





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్'ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “అల్లాహ్ వద్ద అన్నింటి కన్నా ఉత్తమమమైన ఆచరణ ఏది?” అని. ఆయన ఇలా అన్నారు: “(ప్రతి) నమాజును దాని నిర్ధారిత సమయంలో ఆచరించుట”; నేను “దాని తరువాత ఏది?” అని ప్రశ్నించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండుట” అన్నారు; నేను “దాని తరువాత ఏది?” అని ప్రశ్నించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ మార్గములో జిహాదు చేయుట (పోరాడుట, శ్రమించుట) అని జవాబిచ్చారు". ఇబ్న్ మస్'ఊద్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: "ఇవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు తెలిపిన విషయాలు. ఒకవేళ నేను ఇంకా ప్రశ్నించి ఉంటే ఇంకా చెప్పి ఉండేవారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించడం జరిగింది “అల్లాహ్ వద్ద అన్నింటికన్నా ఉత్తమమైన ఆచరణ ఏది?” అని. ఆయన “విధిగా ఆచరించవలసిన ప్రతి ఫర్ద్ నమాజును, షరియత్ ప్రదాత (అయిన అల్లాహ్) దాని కొరకు నిర్ధారించిన సమయములోనే ఆచరించుట” అన్నారు. దాని తరువాత తల్లిదండ్రుల పట్ల కరుణ కలిగి ఉండడం, వారి పట్ల విధేయత కలిగి ఉండడం, వారి హక్కులను నెరవేర్చడం, వారికి అవిధేయత చూపడం నుండి దూరంగా ఉండడం (అన్నారు); దాని తరువాత - తన సంపదతో, తన ప్రాణముతో అల్లాహ్ యొక్క వాక్కును ఉన్నతం చేయుట కొరకు, ఇస్లాం ధర్మాన్ని మరియు దాని ప్రజలను రక్షించడానికి, మరియు ఇస్లాం ధర్మపు ఆచారాలను రక్షించడానికి - అల్లాహ్ కొరకు జిహాదు చేయుట – అన్నారు. ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: "ఇవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు తెలిపిన విషయాలు. ఒకవేళ నేను “దాని తరువాత ఏది?” అని ప్రశ్నించి ఉంటే, ఆయన ఇంకా ఎక్కువ (విషయాలు) చెప్పి ఉండేవారు.”
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: అల్లాహ్ యొక్క దాసుడు నిద్ర లేచే దినములలో – ఇద్దరు దైవదూతలు అవతరించి, వారిలో ఒకరు “ఓ అల్లాహ్! (పిసినారితనం వహించకుండా) ఎవరైతే ఖర్చు పెడతాడో, అతడు ఖర్చు పెట్టిన దానికి బదులుగా అతనికి (ఇంకా) ప్రసాదించు” అని, మరొకరు “ఓ అల్లాహ్! ఎవరైతే కూడబెట్టుకుని ఉంచుకుంటాడో అతనికి వినాశం ప్రసాదించు” అని ప్రార్థించకుండా ఒక్క దినము కూడా గడవదు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "సూర్యుడు ఉదయించే ప్రతి దినము, ఇద్దరు దేవదూతలు దివి నుండి అవతరించి అల్లాహ్’ను ఇలా ప్రార్థిస్తారు: వారిలో ఒకరు ఇలా అంటాడు: “ఓ అల్లాహ్! ఎవరైతే విధేయతా చర్యలపై ఖర్చు చెస్తాడో, అంటే సత్కార్యాలు చేస్తూ ఉంటాడో, తన బంధువుల కొరకు, అతిథుల కొరకు, స్వచ్ఛంద కార్యాల కొరకు ఖర్చు పెట్టే వానికి, అతడు ఖర్చు పెట్టిన దాని కంటే మెరుగైన ప్రతిఫలాన్ని ప్రసాదించు మరియు వానిపై నీ అనుగ్రహాన్ని కురిపించు.” మరొక దైవదూత ఇలా అంటాడు: “ఓ అల్లాహ్! ఎవరైతే కూడబెట్టి (పిసినారితనంతో ఖర్చు చేయకుండా) ఉంచుకుంటాడో, వానికి వినాశనాన్ని ప్రసాదించు.”
