





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీ సంపదలతో, మీ ఆత్మలతో (అంటే మీ ప్రాణాలు పణంగా పెట్టి), మరియు మీ నాలుకలతో బహుదైవారాధకులతో పోరాడండి.”
అబూ దావూద్, అన్నసాయీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం: అల్లాహ్ యొక్క వాక్కు సర్వోన్నతమైనదిగా ఉండేలా సత్యతిరస్కారులకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి పద్ధతిలో వారిని ఎదుర్కోవడానికి ప్రయత్నించాలని ఆదేశించారు, వాటిలో: మొదటిది: అవిశ్వాసులతో పోరాడుట కొరకు యోధులకు ఆయుధాలను సమకూర్చుట కొరకు, మరియు సైనికులపై ఖర్చు చేయుట కొరకు మన సంపదను ఖర్చు చేయాలి. రెండవది: సత్యతిరస్కారులను ఎదిరించడానికి, యుద్ధములో వారిని అధిగమించడానికి స్వయంగా నడుం బిగించి ముందుకు కదలాలి. మూడవది: వారిని మౌఖిక మార్గాల ద్వారా ఇస్లాం వైపు ఆహ్వానించడం, వారికి వ్యతిరేకంగా సత్యాన్ని స్థాపించడం, వారి వాదనలను ఖండించడం మరియు వారి వాదనలను తిరస్కరించడం.
ఖురైమ్ ఇబ్న్ ఫాతిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఆచరణలు ఆరు రకాలు, మరియు మనుషులు నాలుగు రకాలు. (ఆచరణలలో) రెండు విధిగా జరిగేవి, సరికి సరి పరిమాణములో ప్రతిఫలం లభించేవి (రెండు), ఒక మంచి పనికి పది పుణ్యాలు రాయబడేది, ఒక మంచి పనికి ఏడు వందల రెట్లు పుణ్యాలు రాయబడేది. రెండు విధిగా జరిగేవి కార్యాలు: ఎవరైతే ఎవరినీ మరియు దేనినీ అల్లాహ్ కు సాటి కల్పించని స్థితిలో చనిపోతాడో అతడు స్వర్గములోనికి ప్రవేశిస్తాడు, మరియు ఎవరైతే ఎవరినైనా లేక దేనినైనా అల్లాహ్ కు సాటి కల్పిస్తూ చనిపోతాడో, అతడు నరకములోనికి ప్రవేశిస్తాడు. సరికి సరి ఆచరణలు: ఎవరైతే ఏదైనా సత్కార్యము చేయాలని అనుకుంటాడొ, అది అతని హృదయములో సంకల్ప రూపము దాలుస్తుందో, మరియు అల్లాహ్ దానిని (ఆసంకల్పము యొక్క నిష్కల్మషత్వాన్ని) గుర్తిస్తాడో, అతడికి (కేవలం సంకల్పము చేసినందుకు) ఒక పుణ్యము రాయబడుతుంది. మరియు ఎవరైతే ఏదైనా చెడు కార్యాన్ని చేస్తాడో అతనికి ఒక చెడుపని చేసినట్లుగా రాయబడుతుంది. మరియు ఎవరైతే (సంకల్పించుకున్న) సత్కార్యాన్ని అమలు చేస్తాడో, అతనికి దానికి సమానమైన పది పుణ్యాలు రాయబడతాయి. మరియు ఎవరైతే అల్లాహ్ మార్గములో ఖర్చుపెడతారో అతనికి ఏడు వందల రెట్లకు సమానమైన పుణ్యాలు వ్రాయబడతాయి. ఇక ప్రజల విషయానికి వస్తే, కొందరిపై ఈ ప్రాపంచిక జీవితములో సంపన్నత ఉంటుంది, పరలోక జీవితములో వారిపై పేదరికం ఉంటుంది, కొందరికి భూమిపై పేదరికం ఉంటుంది, కానీ పరలోక జీవితములో వారిపై సంపన్నత ఉంటుంది, కొందరిపై ప్రాపంచిక జీవితములోనూ మరియు పరలోక జీవితములోనూ పేదరికం ఉంటుంది, మరి కొందరిపై ప్రాపంచిక జీవితములోనూ మరియు పరలోక జీవితము నందునూ సంపన్నత ఉంటుంది.
ఆహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణలు ఆరు రకాలుగా ఉంటాయని, ప్రజలు నాలుగు రకాలుగా ఉంటారని తెలియజేసారు. ఆ ఆరు ఆచరణలు ఇవి: మొదటిది: ఎవరైతే అల్లాహ్ కు ఎవరినీ సాటి కల్పించని స్థితిలో చనిపోతాడో స్వర్గము అతనిపై విధి అయిపోతుంది. రెండవది: ఎవరైతే అల్లాహ్ కు సాటి కల్పిస్తున్న స్థితిలో చనిపోతాడో, నరకం అతనిపై విధి అయిపోతుంది, అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు. ఇవి రెండూ విధిగా జరిగే కార్యాలు. మూడవది: కల్మశం లేని సంకల్పాలు: ఎవరైనా ఒక మంచి పని చేయాలని అనుకుని, దానిని తన హృదయంలో బలంగా సంకల్పించుకున్నట్లయితే, మరియు అతని సంకల్పం (అందులో ఎటువంటి కల్మశం లేకపోవడం) అల్లాహ్ గుర్తింపు పొందినట్లయితే, తరువాత అతనికి ఏదైనా అవరోధం ఎదురై అతడు ఆ మంచి పనిని చేయలేక పోయినా, అతడు ఆ సంకల్పించుకున్న మంచిపని పూర్తిగా చేసినట్లు అతని పేర వ్రాయబడుతుంది. నాలుగవది: ఆచరించబడిన చెడు పని: ఎవరైనా ఏదైనా చెడుపని చేసినట్లైతే, అతడు ఒక చెడు పని చేసినట్లు అతని పేర వ్రాయబడుతుంది. ఇవి సరికి సరి పరిమాణములో, ఎటువంటి తగ్గింపు లేకుండా, ప్రతిఫలం వ్రాయబడేవి. ఐదవది: ఒక మంచి పనికి పది రెట్లు పుణ్యాలు లభిస్తాయి: ఇది ఎవరైతే మంచి పని చేయాలని (కల్మశం లేని విధంగా) సంకల్పించుకుని, అవరోధం ఎదురైన కారణంగా దానిని ఆచరించలేక పోయినాడో, అతడు తాను సంకల్పించుకున్న మంచి పనిని ఆచరించినట్లయితే, దానికి సమానమైన పది పుణ్యాలు అతని కొరకు వ్రాయబడతాయి. ఆరవది: ఒక మంచి పనికి ఏడు వందల రెట్ల పుణ్యాలు లభిస్తాయి: ఇది ఎవరైతే తన సంపదను అల్లాహ్ మార్గములో ఖర్చు పెడతాడో, ఆ ఒక్క సత్కార్యము కొరకు అతనికి దానికి సమానంగా ఏడు వందల రెట్లు పుణ్యాలు అతని పేర వ్రాయబడతాయి. ఇది శుభాల ప్రదాత, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ తన ఘనత, మరియు దాతృత్వము, మరియు తన దాసులపై ఆయన యొక్క కరుణకు ప్రతీక. మరియు నాలుగు రకాల ప్రజలు ఎవరంటే: ఒకటవ రకం: ఎవరిపైనైతే ఈ భూమిపై సంపన్నత ఉంటుందో, అందులో అతడు కోరుకున్న ప్రతిదీ అతనికి లభిస్తూ ఉంటుందో, అటువంటి వారికి పరలోకమున చాలా కష్టతరమైన జీవితం ఉంటుంది. వారి గమ్యస్థానము నరకాగ్ని అయి ఉంటుంది. అతడు సంపన్నుడయిన తిరస్కారుడై ఉంటాడు. రెండవ రకం: ఉపాధికి సంబంధించి ఇతనిపై భూలోక జీవితంలో పేదరికం ఉంటుంది. కానీ పరలోక జీవితంలో ఇతనిపై సంపన్నత ఉంటుంది. మరియు ఇతని గమ్యస్థానము స్వర్గము. అతడు పేదవాడైన విశ్వాసి. మూడవ రకం: ఇతడు భూలోకములోనూ మరియు పరలోకములోనూ పేదవాడు. ఇతడు పేదవాడైన అవిశ్వాసి. నాలుగవ రకం: ఇతడు భూలోక జీవితములోనూ, పరలోక జీవితములోనూ సంపన్నుడై ఉంటాడు. ఇతడు సుసంపన్నుడైన విశ్వాసి.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “అల్లాహ్, (దాసుడు) తన ఆదేశాలను తీసుకొనుటను, వాటిపై ఆచరించుటను ఏవిధంగానైతే ఇష్టపడతాడో, తాను అనుమతించిన విషయాలను (సౌలభ్యాలను, రాయితీలను) తీసుకొనుటను, వాటిపై ఆచరించుటను కూడా అదే విధంగా ఇష్టపడతాడు”.
