





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబూ ఉమామహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “విధిగా ఆచరించవలసిన ప్రతి సలాహ్ తరువాత ఎవరైతే “ఆయతుల్ కుర్సీ” పఠిస్తాడో, మరణం తప్ప, అతడిని స్వర్గములో ప్రవేశించడం నుండి ఏమీ నిషేధించదు.”
అన్నసాయీ అల్ కుబ్రాలో నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసినారు: ఎవరైతే, విధిగా ఆచరించవలసిన ప్రతి సలాహ్ తరువాత (ప్రతి ఫర్జ్ నమాజు తరువాత), ఆయతుల్ కుర్సీ పఠిస్తాడో, అతడు స్వర్గములో ప్రవేశించడం నుండి చావు తప్ప మరింకేమీ అడ్డుకోలేదు. ఆ ఆయతు సూరహ్ అల్ బఖరహ్ లో ఉంది. అందులో అల్లాహ్ ఇలా అంటున్నాడు: {“అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూం, లా త’ఖుజుహు, సినతు వలా నౌం, లహు మా ఫిస్సమావాతి వమా ఫిల్ అర్జ్, మన్’జల్లజీ యష్’ఫఉ, ఇందహు, ఇల్లా బిఇజ్’నిహి, యా’లము మాబైన ఐదీహిమ్, వమా ఖల్ఫహుమ్, వలా యుహీతూన బి షైఇమ్ మిన్ ఇల్మిహి, ఇల్లా బిమా షాఅ, వసిఅ కుర్సియ్యుహు స్సమావాతి వల్ అర్జ్, వలా యఊదుహు హిఫ్జుహుమా, వహువల్ అలియ్యుల్ అజీమ్”} [అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు, ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖంలో – ఆయన అనుజ్ఞ లేకుండా – సిఫారసు చేయగల వాడెవడు? వారి ముందు ఉన్నదీ మరియు వారి వెనుక నున్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు. ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు.] (సూరహ్ అల్ బఖరహ్ 2:255) (సూరహ్ అల్ బఖరహ్ 2:255)
అబూ సఈద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా తన నమాజు లో (తన నమాజులో ఉండగా) సందేహములో పడిపోతే, తను ఎన్ని (రకాతులు) ఆచరించినాడు? మూడా, నాలుగా అతనికి తెలియకపోతే – అతడు తన సందేహాన్ని (ప్రక్కకు) విసిరేసి, ఖచ్చితంగా ఎన్ని రకాతులు పూర్తి అయినాయని విశ్వసిస్తున్నాడో, దానిపై తన నమాజు ను ఆధారం చేసుకుని పూర్తి చేయాలి; తరువాత సలాం చెప్పే ముందు (సలాంతో నమాజు పూర్తి చేసే ముందు) రెండు సజ్దాలు చేయాలి. ఒకవేళ అతడు 5 రకాతులు చదివి ఉంటే, ఈ రెండు సజ్దాలు అతడి నమాజు ను (సరి సంఖ్యగా) పరిపూర్ణం చేస్తాయి. ఒకవేళ అతడు నాలుగు (రకాతులు) చదివి ఉంటే, ఈ రెండు సజ్దాలు షైతానుకు పరాభవంగా మారుతాయి.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విషయాన్ని ఈ విధంగా స్పష్టపరుస్తున్నారు. నమాజు ఆచరిస్తున్న వ్యక్తి ఒకవేళ తన నమాజు లో అయోమయంలో పడిపోతే, తాను ఎన్ని రకాతులు చదివినాడో జ్ఞాపకంలేకపోతే, అంటే మూడు రకాతులు చదివినాడా లేక నాలుగు రకాతులు చదివినాడా నిర్ణయించుకోలేక పోతున్నట్లయితే, సందేహాన్ని కలిగిస్తున్న ఆ అదనపు రకాతు విషయాన్ని వదిలివేయాలి. ఇక్కడ మూడా లేక నాలుగా అనే సందేహంలో, మూడు రకాతులు అనేది ఖచ్చితమైన విషయం. కనుక అతడు నాలుగవ రకాతు చదివి చివరన నమాజును సలాం తో ముగించడానికి ముందు రెండు సజ్దాలు (సుజూద్ అస్’సహ్వ్) చేయాలి. ఒకవేళ అతడు వాస్తవములో నాలుగు రకాతులు చదివి ఉంటే, అదనంగా చదివిన ఒక రకాతుతో మొత్తం ఐదు రకాతులు అవుతాయి. నమాజు చివరన, సలాంతో నమాజును ముగించడానికి ముందు చేసిన రెండు అదనపు సజ్దాలు