సహ్ల్ బిన్ స’అద్ అస్సఅదీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఖైబర్ దినమున రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నేను రేపు ఈ జెండాను, ఎవరి చేతుల మీదుగా అల్లాహ్ విజయాన్ని ప్రసాదిస్తాడో, అతనికి ఇస్తాను. అతడు అల్లాహ్’ను మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తాడు; అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు అతడిని ప్రేమిస్తారు.” ఆయన (సహ్ల్ బిన్ సఅద్) ఇంకా ఇలా అన్నారు: “తమలో ఎవరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ జెండాను ఇవ్వబోతున్నారో” అని ప్రజలందరూ ఆ రాత్రంతా ఉత్సుకతతో అలాగే గడిపారు. ఉదయం అవుతూనే ప్రజలందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళారు, ప్రతి ఒక్కరూ ఆ జెండాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతికే ఇస్తారు అనే ఆశతో. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ఎక్కడ?” అని అడిగారు. దానికి వారు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ! ఆయన కంటిలో ఏదో సమస్యతో బాధపడుతున్నాడు” అన్నారు. దానికి ఆయన “అయితే అతడిని తీసుకుని రావడానికి ఎవరినైనా పంపండి” అన్నారు. అప్పుడు ఆయనను తీసుకువచ్చారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కళ్ళలో ఉమ్మివేసి ఆయన కోసం ప్రార్థించారు. దానితో ఆయన అంతకు ముందు అసలు ఎప్పుడూ నొప్పి లేదు అన్నట్లుగా కోలుకున్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు జెండాను ఇచ్చారు. అలీ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఓ రసూలల్లాహ్! వారు మనలాగా (విశ్వాసులుగా) మారేంతవరకు పోరాడాలా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “మీరు వారి ప్రాంగణానికి చేరుకునే వరకు స్థిరంగా వెళ్ళండి, ఆపై వారిని ఇస్లాంలోకి ఆహ్వానించండి మరియు అల్లాహ్ యొక్క హక్కులకు సంబంధించి వారిపై ఏ ఏ విషయాలు విధి చేయబడినాయో వారికి తెలియజేయండి. ఎందుకంటే అల్లాహ్ సాక్షిగా, మీ ద్వారా ఒక వ్యక్తిని కూడా అల్లాహ్ సన్మార్గానికి (ఇస్లాం వైపునకు) నడిపిస్తే, అది మీ కొరకు ఎర్రని ఒంటెల కన్నా మేలు” అన్నారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలకు (భవిష్యవాణిగా ముందుగానే) తెలియజేసినారు – మరునాటి ఉదయం తాను ఏ వ్యక్తి చేతికైతే, సైన్యము తన చిహ్నంగా చేసుకునే జెండాను ఇవ్వబోతున్నాడో, అతని చేతిపై ముస్లిములు ఖైబర్ యూదులపై విజయాన్ని పొందబోతున్నారు అని. ఆ వ్యక్తి యొక్క లక్షణాలలో ఉన్న విషయం ఏమిటంటే - అతడు అల్లాహ్’ను మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తాడు; అలాగే అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు అతన్ని ప్రేమిస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటలు విని సహాబాలు – ఎవరి చేతికి ఆ జెండా ఇవ్వబడుతుంది అనే విషయం పై మాట్లాడుకుంటూ, వాదులాడుకుంటూ – ఆ గొప్ప గౌరవం తమకే దక్కాలని కోరుకుంటూ – ఆ రాత్రి గడిపారు. ఉదయం అవుతూనే వారందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు, (ప్రతి ఒక్కరూ) ఆ గొప్ప గౌరవం తనకే దక్కాలని కోరుకుంటూ. వారిని చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ను గురించి అడిగారు. వారు: “ఆయన అనారోగ్యంగా ఉన్నారు, కంటి సమస్యతో బాధపడుతున్నారు” అని చెప్పారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలీ రజియల్లాహు అన్హు కోసం కొందరిని పంపారు; వారు ఆయనను తీసుకువచ్చారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన పవిత్ర లాలాజలాన్ని అలీ కళ్ళలో వేసి, ఆయన కోసం దుఆ చేసినారు. దానితో అలీ రజియల్లాహు అన్హు కు అసలేమీ నొప్పి లేనట్లుగా అయి, ఆ అనారోగ్యం నయమైంది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు జెండాను ఇచ్చారు; శత్రువుల కోటను చేరుకునే వరకు స్థిరంగా కొనసాగమని ఆదేశించారు, అలాగే ఇస్లాంలోకి ప్రవేశించే అవకాశాన్ని వారికి ఇవ్వమని ఆదేశించారు. ఒకవేళ వారు ఆయనకు సానుకూలంగా సమాధానం ఇస్తే, ఇస్లాంలో వారు ఏ ఏ విధులు నిర్వర్తించాలో చెప్పమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు సూచించారు. అప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ వైపునకు ఆహ్వానించడం యొక్క ఘనతను, గొప్పతనాన్ని అలీ రజియల్లాహు అన్హు కు వివరించారు. ఒక వ్యక్తిని ఇస్లాం వైపునకు మార్గదర్శకం చేయడానికి, మరియు అతడు ఇస్లాం స్వీకరించేందుకు, ఆ ఆహ్వానించిన వ్యక్తి కారణమైతే, అది అరబ్బుల యొక్క అత్యంత విలువైన సంపద అయిన ఎర్ర ఒంటెలను కలిగి ఉండటం మరియు వాటిని స్వంతం చేసుకోవడం లేదా దానం చేయడం కంటే కూడా అతనికి మంచిది.
