





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబూ ఉమామహ్ అల్ బాహిలీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఖుర్ఆన్ పఠించండి, ఎందుకంటే పునరుత్థాన దినాన అది దానిని పఠించేవారికి మధ్యవర్తిగా వస్తుంది. “జహ్’రావైన్”లను (రెండు ప్రకాశవంతమైన వాటిని), అంటే “సూరతుల్-బఖరహ్ మరియు సూరతుల్-ఆలి ఇమ్రాన్” లను పఠించండి. ఎందుకంటే తీర్పు దినమున అవి రెండు మేఘాలుగా లేదా రెండు ఘనమైన ఛాయలుగా లేదా రెండు పక్షుల గుపులుగా వచ్చి వాటిని పఠించే వారి కోసం వేడుకుంటాయి. సూరతుల్-బఖరహ్ పఠించండి, ఎందుకంటే దానిని ఆశ్రయించడం ఒక వరం మరియు దానిని వదులుకోవడం దుఃఖానికి కారణం; మరియు మాంత్రికులు, జాదూ చేసేవారు దానిని ఎదుర్కోలేరు.”
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీథులో: ఖుర్ఆన్ పఠనాన్ని స్థిరంగా కొనసాగించమని మనకు హితబోధ చేస్తున్నారు. ఎందుకంటే తీర్పు దినమున అది తనను పఠించే మరియు పఠించిన దానిపై ఆచరించే వారి కొరకు మధ్యవర్తిగా వస్తుంది. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూరతుల్ బఖరహ్ మరియు సూరతుల్-ఆలి ఇమ్రాన్’లను, వాటిలోని వెలుగు మరియు మార్గదర్శకత్వం కారణంగా, వాటిని “జహ్’రావైన్”లు (రెండు ప్రకాశవంతమైనవి) అని పేర్కొంటూ వాటిని పఠించమని నొక్కి చెప్పినారు; వాటిని పఠించడం, వాటి అర్థాలపట్ల లోతుగా ఆలోచించడం, అవగాహన కలిగి ఉండడం మరియు వాటిలో చెప్పబడిన దానిపై ఆచరించడం వల్ల కలిగే ప్రతిఫలం అవి పునరుత్థాన దినమున రెండు మేఘాల మాదిరిగా లేదా రెండు ఘనమైన ఛాయల మాదిరిగా లేదా తమ రెక్కలను పూర్తిగా విస్తరించి, వాటిని ఒకదానితో ఒకటి అనుసంధానం చేసుకుని, దట్టమైన నీడ లాగా తమను పారాయణం చేసే వారికి రక్షణ కల్పిస్తూ వచ్చే రెండు పక్షుల గుంపుల మాదిరిగా వస్తాయని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూరతుల్-బఖరహ్ పఠనం కొనసాగించడం, దాని అర్థాలపై లోతుగా ఆలోచించడం, చింతన చేయడం మరియు దానిలోని విషయాలను అమలు చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు; అలా చేయడం వల్ల ఇహలోకంలో మరియు పరలోకంలో గొప్ప ఆశీర్వాదాలు మరియు ప్రయోజనాలు లభిస్తాయి. దీనిని వదిలివేయడం వల్ల పునరుత్థాన దినాన విచారం మరియు పశ్చాత్తాపం కలుగుతాయి. ఈ సూరహ్ యొక్క సుగుణాలలో ఒకటి మాంత్రికులు, చేతబడి లేదా జాదూ చేయువారు దీనిని పఠించే వారికి హాని చేయలేరు.
జుందుబ్ ఇబ్న్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తో ఉన్నప్పుడు, మేము బలమైన యువకులుగా ఉండేవాళ్ళం, మేము ఖుర్ఆన్ నేర్చుకోవడానికి ముందు ఈమాన్ గురించి నేర్చుకున్నాము, ఆ తర్వాత మేము ఖుర్ఆన్ నేర్చుకున్నాము, దాని ద్వారా మా ఈమాన్ మరింత అధికమయ్యింది.
ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:జుందుబ్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు ఉల్లేఖన: మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉన్నప్పుడు, యుక్తవయస్సుకు చేరువలో ఉన్న బలమైన, దృఢమైన యువకులం. మేము ఖుర్ఆన్ నేర్చుకోవడానికి ముందే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఈమాన్ నేర్చుకున్నాము. ఆ తర్వాత మేము ఖుర్ఆన్ నేర్చుకున్నాము; దాని ద్వారా మా ఈమాన్ మరింత బలపడింది.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: «ప్రవక్తల్లోని ప్రతీ ఒక్క ప్రవక్తకు అద్భుతాలు ఇవ్వబడ్డాయి,ఆ ప్రకారంగా వారి ప్రజలు విశ్వసించేవారు, నిశ్చయంగా నాకు దైవవాణి (ఖుర్ఆన్) ఇవ్వబడింది,అల్లాహ్ దాన్ని నా వైపుకు పంపాడు, కాబట్టి ప్రళయదినాన అత్యధిక అనుచరులు నాకు ఉంటారని నేను ఆశిస్తున్నాను».
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: అల్లాహ్ ప్రవక్తలందరికీ మద్దతునిచ్చి, వారి దైవదౌత్యానికి నిదర్శనంగా ఉండే అసాధారణ అద్భుతాలను వారికి ప్రసాదించాడు, వాటిని చూసినవారు వారి సత్యసంధతను విశ్వసించవలసి వచ్చేది మరియు ఆ సవాలులో అవిశ్వాసి దానిని తిప్పికొట్టలేక నిస్సహాయుడైపోయేవాడు, కానీ అతను దానిని తిరస్కరించి మొండిగా ప్రవర్తించేవాడు. నిశ్చయంగా ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క అద్భుతం మరియు మహిమ అల్లాహ్ ఆయనపై అవతరింపజేసిన ఖుర్ఆన్. ఎందుకంటే దానిలో స్పష్టమైన మరియు నిరంతరమైన అద్భుతాలు ఉన్నాయి, దాని ప్రయోజనాలు అధికంగా మరియు సర్వవ్యాప్తిగా ఉన్నాయి. అంతేగాక దానిలో (ఇస్లాం వైపు) ఆహ్వానం, సాక్ష్యం మరియు భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి సమాచారం ఉంది. అందువల్ల దాని ప్రయోజనం అక్కడ హాజరైన వారికి, హాజరు కాలేక పోయిన వారికి, ఉన్నవారికి మరియు భవిష్యత్తులో ఉండబోయేవారికి అందరికీ చేరుతుంది. ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు: "కాబట్టి ప్రళయ దినాన వారిలో అత్యధిక అనుచరులు కలవాడిని నేనే అవుతానని ఆశిస్తున్నాను.
ఖతాదహ్ ఉల్లేఖన: అనస్ రదియల్లాహు అన్హును, 'ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ పఠనం ఎలా ఉండేది?' అని అడగగా, ఆయన ఇలా సమాధానమిచ్చారు: «అది దీర్ఘంగా ఉండేది», ఆ తర్వాత ఆయన {బిస్మిల్లాహిర్రహ్మాణిర్రహీమ్} అని పఠించారు. ఆయన 'బిస్మిల్లాహ్' ను, 'అర్-రహ్మాన్' ను, మరియు 'అర్-రహీమ్' ను దీర్ఘం తీసి పఠించేవారు.
అల్ బుఖారీ నమోదు చేసినారు:అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హును, "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఖుర్ఆన్ పఠనం ఎలా ఉండేది?" అని అడగగా, ఆయన ఇలా సమాధానమిచ్చారు: "ఆయన పఠనంలో అక్షరాలను సాగదీసేవారు. ఆయన 'అల్లాహ్' లోని 'లా' ను సాగదీసేవారు, 'అర్-రహ్మాన్' లోని 'మా' ను సాగదీసేవారు, మరియు 'అర్-రహీమ్' లోని 'హీ' ని సాగదీసేవారు.
ఇబ్న్ అబీ ములైకహ్ ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలలో ఒక భార్య నుండి ఉల్లేఖన -అబూ ఆమిర్ అన్నారు, నాఫి అన్నారు: నేను ఆమెను హఫ్సా రదియల్లాహు అన్హా అని అనుకుంటున్నాను- ఆమెను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పారాయణం గురించి అడగగా ఆమె ఇలా అన్నారు: నిశ్చయంగా మీరు దానిని చేయలేరు. అప్పుడు ఆమెతో, 'దాని గురించి మాకు తెలియజేయండి' అని అనబడింది. అప్పుడు ఆమె ఆగి ఆగి స్పష్టంగా పారాయణం చేసేవారు. అబూ ఆమిర్ అన్నారు: నాఫి అన్నారు: ఇబ్న్ అబీ ములైకా మాకు దానిని చేసి చూపించారు: {అల్హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్} అని పఠించి, ఆ తర్వాత ఆగి, {అర్రహ్మా నిర్రహీమ్} అని పఠించి, ఆ తర్వాత ఆగి, {మాలికి యౌమిద్దీన్} అని పఠించారు.
