





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ఉమైమహ్ బింతె రుఖైఖహ్ (రదియల్లాహు అన్హా) ఇలా ఉల్లేఖిస్తున్నారు: నేను మరియు కొందరు అన్సార్ స్త్రీలు ఒక బృందంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు విధేయత ప్రతిజ్ఞ చేయుటకు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినాము. మేము ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాము: “ఓ రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం)! మేము అల్లాహ్’కు దేనినీ సాటి కల్పించమని, దొంగతనానికి పాల్బడబోమని, వ్యభిచారానికి పాల్బడము అని, మా చేతులకు, కాళ్ళకు మధ్య కల్పించిన ఏ అబధ్ధాన్ని పలుకము అని మరియు ఏ మంచి విషయం లోనూ మేము మీకు అవిధేయత చూపము అని మీకు విధేయత ప్రకటిస్తున్నాము”; అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “(మీకు) సాధ్యపడినంత వరకు మరియు భరించగలిగినంత వరకు” అన్నారు. ఉమైమహ్ బింతె రుఖైఖహ్ (రదియల్లాహు అన్హా) ఇంకా ఇలా అన్నారు “మేము ఇలా అన్నాము: “అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మాపై (స్త్రీలపై) ఎక్కువ కరుణామయులు; రండి ఓ రసూలుల్లాహ్ మిమ్మల్ని మీ చేతిపై ప్రమాణం చేయనివ్వండి”. కానీ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “నేను మహిళలతో కరచాలనం చేయను. వంద మంది మహిళలకు చెప్పిన నా మాటలు ఒక మహిళకు చెప్పిన నా మాటలకు సమానం, లేదా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “ఒక మహిళకు చెప్పిన నా మాటలు.."
అత్తిర్మిదీ, అన్నసాయీ మరియు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:ఈ హదీథులో ఉమైమహ్ బింతె రుఖైఖహ్ (రదియల్లాహు అన్హా) ఇలా వివరించినారు: ఆమె కొందరు అన్సారు స్త్రీలతో కలిసి విధేయతా ప్రమాణం చేయడానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చినారు. తాము అల్లాహ్’కు ఎవరినీ సాటి కల్పించము అని, దొంగతనానికి పాల్బడము అని, వ్యభిచారానికి పాల్బడము అని, తమ చేతులకు, కాళ్ళకు మధ్య కల్పించిన ఏ అబధ్ధాన్ని పలుకము అని, అలాగే మరియు ఏ మంచి విషయం లోనూ తాము ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు అవిధేయత చూపము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతిపై ప్రతిజ్ఞ చేయాలని. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “మీకు సాధ్యపడినంత వరకు మరియు మీరు భరించగలిగినంత వరకు” (ఆమె ఇలా అన్నారు) “దానికి మేము ఇలా అన్నాము: అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మా పట్ల (స్త్రీల పట్ల) అత్యంత దయామయులు. రండి ఓ ప్రవక్తా! ఏవిధంగానైతే మగవారు మీ చేతిపై చేయి వేసి ప్రతిజ్ఞ చేసినారో అలా మిమ్మల్ని కూడా ప్రతిజ్ఞ చేయనివ్వండి.” అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “నేను స్త్రీలతో కరచాలనం చేయను. నామాటలు మరియు విధేయతా ప్రతిజ్ఞలు వందమంది స్త్రీలకు చేసినా ఒక స్త్రీకి చేసినా సమానమే.
