





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షములో ఉన్నాము. అప్పుడు ఆయన ఇలా పలికినారు: “మీలో వివాహం చేసుకోగల స్థోమత కలిగిన వారు వివాహం చేసుకోవాలి. ఎందుకంటే (ఇది ఇతర మహిళలను చూడకుండా) చూపులను నిగ్రహిస్తుంది, మరియు (చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలలో పడకుండా) మర్మాంగాలను రక్షిస్తుంది. మరియు ఎవరైనా అలా చేయలేకపోతే (వివాహం చేసుకునే స్థోమత లేకపోయినట్లైతే), అతడు ఉపవాసం ఉండాలి, ఎందుకంటే అది అతనికి రక్షణగా ఉంటుంది.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం, లైంగిక సంపర్కం చేయగలిగే సామర్థ్యము మరియు వివాహ ఖర్చులను భరించగలిగే స్థోమత కలిగిన వారిని వివాహం చేసుకోవాలని కోరారు. ఇది నిషేధించబడిన వాటి నుండి వారి దృష్టిని కాపాడుతుంది, వారి మర్మావయవాలను మరింత రక్షిస్తుంది మరియు అనైతికతకు పాల్పడకుండా వారిని నిరోధిస్తుంది ఎవరైతే లైంగిక సంపర్కం చేయగలిగే సామర్థ్యము కలిగి ఉండి, వివాహ ఖర్చులను భరించగలిగే స్థోమత లేనట్లైతే అటువంటి వాడు ఉపవాసాలు పాటించాలి. అది అతని మర్మావయవాల కోరికను తగ్గిస్తుంది మరియు వీర్యం యొక్క హానిని నిరోధిస్తుంది.
ఉఖ్బహ్ ఇబ్న్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఉఖ్బహ్ ఇబ్న్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “స్త్రీలు ఒంటరిగా ఉన్నపుడు వారిని కలవడం నుండి జాగ్రత్తగా ఉండండి”. అది విని అన్సారులలో నుండి ఒక వ్యక్తి “మరి “హమ్’వ” (భర్త తరఫు పురుష బంధువు) ను గురించి మీరు ఏమంటారు?” అని ప్రశ్నించాడు. దానిని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “హమ్’వ” అంటే మరణమే” అన్నారు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరాయి స్త్రీలతో కలసి ఉండరాదని హెచ్చరిస్తూ ఇలా అన్నారు: స్త్రీలు ఉన్న ప్రాంతంలో ప్రవేశించకుండా జాగ్రత్త వహించండి మరియు మీరు ఉన్న చోట స్త్రీలు ప్రవేశించకుండా జాగ్రత్త వహించండి. అది విని అన్సారులకు చెందిన ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను “ఒకవేళ ఆమె వివాహం అతనితో జరిగి ఉండకపోతే, ఆమె వివాహం చేసుకోవడానికి అనుమతి ఉన్న అతని తరఫు బంధువులు (అంటే భర్త తరఫు బంధువులు), ఉదాహరణకు అతని సోదరుడు, అతని మేనల్లుడు (సోదరుని కుమారుడు, లేక సోదరి కుమారుడు), లేక అతడి చిన్నాన్న, లేక అతడి చిన్నాన్న కుమారుడు, మొదలైన వారి గురించి మీరు ఏమంటారు?” అని ప్రశ్నించాడు (అంటే వాళ్ళు ఆమె ఉన్న చోటులోనికి వెళ్ళవచ్చునా? అని ప్రశ్నించాడు). దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు: మీరు మరణం గురించి మీరు ఏవిధంగానైతే జాగ్రత్త పడతారో, అటువంటి బంధువు పట్ల కూడా అదే విధంగా జాగ్రత్తగా ఉండండి! ఎందుకంటే భర్తకు సంబంధించిన అటువంటి మగ బంధువులతో ఒంటరిగా ఉండడం ధర్మములో ప్రలోభాలకు