జైద్ ఇబ్న్ ఖాలిద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఒక పోరాట యోధుడిని (ఆయుధాలు మొ. వాటితో) సన్నద్ధం చేస్తాడో, అతను నిజంగా ఆ పోరాటంలో పాల్గొన్నట్లే; మరియు ఆ యోధుడి గైరుహాజరీలో, అతనిపై ఆధారపడిన వారిని ఎవరు సరిగ్గా చూసుకుంటారో అతడు కూడా నిజంగా పోరాటంలో పాల్గొన్నట్లే.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: అల్లాహ్ మార్గంలో పోరాడే ఒక యోధుని కొరకు – ఎవరైతే ప్రయాణ సాధనాలు, ఆయుధాలు, వాహనం, ఆహారం, ఆహారపదార్థాలు, ఇంకా అతనికి అవసరమైన ఇతర వస్తువులతో సహా ఆ యోధుడిని సిద్ధపరుస్తాడో, అతడు కూడా యోధుడిగానే పరిగణించబడతాడు మరియు (తీర్పు దినమునాడు) అతడు ఒక యోధునికి లభించే పుణ్యఫలాన్ని పొందుతాడు. అలాగే ఎవరైతే యోధుని పరోక్షంలో అతని వ్యవహారాలను చక్కగా చూసుకుంటాడో మరియు అతను లేనప్పుడు అతని కుటుంబాన్ని చూసుకోవడంలో అతని స్థానంలో అతని ప్రతినిధిగా ఉంటాడో అతడు కూడా యోధునిగా పరిగణించబడతాడు.
యహ్యా ఇబ్న్ ఉమారహ్ అల్ మజీని రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “అమ్ర్ ఇబ్న్ అబీ హసన్, అబ్దుల్లాహ్ ఇబ్న్ జైద్ రజియల్లాహు అన్హు ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వుజూ విధానానం గురించి ప్రశ్నించడం నేను చూసాను. దానితో ఆయన ఒక చిన్న పాత్రలో నీళ్ళు తీసుకు రమ్మని ఒకరికి పురమాయించారు.దానితో ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన విధంగా వుజూ చేసినారు. (ముందుగా) ఆయన ఆ నీటి పాత్రను వొంపి చేతులపై నీళ్ళు పోసుకుని, రెండు చేతులను మూడు సార్లు కడిగినారు. తరువాత ఆ పాత్రలో చేయి పెట్టి చేతి నిండా నీళ్ళు తీసుకుని నోటిలో పుక్కిలించి, (ముక్కు లోనికి నీళ్ళు ఎక్కించి) ముక్కును చీది (నోటినీ, ముక్కునూ) మూడు సార్లు శుభ్రపరుచుకున్నారు. తరువాత ఆ పాత్రలో చేయి పెట్టి చేతి నిండా (మూడు సార్లు) నీళ్ళు తీసుకుని ముఖాన్ని మూడు సార్లు కడిగినారు; తరువాత నీటి పాత్రలో చేయి పెట్టి, నీటితో రెండు చేతులను మోచేతుల సమేతంగా రెండుసార్లు కడిగినారు; తరువాత నీటి పాత్రలో చేతులు పెట్టి (తడి చేతులతో) తలను ఒకసారి మసాహ్ చేసినారు (తడిమినారు) – చేతులను తల ముందు భాగము నుండి వెనుకకు తీసుకు వెళ్ళి, వెనుకనుండి ముందుకు తెచ్చినారు. తరువాత పాదాలను చీలమండలముల వరకు కడిగినారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులోఅబ్దుల్లాహ్ ఇబ్న్ జైద్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వుజూ విధానాన్ని వాస్తవ రూపములో (ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన విధంగా) చేసి వివరిస్తున్నారు. ఆయన ఒక చిన్న పాత్ర నిండా నీళ్ళు తీసుకురమ్మని అడిగారు. ముందుగా ఆయన తన రెండు చేతులను కడిగినారు – అందుకు ఆయన నీటి పాత్రను