ఉమ్మ అతియ్యహ్ రదియల్లాహు అన్హా ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ యొక్క కుమార్తెలలో ఒకరు మరణించారు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ బయటకు వచ్చి (అక్కడి స్త్రీల వద్దకు వచ్చి) ఇలా అన్నారు: «మీరు ఆమెను మూడు సార్లు లేక ఐదు సార్లు లేదా అవసరమైతే అంతకంటే ఎక్కువసార్లు నీటితో మరియు సిద్ర్ తో (రేగిపండు ఆకులతో చేసిన మిశ్రమం) బాగా కడగండి. చివరిసారి కడిగేటప్పుడు కాఫూర్ లేదా కాఫూర్ లో నుండి కొంతభాగాన్ని ఉపయోగించండి’ మీరు ముగించిన తరువాత నాకు తెలియజేయండి», మేము ముగించిన తరువాత ఆయనకు తెలిపినాము, అపుడు ఆయన తన వస్త్రాన్ని మాకు ఇచ్చి, దాన్ని ఆమె శరీరానికి చుట్టమని చెప్పారు. మరియు ఆమె ఇంకా ఇలా అన్నారు, 'మేము ఆమె తలవెంట్రుకలను మూడు జడలుగా చేశాము'.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ కూతురు జైనబ్ రదియల్లాహు అన్హా మరణించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఆమెకు గుసుల్ చేయించే స్త్రీల వద్దకు వచ్చి ఇలా చెప్పారు: "ఆమెకు నీటితో’ రేగుఆకులతో బేసి సంఖ్యలో మూడు సార్లు, లేదా ఐదు సార్లు, లేదా అవసరమైతే అంతకంటే ఎక్కువ సార్లు గుసుల్ చేయించండి. చివరి గుసుల్ లో కొంచం కాఫూర్ ను ఉపయోగించండి. మీరు ముగించిన తరువాత నాకు తెలియజేయండి. ఆమెకు గుసుల్ చేయించడం పూర్తి చేసిన తర్వాత, వారు ఆయనకు తెలుపగా, ఆయన గుసుల్ చేయించిన మహిళలకు తన ఇజార్ ను ఇచ్చి, ఇలా అన్నారు: ‘ఆమెను దీనిలో చుట్టండి, దీనినే ఆమె శరీరానికి తగిలి ఉండే వస్త్రంగా చేయండి’. ఆ తర్వాత, ఆమె జుట్టును మూడు జడలుగా అల్లారు.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్సారీలలో ఒక స్త్రీని ఇలా ప్రశ్నించారు; ఇబ్న్ అబ్బాస్ ఆ స్త్రీ పేరు ఏమిటో చెప్పారు, కానీ నేను మర్చిపోయాను; “మాతో పాటు హజ్ చేయుట నుండి నిన్ను ఏ విషయం నిరోధించినది?” ఆమె ఇలా అన్నది “మా వద్ద ఒంటెలు రెండు తప్ప (ఎక్కువ) మరొకటి లేదు. ఒక ఒంటెపై నా భర్త మరియు ఆయన కుమారుడు హజ్జ్ చేయుటకు వెళ్ళారు, ఒక ఒంటెను వదిలి వెళ్ళారు, దానిపై నీళ్ళు తెచ్చుకొనుటకు గాను”, అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెతో “రమజాన్ మాసం వచ్చినపుడు ఉమ్రా చేయి. ఎందుకంటే ఆ మాసములో చేయు ఉమ్రా (పుణ్యఫలములో) హజ్జ్ తో సమానము” అన్నారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు‘హజ్జతుల్ విదా’ (వీడ్కోలు హజ్జ్) నుండి తిరిగి వచ్చిన తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం; హజ్జ్ చేయని ఒక అన్సారీ స్త్రీని ఇలా అడిగారు: “మాతో పాటు హజ్జ్ చేయుట నుండి నిన్ను ఏ విషయం నిరోధించినది?” ఆమె క్షమించమని కోరి తమ వద్ద రెండు ఒంటెలు మాత్రమే ఉన్నాయని, తన భర్త మరియు ఆయన కుమారుడు ఆ రెంటిలో ఒకదానిపై హజ్జ్ చేసారు. మరొక దానిని బావి నుండి నీళ్ళు తోడడానికి వదిలి వెళ్ళారు అని చెప్పింది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – రమజాన్ మాసములో ఉమ్రా చేయుట పుణ్యఫలములో హజ్జ్ చేయుటకు సమానము అని ఆమెకు తెలియజేసారు.
విశ్వాసుల మాతృమూర్తి (ఉమ్ముల్ ము’మినీన్) ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! మేము జిహాద్ ను అత్యుత్తమ ఆచరణగా భావిస్తాము. మరి మేము జిహాద్ చేయవద్దా (జిహాద్ లో పాల్గొనవద్దా?), దానికి ఆయన ఇలా అన్నారు “లేదు, మీ కొరకు (స్త్రీల కొరకు) అత్యుత్తమమైన జిహాద్ ఏమిటంటే (అల్లాహ్ చే) స్వీకరించబడిన హజ్జ్”.