ఒక రకాతుగా పరిగణించబడతాయి. ఆ విధంగా నమాజులో రకాతుల సంఖ్య బేసి, కాకుండా సరి సంఖ్య అవుతుంది. ఒకవేళ అతడు వాస్తవములో నాలుగు రకాతులే చదివి ఉంటే అతడు నమాజును ఆచరించవలసిన విధంగానే, ఎక్కువ తక్కువ లేకుండా ఆచరించాడన్నమాట. ఆ స్థితిలో, సలాంతో నమాజును ముగించడానికి ముందు చేసిన రెండు అదనపు సజ్దాలు (సుజూద్ అస్’సహ్వ్) షైతానుకు పరాభవంగా మారుతాయి, ఆ రెండు సజ్దాలు అతడిని పరాభవంతో, అతడి లక్ష్యం నుండి అతడిని దూరంగా తరిమివేస్తాయి. ఎందుకంటే అతడు అల్లాహ్ యొక్క దాసుడిని నమాజు’లో అయోమయానికి గురిచేసి, అతని నమాజు భంగపడేలా చేయాలని యోచించినాడు. కానీ అల్లాహ్ ఆదేశాలకు విధేయుడై ఆదమ్ కుమారుడు రెండు సజ్దాలు చేస్తూ, షైతానుకు (అతని ప్రభావానికి) అవిధేయత చూపినప్పుడు అతని నమాజు పరిపూర్ణమయ్యింది. అదే షైతాను – ఆదమ్ (అలైహిస్సలాం) కు సజ్దా చేయమని అల్లాహ్ ఆదేశించినపుడు అల్లాహ్ ఆదేశాన్ని తిరస్కరించి అవిధేయుడైనాడు.
విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుహ్ర్ సలాహ్ కు ముందు నాలుగు (రకాతులు), మరియు ఫజ్ర్ సలాహ్’కు ముందు రెండు రకాతులు నమాజు ఆచరించడాన్ని ఎన్నడూ విడిచి పెట్టలేదు.”
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ హదీథులో ఆయిషా (రదియల్లాహు అన్హా) : తన ఇంటిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వచ్ఛందంగా ఆచరించవలసిన నమాజులను ఎన్నడూ విడిచి పెట్టలేదని, ఆయన నిరంతరం వాటిని ఆచరించేవారని తెలియ జేస్తున్నారు; జుహ్ర్ సలాహ్ కు ముందు రెండు-రెండు రకాతులుగా నాలుగు రకాతుల సున్నత్ సలాహ్, మరియు ఫజ్ర్ సలాహ్ కు ముందు రెండు రకాతుల సున్నత్ సలాహ్ నిరంతరం ఆచరించేవారని తెలియజేస్తున్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలలో ఒకరైన ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఎవరైతే జుహ్ర్ నమాజుకు ముందు నాలుగు రకాతులు, మరియు జుహ్ర్ నమాజు తరువాత నాలుగు రకాతులు నిరంతరం ఆచరిస్తాడో, అల్లాహ్ అతడిపై నరకాన్ని నిషేధించినాడు.”
అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్తను వినిపిస్తున్నారు: ఎవరైతే జుహ్ర్ నమాజుకు ముందు నాలుగు రకాతులు మరియు జుహ్ర్ నమాజు తరువాత నాలుగు రకాతులు నమాజు ఆచరిస్తాడో, అలా ఆచరించడాన్ని అతడు ఒక విధానంగా అతడు నిరంతరం నిర్వహిస్తాడో, అల్లాహ్ అతడిని నరకాగ్ని నుండి రక్షిస్తాడు.
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ఫజ్ర్ యొక్క రెండు రకాతుల (సున్నతు) నమాజులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, (మొదటి రకాతులో) “ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్” సూరహ్’ను, (రెండవ రకాతులో) “ఖుల్ హువల్లాహు అహద్” సూరహ్’ను పఠించేవారు.”
ముస్లిం నమోదు చేసినారు:ఫజ్ర్ యొక్క రెండు రకాతుల రవాతిబ్ (స్వచ్ఛంద – సున్నత్) నమాజులో, మొదటి రకాతులో సూరహ్ అల్ ఫాతిహా పఠించిన తరువాత “ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్” సూరహ్’ను (సూరహ్ అల్-కాఫిరూన్), మరియు రెండవ రకాతులో సూరహ్ అల్ ఫాతిహా పఠించిన తరువాత “ఖుల్ హువల్లాహు అహద్” సూరహ్’ (సూరహ్ అల్-ఇఖ్లాస్) పఠించుటను ఎక్కువగా ఇష్టపడేవారు.
