





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
విశ్వాసుల మాతృమూర్తి, ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “తన వలీ (సంరక్షకుల) అనుమతి లేకుండా వివాహం చేసుకున్న స్త్రీ వివాహం చెల్లదు అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాటలను మూడుసార్లు పలికినారు. ఇంకా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఒకవేళ భర్త ఆమెతో సంబోగములో పాల్గొని ఉంటే, అతడు ఆమె నుండి ఏదైతే పొందినాడో, అందుకు గానూ ఆమెకు వరకట్నం లభిస్తుంది. వారి మధ్య ఏదైనా వివాదం తలెత్తితే, సుల్తాన్ (అధికారంలో ఉన్న వ్యక్తి, ఆ ఇద్దరిలో) సంరక్షకుడు ఎవరూ లేని వ్యక్తికి సంరక్షకుడు అవుతాడు.”
అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:తన సంరక్షకుల అనుమతి లేకుండా స్త్రీ తనకు తానుగా వివాహం చేసుకునే స్త్రీకి వ్యతిరేకంగా, “ఆమె వివాహం చెల్లదు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం హెచ్చరించారు. “చెల్లదు” అని ఆయన మూడుసార్లు పునరావృతం చేసారు; అసలు ఎన్నడూ అలా జరుగకూడదు అన్నట్లుగా. ఆమెను వివాహం చేసుకున్న వ్యక్తి, ఆమె సంరక్షకుల సమ్మతి, అంగీకారం లేకపోయినా ఆమెతో సంబోగములో పాల్గొన్నట్లయితే ఆమె యోనితో అతను లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు నిర్ణయించబడిన వరకట్నం పూర్తిగా ఆమెదే అవుతుంది (ఆమె సంరక్షకులకు అందునుండి ఏమీ చెందదు). వివాహ ఒప్పందం యొక్క సంరక్షకత్వంపై సంరక్షకుల మధ్య వివాదం ఏర్పడితే - మరియు ఈ విషయంలో వారందరూ సమాన స్థాయిలో ఉంటే – ఒప్పందం కొరకు వారిలో ఎవరు మొదట ముందడుగు వేసినారో వారికే వెళుతుంది, అయితే అది అన్ని కోణాలలో ఆమె శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని జరుగుతుంది. సంరక్షకుడు ఆమెను అతనికిచ్చి వివాహం చేయడానికి నిరాకరిస్తే, ఆమెకు సంరక్షకుడు ఎవరూ లేనట్లే; ఈ సందర్భంలో, పాలకుడు లేదా అతని ప్రతినిధి, అంటే న్యాయమూర్తి మరియు అలాంటి వారు ఆమెకు సంరక్షకుడిగా మారతారు. చట్టబద్ధమైన సంరక్షకుడు ఉంటే పాలకుడికి సంరక్షకత్వం ఉండదు.
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “శాపగ్రస్తుడు ఎవరంటే, ఎవరైతే తన భార్యతో ఆమె ఆసనము ద్వారా (మలద్వారము) సంభోగము చేసేవాడు.”
అబూ దావూద్, అన్నసాయీ అల్ కుబ్రాలో మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరిస్తున్నారు: భర్త తన భార్య మలద్వారంలోనికి ప్రవేశించరాదు; అలా చేసేవాడు శపించబడ్డాడు మరియు అల్లాహ్ దయ నుండి, కరుణ నుండి అతడు బహిష్కరించబడ్డాడు మరియు అది ఘోరమైన పాపములలో (కబాయిర్ లలో) ఒకటి.
ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “పురుషునితో గానీ, లేక స్త్రీతో గానీ మలద్వారము ద్వారా సంభోగములో పాల్గొనే వాని వైపునకు అల్లాహ్ (తీర్పు దినమున) కన్నెత్తి కూడా చూడడు.”
అత్తిర్మిదీ మరియు సునన్ అన్నసాయీ కుబరాలో నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురుషుడిని లేదా స్త్రీని మలద్వారము ద్వారా సంభోగించే వ్యక్తికి కలిగే తీవ్రమైన పరిణామాలను స్పష్టం చేశారు. ఎందుకంటే (తీర్పుదినమున) అల్లాహ్ అతనిపై తన అనుగ్రహం, దయ, కనికరం చూపడు. మరియు అది ఘోరమైన పాపాలలో (కబాయిర్’లలో) ఒకటి అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎత్తి చూపారు.
