





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “మక్కా విజయ దినమున (ఫతహ్ మక్కా దినాన) రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను ఉద్దేశించి ఇలా ప్రసంగించినారు: “ఓ ప్రజలారా! నిశ్చయంగా అల్లాహ్ మీ నుండి జాహిలియహ్ కాలపు (ఇస్లాంకు పూర్వం ఉన్న అఙ్ఞాన కాలపు) అహంకారాన్ని మరియు వారి పూర్వీకుల గురించి వారి ప్రగల్భాలను తొలగించాడు. కాబట్టి, ఇప్పుడు రెండు రకాల ప్రజలు ఉన్నారు: అల్లాహ్ దృష్టిలో నీతిమంతుడు, పవిత్రుడు మరియు గౌరవప్రదమైన వ్యక్తి మరియు అల్లాహ్ దృష్టిలో దుర్మార్గుడు, దయనీయమైన మరియు అల్పమైన వ్యక్తి. ప్రజలు ఆదము యొక్క సంతానము, మరియు అల్లాహ్ ఆదమును మట్టి నుండి సృష్టించాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు: {ఓ మానవులారా! నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము మరియు మీరు ఒకరినొకరు గుర్తించు కోవటానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాము. నిశ్చయంగా, మీలో ఎక్కువ దైవభీతి గలవాడే, అల్లాహ్ దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు.} [సూరహ్ అల్ హుజురాత్ 49:13]
అత్తిర్మిదీ మరియు ఇబ్న్ హిబ్బాన్ నమోదు చేసినారు:దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా విజయదినమున ప్రజలను ఉద్దేశించి ఇలా ప్రసంగించారు: ఓ ప్రజలారా, నిశ్చయంగా అల్లాహ్ మీ నుండి అఙ్ఞానకాలపు అహంకారాన్ని మరియు గర్వాన్ని అలాగే తమ తాతలు, తండ్రుల పట్ల అతిశయాన్ని తొలగించాడు. నిశ్చయంగా ప్రజలు రెండు రకాలు: ఒక రకం: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను ఆరాధించే - నీతిమంతుడు, పవిత్రుడు, విధేయుడైన విశ్వాసి. అతని విషయానికొస్తే, అతనికి ప్రజలలో (గౌరవప్రదమైన) వంశం లేకపోయినా, లేక వంశీయులు లేకపోయినా ఇది అల్లాహ్’కు గౌరవప్రదమైనది. రెండవ రకం: అతను అనైతిక, నీచమైన అవిశ్వాసి, అల్లాహ్ ముందు అతడు చాలా అల్పమైన వాడు మరియు అవమానకరమైన వాడు. అతను గౌరవం, ప్రతిష్ట మరియు అధికారం కలిగి ఉన్నప్పటికీ, అవేమీ విలువైనవి కాదు. ప్రజలందరూ ఆదమ్ అలైహిస్సలాం యొక్క సంతానము, మరియు అల్లాహ్ ఆదము అలైహిస్సలాం ను మట్టి నుండి సృష్టించాడు. ధూళి నుండి వచ్చిన వ్యక్తి అహంకారంతో తనను తాను మెచ్చుకోవడం తగదు. దీనికి ఋజువు మనకు అల్లాహ్ యొక్క ఈ ఆయతులో కనిపిస్తుంది: {ఓ మానవులారా! నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము మరియు మీరు ఒకరినొకరు గుర్తించు కోవటానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాము. నిశ్చయంగా, మీలో ఎక్కువ దైవభీతి గలవాడే, అల్లాహ్ దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు.} [సూరహ్ అల్ హుజురాత్ 49:13]
జుబైర్ బిన్ అవ్వామ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “అప్పుడు, ఆ రోజు మీరు, (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు!) (సూరహ్: అత్-తకాథుర్ 102:8) అనే ఆయతు అవతరించినపుడు, జుబైర్ (ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో ఇలా పలికారు “ఓ రసూలుల్లాహ్! ఏ సౌఖ్యాలను గురించి ప్రశ్నించడం జరుగుతుంది? మన వద్దనున్న రెండు నల్లని విషయాలు, ఖర్జూరాలు, నీళ్ళు; వాటి గురించా?” అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు “అవి తప్పనిసరిగా ఉంటాయి.”