వొంచి నీటితో తన రెండు చేతులను మణికట్టు వరకు మూడు సార్లు, నీటి పాత్ర బయట, కడిగినారు. అపుడు ఆయన ఆ నీటి పాత్రలో చేయి పెట్టి మూడు సార్లు చేతి నిండా నీళ్ళు తీసుకుని (ఆ నీటితో) తన నోటిని పుక్కిలించి, ముక్కును చీది శుభ్రపరుచు కున్నారు. తరువాత ఆయన నీటి పాత్ర నుండి (అదే విధంగా మూడు సార్లు చేతి నిండా) నీళ్ళు తీసుకుని మూడు సార్లు తన ముఖాన్ని కడిగినారు. తరువాత ఆయన నీటి పాత్ర నుండి రెండు సార్లు చేతి నిండా నీళ్ళు తీసుకుని తన రెండు చేతులను మోచేతుల సమేతంగా కడిగినారు. తరువాత ఆయన రెండు చేతులను నీటి పాత్రలో పెట్టి, తడి అరచేతులతో తల మసాహ్ చేసినారు (తడిమినారు); ముందుగా ఆయన తన రెండు తడి అరచేతులను తల ముందు భాగము నుండి మొదలు పెట్టి తల వెనుక భాగాన మెడ వరకు తీసుకు వెళ్ళి, తరువాత అవే అరచేతులను అలాగే తల ముందు భాగానికి, ఎక్కడి నుండి మొదలు పెట్టినారో అక్కడికి, తీసుకు వచ్చినారు. అప్పుడు ఆయన రెండు పాదాలను చీలమండలాల వరకు కడిగినారు.
అమ్మార్ బిన్ యాసిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదో పని మీద నన్ను మరొక ప్రదేశానికి పంపినారు. అక్కడ నేను “జనాబత్” స్థితికి (గుసుల్ తప్పనిసరిగా ఆచరించవలసిన స్థితికి) లోనయ్యాను. అక్కడ నీళ్ళు దొరకలేదు. దానితో నేను మట్టిలో జంతువు పొర్లిన విధంగా పొర్లాను. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినపుడు నేను ఆయనకు జరిగిన విషయాన్ని చెప్పాను. అపుడు ఆయన ఇలా అన్నారు: “నీవు నీ రెండు చేతులతో ఇలా చేస్తే సరిపోయేది” అని ఆయన తన రెండు చేతులను భూమిపై ఒకసారి చరిచినారు, తరువాత తన ఎడమ చేతితో కుడి చేతి వెనుక భాగాన్ని, అలాగే కుడి చేతితో ఎడమ చేతి వెనుక భాగాన్ని, తరువాత ముఖాన్ని మసాహ్ చేసినారు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అమ్మార్ బిన్ యాసిర్ రజియల్లాహు అన్హు ను తనకు సంబంధించిన కొన్ని పనుల నిమిత్తం ఒక ప్రయాణంపై పంపినారు. అక్కడ ఆయన సంభోగములో పాల్గొనుట కారణంగానో, లేక వాంఛా పూర్వకంగా వీర్యమును బయటకు వచ్చేలా చేయుట కారణంగానో – జనాబత్ స్థితికి లోనయ్యారు. అయితే అక్కడ ఆయనకు గుసుల్ చేయడానికి నీళ్ళు లభించలేదు. జనాబత్ స్థితిలో (పెద్ద హదస్ స్థితిలో), నీళ్ళు లభించనపుడు ‘తయమ్ముమ్’ చేయుటను గురించిన ఆదేశము ఆయనకు తెలియదు. ఆయనకు కేవలం చిన్న హదస్ స్థితికి (వుజూ తప్పనిసరిగా చేయవలసిన స్థితి) సంబంధించిన ఆదేశం మాత్రమే తెలుసు. కనుక ఆయన, తన ఙ్ఞాన పరిధిలో, తనకు బాగా తెలిసి ఉన్న విషయాల ఆధారంగా బాగా ఆలోచించి – హదస్ అల్ అస్ఘర్ స్థితిలో ఉన్నపుడు (నమాజు సమయానికి) ఉదూ చేయడానికి (నీళ్ళు లభించకపోతే), నేల పైభాగాన ఉన్న మట్టితో లేక ధూళితో కొన్ని శరీర భాగాలపై మసహ్ చేయబడుతుంది; అదే విధంగా ‘జనాబత్’ స్థితి నుండి పరిశుద్థత