మరియు విధ్వంసానికి దారి తీస్తుంది. భర్త బంధువులు, ఉదాహరణకు అతడి తండ్రులు (అంటే, అతని తండ్రి, చిన్నాన్న, పెదనాన్నలు, అతని తాత, ముత్తాత మొ.) మరియు అతని కొడుకులు కాకుండా, స్త్రీలు ఉన్న ప్రదేశం లోనికి ప్రవేశించకుండా నిరోధించబడడానికి, ఇటువంటి బంధువులు పరాయి మగవారి కంటే ఎక్కువ అర్హులు. ఎందుకంటే, పరాయి పురుషుల కంటే, భర్త బంధువులు ఆమె ఉన్న ప్రదేశం లోనికి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ. కనుక ఇటువంటి బంధువు నుండి చెడు చోటు చేసుకునే అవకాశం కూడా ఎక్కువే. ఆమెతో ఒంటరిగా ఉండే అవకాశం కారణంగా అతడి నుండి దురాకర్షణ ప్రబలే ప్రమాదము మరియు ఆమె దానికి లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరియు బంధుత్వం కారణంగా అతడు ఆ స్త్రీని చేరుకునే, ఆమెతో ఏకాంతంగా గడిపే అవకాశాలు అతనికి ఎక్కువగా లభిస్తాయి. బంధుత్వం కారణంగా అతని ఉనికి అనివార్యమైనందున అతడిని ఆమె నుంచి దూరంగా ఉంచడం సాధ్యం కాదు కూడా. మన ఇళ్ళలో ఒక వ్యక్తి తన సోదరుని భార్య ఒంటరిగా ఉన్నపుడు ఆమె దగ్గరికి వెళ్ళడాన్ని, ఆమెతో అక్కడ ఉండడాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. అందుకు అతడు నిందించబడడు కూడా. కనుక అటువంటి ఇళ్ళలో ఒక వ్యక్తి తన సోదరుని భార్యను ఏకాంతంలో సులభంగా కలుసుకోగలడు. ఈ స్థితి, అది దారితీసే భయంకరమైన చెడు పరిణామాల పరంగా మరణానికి సమానమైనదై ఉంటుంది. అదే పరాయి పురుషుని విషయాన్ని తీసుకుంటే, మన స్త్రీల దగ్గరికి వెళ్ళకుండా ముందే అడ్డుకోబడతాడు.
మాలిక్ ఇబ్న్ ఔస్ ఇబ్న్ అల్-హదథాన్ ఉల్లేఖన: “(దీనార్లకు బదులుగా) దిర్హమ్’లను మార్పిడి చేసేవారు ఎవరైనా ఉన్నారా?” అంటూ నేను అక్కడ ప్రవేశించినాను. అక్కడ తల్హా ఇబ్న్ ఉబైదుల్లాహ్, ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హుమా) ఉన్నారు. తల్హా ఇబ్న్ ఉబైదుల్లాహ్ (ర) ఇలా అన్నారు: “ముందు నీవు తెచ్చిన బంగారాన్ని చూపించు, కొద్దిసేపటి తరువాత తిరిగిరా, అప్పుడు నా సేవకుడు నీకు వెండి నాణాలను ఇస్తాడు”. అది విని ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “అల్లాహ్ సాక్షిగా (చెబుతున్నాను) ఇది సరికాదు. నువ్వు ఇప్పుడే అతనికి వెండి నాణాలను ఇవ్వు, లేదా అతని బంగారం అతనికి తిరిగి ఇచ్చివేయి, ఎందుకంటే, నిశ్చయంగా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “బంగారానికి బదులుగా వెండి అక్కడికక్కడే (ఉన్న చోటునే) మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది; అలాగే గోధుమలకు బదులుగా గోధుమలు అక్కడికక్కడే మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది; బార్లీ గింజలకు బదులుగా బార్లీ గింజలు అక్కడికక్కడే మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది; ఖర్జూరాలకు బదులుగా ఖర్జూరాలను అక్కడికక్కడే మార్పిడి చేసుకోకపోతే – అది ‘రిబా’ (వడ్డీ) అవుతుంది.