ఇబ్న్ హిబ్బాన్ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: షరియత్ ప్రకారము బాధ్యులైన వ్యక్తుల కొరకు (ముకల్లిఫ్’ల కొరకు), కొన్ని ప్రత్యేక పరిస్థితులలో, షరియత్ యొక్క ఆదేశాలను ఆచరించుటలో, ఆరాధనలలో (అహ్’కామ్, మరియు ఇబాదాత్ లలో) అల్లాహ్ కొన్ని రాయితీలను, సదుపాయాలను, సౌలభ్యాలను ప్రసాదించినాడు. ఉదాహరణకు ప్రయాణములో ఉంటే రెండు నమాజులను ఒకే సమయాన ఆచరించుట, మరియు నమాజులలో రకాతుల సంఖ్యను తక్కువ చేసి ఆచరించుట మొదలైనవి. తన దాసుడు ఆ రాయితీలు తీసుకొనుటను అల్లాహ్ ఇష్టపడతాడు. ఏ విధంగానైతే, విధి చేయబడిన విషయాలకు సంబంధించి తన ఆదేశాలను దాసుడు తీసుకొనుటను, వాటి పై ఆచరించుటను ఆయన ఇష్టపడతాడో. ఎందుకంటే విధి చేయబడిన విషయాలకు సంబంధించి అయినా, రాయితీలకు సంబంధించి అయినా అల్లాహ్ యొక్క ఆదేశము ఒక్కటే (ఆదేశిస్తున్నది అల్లాహ్ యే).
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఇలా పలికినారని అమ్ర్ ఇబ్న్ ఆమిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు: “ప్రతి సలాహ్’ కొరకు (నమాజు కొరకు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేసేవారు.” నేను అడిగాను “మరి నీవు ఎలా చేస్తూ ఉండేవాడివి?” అని. దానికి ఆయన “మాలో ప్రతి ఒక్కరికీ, భగ్నం కానంత వరకూ, ఒకసారి చేసిన ఉదూనే సరిపోయేది” అన్నారు.
అల్ బుఖారీ నమోదు చేసినారు:వుజూ భగ్నం కాక పోయినా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధిగా ఆచరించవలసిన ప్రతి సలాహ్’కు తాజాగా ఉదూ చేసుకునేవారు. ఇలా ఎందుకంటే ఉదూ యొక్క ఘనతను మరియు ప్రతిఫలాన్ని పొందుటకు గాను. అయితే, ఒక వుజూతో, అది భగ్నం కానంతవరకు, విధిగా ఆచరించవలసిన నమాజులలో ఒకటి కంటే ఎక్కువ నమాజులను ఆచరించుటకు అనుమతి ఉన్నది.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయునపుడు శరీరభాగాలను ఒక్కొక్కసారే కడిగినారు.”
అల్ బుఖారీ నమోదు చేసినారు:వుజూ చేయవలసి వచ్చినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్నిసార్లు, (వుజూలో కడగవలసిన) ఒక్కొక్క శరీర భాగాన్ని ఒక్కసారే కడిగేవారు; అంటే తన ముఖాన్ని – నోటిని పుక్కిలించడం, ముక్కును చీది శుభ్రపరుచు కోవడంతో సహా – చేతులను కాళ్ళనూ ఒక్కసారే కడిగేవారు. ఇది, అంటే కనీసం ఒక్కసారి కడుగుట అనునది విధి (వాజిబ్).
అబ్దుల్లాహ్ ఇబ్న్ జైద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయునపుడు తన శరీరభాగాలను రెండు-రెండు సార్లు కడిగినారు.”
అల్ బుఖారీ నమోదు చేసినారు:కొన్నిసార్లు ఉదూ చేయునపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూలో కడగవలసిన శరీర భాగాలను రెండేసి మార్లు కడిగేవారు – అంటే ముఖాన్ని, నోటిని పుక్కిలించడం, ముక్కును చీది శుభ్రపర్చడంతో సహా – రెండు సార్లు కడిగినారు, అలాగే చేతులను, కాళ్ళను రెండుసార్లు కడిగి శుభ్రపరుచుకున్నారు.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా కడుపులో అసౌకర్యంగా ఉన్న కారణంగా వాయువు విడుదల అయ్యిందేమోననే సందేహానికి గురైతే, అతడు మస్జిదును వదిలి వెళ్ళరాదు – (గాలి విడుదలైన) శబ్దం వింటే లేదా ఆ దుర్వాసన గమనిస్తే తప్ప.”
