





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
సుఫ్యాన్ ఇబ్న్ అబ్దుల్లాహ్ అస్సఖఫీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్, నేను మిమ్మల్ని తప్ప మరింకెవరినీ ప్రశ్నించ వలసిన అవసరం లేని విధంగా – నాకు ఇస్లాం ను గురించి బోధించండి.” దానికి ఆయన ఇలా అన్నారు: “నేను అల్లాహ్ ను విశ్వసించాను” అని (మనస్పూర్తిగా) పలుకు; మరియు దానిపై స్థిరంగా ఉండు.”
ముస్లిం మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాలలో ఒకరైన సుఫ్యాన్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు. “ఇస్లాం యొక్క అర్థం పూర్తిగా, సమగ్రంగా పొందుపరిచి ఉండేలా; తద్వారా తాను దానికి విశ్వాసపాత్రునిగా ఉండేలా, మరియు దాని గురించి ఇంకెవరినీ ప్రశ్నించే అవసరం లేని విధంగా, ఒక వాక్యాన్ని తనకు బోధించమని” ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను అడిగాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో (మనస్ఫూర్తిగా) ఇలా పలుకు అన్నారు: “నేను అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని స్థిరపరుస్తున్నాను, ఆయనను విశ్వసిస్తున్నాను, ఆయనే నా ప్రభువు, మరియు ఆయనే ఏకైక ఆరాధ్యుడు, ఆయనే నా సృష్టికర్త, మరియు ఆయనే నేను సత్యపూర్వకంగా ఆరాధించేవాడు, ఆయనకు సాటి, సమానులు ఎవరూ లేరు”. “తరువాత అల్లాహ్ అనుమతించిన మరియు ఆదేశించిన వాటిని ఆచరిస్తూ, ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉంటూ ఆయనకు విధేయునిగా ఉండు, ఆ విధేయతపై స్థిరంగా ఉండు.”
అబ్దుల్లాహ్ బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా, తీర్పు దినము నాడు నా ఉమ్మత్’ నుండి అల్లాహ్ ఒక వ్యక్తిని ఎన్నుకుని సృష్టి అంతటి ముందు హాజరు పరుస్తాడు. అతడి ముందు (చెడు కర్మలు రాయబడిన) తొంభైతొమ్మిది దస్తావేజులు పరుచబడతాయి. ఒక్కొక్కటి కంటిచూపు మేర దూరమంత పెద్దవిగా ఉంటాయి. అప్పుడు ఆయన (అల్లాహ్) ఇలా పలుకుతాడు “వీటిలో ఏ ఒక్కదానినైనా నిరాకరించగలవా నీవు? వీటిని రాసిన వారు (తప్పుగా రాసి) నీకు ఏమైనా అన్యాయం చేసినారా?” దానికి అతడు “లేదు నా ప్రభూ!” అంటాడు. అపుడు ఆయన “మరి నీ వద్ద జావాబు ఏమైనా ఉందా?” అని అడుగుతాడు. దానికి అతడు “లేదు నా ప్రభూ!” అంటాడు. అపుడు అల్లాహ్ “నిశ్చయంగా మావద్ద నీవు చేసిన ఒక మంచి పని ఉన్నది. ఈ దినము నీకు ఎటువంటి అన్యాయమూ జరుగదు” అని ఒక పత్రాన్ని బయటకు తీస్తాడు. దానిపై “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు” (నేను సాక్ష్యమిస్తున్నాను అల్లహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుదు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన యొక్క దాసుడు మరియు సందేశహరుడు”). అల్లాహ్ అతనితో “నీ కర్మల త్రాసును తీసుకురా” అంటాడు. దానికి అతడు “ఓ నా ప్రభూ! నా పాపపు పనుల ఈ చిట్ఠాల (బరువు) ముందు ఈ కాగితం ముక్క ఏమి పనికి వస్తుంది?” అంటాడు. అపుడు ఆయన “ఈ దినము నీకు ఎలాంటి అన్యాయం జరుగదు” అని బదులిస్తాడు. పాపపు కర్మల చిట్ఠాలు త్రాసులో ఒక పళ్ళెంలో ఉంచబడతాయి. మరొక పళ్ళెం లో ఆ పత్రం ఉంచబడుతుంది. పాపపు కర్మ చిట్టాలు తేలికగా పైకి లేచిపోతాయి. ఆ పత్రం మహా బరువుగా తూగుతుంది. ఎందుకంటే అల్లాహ్ పేరు కంటే బరువైనది ఏదీ లేదు”.
