





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “అబ్దుర్రహ్మాన్ ఇబ్న్ ఔఫ్ రజియల్లాహు అన్హు భార్య అయిన ఉమ్మె హబీబహ్ బింత్ జహ్ష్ రజియల్లాహు అన్హా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక సమస్యతో వచ్చి (బహిష్ఠు స్థితిలో వచ్చే) రక్తాన్ని గురించి ప్రశ్నించింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెతో ఇలా అన్నారు: “బహిష్ఠు స్థితి సాధారణంగా ఎంత కాలం కొనసాగుతుందో అన్ని రోజులు వేచి ఉండు. తరువాత గుసుల్ చేయి”. అయితే ఆమె ప్రతి సలాహ్ (నమాజు)కు ముందు స్నానం చేసేవారు.”
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం సహచరులలో ఒక మహిళ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి (బహిష్ఠు స్థితికి సంబంధించి) నిరంతరం రక్తస్రావం అవుతున్నట్లు ఫిర్యాదు చేశారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ కొత్త పరిస్థితి ఎదురు కాకముందు, బహిష్ఠు స్థితి, ఆమెను సలాహ్ (నమాజు) ఆచరించకుండా ఎంతకాలం ఆపి ఉంచేదో, అంత కాలం వేచి ఉండి తరువాత గుసుల్ చేసి నమాజు ఆచరించమని ఆదేశించినారు. అయితే ఆమె స్వచ్ఛందంగా ప్రతి సలాహ్ కు ముందు స్నానం చేసేవారు.
అమ్ర్ బిన్ సులైమ్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “అబూ సయీద్ ఇలా అన్నారని నేను సాక్ష్యమిస్తున్నాను: అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని నేను సాక్ష్యమిచ్చి చెబుతున్నాను: వారు ఇలా అన్నారు: “యుక్తవయస్కుడైన ప్రతి ముస్లిం పురుషునిపై శుక్రవారం నాడు గుసుల్ చేయుట (తల స్నానం చేయుట) విధి; అలాగే మిస్వాక్ తో (పలుదోము పుల్లతో) పళ్ళు శుబ్రపరుచుకొనుట మరియు అందుబాటులో ఉన్నట్లయితే అత్తరు పూసుకొనుట కూడా.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం - శుక్రవారము నాటి సలాహ్ ఆచరించుట ఎవరెవరిపై విధి అగునో, యుక్త వయస్కుడైన అటువంటి ప్రతి ముస్లిం శుక్రవారము నాడు గుసుల్ చేయాలి, అది అతనిపై విధి – అని స్పష్టపరిచినారు. అలాగే ‘మిస్వాక్’ పుల్లను, లేదా అటువంటి ఇంకా ఏదైనా పుల్లను (బ్రష్’ను) ఉపయోగించి పళ్ళు శుభ్రపరుచుకొనుట కూడా విధి. అలాగే అందుబాటులో ఉంటే ఏదైనా పరిమళ ద్రవ్యాన్ని (ఉదా: ఏదైనా అత్తరును) పూసుకొనుట కూడా విధి.
అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో పాటు పన్నెండు యుద్ధాలలో పాల్గొన్నారు. ఆయన ఇలా ఉల్లేఖిస్తునారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నేను నాలుగు విషయాలు విన్నాను. అవి నాకు బాగా నచ్చాయి: “ఏ స్త్రీ తన భర్తతో, లేదా ఒక ‘మహ్రం’ తో తప్ప రెండు రోజుల సుదూర ప్రయాణంలో (ఒంటరిగా) ప్రయాణించరాదు; రెండు దినములు ఉపవాసాములు పాటించరాదు ఈద్ అల్ ఫిత్ర్ దినము నాడు, మరియు ఈద్ అల్ అజ్’హా దినము నాడు; ఫజ్ర్ నమాజు తరువాత సూర్యుడు (పూర్తిగా) ఉదయించే వరకు ఏ నమాజు లేదు, అస్ర్ నమాజు తరువాత సూర్యుడు (పూర్తిగా) అస్తమించే వరకు ఏ నమాజు లేదు; మూడు మస్జిదులకు తప్ప తీర్థయాత్ర చేయరాదు – మస్జిదుల్ హరాం, మస్జిదుల్ అఖ్సా, మరియు ఈ మస్జిద్ (అంటే మదీనాలో ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మస్జిద్ - మస్జిదె’నబవీ).”