ము’ఆవియా అల్ ఖుషైరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగాను: “ఓ రసూలుల్లాహ్! మాలో ఎవరి భార్యకైనా అతనిపై (ఆమె భర్తపై) ఉన్న హక్కు ఏమిటీ?” అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నువ్వు తిన్నపుడు ఆమెకు కూడా తినిపించు; ఆమెకు కూడా దుస్తులు ధరింపజేయి - నీవు దుస్తులు ధరించినపుడు, లేదా నీవు డబ్బు సంపాదించినపుడు; ఆమె ముఖం పై ఎపుడూ కొట్టకు; ఆమెను ఎన్నడూ అవమానించకు; ఆమెను ఇంటిలో తప్ప ఇంకెక్కడా ఆమెను నీ నుండి వేరు చేయకు.”
అబూదావూద్, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా ప్రశ్నించడం జరిగింది: ఒక భార్యకు తన భర్తపై ఉండే హక్కులు ఏమిటి అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా విషయాలు తెలిపినారు; వాటిలో ఇవి కొన్ని: మొదటిది: ఆహారం విషయంలో మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోకండి. మీరు తిన్నపుడల్లా, లేక మీకు ఎవరైనా తినిపించినపుడల్లా ఆమెకు కూడా తినిపించండి. రెండవది: దుస్తుల విషయంలో మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోకండి. మీరు దుస్తులు ధరించినపుడు (అంటే మీ కొరకు మీరు దుస్తులు కొన్నపుడు) ఆమెకు కూడా దుస్తులు ధరింపజేయండి (ఆమె కొరకు కూడా దుస్తులు కొనండి), లేదా మీరు డబ్బు సంపాదించినపుడు, మీరు స్థోమత కలిగి ఉన్నపుడు మీతో పాటు ఆమెకూ దుస్తులు తీసుకోండి. మూడవది: కారణం ఏమీ లేకుండా మరియు దండించవలసిన అవసరం ఏమీ లేకుండా ఆమెను ఎపుడూ దండించవద్దు. ఆమెను క్రమశిక్షణలో ఉంచడం కోసం, లేదా తప్పనిసరి విధులను నిర్లక్ష్యం చేసినందుకు ఆమెను దండించవలసి వస్తే, ఆమెను ఎపుడూ తీవ్రంగా దండించరాదు; మరియు ఆమె ముఖం పై ఎన్నడూ కొట్టరాదు. ఎందుకంటే శరీరంలో ముఖము అత్యంత ప్రముఖమైన భాగము, మరియు సౌందర్యవంతమైన రూపము కలిగి ఉండి, అత్యంత సున్నితమైన భాగములు కలిగినదై ఉంటుంది. నాలుగవది: ఆమెను తిట్టవద్దు (శపించవద్దు), ఉదాహరణకు “అల్లాహ్ నీ ముఖాన్ని అందవికారంగా చేయుగాక” అనేలాంటి మాటలు అనవద్దు. ఆమెకు లేక ఆమె శరీరంలోని ఏ భాగానికీ అందవికారాన్ని ఆపాదించవద్దు, అందవికారము అంటే సౌందర్యానికి వ్యతిరేకము; ఎందుకంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మానవుని ముఖాన్ని మరియు శరీరాన్ని సృష్టించాడు మరియు ఆయన సృష్టించిన ప్రతిదానినీ పరిపూర్ణంగా చేశాడు; సృష్టిని నిందించడం అంటే సృష్టికర్తను నిందించినట్లే, అలాహ్ క్షమించుగాక. ఐదవది: (దండించవలసి వస్తే) పడకలో తప్ప ఒకరినొకరు వదిలివేయకండి; మరియు ఆమె నుండి దూరంగా వెళ్లకండి; (శిక్షలో భారంగా) ఆమెను వేరే ఇంటికి మార్చకండి; భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినపుడు సాధారణంగా ఇలాగే జరుగుతుంది.