అల్ బుఖారీ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులు రజియల్లాహు అన్’హుమ్, అల్లాహ్ మార్గములో జిహాద్ చేయుటను, శతృవులతో పోరాడుటను ఆచరణలలో అత్యుత్తమమైన ఆచరణగా భావించేవారు. అందుకని ఆయిషా రజియల్లాహు అన్హా “మరి మేము జిహాద్ చేయవద్దా?” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెను ఉత్తమమైన జిహాద్ వైపునకు మార్గదర్శకం చేశారు, అదే, ఖుర్’ఆన్ మరియు సున్నత్ ల యొక్క వెలుగులో పాప రహితము మరియు కాపట్య రహితము అయి, ఆమోద యోగ్యమైన హజ్జ్ (హజ్జ్ అల్ మబ్రూర్).
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “తీర్పు దినమున అల్లాహ్ మొదటి వారినుండి చివరి వారి వరకు (అందరినీ) సమీకరించినపుడు, ప్రతి ద్రోహికి ఒక జెండా ఎత్తబడుతుంది మరియు ఇలా చెప్పబడుతుంది: ఇది ఫలానా వ్యక్తి కుమారుడైన ఫలానా వాడు చేసిన ద్రోహం.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనకు ఇలా తెలియజేస్తునారు: సర్వోన్నతుడైన అల్లాహ్ మొదటి మరియు చివరి వారిని పునరుత్థాన దినమున (వారి ఆచరణల) లెక్కాపత్రము కొరకు సమీకరించినప్పుడు, వారు అల్లాహ్’తో లేదా ప్రజలతో తాను చేసుకున్న ఒడంబడికను, నిబంధనలను నెరవేర్చడంలో విఫలమైన ప్రతి ద్రోహికి, తన ద్రోహాన్ని బహిర్గతం చేసే ఒక సూచనను ఏర్పాటు చేస్తాడు. ఆ రోజున, అతను ఇలా పిలువబడతాడు: ‘ఇది ఫలానా వ్యక్తి కుమారుడైన, ఫలానా వ్యక్తి చేసిన ద్రోహం’, అతడి దుష్ట పనులను, ద్రోహాన్ని సమావేశ స్థలంలోని ప్రజలకు వెల్లడించడానికి అల్లాహ్ ఇలా చేస్తాడు.
బరా ఇబ్నె ఆజిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మాకు ఏడు పనులు చేయమని ఆదేశించినారు, అలాగే ఏడు పనులు చేయవద్దని నిషేధించినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మమ్ములను - రోగిని పరామర్శించాలి అని; మరణించినవారి శవయాత్రలో పాల్గొనాలి అని; తుమ్మినవాడు "అల్హమ్దులిల్లాహ్" అన్నప్పుడు "యర్హముకల్లాహ్" అని చెప్పాలి అని; చేసిన ప్రమాణాన్ని నెరవేర్చాలి, అలాగే ఎవరైనా ప్రమాణం చేస్తే, అది నిజం అయ్యేలా సహాయం చేయాలి; అణచివేయబడిన వారికి మద్దతు ఇవ్వాలి, ఎవరైనా ఆహ్వానించినట్లైతే ప్రతిస్పందించాలి (స్వీకరించాలి); ‘సలాం’ను విస్తరింపజేయాలి అని ఆదేశించినారు. అలాగే మాకు ఈ విషయాలు నిషేధించినారు – పురుషులు బంగారు ఉంగరాలు ధరించరాదని; వెండి పాత్రలలో త్రాగరాదని; ‘అల్-మయాథీర్’; ‘ఖస్సీ’; ‘అల్-ఇస్తబ్రక్’ మరియు ‘అల్-దిబాజ్’ లను ఉపయోగించరాదు అని నిషేధించినారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముస్లింలకు