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాలుగు విషయాలను నిషేధించినారు: మొదటిది: ఒక స్త్రీ తన భర్త లేదా ఆమె ‘మహరమ్ పురుషులలో’ ఒకరు లేకుండా రెండు రోజుల సుదూర ప్రయాణంలో (ఒంటరిగా) ప్రయాణించకుండా నిషేధించడం; ‘మహరమ్ పురుషులు’ అంటే ఆమెను వివాహం చేసుకోవడం శాశ్వతంగా నిషేధించబడినవారు, ఉదాహరణకు: ఆమె బంధువులలో - ఆమె కొడుకు, తండ్రి, మామ, సోదరుడు, సొదరుని కొడుకు, సోదరి కొడుకు, తల్లి సోదరులు, లేదా తండ్రి సోదరులు వంటి బంధువులు మొదలైన వారు. రెండవది: ఒక ముస్లిం ఈద్ అల్ ఫిత్ర్ దినము నాడు మరియు ఈద్ అల్ అద్’హా దినము నాడు ఉపవాసము పాటించుటను నిషేధించినారు; అతడు మొక్కుబడిగా మొక్కుకుని ఉన్న ఉపవాసమును పాటించ దలచినా, లేక స్వచ్ఛంద (నఫిల్) ఉపవాసము పాటించ దలచినా, లేక పరిహారంగా పాటించవలసి ఉన్న ఉపవాసమును పాటించదలచినా – ఈ రెండు దినములలో పాటించరాదు. మూడవది: అస్ర్ నమాజు తరువాత సూర్యాస్తమయం వరకు ఏదైనా నఫిల్ నమాజు పాటించుట, మరియు ఫజ్ర్ నమాజు తరువాత సూర్యోదయం వరకు ఏదైనా నఫిల్ నమాజు పాటించుట – ఈ రెండూ నిషేధించబడినవి. నాలుగవది: మూడు మస్జిదులకు తప్ప – ఏదైనా ఒక నిర్దుష్ఠ ప్రదేశానికి, ఆ ప్రదేశము మహత్తు గల ప్రదేశము అని, లేదా అది మహా ఘనత గల ప్రదేశము అని, లేదా ఆ ప్రదేశాన్ని దర్శించడం వల్ల పుణ్యాలు రెట్టింపు అవుతాయని – ఇలాంటి విశ్వాసాలతో ప్రయాణించడం నిషేధించబడినది. కనుక, ఏ ఇతర మస్జిదులకు ప్రత్యేకంగా ప్రయాణం చేసి వెళ్ళరాదు, ఎందుకంటే ఈ మూడు మస్జిదులలో మాత్రమే పుణ్యఫలం రెట్టింపు అవుతుంది – అవి ఒకటి మస్జిదుల్ హరాం, రెండు మస్జిదున్’నబవీ మరియు మూడు మస్జిదుల్ అఖ్సా.
ఊఖ్బహ్ బిన్ ఆమిర్ అల్ జుహనీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “మూడు సమయాలలో రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మమ్ములను నమాజు ఆచరించడం నుండి, మరియు మాలో చనిపోయిన వారిని ఖననం చేయడం నుండి నిషేధించేవారు. వాటిలో (ఒకటి) సూర్యుడు ఉదయించడం మొదలైనప్పటి నుండి పూర్తిగా ఉదయించేంత వరకు, (రెండు) (మిట్టమధ్యాహ్నం) సూర్యుడు నడి నెత్తి మీద ఉన్నప్పుడు, నడినెత్తి నుంచి కొద్దిగా వాలనంత వరకు; మరియు (మూడు) సూర్యుడు అస్తమించడం ప్రారంభమైనప్పటి నుండి అస్తమించడం పూర్తికానంతవరకు – (ఈ మూడు) సమయాలు ఉన్నాయి.”
ముస్లిం నమోదు చేసినారు:దినములో మూడు సమయాలలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు ఆచరించడాన్ని, చనిపోయిన వారిని ఖననం చేయడాన్ని నిషేధించినారు. మొదటి సమయం: సూర్యుడు ఉదయిస్తూ ఉన్నపుడు, అంటే సూర్యుడు పూర్తిగా ఒక బల్లెం అంత ఎత్తుకు ఉదయించనంత వరకు (నమాజు ఆచరించరాదు). ఒక బల్లెం అంత ఎత్తుకు ఉదయించడానికి దాదాపు పావు గంట సమయం పడుతుంది. రెండవది: మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీద ఉన్నపుడు. అపుడు ఒక వస్తువు యొక్క నీడ తూర్పు వైపునకు గానీ లేక పడమర వైపునకు గానీ ఉన్నట్లుగా కనిపించదు, సూర్యుడు నడినెత్తి మీద నుంచి కొద్దిగా వాలనంత వరకు. సూర్యుడు నడినెత్తి మీదనుండి వాలితే అపుడు నీడ పడమర వైపు నుండి కనబడుతుంది. అపుడు జుహ్ర్ నమాజు సమయం మొదలవుతుంది. సూర్యుడు నడి నెత్తి మీద నుండి వాలడాని కొద్ది సమయమే పడుతుంది, దాదాపు ఐదు నిమిశాలు. మూడవది: సూర్యుడు అస్తమించడం ప్రారంభమైనప్పటి నుండి అస్తమించడం పూర్తి కానంత వరకు.