పొందుట కొరకు పూర్తి మట్టి లేక ధూళి శరీరం మొత్తం లేపనం అయ్యేలా చేయాలి – ఇలా ఆయన నీటికి బదులుగా మట్టి లేదా ధూళిని ఉపయోగించడాన్ని పోల్చి చూసి, ఆయన తన శరీరం మొత్తం పై మట్టి లేపనం అయ్యేలా నేలపై పొర్లి, తరువాత నమాజు ఆచరించినాడు. తరువాత ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి నపుడు, తాను ఆచరించిన విధానం సరియైనదేనా అని తెలుసుకోవడానికి ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు జరిగిన విషయాన్ని వివరించాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – రెండు హదస్ స్థితుల నుండి, అంటే మలమూత్ర విసర్జన తరువాత, లేక అపాన వాయువు విడుదల అయినట్లయితే శరీరం లోనయ్యే ‘చిన్న హదస్’ స్థితి (హదసుల్ అస్ఘర్ స్థితి); అలాగే వీర్యము విడుదల అయిన కారణంగా శరీరం లోనయ్యే పెద్ద హదస్ స్థితి (హదసుల్ అక్బర్’ ); ఈ రెండు హదస్ స్థితుల నుండి మట్టిని వినియోగించి ఏవిధంగా పరిశుద్ధత పొందాలో – ఆయనకు వివరించారు. ముందుగా తన రెండు అర చేతులను నేల పైభాగాన ఉన్న మట్టి లేక ధూళిపై ఒకసారి చరిచినారు, తరువాత ఎడమ చేతితో కుడి అరచేయి అవతలి భాగాన్ని, కుడి చేతితో ఎడమ అరచేయి అవతలి భాగాన్ని, తరువాత ముఖాన్ని మసహ్ చేసినారు (తడిమినారు).
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతిపై ఇలా ప్రమాణం చేసాను – “లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదర్’రసూలుల్లాహ్” (అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశ హరుడు); నమాజు స్థాపిస్తాను; జకాతు చెల్లిస్తాను; (పాలకుని) మాట వింటాను మరియు అనుసరిస్తాను; తోటి ప్రతి ముస్లింకు నిజాయితీగా సలహా ఇస్తాను - అని”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు – ఖచ్చితంగా కట్టుబడి ఉండడానికి సంకల్పించుకుని 'ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతిపై ఇలా ప్రమాణం చేసినాను' అని తెలియజేస్తున్నారు – తౌహీదునకు (కేవలం అల్లాహ్ మాత్రమే ఏకైక నిజ ఆరాధ్యుడు అనే విశ్వాసానికి – ఏకదైవారాధనకు) కట్టుబడి ఉంటానని; ప్రతిరోజూ రాత్రింబవళ్ళలలో విధిగా ఆచరించవలసిన నమాజులను, వాటి షరతులను, వాటి మూలస్థంభముల వంటి విషయాలను, వాటికి చెందిన ఫర్జ్ (తప్పనిసరి) మరియు సున్నత్ విషయాలను పాటిస్తూ ఆచరించుటకు కట్టుబడి ఉంటానని; అల్లాహ్ చే ఆదేశించబడిన - ఒక ఆర్ధిక పరమైన ఆరాధన అయిన – జకాతును చెల్లించుటకు కట్టుబడి ఉంటానని (ఇది సంపన్నులనుండి సేకరించబడి, అర్హులైన పేదలకు మరియు అక్కర గలవారికి పంచిపెట్ట బడుతుంది); పాలకునికి విధేయత చూపుతానని, మరియు ప్రతి ముస్లిం పట్ల నిజాయితీగా ఉంటానని, నా మాటల ద్వారా మరియు నా చేతల ద్వారా అతనికి మంచి జరిగేలా చూస్తాను అని, అతడి నుండి చెడును, కీడును దూరం చేస్తాను అని ప్రమాణం చేసాను.
