





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన: ఒక రాత్రి నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రక్క మీద లేకపోవడం గమనించాను; ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు అటూఇటూ తడిమాను. నా చేతికి వారి పాదాల అరికాళ్లు తగిలాయి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలో ఉన్నారు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పాదాలు నిటారుగా ఉన్నాయి మరియు వారు ఇలా దుఆ చేస్తూ ఉన్నారు: “అల్లాహుమ్మ అఊదు బిరిదాక మిన్ సఖతిక; వ బిముఆఫాతిక మిన్ ఉఖూబతిక; వ అఊదుబిక మిన్క; లా ఉహ్’సీ థనాఅన్ అలైక; అన్’త కమా అథ్’నైత అలా నఫ్’సిక” (ఓ అల్లాహ్! నీ అనుగ్రహము ద్వారా నీ ఆగ్రహము నుండి రక్షణ కోరుతున్నాను; నీ క్షమాభిక్ష ద్వారా నీ శిక్ష నుండి రక్షణ కోరుతున్నాను; మరియు నీ నుండి నీతోనే రక్షణ కోరుతున్నాను; (ఓ అల్లాహ్!) నీ ప్రశంసలను నేను లెక్కించలేను; (ఏ ప్రశంసా పదాలతో) నిన్ను నీవు ఏమని ప్రశంసించుకున్నావో, నీవు ఆవిధంగానే ఉన్నవాడవు.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా అన్నారు: “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రక్కన నిద్రిస్తున్నాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రక్కమీద లేకపోవడం గమనించాను; గదిలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చదివే స్థలాన్ని నేను చేతితో తడిమాను; నా చేతికి వారి రెండు అరికాళ్లు తగిలాయి, అవి నిటారుగా ఉన్నాయి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలో ఉన్నారు; ఆయన ఇలా వేడుకుంటూ ఉన్నారు (దుఆ చేస్తూ ఉన్నారు): (అఊదు – నేను రక్షణ కోరుతున్నాను): ఓ అల్లాహ్! నాపై లేక నా ఉమ్మత్’పై (బిరదాక మిన్ సఖతిక) నీ అనుగ్రహం ద్వారా, నీ ఆగ్రహం నుండి నీ ఆశ్రయం కొరకు నిన్ను ప్రార్థిస్తున్నాను, నీ రక్షణ కోరుతున్నాను, వేడుకుంటున్నాను; మరియు (బి ఆఫాతిక) - నీ మన్నింపు ద్వారా, అంతులేని నీ క్షమాగుణం ద్వారా నీ శిక్ష నుండి నీ రక్షణ కోరుతున్నాను. (వ అఊదుబిక మిన్’క - ఓ అల్లాహ్! నీ నుండి రక్షించుకొనుట కొరకై నిన్ను వేడుకుంటున్నాను) నీ సౌందర్య గుణలక్షణాల ద్వారా, నీ మహిమాన్విత గుణలక్షణాల ద్వారా నీ రక్షణ కోరుతున్నాను, ఎందుకంటే నీవు తప్ప నీ నుండి మరెవ్వరూ నాకు రక్షణ ఇవ్వలేరు, నన్ను రక్షించలేరు. అల్లాహ్ నుండి అల్లాహ్ రక్షణ, ఆయన ఆశ్రయం తప్ప మరేదీ రక్షించలేదు. (లా ఉహ్’సీ థనాఅన్ అలైక - అన్ని రకాల ప్రశంసలూ నీ కొరకే, నీ ప్రశంసలు లెక్కలేనన్ని, నేను నీ ప్రశంసలను లెక్కించలేను) ఆ సమర్థత లేని వాడను, ఆ సమర్థత లేని కారణంగా నేను ఎంత ప్రయత్నించినా నీ ఘనతకు తగిన విధంగా నేను నీ ప్రశంసలను, నీ ఘనతను, నీ కృపను, దయాదాక్షిణ్యాలను, నీ అనుగ్రహాన్ని లెక్కించలేను (అన్’త కమా అథ్’నైత అలా నఫ్’సిక - నిన్ను నీవు ఏమని ప్రశంసించుకున్నావో, నీవు ఆ విధంగానే ఉన్నవాడవు) ఓ అల్లాహ్! నీ స్తుతికి, ఘనతకు తగినట్టుగా నిన్ను నీవు స్తుతించుకున్నావు. నీ స్తుతికి తగినట్టుగా, నీ ఘనతకు తగినట్టుగా నీ ప్రశంసల హక్కును ఎవరు మాత్రం తీర్చగలరు?