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు‘తాబయీ’ అయిన మాలిక్ ఇబ్న్ ఔస్ ఇలా తెలియ జేస్తున్నారు: తన వద్ద బంగారు దీనార్లు ఉన్నాయని, తాను వాటిని వెండి దిర్హంలతో మార్పిడి చేయాలనుకున్నానని, అపుడు తల్హా ఇబ్న్ ఉబైదుల్లాహ్ (ర) తనతో ఇలా అన్నారు: “ముందుగా నీ దీనార్లను నాకు ఇవ్వు, నన్ను పరిశీలించనివ్వు”. ఆయన వాటిని పరిశీలించిన తరువాత వాటిని కొనడానికి నిశ్చయించుకుని అతనితో ఇలా అన్నారు: “ప్రస్తుతం నా సేవకుడు లేడు, అతడు వచ్చిన తరువాత నీకు దిర్హంలను ఇస్తాను. నీవు వెళ్ళి తరువాత రా”. అది విని అక్కడే ఉన్న ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఈ లావాదేవీ బేరాన్ని ‘ఇది సరికాదు’ అంటూ ఆక్షేపించినారు. అల్లాహ్ సాక్షిగా ఒట్టు పెట్టుకుని తల్హా ఇబ్న్ ఉబైదుల్లాహ్ (ర) తో అప్పటికప్పుడే అతనికి వెండి దిర్హంలను చెల్లించమని, లేదా అతని బంగారు దీనార్లు అతనికి తిరిగి ఇచ్చివేయమని చెప్పి, అందుకు కారణాన్ని ఇలా వివరించినారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బంగారానికి బదులుగా వెండి, లేదా వెండికి బదులుగా బంగారం మార్పిడి చేసుకునే లావాదేవీ వ్యవహారంలో వాటిని అక్కడికక్కడే (ఉన్న చోటునే) మార్పిడి చేసుకోవాలి, లేకపోతే అది వడ్డీ ఆధారిత లావాదేవీ వ్యవహారం అవుతుంది, అది హరాం. మరియు ఆ లావాదేవీ వ్యవహారం చెల్లుబాటు కానిది అవుతుంది. వెండికి బదులుగా బంగారం అమ్మబడదు, అలాగే బంగారానికి బదులుగా వెండి అమ్మబడదు – అవి ఉన్నచోటునే (అక్కడికక్కడే) మార్పిడి చేసుకోబడితే తప్ప. అంతేకాకుండా, గోధుమలకు బదులుగా గోధుమలను, బార్లీకి బదులుగా బార్లీని, మరియు ఖర్జూరాలకు బదులుగా ఖర్జూరాలను విక్రయించరాదు; అయితే అవి తూగిన బరువుకు సమానంగా ఇవ్వబడితే తప్ప, లేక కొలిచిన కొలతకు సమానంగా కొలిచి ఇస్తే తప్ప మరియు అవి వెంటనే, అక్కడికక్కడే ఇచ్చివేయబడాలి (చేతులు మారాలి); అలాకాకుండా కొద్దికాలం వాయిదా తరువాత చెల్లించేలా విక్రయించుట చేయరాదు.
ఉథ్మాన్ ఇబ్న్ అబీ అల్ అథ్’థఖఫీ (రదియల్లాహు అన్హు) తాను ఇస్లాం స్వీకరించిన తరువాత నుండి తన శరీరంలో ఒక భాగంలో కలుగుతున్న నొప్పి యొక్క బాధను గురించి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఫిర్యాదు చేసినానని, దానికి రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు అని ఉల్లేఖిస్తున్నారు: “నీ శరీరంలో ఏభాగములోనైతే నొప్పి పెడుతున్నదో దానిపై నీ చెతిని ఉంచు, తరువాత “బిస్మిల్లాహ్” (అల్లాహ్ నామముతో) అని మూడుసార్లు పఠించు; తరువాత ఏడుసార్లు “అఊదుబిల్లాహి, వ ఖుద్రతిహి మిన్ షర్రిమా అజిదు వ ఉహాదిర్” అని పఠించు” (నేను అనుభవిస్తున్న మరియు భయపడుచున్న చెడు మరియు కీడు నుండి నేను అల్లాహ్ ద్వారా మరియు ఆయన శక్తి ద్వారా శరణు వేడుకుంటున్నాను) అన్నారు.