అత్తిర్మిదీ మరియు ఇబ్నె మాజహ్ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పేర్కొన్నారు: తీర్పు దినము నాడు అల్లాహ్ సృష్టి మొత్తములో తన ఉమ్మత్ నుండి ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు అతడి లెక్కా పత్రము చూడడానికి. అల్లాహ్ అతడి ముందు తొంభైతొమ్మిది దస్తావేజులను ఉంచుతాడు. అందులో అతడు ప్రపంచములో చేసిన చెడు పనులన్నీ నమోదు చేయబడి ఉంటాయి. ఒక్కొక్క దస్తావేజు ఎంత పొడవుగా ఉంటుందంటే కను చూపు మేర దూరమంత పెద్దగా ఉంటుంది. అపుడు అల్లాహ్ అతడితో “ఈ దస్తావేజులలో రాయబడి ఉన్న వాటిలో ఏ ఒక్క దానినైనా నీవు నిరాకరిస్తావా?" రక్షక దైవదూతలు (రాయడంలో) ఏమైనా అన్యాయం చేసారా?” అని ప్రశ్నిస్తాడు. ఆ వ్యక్తి “లేదు నా ప్రభూ!” అని సమాధానమిస్తాడు. అపుడు అల్లాహ్ “ప్రపంచంలో ఆచరించి వచ్చిన వీటి గురించి మరి నీ సమాధానం ఏమిటి? ఏమైనా (చేయవలసిన పనిని) వదిలి వేయడం ద్వారా నీ వల్ల చెడు జరిగిందా, లేక ఏమైనా తప్పు జరగడం వల్ల చెడు జరిగిందా, లేక అఙ్ఞానం కారణంగా చెడు జరిగిందా?” అని ప్రశ్నిస్తాడు. ఆ మనిషి “ఓ నా ప్రభూ! నావద్ద సమాధానం ఏమీ లేదు” అంటాడు. అపుడు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు “(వాటన్నింటితో పాటు) మా వద్ద నీవు చేసిన ఒక మంచి పని కూడా ఉంది. ఈ రోజు నీకు ఎలాంటి అన్యాయమూ జరుగదు”. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అపుడు అల్లాహ్ ఒక పత్రాన్ని బయటకు తీస్తాడు. దానిపై “అష్’హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు” (నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుదు ఎవరూ లేరు, మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన యొక్క దాసుడు మరియు సందేశహరుడు”) అని రాసి ఉంటుంది. మహోన్నతుడైన అల్లాహ్ అతనితో “నీ కర్మల త్రాసు తీసుకునిరా” అంటాడు. ఆ మనిషి అమితాశ్చర్యంగా “ఓ నా ప్రభూ! ఈ చిట్ఠాల బరువు ముందు ఈ కాగితం ముక్క ఏమి బరువు తూగుతుంది?” అంటాడు. అపుడు అల్లాహ్ “నీకు ఏమాత్రం అన్యాయం జరుగదు” అని సమాధానమిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు: ఆ పాపపు కర్మ చిట్ఠాలు ఒక పళ్ళెం లో, ఆ కాగితపు ముక్క మరొక పళ్ళెం లో ఉంచబడతాయి. ఆ కాగితపు ముక్క ఉంచిన పళ్ళెం ఎక్కువ బరువు తూగుతుంది. అంతే అల్లాహ్ అతడిని క్షమిస్తాడు.