షురైహ్ ఇబ్న్ హానీ ఉల్లేఖన: “నేను ఆయిషా (రదియల్లాహు అన్హా) ను ఇలా ప్రశ్నించాను “ఇంటిలోనికి ప్రవేశిస్తూనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా ఏమి చేసేవారు?” అని. దానికి ఆమె (ర) “వారు ముందుగా ‘సివాక్’ (పలుదోముపుల్ల) ఉపయోగించేవారు” అని సమాధానమిచ్చారు.”
ముస్లిం నమోదు చేసినారు:రాత్రిపూటగానీ, లేక పగటి పూట గానీ, (బయటి నుండి వస్తే) ఇంటిలోనికి ప్రవేశించినపుడు ముందుగా సివాక్ ఉపయోగించడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానము.
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు రాత్రంతా నిద్రపోయి పగటి దాకా లేవని ఒక వ్యక్తిని గురించి ప్రస్తావించడం జరిగింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అతని రెండు చెవులలో షైతాను మూత్రము పోసినాడు అనో లేక అతని చెవిలో షైతాను మూత్రము పోసినాడు అనో అన్నారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు రాత్రి నిద్రపోయి, ఫజ్ర్ నమాజు కొరకు లేవకుండా, సూర్యుడు ఉదయించి పట్టపగలు అయ్యే దాకా నిద్రలేవని ఒక వ్యక్తిని గురించి ప్రస్తావించడం జరిగింది. ఆయన (స) ఇలా అన్నారు: అతడు ఎటువంటి వాడంటే అతని చెవిలో షైతాను మూత్రము పోసినవాడు.
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: "మీలో ఎవరైనా రాత్రి నిద్రపోయినపుడు, అతడి తలవెనుక షైతాను మూడు ముళ్ళు వేసి, ప్రతి ముడిని తట్టుతూ ఇలా అంటాడు “ఇంకా చాలా రాత్రి ఉంది, పడుకో”. ఎపుడైతే అతడు నిద్ర నుండి లేచి అల్లాహ్ పేరును స్మరిస్తాడో ఒక ముడి విడి పోతుంది; ఎపుడైతే అతడు ఉదూ చేస్తాడో మరొక ముడి విడిపోతుంది; (ఉదూ చేసిన తరువాత) ఎపుడైతే అతడు నమాజును ఆచరిస్తాడో చివరి ముడి విడి పోతుంది. మరియు అతడు ఉదయం చురుకైన ఆత్మతో, ఉల్లాసంగా లేస్తాడు; లేకుంటే ఉదయం దౌర్భాగ్యపూరితంగా, నిరుత్సాహంగా, సొమరితనంతో లేస్తాడు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాత్రి (తహజ్జుద్) నమాజు కొరకు, లేదా ఫజ్ర్ నమాజు కొరకు లేవాలి అనుకునే వ్యక్తిపై షైతాను చేసే దాడి గురించి తెలియజేస్తున్నారు. ఒక విశ్వాసి నిద్రకు ఉపక్రమించినపుడు, షైతాను అతని మెడ భాగంలో మూడు ముడులు వేస్తాడు. మెడ భాగములో అంటే తలవెనుక భాగములో అని అర్థము షైతాను గుసగుసలకు ప్రతిస్పందించక, విశ్వాసి నిద్ర నుండి మేల్కొని అల్లాహ్’ను స్మరించుకుంటే ఒక ముడి తొలగి పోతుంది. అతడు ఉదూ చేసుకుంటే రెండవ ముడి తొలగిపోతుంది. అతను లేచి నమాజు ఆచరిస్తే చేస్తే, మూడవ ముడి విడిపోతుంది. షైతాను వేసిన ముడుల కారణంగా అతడిని ఆవరించి ఉన్న నిరుత్సాహము తొలగి పోవడంతో, అతను చురుకుగా మరియు మంచి మానసిక స్థితిలో ఉంటాడు, ఎందుకంటే అల్లాహ్ తనకు ప్రసాదించిన విధేయతతో అతను సంతోషంగా ఉన్నాడు గనుక, మరియు అల్లాహ్ అతనికి ప్రతిఫలం గురించి మరియు క్షమాపణ గురించి వాగ్దానం చేసిన దాని పట్ల ఆశాజనకంగా ఉన్నాడు గనుక.
