





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "పాలు త్రాగడం (రదా'అ) వలన కూడా, జన్మ సంబంధం వల్ల నిషిద్ధమైన సంబంధాలు నిషిద్ధంగా మారతాయి."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు"ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు: పాలు తాగడం (రదా'అ) వల్ల, జన్మ సంబంధం మరియు వంశం వల్ల నిషిద్ధమైనవి, అంటే మేనమామ, పినతండ్రి, లేదా సోదరుడు వంటి వారితో నిషిద్ధమైనవన్నీ నిషిద్ధంగా మారతాయి. మరియు పాలు తాగడం వల్ల, జన్మ సంబంధం వల్ల ధర్మబద్ధమైన తీర్పులు ధర్మబద్ధంగా మారతాయి."
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “నా మిత్రుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు మూడు విషయాల గురించి హితబోధ చేసినారు. ప్రతి నెల మూడు దినములు ఉపవాసములు పాటించమని; రెండు రకాతులు సలాత్ అద్’దుహా ఆచరించమని; రాత్రి నిద్ర పోవడానికి ముందు విత్ర్ సలాహ్ ఆచరించమని.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేస్తున్నారు: తన ప్రాణమిత్రుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనకు మూడు విషయాల గురించి హితబోధ చేసినారని, మరియు వాటి పట్ల తనను కట్టడి చేసినారు. మొదటిది: ప్రతి నెల మూడు దినములు ఉపవాసములు పాటించుట, రెండవది: ప్రతి దినమూ రెండు రకాతులు ‘దుహా’ నమాజు ఆచరించుట, మూడవది: నిద్రించుటకు ముందు విత్ర్ నమాజు ఆచరించుట, ఇది రాత్రి మూడవ (చివరి) భాగములో లేవలేమేమో అని భయపడుతున్న వారి కొరకు.
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను: “దానిని (నెలవంకను) చూసిన తరువాత ఉపవాసాలు ప్రారంభించండి; మరియు (రమదాన్ మాసము చివర) దానిని చూసినపుడు ఉపవాసములు విరమించండి. మేఘావృతమై ఉండి, అది కనబడక పోతే, అపుడు దానిని గురించి అంచనా వేయండి (అంటే షఅబాన్ నెల ముఫ్ఫై దినములుగా పూర్తి చేయండి).
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రమదాన్ నెల ఆరంభాన్ని గురించి మరియు దాని ముగింపు గురించిన చిహ్నాలను ఈ విధంగా వివరిస్తున్నారు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంఇలా అన్నారు: “రమదాన్ మాసపు నెలవంకను చూసినపుడు ఉపవాసాలు ప్రారంభించండి, ఒకవేళ మీకూ మరియు నెలవంకకు మధ్య మబ్బులు అడ్డువచ్చి, అవి నెలవంకను కమ్మివేసి మీరు దానిని చూడలేకపోయినట్లైతే, షఅబాన్ మాసపు గడువును ముఫ్ఫై దినములుగా లెక్కించండి; మరియు షవ్వాల్ మాసపు నెలవంకను చూసినపుడు ఉపవాసములు విరమించండి; ఒకవేళ మీకూ మరియు నెలవంకకు మధ్య మబ్బులు అడ్డువచ్చి, అవి నెలవంకను కమ్మివేసి మీరు దానిని చూడలేకపోయినట్లైతే, రమదాన్ మాసపు గడువును ముఫ్ఫై దినములుగా లెక్కించండి.”