ముస్లిం నమోదు చేసినారు:ఉథ్మాన్ ఇబ్న్ అబీ అల్-ఆస్ (రదియల్లాహు అన్హు) ఒక నొప్పితో బాధపడుతూ ఉండేవారు, అది ఆయనను దాదాపు మృత్యువు అంచు వరకు తీసుకువెళ్ళింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనను సందర్శించడానికి వచ్చి ఆయనకు ఆ నొప్పి నుండి ఉపశమనం కలిగించే, అతనికి వచ్చిన అనారోగ్యాన్ని దూరం చేసే ఒక దుఆను (ప్రార్థనను) బోధించారు. అతను నొప్పితో బాధపడుతున్న చోట తన చేతిని ఉంచాలి మరియు మూడుసార్లు ఇలా పలకాలి: “బిస్మిల్లాహ్” (అల్లాహ్ పేరుతో); (అఊదు - నేను శరణు వేడుకుంటున్నాను) ఆశ్రయం పొందుతాను, దానిని గట్టిగా వొడిసి పట్టుకుంటాను, తద్వారా నన్ను నేను బలపరచుకుంటాను; (బిల్లాహి, వ ఖుద్రతిహి మిన్ షర్రిమా అజిదు) నేను చూసిన మరియు భయపడుచున్న చెడు నుండి ప్రస్తుతం నేను అనుభవిస్తున్న బాధ, నొప్పి నుండి నేను అల్లాహ్ ద్వారా శరణు వేడుకుంటున్నాను, ఆయన శరణు పొందుతాను, వాటిని గట్టిగా వొడిసి పట్టుకుంటాను; (వ ఉహాదిర్) మరియు జాగ్రత్త పడుతున్నాను; ఈ విచారం మరియు భయం కారణంగా భవిష్యత్తులో ఇది పునరావృతం అవుతుందేమో అని భయపడుతున్నాను, లేక ఇదే నొప్పి, ఇదే బాధ కొనసాగి నా శరీరమంతా వ్యాపిస్తుందేమో అని భయపడుతున్నాను.
ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో అత్యంత ఉదారంగా ఉండేవారు. రమదాన్ నెలలో జిబ్రీల్ (అలైహిస్సలాం) ఆయనను కలిసినపుడు ఆయన దాతృత్వం, ఉదారత మరింతగా పెరిగిపోయేవి. జిబ్రీల్ (అలైహిస్సలాం) రమదాన్ మాసములో ప్రతి రాత్రి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చేవారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కలిసి ఖుర్’ఆన్ పునశ్చరణ చేయుట కొరకు. అపుడు దాతృత్వములో, ఉదారతలో, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వేగవంతమైన గాలి కంటే కూడా ఎక్కువ వేగంగా ఉండేవారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో అత్యంత ఉదార స్వభావి, రమదాన్ మాసంలో ఆయన దాతృత్వం మరింతగా పెరిగిపోయేది. తనను అర్థించిన వారికి ఏది అవసరమో దానిని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చివేసేవారు. ఆయన దాతృత్వం అధికం కావడానికి రెండు విషయాలు కారణంగా ఉండేవి, అవి: మొదటిది: జిబ్రీల్ (అలైహిస్సలాం) తో ఆయన సమావేశం కావడం; రెండవ విషయం: కంఠస్థము చేసి, ధారణలో ఉంచుకున్న ఖుర్’ఆన్ ను పునశ్చరణ చేయడం. జిబ్రీల్ (అలైహిస్సలాం) ఖుర్ఆన్ యొక్క అవతరించిన ప్రతి ఆయతును ఆయన ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో అధ్యయనం చేసేవారు, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరింత ఉదారత్వముతో; అర్థించిన వారికి అర్థించిన దాని కంటే ఎక్కువ ప్రసాదిస్తూ, వీలైనంత ఎక్కువ మంచి చేస్తూ, అల్లాహ్ తన కరుణతో పంపే వర్షం మరియు మంచి గాలి కంటే వేగంగా ప్రజలకు మరింత త్వరగా ప్రయోజనం చేకూరుస్తూ ఉండేవారు.
అబూ జుహైర్ ఉమారహ్ ఇబ్న్ రుఐబహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే సూర్యుడు ఉదయించడానికి ముందున్న నమాజును (సలాహ్’ను) మరియు సూర్యుడు అస్తమించడానికి ముందున్న నమాజును ఆచరిస్తాడో అతడు నరకాగ్నిలోనికి ప్రవేశించడు
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైతే ఫజ్ర్ మరియు అస్ర్ నమాజులను ఆచరిస్తారో, మరియు ఆ నమాజులను ఆచరించుటలో స్థిరత్వాన్ని కలిగి ఉంటారో వారు నరకాగ్నిలోనికి ప్రవేశించరు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రెండు నమాజులను ఎందుకు ప్రత్యేకించినారు అంటే, అవి (విశ్వాసులపై) భారమైనవి (గా చూడబడతాయి); ఎందుకంటే ఫజ్ర్ నమాజు సమయమున అతడు తన గాఢ నిద్రను ఆనందిస్తుంటాడు; అస్ర్ నమాజు సమయమున అతడు తన దైనందిన వ్యవహారాలు, వ్యాపారం మొదలైన వాటిలో మునిగి ఉంటాడు. కనుక కఠినంగా, భారంగా ఉన్నప్పటికీ ఎవరైతే ఈ రెండు నమాజులను వదలకుండా ఆచరిస్తాడో, అతడు మిగతా నమాజులను తేలికగా ఆచరిస్తాడు.
ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఏ ముస్లిం వ్యక్తి అయినా, సలాహ్ (నమాజు) సమయం ఆసన్నమైనపుడు పరిపూర్ణంగా ఉదూ ఆచరించి, అణకువ, వినయం కలిగి, సలాహ్’లో రుకూ (మొదలైన వాటిని) పరిపూర్ణంగా ఆచరిస్తాడో, అది అతని వల్ల అంతకు ముందు వరకు జరిగిన ‘సగాయిర్’ పాపాలకు (చిన్న పాపాలకు) పరిహారంగా మారుతుంది; అతడు ‘కబాయిర్’ పాపాలకు (పెద్ద పాపాలకు) పాల్బడనంత వరకు; మరియు ఇది అన్ని కాలాలకు వర్తిస్తుంది.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు. ఏ ముస్లిమ్ అయినా కూడా ఫర్జ్ నమాజు చేసే సమయం ప్రవేశించినపుడు, ఉత్తమంగా ఉదూ ఆచరించి దానిని పరిపూర్ణం చేస్తాడు; తరువాత తన హృదయాన్నీ, తన దేహాన్నీ అల్లాహ్ వైపునము మరల్చి, అణకువ, వినయం కలిగి తనను తాను పూర్తిగా సమర్పించుకున్న రీతిలో అల్లాహ్ యొక్క ఘనతను, ఆయన ఔన్నత్యాన్ని కొనియాడుతూ, రుకూ మరియు సజ్దాలను పరిపూర్ణంగా ఆచరిస్తూ సలాహ్ ను (నమాజును) ఆచరిస్తాడు, అది అంతకు ముందు వరకు అతని వల్ల జరిగిన చిన్న పాపాలకు పరిహారంగా పరిణమిస్తుంది; అతడు పెద్ద పాపాలకు పాల్బడనంత వరకు. ఈ ఘనత కాలానుగతంగా ప్రతి సలాహ్ కు వర్తిస్తుంది.
కాబ్ బిన్ ఉజ్రహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు : “నిత్యమూ అనుసరించదగిన కొన్ని విషయాలున్నాయి - ప్రతి ఫర్జ్ సలాహ్ (ఫర్జ్ నమాజు) తరువాత వాటిని ఉచ్ఛరించే వానిని, లేదా వాటిని ఆచరించే వానిని అవి ఎప్పుడూ నిరాశపరచవు. అవి: ముప్పై మూడు సార్లు ‘తస్’బీహ్’ పలుకుట (సుబ్’హానల్లాహ్ అని పలుకుట); ముప్పై మూడు సార్లు ‘తమ్’హీద్’ పలుకుట (అల్’హందులిల్లాహ్ అని పలుకుట); మరియు ముప్పై నాలుగు సార్లు ‘తక్బీర్’ పలుకుట (అల్లాహు అక్బర్ అని పలుకుట).”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్’ను స్మరించడానికి పలుకవలసిన కొన్ని పదాలను గురించి తెలియజేసారు. వాటిని ఉచ్ఛరించే వాడు ఏమీ కోల్పోడు, మరియు దేనికీ చింతించడు; పైగా వాటిని ఉచ్ఛరించినందుకు అతడు ప్రతిఫలాన్ని పొందుతాడు. వాటిలో కొన్ని విషయాల తరువాత కొన్ని వస్తాయి. ప్రతి ఫర్జ్ సలాహ్ (ఫర్జ్ నమాజు) తరువాత ఉచ్చరించబడతాయి. అవి: “సుబ్’హానల్లాహ్” అని ముప్పైమూడు సార్లు పలకాలి. (దాని అర్థము: అల్లాహ్ పరమ పవిత్రుడు, లోపములకు, కొరతలకు అతీతుడు) “అల్’హదులిల్లాహ్” అని ముప్పైమూడు సార్లు పలకాలి. (దాని అర్థము: సకల స్తోత్రములు, పొగడ్తలు కేవలం అల్లాహ్ కొరకే అని, అంటే ఇందులో అల్లాహ్ను పూర్తి పరిపూర్ణతతో వర్ణించడంతో పాటు ఆయనను ప్రేమించడం మరియు కీర్తించడం అన్నీ కలిసి ఉంటాయి) “అల్లాహు అక్బర్” అని ముప్పైనాలుగు సార్లు పలకాలి. (దాని అర్థము: అల్లాహ్ అందరి కంటే, అన్నిటి కంటే గొప్పవాడు, మహోన్నతుడు, మరియు అన్నింటికన్నా శక్తివంతమైనవాడు)