ముఆద్ ఇబ్న్ జబల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అతడి చేతిని పట్టుకుని ఇలా అన్నారు: “ఓ ము’ఆద్! అల్లాహ్ సాక్షిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను”. ఆయన ఇంకా ఇలా అన్నారు: “ఓ ముఆద్! నేను నీకు ఉపదేశిస్తున్నాను ప్రతి సలాహ్ (నమాజు) తరువాత (అల్లాహ్’ను స్మరించే) ఈ పదాలు పలుకుటలో ఎప్పుడూ విఫలం కావద్దు, “అల్లాహుమ్మ అ’ఇన్నీ అలా జిక్రిక, వ షుక్రిక, వ హుస్నీ ఇబాదతిక్” (ఓ అల్లాహ్! నిన్ను స్మరించుకొనుటకు నాకు సహాయం చేయి, మరియు నీకు కృతఙ్ఞతలు తెలుపుకొనుటకు నాకు సహాయం చేయి; మరియు నిన్ను అత్యుత్తమంగా ఆరాధించుటకు నాకు సహాయం చేయి)
అబూ దావూద్, అన్నసాయీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ము’ఆద్ (రదియల్లాహు అన్హు) చేతిని పట్టుకుని “అల్లాహ్ సాక్షిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఓ ముఆద్! నేను నీకు ఉపదేశిస్తున్నాను, ప్రతి సలాహ్ తరువాత ఈ పదాలు పలుకకుండా ఎప్పుడూ ఉండవద్దు: (అల్లాహుమ్మ అఇన్నీ అలా జిక్రిక) ఓ అల్లాహ్! నిన్ను స్మరించుకొనుటకు నాకు సహాయం చేయి – నీ విధేయతకు దగ్గర చేసే ప్రతి పనిలో, ప్రతి మాటలో (నాకు సహాయం చేయి) (వ షుక్రిక) నీకు కృతఙ్ఞతలు అర్పించుకొనుటకు నాకు సహాయం చేయి – శుభాలు పొందడం మరియు విపత్తులను త్రిప్పికొట్టడం ద్వారా (కృతఙ్ఞతలు అర్పించుకొనుటకు నాకు సహాయం చేయి), (వ హుస్ని ఇబాదతిక్) నిన్ను అత్యుత్తమంగా ఆరాధించుటకు నాకు సహాయం చేయి - అల్లాహ్ పట్ల చిత్తశుద్ధితో ఉండడం ద్వారా మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అనుసరించడం ద్వారా (ఉత్తమంగా ఆరాధించుటకు సహాయం చేయి).
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “అల్లాహ్ ఇలా పలికినాడు: ఆదము కుమారుని ఆచరణలన్నీ అతని కొరకే, ఒక్క ఉపవాసం తప్ప; అది నాకొరకు, మరియు దానికి నేనే ప్రతిఫలాన్ని ఇస్తాను. ఉపవాసము ఒక రక్షణ కవచం వంటిది. మీలో ఎవరైనా ఏరోజైనా ఉపవాసం ఉన్నట్లైతే, అతను అసభ్యకరంగా ప్రవర్తించరాదు మరియు పెద్ద గొంతుకతో మాట్లాడరాదు. ఒకవేళ ఎవరైనా అతనిని అవమానించినా, అతనితో వాదనకు లేక జగడానికి దిగినా అతడు "నేను ఉపవాసం ఉన్న వాడను" అని చెప్పాలి. ఎవరి చేతిలోనైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆత్మఉన్నదో, ఆయన సాక్షిగా, ఉపవాసం ఉన్న వ్యక్తి యొక్క నోటి వాసన కస్తూరి సుగంధం కంటే అల్లాహ్ వద్ద మరింత ఆహ్లాదకరమైనది. ఉపవాసం ఉన్న వ్యక్తికి రెండు ఆనందాలు ఉన్నాయి. అవి అతన్ని సంతోషపరుస్తాయి; అతడు తన ఉపవాసం విరమించినప్పుడు అతడు సంతోషిస్తాడు మరియు అతడు తన ప్రభువును కలుసుకున్నప్పుడు, అతను తన ఉపవాసం గురించి