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఇలా ఉల్లేఖించినారు: తల వెంట్రుకలకు సవరాన్ని జోడించి, వెంట్రుకలను పొడిగించే స్త్రీని మరియు సవరం కొరకు అడిగే స్త్రీని, పచ్చబొట్లు వేసే స్త్రీని మరియు పహ్చబొట్టు వేయమని అడిగే స్త్రీని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శపించారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) నాలుగు వర్గాల ప్రజలను శపించారు, బహిష్కరించారు మరియు అల్లాహ్ కారుణ్యము నుండి వారిని దూరం చేసినారు: ఒకటి: తన తల వెంట్రుకలకు లేదా వేరే స్త్రీల తల వెంట్రుకలకు సవరాన్ని జోడించే స్త్రీని రెండు: తన జుత్తుకు సవరాన్ని జోడించమని వేరే స్త్రీని కోరే స్త్రీ. మూడు: పచ్చబొట్టు పొడిచే స్త్రీ; ఆమె ముఖము, చేయి లేదా ఛాతీ వంటి శరీరంలోని ఒక భాగంలో, సౌందర్యం పొందడానికి చేసే ప్రక్రియలో భాగంగా, సూదిని గ్రుచ్చి, ఆ భాగాలు నీలి రంగులోనికో లేక ఆకుపచ్చ రంగులోనికో మారేటంత వరకు, సూదితో కాటుక పొడి (సుర్మా, కొహ్ల్) వంటి పచ్చబొట్టు పొడిచేందుకు ఉపయోగించే పదార్థాలను చొప్పిస్తుంది. అటువంటి స్త్రీ కూడా శపించబడింది. నాలుగు: తనకు పచ్చబొట్టు పొడవమని అడిగి పచ్చబొట్టు పొడిపించుకునే స్త్రీ. ఈ ఆచరణలు “కబాయిర్” ఆచరణలు (పాపములలో ఘోరమైన పాపములు) గా పరిగణించబడతాయి.
అబూ బురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైనా ఇద్దరు భార్యలు కలిగి ఉండి, వారిలో ఒక భార్య వైపునకు ఎక్కువగా ఆకర్షితులై ఉంటే (అన్నింటా ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే) పునరుత్థాన దినమున అతడు శరీరం ఒక వైపునకు వంగి ఉన్న స్థితిలో వస్తాడు.”
అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఎవరికైనా ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండి, ఖర్చు విషయంలో, వారికి ఇల్లు సమకూర్చే విషయంలో, వారికి దుస్తులు సమకూర్చే విషయంలో మరియు వారితో రాత్రి గడపడం వంటి విషయాలలో తన భార్యలను సమానంగా చూడకపోతే, పునరుత్థాన దినాన అతని శరీరం సగం వంగి ఉంటుంది; మరియు అతని శరీరం వంగి ఉన్న స్థితిలో రావడం అతని అన్యాయానికి శిక్ష అని ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం మనకు తెలియజేస్తున్నారు.
అబూ హురరైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా అల్లాహ్ నా సమాజాన్ని (ఉమ్మత్’ను) వారి మనస్సులలోనికి వచ్చే (పరిపరి విధాల) ఆలోచనల కొరకు వారిని క్షమించాడు – వారు ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టనంత వరకు, లేక వాటిని బయటకు ఉచ్చరించనంత వరకు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఒక ముస్లిం, ఒకవేళ తన మసులో చెడు ఆలోచనలు ఉన్నట్లైతే, అతడు వాటిపై అమలు చేయనంత వరకు లేదా వాటి గురించి బయటకు మాట్లాడనంత వరకు – అతడు అటువంటి చెడు ఆలోచనలు కలిగి ఉన్నందుకు బాధ్యుడుగా చేయబడడు, అల్లాహ్ అతని పై నుంచి ఆ భారాన్ని తొలిగించి అతణ్ణి క్షమించాడు. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమాజాన్ని (ఉమ్మత్’ను) వారి హృదయాలలో ఉన్న దానికి (అది చెడు ఆలోచన అయినా) అల్లాహ్ వారిని బాధ్యులను చేయలేదు; వారి హృదయాలలో ఉన్నది వారి ఆత్మలలో పునరావృతం అవుతూ ఉన్నా, అది అక్కడ స్థిరపడకుండా ఉన్నట్లైతే. ఒకవేళ అది అతని హృదయంలో స్థిరపడిపోయినట్లైతే, ఉదాహరణకు: గర్వము, అహంభావము, మోసము; కపటత్వము మొదలైనవి అక్కడ స్థిరపడిపోతే అప్పుడు అతడు బాధ్యునిగా నిలబెట్టబడతాడు; లేక అతడు తన అవయవాలతో ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టినా; లేక అతడు తన నాలుకతో వాటిని ఉచ్ఛరించినా – అపుడు అతడు బాధ్యునిగా నిలబెట్టబడతాడు.