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను: "ఒక వ్యక్తి ఒంటరిగా ఆచరించే నమాజు కంటే సామూహికంగా చేసే నమాజు (జమాఅత్ తో ఆచరించే నమాజు) యొక్క ప్రతిఫలం ఇరవై ఐదు రెట్లు గొప్పది. రాత్రి సమయపు దేవదూతలు మరియు పగటి సమయపు దేవదూతలు ఫజ్ర్ నమాజు సమయంలో సమావేశమవుతారు.' "అబూ హురైరా ఇంకా ఇలా అన్నారు, "కావాలంటే మీరు పవిత్ర గ్రంథాన్ని పఠించండి, “ఇన్న ఖుర్’ఆనల్ ఫజ్రి కాన మష్’హూదా” (నిష్చయంగా తెల్లవారుజామున ఖురాన్ పారాయణం (ఫజ్ర్ ప్రార్థన) ఎల్లప్పుడూ వీక్షించబడుతుంది." (సూరహ్ అల్ ఇస్రా 17:78).
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ఇమామ్తో కలిసి సామూహికంగా నమాజు ఆచరించే వ్యక్తికి లభించే ప్రతిఫలం మరియు బహుమానము అతడు ఇంట్లోనో లేదా మార్కెట్లోనో ఒంటరిగా ఆచరించే ఇరవై ఐదు నమాజుల కంటే గొప్పదని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వివరించారు. తరువాత ఆయన రాత్రి సమయపు దైవదూతలు మరియు పగటి సమయపు దైవదూతలు ‘ఫజ్ర్’ నమాజు కోసం సమావేశమవుతారని ప్రస్తావించారు. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) దీనికి ఆధారాలను ఉటంకిస్తూ ఇలా అన్నారు: “కావాలంటే మీరు (ఖుర్’ఆన్) చదండి: {ఇన్న ఖుర్’ఆనల్ ఫజ్రి కాన మష్’హూదా} (నిశ్చయంగా, ప్రాతఃకాల (ఖుర్ఆన్) పఠనం (దైవదూతల ద్వారా) వీక్షింప బడుతుంది. [సూరా అల్ ఇస్రా: 17:78] అంటే దాని అర్థము ఫజ్ర్ నమాజు రాత్రి సమయపు దైవదూతలు మరియు పగటి సమయపు దైవదూతల ద్వారా వీక్షించబడుతుంది అని.
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: (నమాజుకు సంబంధించి) పురుషుల కొరకు ఉత్తమమైన పంక్తులు మొదటి పంక్తులు; మరియు అధమమైనవి చివరి పంక్తులు; అలాగే స్త్రీల కొరకు ఉత్తమమైన పంక్తులు చివరి పంక్తులు, మరియు అధమమైనవి మొదటి పంక్తులు.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: నమాజులో పురుషులకొరకు శ్రేష్ఠమైన పంక్తులు, అత్యధిక ప్రతిఫలం, పుణ్యఫలం మరియు ఘనత కలిగిన పంక్తులు – మొదటి పంక్తులు. ఎందుకంటే ఇవి ఇమామ్’కు దగ్గరగా ఉంటాయి మరియు ఆయన పఠనాన్ని ఈ పంక్తులు శ్రధ్ధగా వింటాయి మరియు స్త్రీలకు దూరంగా ఉంటాయి కనుక. మరియు అధమమైన వరుసలు, తక్కువ ప్రతిఫలం మరియు తక్కువ ఘనత కలిగిన వరుసలు మరియు (నమాజుకు సంబంధించి) షరియత్ ద్వారా అవసరమైన వాటికి దూరంగా ఉండే వరుసలు చివరి వరుసలు. మహిళలకు ఉత్తమమైన వరుసలు చివరివి, ఎందుకంటే చివరి వరుసలు మహిళలకు ఎక్కువ పరదాను కలుగజేస్తాయి, పురుషులతో కలవకుండా, వారికి దూరంగా, వారిని చూడకుండా మరియు వారి కారణంగా మనోవికారం వంటి వాటికి గురి కాకుండా చేస్తాయి. అలాగే మహిళల కొరకు అధమమైన వరుసలు మొదటి వరుసలు, ఎందుకంటే మొదటి వరుసలు పురుషులకు సమీపంగా ఉంటాయి, మరియు ఆ కారణంగా స్త్రీల హృదయాలు ప్రలోభానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది.
వాబిసహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి నమాజులో పంక్తి వెనుక ఒంటరిగా నిలబడి నమాజు ఆచరించడాన్ని చూసినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని ఆ నమాజు మరలా చేయమని ఆదేశించినారు.”
అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజులో ఒక వ్యక్తి పంక్తి వెనుక నిలబడి ఒంటరిగా నమాజు చేయడం చూసి, అతడిని ఆ నమాజును మరలా చేయమని ఆదేశించినారు; ఎందుకంటే ఆ విధంగా (పంక్తి విడిచి ఏకాకిగా) ఆచరించబడిన అతడి నమాజు చెల్లదు కనుక.
ఉబయ్ ఇబ్న్ క’ఆబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ఒక రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన నాయకత్వములో మాకు ఫజ్ర్ నమాజు చదివించారు. తరువాత “ఫలానా అతణ్ణి చూసారా?” అని అడిగారు. దానికి అక్కడ ఉన్న వారు “లేదు” అని జవాబిచ్చారు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “మరి ఫలానా అతణ్ణి చూసారా?” అని ప్రశ్నించారు. దానికి వారు “లేదు” అని సమాధానమిచ్చారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఈ రెండు సలాహ్’లు (నమాజులు) కపటవిశ్వాసులపై భారమైనవి. ఈ రెండింటిలో ఏమి (దాగి) ఉన్నదో మీకు తెలిస్తే, మీ మోకాళ్ళపై ప్రాకుతూ రావల్సి వచ్చినా మీరు వాటి కొరకు (మస్జిదుకు) వస్తారు. (నమాజులో) మొదటి వరుస దైవదూతల శ్రేణి లాంటిది. దాని ఘనతను మీరు తెలుసుకుంటే అందులో చేరడానికి మీరు పోటీ పడతారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో కలిసి (జమాఅత్’గా) నమాజు ఆచరించుట, అతడు ఒంటరిగా నమాజు ఆచరించుట కంటే పరిశుద్ధమైనది. మరియు అతడు మరో ఇద్దరితో కలిసి నమాజు ఆచరించుట ఒక్క వ్యక్తితో కలిసి నమాజు ఆచరించుట కంటే పరిశుద్ధమైనది. సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే అది (ఆ జమాఅత్) సర్వోన్నతుడైన అల్లాహ్’కు అంత ప్రీతిప్రదమైనది అవుతుంది.
అబూ దావూద్, అన్నసాయీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరోజు ఫజ్ర్ నమాజు చదివించినారు, తరువాత ఆయన: “ఫలాన అతను మనతో నమాజు ఆచరించినారా?” అని అడిగారు. సహాబాలు “లేదు” అని జవాబిచ్చారు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరొక వ్యక్తిని గురించి “మరి ఫలానా అతను హాజరయ్యాడా?” అని అడిగారు. వారు “లేదు” అని జవాబిచ్చారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ‘ఫజ్ర్’ మరియు ‘ఇషా’ నమాజులు కపట విశ్వాసులపై అత్యంత భారమైనవి. వారిలో సోమరితనం ఎక్కువ ఉంటుంది. పైగా తాము నమాజులకు హాజరువుతున్నామనే విషయం చీకటిలో కనిపించదు; వారి ప్రదర్శనా లాలస తీరదు. ఓ విశ్వాసులారా, ప్రతిఫలం పరంగా మరియు పుణ్యఫలం పరంగా ఫజ్ర్ మరియు ఇషా నమాజులలో ఏమి (శుభం దాగి) ఉన్నదో మీకు గనుక తెలిస్తే – ఎందుకంటే కష్టానికి తగిన అనుపాతంలో ప్రతిఫలం ఉంటుంది గనుక – మీరు మీ చేతులు మరియు మోకాళ్ళపై ప్రాకుతూ రావలసి వచ్చినా మీరు ఆ నమాజుల కొరకు (మస్జిదునకు) వస్తారు. నమాజులో ఇమాం వెనుక ఇమాం కు దగ్గరగా ఉండే మొదటి వరుస, సామీప్యములో సర్వోన్నతుడైన అల్లాహ్ కు దగ్గరగా ఉండే దైవదూతల వరుస వంటిది. ఒక వ్యక్తి ఒంటరిగా చేసే నమాజు కంటే మరొక వ్యక్తితో కలిసి (జమాఅత్’గా) చేసే నమాజు ప్రతిఫలం మరియు ప్రభావంలో గొప్పది మరియు ఇద్దరు వ్యక్తులతో కలిసి చేసే నమాజు ఒక వ్యక్తితో కలిసి చేసే నమాజు కంటే ఉత్తమమైనది. చాలా మంది ఆరాధకులు పాల్గొన్న నమాజు అల్లాహ్కు మరింత ప్రియమైనది మరియు ఉత్తమమైనది.