ఏడు పనులు చేయాలని ఆజ్ఞాపించారు మరియు ఏడు పనులు చేయకూడదని నిషేధించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చేయమని ఆదేశించినవి: మొదటిది: రోగగ్రస్తులై ఉన్న వారిని పరామర్శించాలి; రెండవది: మృతుడిని ఖననం చేయడానికి తీసుకుని వెళుతున్నపుడు ఆ శవయాత్రను అనుసరించాలి; మృతుని అంత్యక్రియల నమాజులో (సలాతుల్ జనాజహ్ లో) పాల్గొనాలి, అతడి ఖనన ప్రక్రియలో పాల్గొనాలి మరియు మృతుని కొరకు దుఆ చేయాలి. మూడవది: తుమ్మి అల్లాహ్’ను ‘అల్’హందులిల్లాహ్’ అని స్తుతించే వ్యక్తి కోసం, ‘యర్హకుముల్లాహ్’ ("అల్లాహ్ నిన్ను కరుణించుగాక") అని ప్రార్థించడం. నాలుగవది: ప్రమాణం చేసిన వ్యక్తి ప్రమాణం నెరవేర్చడం మరియు అతనిని విశ్వసించడం; అంటే, ఎవరైనా ఏదైనా విషయం గురించి ప్రమాణం చేస్తే మరియు మీరు దానిని నిజం చేయగలిగితే, మీరు అలా చేయాలి, తద్వారా అతను తను ప్రమాణాన్ని నెరవేర్చలేక పోయినందుకు ఆచరించవలసిన ప్రాయశ్చిత్తం చేయవలసిన అవసరం లేదు. ఐదవది: అణచివేయబడిన వ్యక్తికి సహాయం చేయడం ద్వారా అతనికి మద్దతు ఇవ్వడం మరియు దౌర్జన్యపరుడైన వ్యక్తి అతనికి కలిగించే ఏదైనా హానిని మీ సామర్థ్యం మేరకు నిరోధించడం. ఆరవది: విందు భోజనపు ఆహ్వానాన్ని అంగీకరించడం, ఉదాహరణకు: వివాహ విందు, అఖీఖా (కొత్త శిశువు పుట్టిన తర్వాత జంతువును జిబహ్ చేసి ఇచ్చే విందు) లేదా ఇలాంటి ఇతర సందర్భాలలో భోజనానికి ఆహ్వానించినట్లైతే దానిని అంగీకరించడం. ఏడవది: ‘సలాం’ ను (శాంతి శుభాకాంక్షలను) వ్యాప్తి చేయడం, ‘సలాం’ చేయడం మరియు దానికి ప్రతిస్పందించడం. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) నిషేధించినవి: మొదటిది: బంగార ఉంగరాలు ధరించడం మరియు వాటితో మిమ్మల్ని మీరు అలంకరించుకోవడం. వెండి పాత్రలో లేదా వెండి పాత్ర నుంచి త్రాగడం. మూడవది: మయాథిర్ మీద కూర్చోవడం, అవి గుర్రపు జీనులపై మరియు ఒంటె జీనులపై పరచబడే దుప్పట్లు. ఇవి పట్టుతో తయారు చేయబడతాయి. (ఇవి విలాసవంతమైన జీను కుషన్లు, పట్టుతో తయారు చేయబడి, ఎంబ్రాయిడరీతో అలంకరించబడి, ఆనాటి సమాజంలో ఉన్నతవర్గాల ఆడంబరాన్ని సూచించేవిగా ఉండేవి) నాల్గవది: పట్టు కలిపిన నారతో చేసిన వస్త్రాన్ని ధరించడం, దీనిని "అల్’ఖస్సీ" అని పిలుస్తారు. ఐదవది: పురుషులు శుద్ధ పట్టు వస్త్రాలు (పూర్తిగా పట్టుతో తయారు చేసిన వస్త్రాలు) ధరించటం. ఆరవది: ‘ఇస్తబ్రక్’ను ధరించడం. ఇది మందపాటి పట్టుతో తయారు చేయబడే వస్త్రము. ఏడవది: ‘అల్-దిబాజ్’ ను ధరించడం. ఇది పట్టులో (సిల్క్ లో) అత్యుత్తమ మరియు అత్యంత విలువైన పట్టు రకం.
