకరు దూరమై పోవడం అనే విషయాన్ని తేలికగా జీర్ణించు కోలేని వారి సున్నితత్వం, వారి పరిమితమైన ఓర్పు మొదలైనవి. ఆమె ఇంకా ఇలా అన్నారు: అయితే ఇతర నిషేధిత విషయాలలో కఠినంగా నొక్కి చెప్పినట్లుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయంలోని నిషేధాన్ని నొక్కి చెప్పలేదు.
విశ్వాసుల మాతృమూర్తి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యామణులలో ఒకరైన ఆయిషా రదియల్లాహు అన్హా తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చెప్పిన ఒక విషయాన్ని ఈ హదీథులో ఉల్లేఖిస్తున్నారు: “ఒక స్త్రీ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నా దగ్గరకు వచ్చి ఏమైనా దానం చేయమని అడిగింది. నా దగ్గర ఒక ఖర్జూరం తప్ప మరేమీ లేదని ఆమె గ్రహించింది, ఆ ఒక్క ఖర్జూరాన్నే నేను ఆమెకు ఇచ్చాను. ఆమె దానిని రెండు భాగాలు చేసి తన ఇద్దరు కూతుళ్లకు చెరొకటి ఇచ్చింది, (ఆ పిల్లలిద్దరు తిన్న తరువాత) ఆమె అక్కడి నుండి వెళ్లిపోయింది. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చినపుడు నేను వారికి ఈ విషయం గురించి తెలియజేసాను. అపుడు వారు ఇలా అన్నారు: “ఎవరైతే తన కూతుళ్లను జాగ్రత్తగా చూసుకుంటారో మరియు వారితో దయగా వ్యవహరిస్తారో, వారు అతనికి నరకాగ్ని నుండి రక్షణగా (తెరగా) ఉంటారు."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారువిశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా నివేదించినారు: ఒక స్త్రీ తన ఇద్దరు కుమార్తెలతో తన వద్దకు వచ్చి తినడానికి ఏదైనా దానం చేయమని అడిగింది. ఆయిషా రదియల్లాహు అన్హా దగ్గర ఒక్క ఖర్జూరం తప్ప మరేమీ లేదు, ఆమె ఆ ఒక్క ఖర్జూరాన్ని కూడా ఆమెకు ఇచ్చివేసినారు. ఆ స్త్రీ తన ఇద్దరు కుమార్తెలకు ఖర్జూరాన్ని పంచిపెట్టింది, ఆమె దాని నుండి ఏమీ తినలేదు. తరువాత ఆమె లేచి వెళ్ళిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లోపలికి ప్రవేశించారు మరియు ఆయిషా రదియల్లాహు అన్హా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు జరిగింది వివరించారు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వస్లలం ఇలా అన్నారు: తమ కుమార్తెల పట్ల బాధ్యత వహించి, వారిని జాగ్రత్తగా చూసుకుని, వారి పట్ల మంచిగా ప్రవర్తించేవాడు - వారికి విద్య నేర్పడం, తినిపించడం, తాగించడం, దుస్తులు ధరించడం మరియు ఇవన్నీ ఓపికగా భరించేవారు – అటువంటి వారికి ఆ పిల్లలు నరకాగ్ని నుండి రక్షణ కవచంగా మరియు నరకాగ్ని వారిని తాకకుండా ఒక అడ్డుతెరగా ఉంటారు.