ఆనందిస్తాడు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుసర్వోన్నతుడైన అల్లాహ్ ఈ అల్’హదీథు అల్’ఖుద్సీలో ఇలా పలికినాడు అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేస్తున్నారు: ఆదము కుమారుని ప్రతి సత్కార్యమూ, దాని కంటే (పుణ్యఫలములో) పది రెట్ల నుండి ఏడు వందల రెట్లు పెంచబడుతుంది; ఉపవాసం తప్ప; ఎందుకంటే అది నా కోసమే, అక్కడ ప్రదర్శనా బుద్ధి ఉండదు, నేనే దానికి ప్రతిఫలమిస్తాను; కాబట్టి నేను మాత్రమే దాని బహుమతి యొక్క పరిధిని మరియు దాని పుణ్యఫలం ఎన్ని రెట్లు పెంచి ఇవ్వబడుతుందో ఎరిగిన వాడను. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: (ఉపవాసం ఒక రక్షణ కవచం) అది నరకాగ్ని నుండి రక్షణ మరియు కవచం మరియు బలమైన కోట వంటిది. ఎందుకంటే ఉపవాసం అంటే కోరికల నుండి, వాంఛల నుండి, పాపాల నుండి దూరంగా ఉండడం. మరియు నరకాగ్ని కోరికలు, వాంఛలు, పాపాల చేత చుట్టుముట్టబడి ఉంటుంది. (కనుక మీలో ఒకరు ఏ రోజైనా ఉపవాసం ఉన్నట్లైతే, అతను అశ్లీలతకు పాల్బడరాదు అంటే) లైంగిక సంపర్కంలో పాల్గొనరాదు, మరియు దానికి దారితీసే పనులకు పాల్బడరాదు లేదా అశ్లీల ప్రసంగం అస్సలు చేయరాదు. (మరియు అతడు పెద్ద గొంతుకతో మాట్లాడరాదు) – జగడాలలో మరియు వాదనలలో. (ఒకవేళ అతడిని ఎవరైనా అవమానించినా, లేక అతనితో జగడానికి దిగినా) రమదాన్ నెలలో అతడు “నేను ఉపవాసం ఉన్నవాడను” అనాలి; బహుశా అది అతడిని (జగడానికి దిగిన వాడిని) శాంత పరుచవచ్చు. (అప్పటికీ) ఒకవేళ అతడు వాస్తవముగా జగడానికి దిగితే, ఒక యోధునిలాగా అతడిని నెమ్మది నెమ్మదిగా దూరంగా తరిమివేయాలి. ‘ఎవరి చేతిలోనైతే తన ప్రాణాలున్నాయో ఆయన సాక్షిగా’ అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒట్టువేసుకుని మరీ ప్రమాణం చేసి చెప్పారు – ఉపవాసం కారణంగా మార్పునకు లోనయ్యే ఉపవాసి యొక్క నోటి వాసన - సాధారణంగా శుక్రవారపు నమాజు కొరకు, లేదా ధార్మిక సమావేశాలలో హాజరయ్యే సందర్భములో మీరు వాడే కస్తూరి సుగంధం కంటే, ప్రళయదినము నాడు అల్లాహ్’కు అత్యంత ప్రీతికరమైనది, మరియు పుణ్యఫలాన్ని అనేక రెట్లు అధికమైనది. ఉపవాసం ఉన్న వ్యక్తికి సంతోషం కలిగించే రెండు ఆనందాలు ఉంటాయి: అతను ఉపవాసం విరమించినప్పుడు; అతడు ఆకలి మరియు దాహం తొలగి పోయి ఉపవాసాన్ని విరమించడంలో సంతోషిస్తాడు. ఎందుకంటే (ఉపవాస సమయం పూర్తికాగానే) ఉపవాసాన్ని విరమించడం అతనికి అనుమతించబడింది. ఉపవాసము అనే ఆరాధన పూర్తి అయినందుకు, తన ప్రభువు తరఫు నుండి ఉపశమనం లభించినందుకు, మరియు భవిష్యత్తులో తాను ఉండబోయే ఉపవాసాలకు సహాయము కొరకు అతడు సంతోషపడతాడు. (మరియు అతడు (పునరుత్థాన దినమున) తన ప్రభువును) తాను పొందిన ప్రతిఫలముతో కలుసుకున్నపుడు అతడు తన ఉపవాసాల కొరకు సంతోషపడతాడు.