అలీ (రదియల్లాహు అన్హు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ముగ్గురి పైనుండి (మూడు రకాల వ్యక్తులపైనుండి) కలము లేపివేయబడినది (వారిని గురించి ఏమీ నమోదు చేయదు); వారు: నిద్రిస్తున్న వ్యక్తి అతడు నిద్రనుంచి మేల్కొనేంత వరకు; యుక్త వయస్సుకు చేరని బాలుడు/బాలిక అతడు యుక్తవయస్సుకు చేరేంతవరకు, మరియు మతిస్థిమితము కోల్పోయిన పిచ్చివాడు, అతడు తిరిగి మతిస్థిమితం పొందేంతవరకు.”
అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ కుబరా, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ముగ్గురు వ్యక్తులు మినహా, ఆదం సంతానం మొత్తం తమ జవాబుదారీ తనానికి కట్టుబడి ఉంది. ఆ ముగ్గురు: యుక్తవయస్సుకు చేరని పిల్లలు, వారు యుక్తవయస్సుకు చేరేంత వరకు; మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి (పిచ్చివాడు) అతడు తిరిగి మతి స్థిమితం పొందేంత వరకు; మరియు నిద్రిస్తున్న వ్యక్తి అతడు నిద్రనుండి మేల్కొనేంత వరకు. పైన పేర్కొనబడిన వారి నుండి జవాబుదారితనం లేపి వేయబడింది; వారి పాపపు చర్యలు వారికి వ్యతిరేకంగా నమోదు చేయబడవు, అయితే యుక్త వయస్సుకు చేరని చిన్న పిల్లవాడు ఏదైనా మంచి పని చేస్తే, ఆ మంచి అతని పేర నమోదు అవుతుంది కానీ పిచ్చివాడికి మరియు నిద్రపోయే వ్యక్తికి కాదు. ఎందుకంటే వారు భావోద్వేగాలు లేని వేరే స్థితిలో, వేరే ప్రపంచములో ఉంటారు. సాధారణ స్థితిలో ఉండే స్పృహ, సచేతనత్వం కలిగి ఉండని కారణంగా వారు ఏ ఆరాధననూ సక్రమంగా నిర్వహించలేని స్థితిలో ఉంటారు.
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మత్తు కలిగించే ప్రతి పదార్థమూ మద్యమే అనబడుతుంది, కనుక మత్తు కలిగించే ప్రతిదీ హరామే (నిషేధించబడినదే). ఎవరైతే ప్రాపంచిక జీవితంలో మద్యము త్రాగుతూ ఉంటాడో, పశ్చాత్తాపము చెందకుండా, దానికి అలవాటు పడి ఉన్న స్థితిలోనే మరణిస్తాడో, అతడు పరలోక జీవితములో దానిని (స్వర్గపానీయాలను) త్రాగలేడు.”
ముస్లిం, అల్ బుఖారీ చివరి వాక్యం పదాలతో నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: మెదడును మత్తులో ముంచి, మబ్బులా కమ్మివేసి, సరిగా పనిచేయకుండా చేసే ప్రతిదీ మద్యం అనబడుతుంది; అది తినడం ద్వారా కానీ, త్రాగడం ద్వారా కానీ, ముక్కుతో పీల్చడం ద్వారా కానీ, లేక ఇంకే విధంగానైనా కానీ. మెదడును మత్తులో ముంచి, మబ్బులా కమ్మివేసి, సరిగా పనిచేయకుండా చేసే ప్రతిదీ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ద్వారా హరాం చేయబడింది (నిషేధించబడినది); అది కొద్ది మొత్తములోనైనా, లేక ఎక్కువ మోతాదులోనైనా సరే. మరియు ఎవరైనా ఏ రకమైన మత్తుపదార్థాలు వాడినా, వాటిని తాగడం కొనసాగించి, చనిపోయే వరకు వాటి నుండి పశ్చాత్తాపపడకపోతే, అటువంటి వారు అల్లాహ్ శిక్షకు అర్హులు అవుతారు, స్వర్గంలో ఇవ్వబడే పానీయాలను తాగకుండా చేస్తాడు.