ఉమ్ముల్ ము’మినీన్ (విశ్వాసుల మాత) ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖనం: “అబూ సూఫ్యాన్ (రదియల్లాహు అన్హు) భార్య అయిన హింద్ బింత్ ఉత్బాహ్ (రదియల్లాహు అన్హా) రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ఇలా అన్నది: “ఓ రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం)! (నా భర్త) అబూ సూఫ్యాన్, నిశ్చయంగా ఒక పిసినారి. అతను నాకు మరియు నా పిల్లల ఖర్చులకు తగినంత జీవనోపాధి (పైకాన్ని) ఇవ్వడు, అతనికి తెలియకుండా నేను అతని ధనము నుండి తీసుకునేది తప్ప. అలా చేయడంలో నాపై ఏదైనా దోషం ఉందా?” దానికి రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “"అతని ధనము నుండి నీకు సరిపోయే మరియు మీ పిల్లలకు సముచితమైన రీతిలో సరిపోయేటంత తీసుకో."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుహింద్ బిన్తె ఉత్బా (రదియల్లాహు అన్హా) తన భర్త అబూ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హు) గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అడిగారు; ఆమె ప్రవక్త (స) కు అతని గురించి వివరించినారు - అతనొక పిసినారి అని, తన సంపదను ఎంతో ప్రేమిస్తాడని, తనకు, తన పిల్లల ఖర్చులకు తగినంత ధనం ఎప్పుడూ ఇచ్చేవాడు కాడని, అతనికి తెలియకుండా అతని ధనము లోనుండి కొంత తీసుకుంటే తప్ప తమ ఖర్చులు తీరేవి కావని. అలా చేయడంలో తనపై ఏమైనా పాపము ఉంటుందా అని. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా జవాబిచ్చారు, "అతని సంపద నుండి నీకు మరియు నీ పిల్లలకు సాధారణంగా సరిపోతుందని భావించే మొత్తాన్ని తీసుకోండి, అతనికి తెలియకుండానే కూడా."
సహ్ల్ ఇబ్నె సా’ద్ అస్’సాయిదీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “అల్లాహ్ మార్గంలో ఒక రోజు “రిబాత్” పాటించడం (అంటే, ముస్లింల సరిహద్దులను కాపాడటం) ఈ ప్రపంచం మరియు దానిలో ఉన్న ప్రతిదానికంటే శుభప్రదమైనది; , మరియు స్వర్గములో, మీలో ఎవరి వద్దనైనా ఉన్న చిన్న కొరడాతో ఆక్రమించ దగినంత చిన్న స్థలమైనా ఈ ప్రపంచం కంటే మరియు దాని ఉపరితలంపై ఉన్న దాని ప్రతిదాని కన్నా ఉత్తమమైనది; మరియు అల్లాహ్ యొక్క దాసుడు, ఒక ఉదయం లేదా ఒక సాయంత్రం అల్లాహ్ మార్గములో చేసే ప్రయాణం ఈ ప్రపంచం మరియు దాని ఉపరితలంపై ఉన్న ప్రతి దాని కంటే ఉత్తమమైనది.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: ముస్లింలకు మరియు అవిశ్వాసులకు మధ్య ఉన్న ప్రదేశంలో అల్లాహ్ కొరకు నిజాయితీగా ఒక రోజు ముస్లింలను వారి నుండి కాపాడటం ఈ ప్రపంచం మరియు దానిలో ఉన్న ప్రతిదానికంటే ఉత్తమమైనది; అలాగే అల్లాహ్ మార్గంలో పోరాడటానికి ఉపయోగించే కొరడా, స్వర్గం లో ఎంత స్థలమైతే ఆక్రమించగలదో, అది ఈ ప్రపంచం మరియు దానిలో ఉన్న ప్రతిదానికంటే ఉత్తమమైనది; మరియు దినము ప్రారంభం నుండి మధ్యాహ్నం ముందు వరకు లేదా మధ్యాహ్నం నుండి రాత్రి వరకు అల్లాహ్ మార్గంలో ఒక్కసారి నడిచినట్లైతే అందుకు లభించే ప్రతిఫలం మరియు బహుమానం ఈ ప్రపంచం మరియు దానిలోని ప్రతిదానికంటే ఉత్తమమైనది.
అనస్ ఇబ్న్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం రెండు నలుపు మరియు తెలుపు కొమ్ములతో కూడిన, గొర్రెలను బలిగా అర్పించారు, వీటిని ఆయన తన స్వంత చేతులతో ఖుర్బానీ చేసినారు. అపుడు, ఆయన ఇలా అన్నారు: "బిస్మిల్లాహ్, అల్లాహ్ అక్బర్!” మరియు వాటి మెడ మీద తన పాదాన్ని ఉంచినారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో అనస్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియ జేస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈద్ అల్-అద్’హా రోజున నలుపుతో కలిసిన తెల్లని కొమ్ములతో ఉన్న రెండు పోతు గొర్రెలను తన చేతితో జిబహ్ చేసినారు. ఆయన ‘బిస్మిల్లాహ్’ ‘అల్లాహు అక్బర్’ అని పలికి వాటి మెడపై తన పాదాన్ని ఉంచినారు.