మఅదాన్ ఇబ్నె అబీ తల్హహ్ అల్ యఅమరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేత బానిసత్వము నుండి విముక్తి పొందిన సౌబాన్ రజియల్లాహు అన్హు కలిసి ఇలా అడిగాను: “నాకు ఒక ఆచరణను గురించి తెలియ జేయండి, దేనిని నేను ఆచరించినట్లయితే దాని ద్వారా అల్లాహ్ నన్ను స్వర్గములోనికి ప్రవేశింపజేస్తాడో” లేక బహుశా నేను ఇలా అన్నాను: “”అల్లాహ్ అమితంగా ఇష్టపడే ఆచరణలు ఏమిటి?” ఆయన మౌనంగా ఉండిపోయాడు. నేను మళ్ళీ ప్రశ్నించాను, ఆయన మళ్ళీ మౌనంగా ఉండిపోయాడు, నేను మూడోసారి మళ్ళీ ప్రశ్నించాను. దానికి ఆయన ఇలా అన్నాడు: “నేను ఇదే విధంగా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించాను. దానికి ఆయన: “అల్లాహ్ కొరకు అధికంగా సజ్దాలు చేయి; ఎందుకంటే అల్లాహ్ కొరకు చేయబడిన ప్రతి సజ్దా అతని స్థానాన్ని ఉన్నతం చేస్తుంది మరియు అతని నుండి ఒక పాపాన్ని తొలగిస్తుంది తప్ప అది వ్యర్థం కాదు”. మఅదాన్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: “తరువాత నేను అబూ దర్దా రజియల్లాహు అన్హు ను కలిసాను. ఆయనను కూడా ప్రశ్నించాను. ఆయన కూడా సౌబాన్ రజియల్లాహు అన్హు పలికిన మాదిరిగానే పలికారు.”
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను స్వర్గములోనికి ప్రవేశించడానికి కారణమయ్యే ఆచరణలు ఏవి లేక అల్లాహ్’కు ఇష్టమైన ఆచరణలు ఏవి? అని ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించిన వ్యక్తికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చినారు: “(ఎక్కువ సలాహ్’లు (నమాజులు) ఆచరించడం ద్వారా) ఎక్కువ సజ్దాలు చేయడానికి కట్టుబడి ఉండు. ఎందుకంటే అల్లాహ్ కొరకు చేయబడిన ప్రతి సజ్దహ్ నీ స్థానాన్ని ఉన్నతం చేస్తుంది మరియు నీ నుండి ఒక పాపాన్ని తొలగిస్తుంది తప్ప అది వ్యర్థం కాదు.
ఉమ్ముల్ ము'మినీన్, విశ్వాసుల మాత అయిన ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి పదింటిలో (పది రాత్రులలో) మిగతా సమయాలన్నింటి కంటే కూడా (ఆరాధనలో) ఎక్కువగా శ్రమించేవారు.”
ముస్లిం నమోదు చేసినారు:రమదాన్ మాసంలోని చివరి పది రాత్రులు ప్రవేశిస్తూనే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆరాధన మరియు విధేయత యొక్క పనులలో, ఆచరణలలో ఎక్కువగా శ్రమ పడేవారు. ఆయన (స) చాలా ఎక్కువగా వివిధ రకాలైన మంచి పనులను, వివిధ రకాలైన దాతృత్వ చర్యలను చేసేవారు, రమదాన్ నెల చివరి పది రాత్రుల గొప్పతనం, మరియు ఘనత కారణంగా ఆయన (స) మిగతా ఇతర సమయాలలో ఆచరించిన దాని కంటే ఎక్కువగా ఆరాధనలను ఆచరించేవారు.
అబూ అబ్స్ అబ్దుర్రహ్మాన్ ఇబ్న్ జబ్ర్ (రదియల్లాహు అన్హు) రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అల్లాహ్ మార్గములో (శ్రమించుటలో) ఎవరి పాదములు దుమ్ము, ధూళితో కప్పబడబడతాయో, వాటిని నరకాగ్ని తాకదు.”