అబూ అల్ హవ్’రా అస్-స’దీ ఇలా పలికినారు: “హసన్ ఇబ్న్ అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హుమా) ను నేను ఇలా అడిగాను: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నీవు ఏమి కంఠస్థము చేసినావు?” దానికి ఆయన ఇలా బదులు పలికినారు: రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నేను దీనిని కంఠస్థము చేసినాను - “సందేహాస్పదమైన విషయాన్ని, సందేహాస్పదం కాని దాని కొరకు (స్పష్టంగా ఉన్న దాని కొరకు) వదిలి వేయి. నిశ్చయంగా సత్యసంధత ప్రశాంతతను కలిగిస్తుంది, అసత్యం అనుమానానికి దారి తీస్తుంది”
అత్తిర్మిదీ, అన్నసాయీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:సందేహాలకు, అనుమాలకు దారి తీసే ఏవైనా మాటలు కానీ, చేతలు కానీ ఉంటే, వాటిని వదిలి వేయాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించినారు; అవి నిషేధించబడిన విషయాలు అయినా, కాకపోయినా సరే, అవి అనుమతించబడిన విషయాలు అయినా లేదా నిషేధించబడిన విషయాలు అయినా సరే – వాటికి బదులుగా కేవలం వాటినే ఎంచుకొండి వేటిలోనైతే సందేహాలకు, అనుమాలకు తావు లేదో; వేటి గురించైతే అవి మంచివి అనీ, పరిశుద్ధమైనవి అనీ, చట్టసమ్మతమైనవి అనీ (షరియత్ ఆమోదించినవని) మీకు ఖచ్చితంగా తెలుసునో వాటిని మాత్రమే ఎంచుకోండి. ఎందుకంటే వాటిలో హృదయం శాంతి మరియు ప్రశాంతతను పొందుతుంది, కానీ సందేహాన్ని కలిగించే, అనుమానాలు రేకెత్తించే విషయాలు హృదయాన్ని ఆందోళనకు మరియు కలతకు గురి చేస్తాయి.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “జామాఅత్” తో కలిసి ఆచరించిన వాని సలాహ్ (నమాజు) యొక్క స్థాయి, తన ఇంటిలోనో లేక తన వ్యాపార స్థలము (దుకాణం మొ.) లోనో ఆచరించే వాని సలాహ్ కంటే ఇరవై కంటే ఎక్కువ రెట్లు ఉత్తమమైనది ఎందుకంటే అతడు సలాహ్ కొరకు ఉత్తమంగా ఉదూ చేస్తాడు, తరువాత అతడు మస్జిద్ కు బయలుదేరుతాడు; అతడిని సలాహ్ తప్ప మరింకే విషయమూ అలా చేయడానికి ప్రోత్సహించదు; సలాహ్ ఆచరించడం తప్ప అతడు మరింకేదీ కోరుకోడు; (అటువంటి స్థితిలో) అతడు మస్జిదులోనికి ప్రవేశించేంత వరకు అతడు వేసే ప్రతి అడుగు అతడి స్థాయిని ఉన్నతం చేస్తుంది; అతడి నుండి ఒక పాపాన్ని తొలగిస్తుంది; మరి మస్జిదులోనికి ప్రవేశించిన తరువాత కేవలం సలాహ్ మాత్రమే అతడు మస్జిదులో వేచి ఉండేలా చేసినట్లయితే, అతడు వేచి ఉన్న సమయమంతా అతడు సలాహ్ లోనే ఉన్నట్లుగా భావించబడుతుంది; అటువంటి వాని కొరకు, అతడు సలాహ్ ఆచరించిన స్థానములోనే కూర్చుని ఉన్నంత వరకు, దైవదూతలు అల్లాహ్’ను ప్రార్థిస్తూ ఉంటారు – నీవు అక్కడ ఇతరులకు కష్టం కలిగించే ఏ పనీ చేయనంత వరకు, లేదా నీ ఉదూ భంగం కానంత వరకు దైవదూతలు ఇలా ప్రార్థిస్తూ ఉంటారు “ఓ అల్లాహ్ అతడిని కరుణించు, ఓ అల్లాహ్ అతడిని క్షమించు, ఓ అల్లాహ్ అతడి పశ్చాత్తాపాన్ని అంగీకరించు”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఒక ముస్లిం జామాఅత్ తో పాటు సలాహ్ (నమాజు) ఆచరించినట్లయితే అది అతడు తాను ఇంటిలోనో లేక తన వ్యాపార స్థలము (దుకాణం) లోనో ఆచరించిన సలాహ్ కంటే ఇరవై కంటే ఎక్కువ రెట్లు ఉత్తమమైనది. తరువాత దాని కారణాన్ని ఇలా వివరిస్తున్నారు: అతడు సలాహ్ కొరకు ఉత్తమంగా మరియు పరిపూర్ణంగా ఉదూ ఆచరిస్తాడు; తరువాత అతడు మస్జిదుకు బయలుదేరుతాడు – కేవలం సలాహ్ ఆచరించే సంకల్పముతో బయలు దేరుతాడు; దానితో అతడు వేసే ప్రతి అడుగు అతడి స్థాయిని ఉన్నతం చేస్తుంది; ప్రతి అడుగు అతడి నుంచి ఒక పాపాన్ని తొలగిస్తుంది. తరువాత అతడు మస్జిదులోనికి ప్రవేశించి, కూర్చుని సలాహ్ కొరకు ఎదురుచూస్తూ వేచి ఉన్నట్లయితే, అతడు వేచి ఉన్న కాలమంతా అతడు సలాహ్ లోనే గడిపినంత పుణ్యాన్ని పొందుతాడు. అతడు, తాను సలాహ్ ఆచరించి కూర్చుని ఉన్న స్థలం లోనే గడిపినంత కాలం దైవదూతలు అతని కొరకు అల్లాహ్ ను ప్రార్థిస్తూ, ఇలా అంటారు: “ఓ అల్లాహ్! అతడిని క్షమించు (అతడి పాపాలను మన్నించు); ఓ అల్లాహ్! అతడిని కరుణించు; ఓ అల్లాహ్! అతడి పశ్చాత్తాపాన్ని అంగీకరించు”. ఇలా అతడు తన ఉదూను భంగపరచనంత వరకు, లేదా, ఇతరులకు లేదా దైవదూతలకు కష్టం కలిగించే ఏ పనీ చేయనంతవరకు ప్రార్థిస్తూ ఉంటారు.
ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఒక ముస్లిం వ్యక్తి యొక్క రక్తం (ప్రాణం తీయడం) ఈ మూడు కారణాలలో ఒకదాని వలన మాత్రమే ధర్మసమ్మతం అవుతుంది: వివాహితుడు అయిన వ్యభిచారి, ప్రాణానికి ప్రతిగా ప్రాణం, మరియు తన ధర్మాన్ని (ఇస్లాం ను) విడిచి సమాజాన్ని (ముస్లింల సమాజము) వదిలిపోయిన వ్యక్తి.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు'నిశ్చయంగా ఒక ముస్లిం యొక్క రక్తం (ప్రాణం) నిషేధించ బడింది (హరామ్), కేవలం మూడు కారణాలలో ఒకదానిని ఆ వ్యక్తి ఆచరిస్తే తప్ప' అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టం చేసినారు. మొదటిది: ఎవరైతే ధర్మబద్ధమైన నిఖా ఒప్పందం ద్వారా వివాహం చేసుకున్న తర్వాత, వ్యభిచారం (ఫాహిషా) అనే నేరం చేస్తాడో; అతడిని రాళ్లతో కొట్టడం (రజ్మ్) ద్వారా చంపడానికి అనుమతి ఉంది. రెండవది: ఎవరైతే ఉద్దేశపూర్వకంగా, అన్యాయంగా ఒక పవిత్రమైన ప్రాణాన్ని తీస్తాడో (నిర్దోషిని చంపుతాడో), అతనిపై దాని (అతడి ప్రాణం తీయడం) యొక్క షరతులు వర్తిస్తాయి." మూడవది: ముస్లింల సమాజం (జమాఅత్) నుండి బయటికి పోయిన వాడు; అది ఇస్లాం ధర్మాన్ని పూర్తిగా విడిచిపెట్టడం ధర్మభ్రష్టత (ఇర్తిదాద్) ద్వారా కావచ్చు, లేదా ధర్మభ్రష్టత కాకుండా దానిలో కొంత భాగాన్ని వదిలివేయటం ద్వారా కావచ్చు, ఉదాహరణకు తిరుగుబాటుదారులు, దారి దోపిడీదొంగలు, మరియు ఖవారిజ్ వంటి వారు.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ప్రజలకు వారు దావా చేసిన ప్రతిదానిని ఇచ్చివేస్తే, మనుషులు [ఇతర] వ్యక్తుల సంపదపై మరియు వారి రక్తంపై (అన్యాయంగా) దావా వేస్తారు. అయితే సాక్ష్యం చూపవలసిన బాధ్యత దావా చేసిన వానిపై ఉంటుంది; ప్రమాణం చేయడం దానిని వ్యతిరేకించే వానిపై ఉంటుంది.”
బైహిఖీ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: సాక్ష్యాలు గానీ లేదా తగిన ఆధారాలు గానీ లేకుండా ప్రజలు దావా చేసిన (క్లెయిమ్ చేసిన) దానిని ఇచ్చివేస్తే, కొంతమంది ఇతరుల డబ్బు మరియు రక్తాన్ని కూడా క్లెయిమ్ చేస్తారు. అయితే, దావా చేస్తున్న వ్యక్తి, తాను దావా చేస్తున్న దానికి సాక్ష్యం మరియు రుజువును తప్పనిసరిగా సమకూర్చాలి. అతని వద్ద సాక్ష్యం, రుజువు లేకపోతే, ఆ దావా ప్రతివాదికి సమర్పించబడుతుంది. అతను దానిని తిరస్కరించినట్లయితే, అతను ప్రమాణం చేయాలి, ఆ విధంగా అతడు నిర్దోషిగా ప్రకటించబడతాడు.