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: సలాహ్ ఆచరిస్తున్న వ్యక్తి కడుపులో అసౌకర్యంగా ఉండి, ఒకవేళ కడుపు నుండి గాలి లాంటిది ఏదైనా బయటకు వెలువడిందేమో అనే సందేహానికి గురైతే – అతడు తిరిగి ఉదూ చేయుటకుగాను చేస్తున్న సలాహ్’ ఆపరాదు – ఉదూను భగ్నం చేసే పని జరిగిందని అతనికి నిర్ధారణ అయితే తప్ప; అది గాలి విడుదలైన శబ్దం వినడం గానీ లేక ఆ దుర్వాసనను గమనించడం గానీ. ఎందుకంటే ఒక నిర్దిష్ట విషయము సందేహాస్పదమైన విషయము ద్వారా రద్దు చేయబడదు. ఇందులో అతడు ఉదూ చేసి ఉన్నాడు అనేది నిర్దిష్ఠమైన విషయం, ఉదూను భగ్నం చేసే వాయువు (హదస్) వెలువడింది అనేది సందేహాస్పదమైన విషయం.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం , “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ప్రతి ఏడు దినములలో (కనీసం) ఒక దినమున (వారానికొకసారి) తల మరియు శరీరమును (శుభ్రముగా) కడుగుతూ (తల) స్నానము చేయుట ప్రతి ముస్లిము పై విధి.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపు తున్నారు: ప్రతి ఏడు దినములలో కనీసం ఒక దినమున, యుక్త వయస్సుకు చేరి, మతిస్థిమితం కలిగిన, ప్రతి ముస్లిం తప్పనిసరిగా (విధిగా) తలస్నానము చేయాలి. ఆ దినమున అతడు శరీరముతో పాటు తలను కూడా శుభ్రముగా కడగాలి. ఆ స్నానము పరిశుద్ధతను పొందే సంకల్పముతో చేయాలి. ఈ (ఏడు) దినములలో మొదటి దినము – వేరే ఉల్లేఖనాలలో వచ్చిన విధంగా – శుక్రవారము. (హదీసులో ‘విధిగా’ ఆచరించాలి అనే అర్థములో పదములు ఉన్నాయి. అయినా) గురువారము నాడు స్నానం చేసి ఉన్నప్పటికీ శుక్రవారపు నమాజు కంటే ముందు తలస్నానము చేయుట ‘ముస్తహబ్ ముఅక్కిదహ్’ (నొక్కి చెప్పబడిన అభిలషణీయమైన ఆచరణ; కాని తప్పనిసరి విధి కాదు). ఇమాం బుఖారీ సేకరించిన ఒక హదీథు ద్వారా మనకు ఈ విషయం అర్థమవుతున్నది. అందులో ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా అన్నారు: “ప్రజలు తమ జీవనోపాధి కొరకు (వివిధ రకాల) పనులు చేయడానికి వెళ్ళేవారు. జుమా నమాజు కొరకు (పనులనుండి నేరుగా) అదే స్థితిలో మస్జిదుకు వెళ్ళేవారు. అపుడు వారితో “స్నానం చేసి వస్తే మంచిది’ అని చెప్పబడినది.” ఇదే విషయానికి సంబంధించి మరొక ఉల్లేఖనలో ‘ప్రవక్త సహచరులు శ్రామికులు, వారి (శరీరం) నుండి చెమట వాసన వస్తూ ఉండేది. అందుకని వారికి “స్నానం చేసి వస్తే మంచిది’ అని చెప్పబడింది” అని ఉన్నది. అది వారి స్థితిని ఉన్నత పర్చడానికి సముచితమైనది.
ఖైస్ బిన్ ఆసిం రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “నేను ఇస్లాం స్వీకరించే సంకల్పముతో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చాను. అపుడు వారు “రేగు ఆకులు వేసిన నీటితో స్నానం చేసి రమ్మని” నన్ను ఆదేశించినారు.
అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అన్నసాయీ నమోదు చేసినారు:ఖైస్ బిన్ ఆసిం రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించే నిమిత్తము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు “రేగు ఆకులు వేసిన నీటితో స్నానం చేసి రమ్మని” ఆదేశించినారు. కారణం రేగు ఆకులు పరిశుభ్రత పొందుట కొరకు ఉపయోగించేవారు, అలాగే వాటికి మంచి సువాసన కూడా ఉంటుంది.