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్తను వినిపిస్తున్నారు – అల్లాహ్ మార్గములో శ్రమిస్తున్న కారణంగా ఎవరి పాదములైతే దుమ్ము, ధూళితో ఆవరించబడతాయో, అటువంటి వ్యక్తిని నరకాగ్ని తాకదు అని.
అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : ఒకసారి అబూ ఖతాదా (ర) తన వద్ద అప్పు తీసుకుని తనను తప్పించుకుని తిరుగుతున్న ఒక వ్యక్తిని వెతుకుతూ వెళ్ళి, చివరికి అతడిని కలిసినారు. అతడు: “నేను దివాళా తీసాను (మీ అప్పు తీర్చటానికి నా వద్ద ఏమీ లేదు) అన్నాడు. దానికి అబూ ఖతాదా “అల్లాహ్ సాక్షిగా చెప్పు, నీవు నిజంగా దివాలా తీసావా?” అని ప్రశ్నించారు. ఆ వ్యక్తి “అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను” అన్నాడు. అపుడు అబూ ఖతాదా (ర) అన్నారు “నిశ్చయంగా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఎవరైతే తీర్పు దినము యొక్క శిక్షల నుండి అల్లాహ్ చేత రక్షించబడుటను ఇష్టపడతాడో, అతడు తన వద్ద అప్పు తీసుకుని, (వాస్తవంగా) దానిని తీర్చలేక పోతున్న వ్యక్తికి మరింత సమయం ఇవ్వడం ద్వారా లేదా ఇచ్చిన అప్పు నుండి కొంత తగ్గించడం ద్వారా అతనికి ఉపశమనం కలిగించాలి.”
ముస్లిం నమోదు చేసినారు:అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) తన నుండి అప్పు తీసుకుని తప్పించుకుని తిరుగుతున్న ఒక వ్యక్తి కొరకు వెతక సాగినారు. చివరికి అతడిని కలిసినారు. అప్పు తీసుకున్న ఆ వ్యక్తి ఇలా అన్నాడు: “నేను దివాలా తీసినాను, నా దగ్గర మీ అప్పు తీర్చడానికి డబ్బు లేదు.” అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) ఆ వ్యక్తిని ‘తన దగ్గర డబ్బు లేదు’ అని అల్లాహ్ పై ఒట్టు వేసి చెప్పమన్నారు. ఆ వ్యక్తి ‘తాను నిజం పలుకుతున్నాను’ అని అల్లాహ్ పై ఒట్టు వేసి చెప్పినాడు. అపుడు అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) ‘తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా విన్నాను అని ఇలా అన్నారు: పునరుత్థాన దినము యొక్క బాధలు, కష్టాలు మరియు భయానక స్థితి నుండి అల్లాహ్ తనను రక్షిస్తాడని ఎవరైతే సంతోషంగా, ఉల్లాసంగా ఉన్నారో; అతడు తన వద్ద అప్పు తీసుకుని తీర్చలేకపోతున్న వానికి మరింత గడువునివ్వడం ద్వారా, లేక ఇచ్చిన అప్పులో కొంత భాగాన్ని రద్దు చేయడం ద్వారా, లేక పూర్తిగా అప్పునే రద్దు చేయడం ద్వారా అతనికి ఉపశమనం కలిగించాలి.
అబూ మూసా అల్ అష్’అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూల్లల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే ‘బర్దైన్’ నమాజులను’ ఆచరిస్తారో వారు స్వర్గములోనికి ప్రవేశిస్తారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘బర్దైన్’ నమాజులను ఆచరించుటకు ఆశపడాలని, ఆసక్తి కలిగి ఉండాలని హితబోధ చేస్తున్నారు. ‘బర్దైన్’ నమాజులు అంటే ‘ఫజ్ర్’ మరియు ‘అస్ర్’ నమాజులు. ఎవరైతే ఆ నమాజులను వాటి హక్కును చెల్లిస్తూ, వాటి నిర్ధారిత సమయాలలో, మస్జిదులో జమా’అత్ తో పాటు ఆచరించడం మొదలైన విషయాలను పాటిస్తూ ఆచరిస్తాడో, అతనికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్తను ఇస్తున్నారు – ఆ నమాజులు అతడు స్వర్గములో ప్రవేశించడానికి ఒక కారణము కాగలవు.