ఆహ్మద్ నమోదు చేసినారు:విశ్వాసుల మాత హఫ్సా రదియల్లాహు అన్హాను ఇలా ప్రశ్నించారు: "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఖుర్ఆన్ పారాయణం ఎలా ఉండేది?" దానికి ఆమె "మీరు ఆయనలా పఠించలేరు" అని చెప్పగా, మరలా వారు ఆమెతో, "మాకు తెలియజేయండి" అని అన్నారు. నాఫె తెలిపారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ పారాయణ పద్ధతిని అనుకరించి, వారికి స్పష్టంగా తెలియజేయడానికి ఇబ్నె అబీ ములైక మా కొరకు నెమ్మదిగా పారాయణం చేశారు. ఆయన ఇలా పఠించారు: {అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్} తర్వాత పారాయణాన్ని ఆపారు, {అర్రహ్మానిర్రహీమ్}, తర్వాత పారాయణాన్ని ఆపారు, {మాలికి యౌమిద్దీన్}.
అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్, జునుబ్ (అశుద్ధ) స్థితిలో తప్ప, అన్ని వేళలా మాకు ఖుర్ఆను చదివించేవారు.
అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తన భార్యతో సంభోగించడం వలన కలిగే జనాబత్ స్థితిలో ఉన్నప్పుడు తప్ప, మిగతా అన్ని స్థితులలో తన సహాబాలకు ఖుర్’ఆన్ బోధించేవారు మరియు దాని పారాయణము చేయించేవారు.
అబూ సయీద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ఒక వ్యక్తి – మరో వ్యక్తి “ఖుల్ హువల్లాహు అహద్...” సూరాహ్’ను (సూరతుల్ ఇఖ్లాస్ ను) పలుమార్లు అదే సూరహ్ ను పునరావృతం చేస్తూ పఠిస్తూ ఉండగా చూచినాడు. మర్నాడు ఉదయం అతడు రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ఆ విషయాన్ని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు వివరించినాడు; ఆ వ్యక్తి ఆ సూరాహ్ ను తగినన్ని సార్లు పఠించలేదు అనే ధోరణిలో. దానికి రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఎవరి చేతిలోనైతే నా ప్రాణము ఉన్నదో, ఆయన సాక్షి – అది (ఆ సూరహ్) మూడింటి ఒక వంతు ఖుర్’ఆన్ కు సమానం.”
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ హదీథులో అబూ సయీద్ అల్-ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఒక వృత్తాంతాన్ని ఇలా ప్రస్తావిస్తున్నారు: ఒక వ్యక్తి - మరొక వ్యక్తి రాత్రంతా “ఖుల్ హువల్లాహు అహద్..” సూరహ్ ను, దానికి ఇంకేమీ జోడించకుండా, కేవల ఆ ఒక్క సూరానే పునరావృతం చేస్తూ పఠించడం విన్నాడు. మర్నాడు ఉదయం ఆ వ్యక్తి రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో ఈ విషయం చెప్పాడు. అతడు చెప్పడం – ఆ వ్యక్తి చేసినది చాలా తక్కువగా ఉందని భావిస్తున్నట్లుగా ఉంది. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నొక్కి చెబుతున్నట్లుగా ప్రమాణం చేస్తూ మరీ ఇలా అన్నారు: “ఎవరి చేతిలోనైతే నా ఆత్మ ఉన్నదో, ఆయన సాక్షిగా, అది ఖుర్’ఆన్ లో మూడో వంతుకు సమానం.”