సా’ద్ బిన్ అబీ వఖ్ఖాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ముఅజ్జిన్ ఇచ్చిన అజాన్ విన్నపుడు, ఎవరైతే “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు; రదీతు బిల్లాహి రబ్బన్, వ బి ముహమ్మదిన్ రసూలన్, వ బిల్ ఇస్లామి దీనన్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ఆయనకు సాటిగానీ, భాగస్వామి గానీ ఎవరూ లేరు అని, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను; నేను అల్లాహ్ ను నా ప్రభువుగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరునిగా మరియు ఇస్లాంను ధర్మంగా అంగీకరిస్తున్నాను, మరియు అందుకు సంతోషిస్తున్నాను) అని పలుకుతాడో అతని పాపాలు క్షమించి వేయబడతాయి.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ముఅజ్జిన్ ఇచ్చిన అజాన్ విన్నపుడు, ఎవరైతే ఇలా పలుకుతాడో: “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు” (నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ఆయనకు సాటిగానీ, భాగస్వామి గానీ ఎవరూ లేరు అని): అంటే దాని అర్థము: అర్థం: “అల్లాహ్ తప్ప సకల ఆరాధనలకు అర్హుడైన నిజఆరాధ్యుడు ఎవరూ లేడని, మరియు ఆయన తప్ప అరాధించబడే ప్రతిదీ అబద్ధమని నేను ధృవీకరిస్తున్నాను, అంగీకరిస్తున్నాను మరియు (ప్రపంచానికి) తెలియజేస్తున్నాను” అని. “వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు” (మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను): అంటే దాని అర్థము ఆయన అల్లాహ్ యొక్క దాసుడు, కనుక ఆయన ఆరాధించబడడు (ఆయనను ఆరాధించరాదు); మరియు ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు, ఆయన అసత్యం పలుకడు. “రజీతు బిల్లాహి రబ్బన్”: (నేను అల్లాను నా ప్రభువుగా అంగీకరిస్తున్నాను, అల్లాహ్ నా ప్రభువుగా సంతోషిస్తున్నాను): అంటే దాని అర్థము: నేను ఆయన ప్రభుతను, ఆయన దైవత్వాన్ని, ఆయన నామములు మరియు గుణలక్షణాలతో సంతృప్తి చెందాను మరియు సంతోషిస్తున్నాను. “వ బి ముహమ్మదిన్ రసూలన్”: (నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అల్లాహ్ యొక్క సందేశహరునిగా సంతోషిస్తున్నాను, అంగీకరిస్తున్నాను): అంటే దాని అర్థము: అల్లాహ్ ద్వారా ఆయనకు పంపబడిన ప్రతిదానితో మరియు ఆయన మాకు అందించిన ప్రతిదానితో నేను సంతృప్తి చెందాను మరియు సంతోషిస్తున్నాను. “వ బిల్ ఇస్లాం...”: (మరియు ఇస్లాంను ...) అంటే దాని అర్థము: ఇస్లాం యొక్క అన్ని నిబంధనల ప్రకారం, ఆదేశాలు మరియు నిషేధాలతో సహా “దీనన్...”: (ధర్మంగా...) అంటే దాని అర్థము: “ఇస్లాం ను నా ధర్మంగా విశ్వసిస్తున్నాను, మరియు విధేయుడను అవుతున్నాను”. “అతని పాపాలు క్షమించివేయబడతాయి” – అంటే దాని అర్థము అతని వల్ల జరిగిన చిన్న పాపాలు (సగాయిర్ పాపలు) క్షమించి వేయబడతాయి అని.