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరూ మీ భుజాలపై ఏ ఆచ్ఛాదనా లేకుండా ఒకే వస్త్రములో సలాహ్ (నమాజు) ఆచరించకండి”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఎవరైనా ఒకే వస్త్రం ధరించి భుజాలను, భుజము మరియు మెడ మధ్య భాగాన్ని, కప్పి ఉంచకుండా, బహిర్గతం చేస్తూ నమాజు ఆచరించడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారు. ఎందుకంటే భుజాలు “ఔరహ్”లో భాగం (ఔరహ్ అంటే శరీరములో అంటే తప్పనిసరిగా కప్పి ఉంచవలసిన ప్రైవేట్ శరీర భాగాలు) కానప్పటికీ, ఔరహ్ భాగాలను కప్పడంతో పాటు వాటిని కప్పడం కూడా సాధ్యమే. ఇది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ముందు నిలబడి, సలాహ్ ఆచరిస్తున్నపుడు, ఆయన గౌరవానికి మరియు ఆయన ఘనతకు దగ్గరగా ఉంటుంది.
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “నమాజులో ఉన్నపుడు ప్రజలు (కొంతమంది) ఆకాశం వైపు చూస్తున్నారు, ఏమైంది వారికి?” ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన మాట కఠినంగా మారింది మరియు ఆయన ఇలా అన్నారు, "వారు దానిని (నమాజు సమయంలో ఆకాశం వైపు చూడటం) ఆపాలి; లేకపోతే వారి కంటి చూపు పోతుంది"
అల్ బుఖారీ నమోదు చేసినారు:నమాజు ఆచరిస్తున్నపుడు లేదా ఇతరత్రా దుఆ చేసేటప్పుడు ఆకాశం వైపు చూసేవారిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హెచ్చరించారు. అలా చేసే వారిపై ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన మందలింపును, హెచ్చరికను తీవ్రతరం చేసినారు – వారి చూపు ఎంత త్వరగా లాగుకోబడుతుందంటే, వారు చూపు అనే భాగ్యాన్ని కోల్పోయే వరకు దానిని గ్రహించలేరు అని తనకు భయంగా ఉంది అని అన్నారు.
అల్ బరా ఇబ్న్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: (నమాజులో) మీరు సజ్దహ్ చేసినపుడు రెండు అరచేతులను నేలకు ఆనించి, రెండు మోచేతులు (నేలపై ఆనకుండా) పైకి ఉండేలా సజ్దహ్ చేయండి.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాహ్ చేయునపుడు సజ్దహ్ లో రెండు చేతుల యొక్క స్థానము ఏమిటో వివరిస్తున్నారు. అది – రెండు అరచేతులను, చేతి వ్రేళ్ళు (విడిగా, విప్పి ఉండేలా కాకుండా) కలిసి ఉండేలా మరియు ఖిబ్లా వైపునకు ఉండేలా చేయాలి. అదే సమయములో మోచేతులను (మోచేయి అంటే భుజపు టెముక మరియు ముంజేయి కలియు భాగము) నేలపై ఆనకుండా మోచేతులను శరీరానికి దూరంగా ఉండేలా, పైకి లేపి ఉంచి సజ్దహ్ చేయాలి.
వాయిల్ ఇబ్న్ హుజ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో నమాజు ఆచరించాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు ముగించుట కొరకు సలాం చెప్పినపుడు తన కుడి వైపునకు “అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” (అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు అనుగ్రము మీపై కురియుగాక) అని, మరియు తన ఎడమ వైపునకు “అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్” (అల్లాహ్ యొక్క శాంతి మరియు కరుణ మీపై కురియుగాక) అని పలికినారు.”