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: "ఆకాశాలలో, భూమిపై ఉన్న సమస్తమూ అల్లాహ్ దే. మీరు మీ మనస్సులలో ఉన్న విషయాలను వెల్లడి చేసినా లేక దాచినా, వాటి గురించి అల్లాహ్ మీతో లెక్క తీసుకుంటాడు. ఆ తర్వాత ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతి దానిపై సర్వశక్తిమంతుడు" [అల్ బఖరహ్ 2:284] అన్న ఖుర్ఆన్ వచనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులకు అది భారంగా తోచింది. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళి తమ మోకాళ్ళపై కూర్చొని, “ఓ రసూలుల్లాహ్! మాలో నిర్వర్తించగల శక్తి ఉన్న ఆచరణలే మాపై మోపబడ్డాయి: నమాజ్, ఉపవాసాలు, జిహాద్ మరియు దానధర్మాలు. కాని ఇప్పుడు మీపై ఈ ఆయతు అవతరించింది. దీనిని భరించే శక్తి మాలో లేదు” అని విన్నవించుకున్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: «మీకు పూర్వం గ్రంథప్రజలు (యూదులు, క్రైస్తవులు) "మేము విన్నాము కాని అంగీకరించట్లేదు" అన్నట్లుగా మీరు కూడా అలాగే జవాబు చెబుదామని అనుకుంటున్నారా ఏమిటి? కాదు, మీరు ఇలా చెప్పండి: 'మేము విన్నాము. శిరసావహించాము. ప్రభూ! క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరికి మేమంతా నీవైపునకే మరలివస్తాము'». వారు అన్నారు: "మేము విన్నాము. శిరసావహించాము. ప్రభూ! క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరికి మేమంతా నీవైపునకే మరలివస్తాము". ప్రజలు ఆ వచనాలను పలుకగా, వారి నాలుకలు వాటితో పలచబడిన తరువాత, అల్లాహ్ దాని వెనుకే ఈ ఆయతును అవతరింపజేశాడు: {ప్రవక్త తనపై తన ప్రభువు నుండి అవతరించిన దాన్ని విశ్వసించాడు. ఈ ప్రవక్తను అనుసరించే వారు కూడా దానిని హృదయపూర్వకంగా స్వీకరించారు. వారంతా అల్లాహ్ నూ, ఆయన దూతలనూ, ఆయన గ్రంథాలనూ, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. వారు ఇలా అంటారు: మేము ఆయన ప్రవక్తలలో ఏ ఒక్కరినీ భేదభావంతో చూడము. మేము ఆదేశం విన్నాం. శిరసా వహించాం. ప్రభూ! క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరకు మేమంతా నీవైపునకే మరలి వస్తాము} [అల్ బఖరహ్ 2:285]. వారు అలా చేయగానే, అల్లాహ్ దానిని రద్దుపరచి, ఈ ఆయతును అవతరింపజేశాడు: {ఏ ప్రాణిపైనా అల్లాహ్ దాని శక్తిసామర్థ్యాలకు మించిన బరువు బాధ్యతలను మోపడు. తాను సంపాదించిన పుణ్యానికి సత్ఫలితాన్నీ, తాను కూడబెట్టిన పాపానికి దుష్ఫలితాన్నీ ప్రతి వ్యక్తీ అనుభవిస్తాడు. ఓ మా ప్రభూ! మేము మరచినా లేక తప్పు చేసినా మమ్మల్ని పట్టుకోకు} [అల్ బఖరహ్ 2:286] దానికి ఆయన «సరే» అన్నాడు. {ప్రభూ! మాకు పూర్వం వారిపై మోపిన భారాన్ని మాపై మోపకు!} [అల్ బఖరహ్ 2:286] దానికి ఆయన «సరే» అన్నాడు. {ప్రభూ! ఏ బరువును మోసే శక్తి మాలో లేదో, దానిని మాపై మోపకు} [అల్ బఖరహ్ 2:286] దానికి ఆయన «సరే» అన్నాడు. {మమ్మల్ని మన్నించి వదలిపెట్టు. మమ్మల్ని క్షమించు. మమ్మల్ని కరుణించు. నీవు మాకు రక్షకుడవు. అవిశ్వాసులకు వ్యతిరేకంగా నీవు మాకు సహాయపడు} [అల్ బఖరహ్ 2:286] దానికి ఆయన «సరే» అన్నాడు.