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు తింటాడో, అతడు మా నుండి దూరంగా ఉండాలి” లేదా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అతడు మా మస్జిదు నుండి దూరంగా ఉండాలి మరియు తన ఇంటిలోనే ఉండాలి” మరియు (ఒకసారి)ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు, ఆకుపచ్చని కూరగాయలతో కూడిన ఒక కుండ తీసుకు రావడం జరిగింది. అందులో నుండి (ఒకరకమైన) వాసన వస్తున్నది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దాని గురించి అడిగారు; మరియు వారికి కుండలో ఉన్న కూరగాయలను గురించి చెప్పడం జరిగింది. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తనతో పాటు ఉన్న ఒక సహచరుని వద్దకు దానిని తీసుకు రండి అని ఆదేశించినారు. దానిని అతడు (ఆ సహచరుడు) తినడానికి ఇష్టపడలేదు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “తిను! (నా విషయం వేరు) ఎందుకంటే, ఎవరితోనైతే మీరు సంభాషించలేరో నేను ఏకాంతములో ఆయనతో సంభాషిస్తూ ఉంటాను, ”. సహీహ్ ముస్లింలో జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే ఈ మొక్క ఫలాన్ని, అంటే వెల్లుల్లిని తింటారో...” మరో చోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “ఎవరైతే ఉల్లి, వెల్లుల్లి మరియు ఉల్లి ఆకులు తింటారో" వారు నా మస్జిదు దగ్గరికి రాకండి. నిశ్చయంగా ఏ విషయాలైతే ఆదము సంతతిని కష్టానికి, ఇబ్బందికి గురిచేస్తాయో వాటి వల్ల దైవదూతలు కూడా ఇబ్బందికి, కష్టానికి గురి అవుతారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరైతే పచ్చి ఉల్లిపాయలు, పచ్చి వెల్లుల్లి తిన్నాడో అతడు మస్జిదుకు రారాదని నిషేధించినారు - అలా వాటిని తిని, దాని వాసన వస్తున్న నోటితో మస్జిదుకు వచ్చినట్లయితే, జమాఅత్’తో నమాజు చదవడానికి వచ్చిన తన సోదరులను ఇబ్బందికి గురిచేస్తాడు అనే ఉద్దేశ్యంతో. ఈ నిషేధాన్ని ‘తన్’జీహీ’ అంటారు; అంటే ఇది, వాటిని తిని వాసన వచ్చే నోటితో మస్జిదుకు రావడాన్ని మాత్రమే నిషేధిస్తున్నది, వాటిని తినడం నుండి కాదు; ఎందుకంటే అవి ‘హలాల్’ (షరియత్ అనుమతించిన) ఆహారపదార్థాలు. తరువాత కూరగాయలతో కూడిన ఒక కుండను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి తీసుకు రావడం జరిగింది. దాని నుండి వస్తున్న వాసనను చూసి, దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుగగా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు దానిలో ఏమి ఉన్నదో తెలియజేయడం జరిగింది. అది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని తినడానికి ఇష్టపడలేదు. వారు ఆ కుండను తనతోపాటు ఉన్న సహచరుల వైపునకు పంపినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను అనుకరిస్తూ వారు కూడా దానిని తినడానికి అయిష్టత చూపినారు. అది చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మీరు తినండి! ఎందుకంటే నేను వహీ తీసుకుని వచ్చే దైవదూతలతో సంభాషిస్తుంటాను”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా తెలియజేసినారు – దుర్వాసన వలన మనుషులకు ఏ విధంగానైతే ఇబ్బంది, హాని కలుగుతుందో, అదేవిధంగా దైవదూతలకు కూడా కలుగుతుంది.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా తాను విన్నానని ఉల్లేఖించారు: “ఒకవేళ మీలో ఎవరి ఇంటి ముంగిట అయినా ఒక నది పారుతూ ఉండి, అందులో అతడు రోజుకు ఐదు సార్లు స్నానం చేయడం ఎవరైనా చూసారా? అలా చేసిన తరువాత, అతడి ఒంటిపై ఏమైనా మలినం మిగిలి ఉంటుందా, ఏమంటారు మీరు?” దానికి వారు ఇలా అన్నారు: “ఎలాంటి మలినమూ కూడా మిగిలి ఉండదు”. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మరి ఐదు సలాహ్’ల (నమాజుల) ఉదాహరణ కూడా ఇటువంటిదే. వాటి ద్వారా అల్లాహ్ పాపాలను తుడిచివేస్తాడు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారురాత్రింబవళ్ళ కాలములో ఐదు పూటలా విధిగా ఆచరించవలసిన సలాహ్’లను (నమాజులను) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), చిన్న పాపాలు మరియు తప్పులు తుడిచి వేస్తాయని మరియు వాటికి పరిహారంగా ఉపకరిస్తాయని పలుకుతూ, ఇంటి ముంగిట పారుతున్న నదిలో రోజుకు ఐదు సార్లు స్నానం చేయడంతో పోల్చినారు – ఏ విధంగానైతే ఇంటి వాకిట పారుతున్న నదిలో రోజుకు ఐదు సార్లు స్నానం చేసే వాని శరీరంపై నుండి అశుద్ధత, మలినాలు దూరమైపోతాయో అదే విధంగా ఐదు నమాజులు కూడా అతడి నుండి అతని చిన్న పాపాలను, తప్పులను దూరం చేస్తాయి.