అబూదావూద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన నమాజు ముగించాలని అనుకున్నప్పుడు, తన కుడి మరియు ఎడమ వైపునకు తన ముఖాన్ని తిప్పి సలాం చేసేవారు, అపుడు తన కుడి వైపునకు “అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” (మీపై శాంతి, అల్లాహ్ కరుణ మరియు ఆయన ఆశీర్వాదాలు కురియుగాక) అని, మరియు ఎడమ వైపునకు తన ముఖాన్ని తిప్పి సలాం చేసినపుడు, “అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్” ("మీపై అల్లహ్ యొక్క శాంతి మరియు కరుణ) కురియుగాక అని పలికేవారు.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి, ఆయన ఇలా పలికినారు: “ఎవరైతే (ప్రతిరోజూ విధిగా ఆచరించ వలసిన) ప్రతి నమాజు తరువాత ముప్ఫై మూడు సార్లు “సుబ్’హానల్లాహ్” అని, ముప్ఫై మూడు సార్లు “అల్’హందులిల్లాహ్” అని, ముప్ఫై మూడు సార్లు “అల్లాహు అక్బర్” అని ఉచ్ఛరిస్తాడో, అవి మొత్తం తొంభైతొమ్మిది అవుతాయి”; ఆయన ఇంకా ఇలా అన్నారు: “వాటిని “లాఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లాషరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హమ్దు, వహువ అలాకుల్లి షైఇన్ ఖదీర్” అని ఉచ్ఛరించి మొత్తం వందగా పూర్తి చేస్తాడో, అతని పాపాలన్నీ క్షమించివేయబడతాయి, అవి సముద్రపు నురగ అంత అధికంగా ఉన్నా సరే.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ‘విధిగా ఆచరించవలసిన ప్రతి నమాజు తరువాత ఎవరైతే ఈ క్రింది విధంగా ఉచ్చారిస్తారో: “సుబ్’హానల్లాహ్” అని ముప్ఫైమూడు సార్లు, అంటే దాని అర్థం “అల్లాహ్ లోపాలకు అతీతమైన వాడు” అని; అలాగే “అల్’హమ్దులిల్లాహ్” అని ముప్ఫైమూడు సార్లు, అంటే దాని అర్థం “అన్ని రకాల స్తుతులు, ప్రశంసలు అన్నీ కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే” అని; అంటే ఆయనపై ప్రేమతో, ఆయనను మహిమ పరచడం, దానితో పాటు ఆయన యొక్క పరిపూర్ణ గుణ,లక్షణాలతో ఆయనను స్తుతించడం. అలాగే “అల్లాహు అక్బర్” అని ముప్ఫైమూడు సార్లు, అంటే దాని అర్థం అల్లాహ్ అన్నిటి కంటే మరియు అందరి కంటే గొప్పవాడు మరియు ఘనమైన వాడు, దివ్యమైనవాడు అని అర్థం – అలా ఉచ్ఛరించి; వాటిని ఈ పదాలతో వాటి సంఖ్య మొత్తం వంద పూర్తి అయ్యేలా చేయాలి: “లాఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లాషరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హందు, వహువ అలాకుల్లి షైఇన్ ఖదీర్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన అద్వితీయుడు (ఏకైకుడు); తనకు సమానం గానీ, సాటి గానీ, భాగస్వాములు గానీ ఎవరూ లేని వాడు, విశ్వ సామ్రాజ్యం ఆయనదే, ప్రశంసలు, పొగడ్తలు అన్నీ ఆయనకే చెందుతాయి, ఆయన ప్రతి విషయంపై అధికారం గలవాడు) – అంటే దాని అర్థము: ఏకైకుడూ, తన ప్రభుతలో సాటి గానీ, భాగస్వామి గానీ ఎవరూ లేని వాడు అయిన అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ఆయనే లోపాలకు అతీతుడు, పరమ పవిత్రుడు, మరియు విశ్వసామ్రాజ్యంపై సంపూర్ణ ఆధిపత్యం గలవాడు. మరియు ఆయనే అందరికంటే ఎక్కువగా ప్రశంసలు, ప్రేమ మరియు గౌరవాలకు అర్హుడు. ఆయన సర్వశక్తిమంతుడు, సమర్థుడు మరియు ఏ విషయామూ ఆయనను అశక్తుని, నిస్సహాయుని చేయలేదు; ఆయన శక్తిని అధిగమించగలిగినది ఏదీ లేదు. ఎవరైతే అలా పలికి వంద పూర్తి చేస్తారో, అతడి పాపాలన్నీ తుడిచివేయబడతాయి, అతడు క్షమించబడతాడు; అతడి పాపాలు సముద్రం ఉప్పొంగినప్పుడు మరియు ఉధృతంగా ఉన్నప్పుడు పైకి లేచే తెల్లని నురుగ లాగా ఎంత అధికంగా ఉన్నప్పటికీ.