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “అల్లాహ్ స్వర్గమును మరియు నరకమును సృష్టించినపుడు, జిబ్రయీల్ అలైహిస్సలాం ను స్వర్గము వైపునకు పంపుతూ ఇలా అన్నాడు “దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు”. ఆయన స్వర్గానికి వెళ్ళి దానిని చూసాడు, మరియు అల్లాహ్ అందులో ఏమేమి తయారు చేసి ఉంచినాడో చూస్తాడు. (తిరిగి వచ్చి) జిబ్రయీల్ అలైహిస్సలాం ఇలా అంటాడు “నీ ఘనత సాక్షిగా, దాని గురించి విన్న వారు ఎవరైనా దాని లోనికి ప్రవేశించాలని తప్ప మరేమీ కోరుకోరు.” అల్లాహ్ తన ఆదేశముతో స్వర్గాన్ని (స్వర్గంలో చేరే మార్గాన్ని) కఠిన పరిస్థితులు, కష్టాలు, కడగండ్లు, శ్రమ, ప్రయాస మొదలైనవి చుట్టుకుని ఉండేలా చేసాడు. అపుడు (జిబ్రయీల్ అలైహిస్సలాంతో) అల్లాహ్ ఇలా అన్నాడు “తిరిగి వెళ్ళు, దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు.” కనుక ఆయన (జిబ్రయీల్) స్వర్గానికి తిరిగి వెళ్ళాడు. స్వర్గము కఠిన పరిస్థితులు, కష్టాలు, కడగండ్లతో చుట్టుకుని ఉండడం చూసాడు. అతడు అల్లాహ్ వద్దకు వచ్చి ఇలా అన్నాడు “నీ ఘనత సాక్షిగా, ఎవరూ అందులోనికి ప్రవేశించలేరు.” అపుడు అల్లాహ్ ఆయనతో “నరకానికి వెళ్ళు, దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు” అన్నాడు. ఆయన దానిని వెళ్ళి చూసాడు. (అది ఎన్నో భాగాలుగా ఉంది) దాని ఒక భాగము మరొక భాగముపై పేర్చబడి ఉన్నది. ఆయన తిరిగి వచ్చి “నీ ఘనత సాక్షిగా, ఎవరూ దానిలోనికి ప్రవేశించరు” అన్నాడు. అపుడు అల్లాహ్ తన ఆదేశముతో నరకాన్ని వాంఛలు, కోరికలు మొదలైనవి చుట్టుకుని ఉండేలా చేసాడు. తరువాత జిబ్రయీల్ అలైహిస్సలాంతో అల్లాహ్ ఇలా అన్నాడు “తిరిగి వెళ్ళు, దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు.” ఆయన వెళ్ళి దానిని చూసాడు. అది వాంఛలు, కోరికలతో ఆవరించబడి ఉన్నది. ఆయన తిరిగి వచ్చి “నీ ఘనత సాక్షిగా! అందులోనికి వెళ్ళి పడిపోవడం తప్ప, దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు అని భయంగా ఉన్నది” అన్నాడు.
అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అన్నసాయీ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ క్రింది విషయాలు తెలియజేస్తున్నారు: అల్లాహ్ స్వర్గాన్ని మరియు నరకాన్ని సృష్టించినపుడు ఆయన జిబ్రయీల్ అలైహిస్సలాం తో ఇలా అన్నారు “వెళ్ళు, వెళ్ళి స్వర్గాన్ని చూడు”. ఆయన వెళ్ళి స్వర్గాన్ని చూసి వచ్చాడు. (తిరిగి వచ్చి) జిబ్రయీల్ అలైహిస్సలాం ఇలా అన్నాడు “ఓ ప్రభూ! నీ ఘనత సాక్షిగా, దానిని గురించి, దానిలో ఉన్న సుఖాలూ, సంతుష్ఠి, గౌరవం, సంపదలూ మొదలైన వాటి గురించి విన్న వారెవరైనా అందులోనికి ప్రవేశించాలని తప్ప మరేమీ కోరుకోరు. మరియు దాని కొరకు శ్రమిస్తారు”. అపుడు అల్లాహ్ స్వర్గాన్ని ఆయన ఆదేశాలను ఆచరించడంలోని కష్టాలతో; ఆయన నిషేధించిన విషయాలనుండి దూరంగా ఉండలేని కష్టాలు, ఆకర్షణలు, మరియు కడగండ్లు చుట్టుకుని ఉండేలా చేసాడు. ఎవరైతే దానిలోనికి