ముస్లిం నమోదు చేసినారు:మహోన్నతుడు, పరమ పవిత్రుడైన అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై తన ఈ వాక్కును అవతరింపజేసినప్పుడు: {ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ దే!} సృష్టిపరంగా, అధికారం పరంగా, నియంత్రణ మరియు పర్యాలోచన పరంగా. {మరియు మీరు మీ మనస్సులలో ఉన్నది} అంటే మీ హృదయాలలో ఉన్నది, {వెలిబుచ్చినా} అంటే బహిర్గతం చేసినా లేదా గోప్యంగా ఉంచినా, {లేదా దానిని దాచినా} అంటే రహస్యంగా ఉంచినా లేదా మీ హృదయాలలో దాచిపెట్టినా, {అల్లాహ్ మీ నుంచి దాని లెక్క తీసుకుంటాడు} ప్రళయదినాన. {ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు} తన అనుగ్రహం మరియు కారుణ్యంతో, {మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు} తన న్యాయంతో, {మరియు అల్లాహ్ ప్రతి వస్తువుపై శక్తి గలవాడు} ఆయనను ఏదీ అసమర్థునిగా చేయలేదు. సహాబాలు దానిని విన్నప్పుడు, అది వారికి చాలా భారంగా తోచింది; ఎందుకంటే దానిలో హృదయంలో మెదిలే ఆలోచనలపై కూడా పట్టు ఉంటుందని ఉంది. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళి, (ఆయన ఎదురుగా) మోకాళ్ళపై కూర్చొని ఇలా విన్నవించుకున్నారు: “ఓ రసూలుల్లాహ్! ఇంతకు ముందు మాపై, మేము నిర్వర్తించగల శారీరక ఆచరణలే మోపబడ్డాయి; ఉదాహరణకు నమాజ్, ఉపవాసాలు, జిహాద్ మరియు దానధర్మాలు. కాని ఇప్పుడు మీపై ఈ ఆయతు అవతరించింది, మరియు మేము దానిని పూర్తి చేయలేము.” అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా అన్నారు: “యూదులు మరియు క్రైస్తవులు చెప్పినట్లుగా మీరు కూడా: {మేము విన్నాము మరియు అవిధేయత చూపాము} అని చెప్పాలని అనుకుంటున్నారా? దానికి బదులుగా ఇలా చెప్పండి: {మేము విన్నాము మరియు విధేయులం అయ్యాము. ఓ మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అర్ధిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే.}” సహాబాలు అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని ఆదేశానికి స్పందించి, ఇలా అన్నారు: “మేము విన్నాము మరియు విధేయులం అయ్యాము. మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అర్ధిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే.” ముస్లింలు తమ నోళ్ళతో దాన్ని పలికి, వారి ఆంతర్యాలు దానికి లొంగిపోయినప్పుడు; ప్రవక్త మరియు ఆయన సమాజమును ప్రశంసిస్తూ అల్లాహ్ ఈ వచనమును అవతరింపజేశాడు: {آمَنَ الرَّسُولُ بِمَا أُنْزِلَ إِلَيْهِ مِنْ رَبِّهِ وَالمُؤْمِنُونَ} మరియు వారి నోళ్ళు మరియు హృదయములు అల్లాహ్ ఆజ్ఞకు లొంగిపోయాయి. {వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము.} అంతేకాక, మేము వారందరినీ విశ్వసిస్తాము. {మరియు వారు ఇలా అన్నారు: మేము} నీ మాటను {విన్నాము} మరియు నీ ఆజ్ఞకు {విధేయులం అయ్యాము}. మేము {మా ప్రభూ నీ క్షమాభిక్షను} మరియు నీ మన్నింపును అర్ధిస్తున్నాము. {మరియు కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే}, తీర్పు దినాన తిరిగి రావలసిన చోటు కూడా నీ వద్దకే. వారు అలా చేసి, అల్లాహ్ ఆజ్ఞలను వింటూ, విధేయత చూపుతూ, చెప్పమని ఆజ్ఞాపించబడిన దానిని చెప్పినప్పుడు; అల్లాహ్ ఈ సమాజంపై భారాన్ని తగ్గించి, ఆ ఆయతును తన ఈ మాటతో రద్దు చేశాడు: {అల్లాహ్ ఏ ప్రాణిపై కూడా దాని శక్తికి మించిన భారాన్ని మోపడు}, అనగా దాని శక్తి, సామర్థ్యం మరియు ప్రయత్నం మేరకు మాత్రమే (మోపుతాడు). {దానికి} తాను సంపాదించిన మరియు చేసిన మంచికి ప్రతిఫలం (పుణ్యం) లభిస్తుంది, {మరియు దానిపై} తాను చేసిన పాపానికి మరియు అపరాధానికి శిక్ష పడుతుంది. మరియు అల్లాహ్ ఒకరి పాపానికి మరొకరిని శిక్షించడు, అలాగే ఒకరి మనస్సులో మెదిలే (చెడు) ఆలోచనలకు కూడా శిక్షించడు. {رَبَّا لَا تُؤَاخِذْنَا} అంటే మమ్మల్ని శిక్షించకు, {إِنْ نَسِينَا} అంటే మేము గుర్తుంచుకోలేకపోయినా, {أَوْ أَخْطَأْنَا} అంటే ఉద్దేశపూర్వకంగా కాకుండా మరచిపోయి సరైన మార్గాన్ని వదిలేసినా. అప్పుడు అల్లాహ్ వారి ఈ ప్రార్థనను స్వీకరించి ఇలా పలికాడు: సరే, నేను అంగీకరించాను. {ఓ మా ప్రభూ! మాపై భారం మోపకు} అంటే కష్టాన్ని, బరువును, {పూర్వం వారిపై మోపినట్లు} అంటే బనీ ఇస్రాయీల్ మరియు ఇతరులపై. దానికి అల్లాహ్ సమాధానమిస్తూ ఇలా అన్నాడు: అవును, నేను అలా చేశాను. {ఓ మా ప్రభూ! మేము సహించలేని భారం మాపై వేయకు} అంటే మేము మోయలేని విధులు, పరీక్షలు మరియు ఇతర విషయాల భారం. అల్లాహ్ ఇలా అన్నాడు: అవును, నేను అలా చేశాను. {మమ్మల్ని మన్నించు} అంటే మా పాపాలను మా నుండి తుడిచివేయి, {మమ్మల్ని క్షమించు} అంటే మా పాపాలను మాపై కప్పిపుచ్చి, వాటిని ఉపేక్షించు, {మమ్మల్ని కరుణించు} నీ అపారమైన కరుణతో. {నీవే మా సంరక్షకుడవు} మరియు మా యజమానివి; {కావున మాకు సహాయం చేయి} సాక్ష్యాలను స్థాపించడం మరియు ఆధిపత్యం ద్వారా {సత్యతిరస్కారులకు విరుద్ధంగా} వారితో చేసే పోరాటంలో మరియు ధర్మయుద్ధంలో . అప్పుడు అల్లాహ్ సమాధానమిచ్చి, ఇలా అన్నాడు: అవును, నేను అలా చేశాను.
ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ఒక యూదుడు ఆయనతో (ఉమర్ రదియల్లాహు అన్హుతో) ఇలా అన్నాడు: 'ఓ అమీరుల్ మూమినీన్, మీ గ్రంథంలో ఒక ఆయతు (వచనం) ఉంది, దానిని మీరు పఠిస్తారు. ఒకవేళ అది మా యూదుల సమాజంపై అవతరించి ఉంటే, మేము ఆ రోజును పండుగగా చేసుకుని ఉండేవారం.' దానికి ఉమర్ (రదియల్లాహు అన్హు) అడిగారు: 'ఏ ఆయతు (వచనం)?' దానికి అతను ఇలా అన్నాడు: {ఈ రోజు నేను మీ కోసం మీ ధర్మాన్ని పరిపూర్ణం చేశాను, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ కొరకు ఇస్లాంను ధర్మంగా ఇష్టపడ్డాను} [అల్-మాయిదా 5:3]. అప్పుడు ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: 'నిశ్చయంగా ఆ రోజు మరియు అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన ప్రదేశం మాకు తెలుసు. అది శుక్రవారం రోజున అరఫాతు మైదానంలో ఆయన నిలబడి ఉన్నప్పుడు అవతరించింది.'
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుయూదులలోని ఒక వ్యక్తి విశ్వాసుల నాయకుడైన ఉమర్ రదియల్లాహు అన్హు వద్దకు వచ్చి ఇలా అన్నాడు: "మీ గ్రంథమైన ఖుర్ఆన్ లో మీరు పఠించే ఒక ఆయతు ఉంది, ఒకవేళ అది మా యూదుల సమాజంపై మా గ్రంథమైన తౌరాత్ లో అవతరించి ఉంటే, ఈ గొప్ప ఆయతు అవతరించినందుకు కృతజ్ఞతగా మేము ఆ రోజును పండుగగా జరుపుకునే వాళ్ళం." అప్పుడు ఉమర్ రదియల్లాహు అన్హు అతనితో ఇలా అన్నారు: "అది ఏ ఆయతు?" దానికి అతడు ఇలా అన్నాడు: {ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను,మీ పై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను ఇంకా ఇస్లాంను మీ ధర్మంగా సంతృప్తిసమ్మతితో ఇష్టపడ్డాను}. ఉమర్ రదియల్లాహు అన్హు ఇలా పలికినారు: ఈ పవిత్ర ఆయతు అవతరించిన ఆ రోజు మరియు ఆ ప్రదేశం మాకు తెలుసు, అది జుమహ్ రోజు అయిన పండుగ రోజున, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ అరఫాలో నిలబడి ఉన్నప్పుడు వారిపై అవతరించింది. ఆ రెండూ ముస్లింలకు చాలా గొప్ప పర్వదినములు.