ప్రవేశించాలని కోరుకుంటారో వారు ఖచ్చితంగా వాటన్నింటినీ దాటవలసి ఉంటుంది. అపుడు అల్లాహ్ జిబ్రయీల్ అలైహిస్సలాం తో “ఓ జిబ్రయీల్! వెళ్ళు, ఇపుడు కఠిన పరిస్థితులు, కష్టాలు, కడగండ్లతో చుట్టుకుని ఉన్నస్వర్గాన్ని చూసిరా” అన్నాడు. ఆయన వెళ్ళి, దానిని చూసి తిరిగి వచ్చి ఇలా అన్నాడు “ఓ ప్రభూ! నీ ఘనత సాక్షిగా చెబుతున్నాను, నాకు భయంగా ఉంది, స్వర్గాన్ని చేరుకునే మార్గంలో, దానిని చుట్టుకుని ఉన్న కష్టాలు, బాధలు, కడగండ్లు మొదలైన వాటి కారణంగా ఎవరూ దానిలోనికి ప్రవేశించలేరేమో”. అదేవిధంగా, అల్లాహ్ నరకాన్ని సృష్టించినపుడు “ఓ జిబ్రయీల్! వెళ్ళు, వెళ్ళి దానిని చూడు” అన్నాడు. ఆయన వెళ్ళి దానిని చూసాడు. తిరిగి వచ్చి జిబ్రయీల్ అలైహిస్సలాం ఇలా అన్నాడు “ఓ ప్రభూ! నీ ఘనత సాక్షిగా చెబుతున్నాను, అందులో ఉన్న భయంకర శిక్షలు, హింస, దుఃఖము, దురవస్థ, పరాభవము, అవమానము మొదలైన వాటిని గురించి విన్న వారెవరైనా అందులోనికి ప్రవేశించడాన్ని ఏ మాత్రమూ ఇష్టపడరు, మరియు దానిలోనికి తీసుకుని వెళ్ళే ప్రతి కారణం నుండి దూరంగా ఉంటారు.” అపుడు మహోన్నతుడూ, మహోత్కృష్టుడు అయిన అల్లాహ్ నరకాగ్నిని వాంఛలు, కోరికలు, సౌందర్యాలతో ఆవరింపజేసాడు. అపుడు ఇలా అన్నాడు “ఓ జిబ్రయీల్! వెళ్ళు, నరకాగ్నిని ఒకసారి చూడు”. అపుడు జిబ్రీల్ వెళ్ళి నరకాగ్నిని చూసాడు. తిరిగి వచ్చి ఇలా అన్నాడు “ఓ ప్రభూ! నీ ఘనత సాక్షిగా చెబుతున్నాను. దానిని చూసి నేను భయపడ్డాను – దానిని చుట్టుకుని ఉన్న ఆకర్షణలు, వాంఛలు, కోరికల కారణంగా దానిలో పడిపోవడం నుండి ఎవరూ తప్పించుకోలేరు”.
అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఆకాశాలనూ మరియు భూమినీ సృష్ఠించడానికి యాభై వేల సంవత్సరాలకు పూర్వమే అల్లాహ్ సృష్టితాలన్నింటి భవితవ్యాన్ని రాసి ఉంచినాడు”. ఆయన ఇంకా ఇలా అన్నారు “ఆయన సింహాసనం నీటిపై ఉన్నది”.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: సృష్ఠితాల భవితవ్యానికి సంబంధించి ఏమి జరుగనున్నది అనేది అల్లాహ్ చాలా విపులంగా రాసాడు; ఉదాహరణకు వాటి జీవిత కాలాన్ని గురించి, వాటి మరణాన్ని గురించి, వాటి ఉపాధి గురించి – ఇలా అనేక విషయాలను గురించి, ఈ ఆకాశాలు, మరియు భూమిని ఆయన సృష్టించడానికి యాభై వేల సంవత్సరాలకు పూర్వమే చాలా వివరంగా రాసి, ‘లౌహ్ అల్ మహ్’ఫూజ్’ లో (భద్రపరుచబడిన ఫలకములో) భద్ర పరిచాడు. ప్రతి విషయమూ ఆయన ఆదేశించిన విధంగానే జరుగుతుంది. ప్రతి విషయము, ప్రతి వస్తువు మొదలైన ప్రతి దాని యొక్క ఉనికి, భవితవ్యము అల్లాహ్ ఇచ్ఛానుసారమే ఉంటుంది. దాసునిపై వచ్చి పడేది ఏదీ అతనిని చేరకుండా ఉండదు, అతనిది కానిది ఏదీ అతనిని ఎన్నటికీ చేరదు.
జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను: “(ముస్లిం) మనిషికి మరియు బహుదైవారాధన, అవిశ్వాసములకు మధ్య వ్యత్యాసము ఏమిటంటే – సలాహ్’ను (నమాజును) వదిలివేయుట.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధిగా ఆచరించవలసిన నమజులను వదిలివేయుట గురించి తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఒక (ముస్లిం) వ్యక్తికి మరియు అతడు బహుదైవారాధనలో, అవిశ్వాసములో పడిపోవడానికి మధ్య ఉన్న భేదం ఏమిటంటే అతడు నమాజును వదిలివేయడం. ఇస్లాం మూలస్థంభాలలో ‘సలాహ్’ (నమాజు) రెండవ మూలస్థంభము. ఇస్లాంలో నమాజు యొక్క ప్రాముఖ్యత, ఘనత మరియు ఔన్నత్యము చాలా గొప్పవి. ముస్లిములందరి ఏకాభిప్రాయము ప్రకారము – ఎవరైతే నమాజు ఆచరించుట విధి అనే విషయాన్ని విశ్వసించడో మరియు నమాజు ఆచరించుటను వదిలివేస్తాడో అతడు అవిశ్వాసానికి పాల్బడిన వాడిగా పరిగణించబడతాడు. అలాగే ఎవరైనా సోమరితనం కారణంగా, లేక నిర్లక్ష్యము కారణంగా నమాజు ఆచరించుటను పూర్తిగా వదిలివేసినట్లయితే – అలాంటి వాడు కూడా అవిశ్వాసిగా పరిగణించబడతాడు. ఈ విషయముపై సహాబాల ఏకాభిప్రాయము నమోదు చేయబడి ఉన్నది. ఒకవేళ ఎవరైనా కొన్నిసార్లు ఆచరిస్తూ, కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్లయితే అతడు తీవ్రమైన హెచ్చరిక పరిధిలో ఉన్నాడని అర్థము.
బురైదహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “మనకు (విశ్వాసులకు) మరియు వారికి (అవిశ్వాసులకు) మధ్య ఉన్న ప్రమాణము (భేదము) సలాహ్ (నమాజు). ఎవరైతే సలాహ్ వదలివేసాడో అతడు అవిశ్వాసానికి పాల్బడినట్లే.”
అత్తిర్మిదీ, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీసులో – ముస్లిములకు మరియు ముస్లిమేతరులకు అంటే అవిశ్వాసులకు మరియు కపటవిశ్వాసులకు మధ్య ఉన్న ప్రమాణము సలాహ్ (నమాజు) అని, ఎవరైతే సలాహ్ ను వదిలి వేసినాడో అతడు అవిశ్వాసానికి పాల్బడినవాడు అవుతాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసినారు.
ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నిశ్చయంగా అల్లాహ్, మీ తండ్రులు, తాతముత్తాతల పేర్ల మీద ఒట్టు పెట్టుకోవడాన్ని, ప్రమాణం చేయడాన్ని నిషేధించినాడు.” ఉమర్ రజియల్లాహు అన్హు కొనసాగిస్తూ ఇంకా ఇలా అన్నారు “అల్లాహ్ సాక్షిగా (చెబుతున్నాను); రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఆ మాటను విన్నప్పటినుండి (ఒట్టువేసి) నేను ఏదైనా చెప్పాలన్నా, లేక ఎవరి మాటనైనా (ఒట్టు వేసి) చెప్పాలన్నా ఎప్పుడూ నా తండ్రి, తాతముత్తాతల పేర్ల మీద ఒట్టు వేయలేదు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాత, ముత్తాతల పేర్ల మీద ఒట్టు వేయడాన్ని, వారి పేర్లమీద ప్రమాణం చేయడాన్ని నిషేధించినారు. కనుక ఎవరైనా ఒట్టువేయవలసిన, లేక ప్రమాణం చేయవలసిన పరిస్థితివస్తే అల్లాహ్ పేరున ప్రమాణం చేయాలి (ఒట్టువేయాలి); అంతే తప్ప వేరే ఇంకెవరి పేరునా ఒట్టువేయడం లేక ప్రమాణం చేయడం చేయరాదు. తరువాత ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఇలా ప్రస్తావించారు – రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఆ మాటలు విన్నప్పటి నుండి తాను ఆ విధంగా ఎప్పుడూ సంకల్ప పూర్వకంగా గానీ, లేక వేరే వారి మాటల విషయంలో గానీ అల్లాహ్ పేరున తప్ప ఇతరుల పేరున ఒట్టు పెట్టుకోవడం లేక ప్రమాణం చేయడం చేయలేదు.
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “పునరుత్థాన దినమున తీర్పు చేయబడే మొదటి విషయం – అక్రమంగా చిందించబడిన రక్తము” (అన్యాయంగా, అధర్మంగా ఎవరినైనా చంపడం, హత్య చేయడం.)
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు: పునరుత్థాన దినమున ప్రజల మధ్య తీర్పు చేయబడే మొదటి విషయం – అన్యాయంగా, అధర్మంగా ఒకరిపై మరొకరు చేసిన రక్తపాతం. అంటే అన్యాయంగా, అధర్మంగా ఒకరి ప్రాణం తీయడం, లేదా గాయపరచడం మొదలైనవి.
ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు సమాధుల ప్రక్క నుండి వెళ్ళడం జరిగింది. ఆయన (అక్కడ ఆగి) ఇలా అన్నారు: “వీటిలో ఉన్నవారు శిక్షించబడుచున్నారు; కానీ పెద్ద పాపము చేసినందుకు కాదు. వారిలో ఒకడు మూత్రము (తనపై చిందుట) నుండి తనను తాను రక్షించుకునేవాడు కాడు, రెండవ వాడు జనుల పట్ల అపవాదులు ప్రచారం చేస్తూ ఉండేవాడు.” తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెట్టు నుండి ఒక తాజా రెమ్మను తీసుకుని, దానిని రెండు భాగాలుగా చీల్చి, ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క సమాధిపై ఉంచినారు. ఆయనతో ఉన్నవారు ఇలా అడిగారు: “ఓ రసూలుల్లాహ్! అలా ఎందుకు చేసినారు?” దానికి ఆయన “ఆ రెమ్మలు పచ్చగా (ఎండిపోకుండా) ఉన్నంత వరకు బహుశా వారి శిక్ష తగ్గించబడవచ్చు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు సమాధుల ప్రక్కనుండి వెళ్ళడం జరిగింది. అపుడు వారు ఇలా అన్నారు: “ఈ సమాధులలో ఉన్నవారు నిశ్చయంగా శిక్షించబడు చున్నారు. మీ దృష్టిలోని ఘోరమైన పాపములలో ఏదో ఒకటి చేసినందుకు వారు శిక్షించబడుటలేదు; కానీ అది అల్లాహ్ దృష్టిలో ఘోరమైనది. వారిలో ఒకడు మూత్ర విసర్జన చేయునపుడు మూత్రపు చుక్కలు చింది తన శరీరముపై, బట్టలపై పడకుండా జాగ్రత్త పడేవాడు కాదు. రెండవ వాడు వ్యక్తుల మధ్య విభేదాలు మరియు చీలికలను కలిగించే, ఉద్దేశ్యంతో ప్రజల మధ్య ఇతరుల మాటలను ప్రసారం చేస్తూ ఉండేవాడు.