అత్తిర్మిదీ మరియు ఇబ్నె మాజహ్ నమోదు చేసినారు:ఈ ఆయతు అవతరించినపుడు: (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు!*) (సూరహ్: అత్-తకాసుర్ 102:8) – ఆ ఆయతు యొక్క అర్థము ఏమిటంటే - “అల్లాహ్ మీకు ప్రసాదించిన శుభాలు, సౌఖ్యాలను గురించి ప్రశ్నించబడతారు అని. అపుడు జుబైర్ ఇబ్న్ అల్ అవ్వాం రజియల్లాహు అన్హు “ఓ ప్రవక్తా! ఏ సౌఖ్యాలను గురించి ప్రశ్నించడం జరుగుతుంది. ఉన్నవే రెండు శుభాలు, అవి ప్రశ్నించబడేటంత అవసరసం ఉన్నవి కూడా కాదు; అవి ఖర్జూరాలు మరియు నీళ్ళు.” అన్నాడు. దాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఈ స్థితిలో కూడా నీవు ఉన్న సౌఖ్యాన్ని గురించి, శుభాలను గురించి ప్రశ్నించబడతావు. ఎందుకంటే అవి రెండు కూడా అల్లాహ్ ప్రసాదించిన శుభాలలో గొప్ప శుభాలు గనుక” అన్నారు.
అదీ ఇబ్న్ హాతిం రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “యూదులు అల్లాహ్ ఆగ్రహానికి గురియైన వారు; మరియు క్రైస్తవులు మార్గభ్రష్ఠులైన వారు”
అత్తిర్మిదీ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – యూదుల పట్ల అల్లాహ్ ఆగ్రహించినాడని తెలియజేస్తున్నారు; ఎందుకంటే వారు సత్యాన్ని ఎరిగి కూడా దానిపై ఆచరించలేదు. మరియు క్రైస్తవులు మార్గభ్రష్ఠులైన ప్రజలు, ఎందుకంటే తాము ఆచరించే విషయాల పట్ల సరియైన ఙ్ఞానము లేకుండానే వాటిని వారు ఆచరిస్తున్నారు.
సయీద్ ఇబ్న్ ముసయ్యిబ్ తన తండ్రి నుండి ఉల్లేఖిస్తున్నారు: “అబూ తాలిబ్ చనిపోయే సమయాన నేను అక్కడే ఉన్నాను. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడికి వచ్చారు. ఆయన వద్ద అప్పటికే అబూ జహ్ల్ మరియు అబ్దుల్లాహ్ ఇబ్న్ అబీ ఉమయ్యహ్ ఇబ్న్ అల్ ముఘీరహ్ ఉండడం గమనించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఓ చిన్నాన్న, “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు వేరే ఎవ్వరూ లేరు) అను. ఈ ఒక్క మాట ద్వారా నీ కొరకు నేను అల్లాహ్ ను వేడుకుంటాను” అపుడు అబూ జహ్ల్ మరియు అబ్దుల్లాహ్ అబీ ఉమయ్యహ్ ఇలా అన్నారు “(ఓ అబూ తాలిబ్!) ఏం, అబ్దుల్ ముత్తలిబ్ ధర్మాన్ని విడనాడుతావా నువ్వు?” రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం విడువకుండా (షహాదహ్ పదాలు పలుకమని) పేర్కొంటూనే ఉన్నారు. వారు కూడా తమ మాటలను పునరావృతం చేస్తూనే ఉన్నారు. చివరికి, అబూ తాలిబ్ “లా ఇలాహా ఇల్లల్లాహ్” అని పలుకడానికి నిరాకరిస్తూ, తన చివరి మాటగా “నేను అబ్దుల్ ముత్తలిబ్ ధర్మం మీదనే చనిపోతాను” అన్నాడు (అని ప్రాణం విడిచాడు). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అల్లాహ్ సాక్షిగా! (చెబుతున్నాను), నేను వారించబడనంత వరకూ నేను నీ క్షమాభిక్ష కొరకు ప్రార్థిస్తూనే ఉంటాను”. అపుడు అల్లాహ్ ఈ ఆయతును అవతరింపజేసాడు: { مَا كَانَ لِلنَّبِيِّ وَالَّذِينَ آمَنُوا أَنْ يَسْتَغْفِرُوا لِلْمُشْرِكِينَ} {అల్లాహ్’కు సాటి కల్పించే వారు (ముష్రికులు) దగ్గరి బంధువులైనా, వారు నరకవాసులని వ్యక్తమైన తరువాత కూడా, ప్రవక్తకు మరియు విశ్వాసులకు వారి క్షమాపణకై ప్రార్థించుట తగదు.} [సూరహ్: అత్-తౌబహ్ 9:113]. మరియు అబూ తాలిబ్’ను గురించి, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు, అల్లాహ్ ఈ ఆయతును అవతరింపజేసినాడు: { إِنَّكَ لا تَهْدِي مَنْ أَحْبَبْتَ وَلَكِنَّ اللهَ يَهْدِي مَنْ يَشَاءُ} { (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీవు, నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకం చేయలేవు. కానీ అల్లాహ్ తాను కోరిన వారికి మార్గదర్శకం చేస్తాడు. మరియు ఆయనకు మార్గదర్శకం పొందే వారెవరో బాగా తెలుసు} [సూరహ్ అల్ ఖసస్ 28:56].
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణశయ్య పై ఉన్న తన చిన్నాన్నను (అబూ తాలిబ్ ను) చూడడానికి ఆయన గదిలోనికి ప్రవేశించినారు. తరువాత ఆయనతో ఇలా అన్నారు: “ఓ చిన్నాన్న! ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ (అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు ఎవరూ లేరు) అను. ఈ ఒక్క మాటతో అల్లాహ్ ముందు నేను నీ కొరకు సాక్ష్యమిస్తాను.” అబూ జహ్ల్ మరియు అబ్దుల్లాహ్ బిన్ అబీ ఉమయ్యహ్ ఇలా అన్నారు: “ఓ అబూ తాలిబ్, ఏం నీ తండ్రి అబ్దుల్ ముత్తలిబ్ ధర్మాన్ని అంటే విగ్రహాలను ఆరాధించడం వదిలి వేస్తున్నావా నువ్వు? ” వారు పదేపదే ఆ విధంగా అనసాగారు. చివరికి ఆయన తన చివరి మాటగా వారితో ఇలా అన్నాడు: “అబ్దుల్ ముత్తలిబ్ ధర్మమైన బహుదైవారాధనను, విగ్రహారాధనను అనుసరిస్తున్నాను (అని ప్రాణం విడిచాడు). అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అల్లాహ్ నన్ను వారించేదాక నేను నీ క్షమాభిక్ష కొరకు ప్రార్థిస్తూనే ఉంటాను”. అపుడు సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ వాక్కులు అవతరించినాయి. { مَا كَانَ لِلنَّبِيِّ وَالَّذِينَ آمَنُوا أَنْ يَسْتَغْفِرُوا لِلْمُشْرِكِينَ} {అల్లాహ్’కు సాటి కల్పించే వారు (ముష్రికులు) దగ్గరి బంధువులైనా, వారు నరకవాసులని వ్యక్తమైన తరువాత కూడా, ప్రవక్తకు మరియు విశ్వాసులకు వారి క్షమాపణకై ప్రార్థించుట తగదు.} [సూరహ్: అత్-తౌబహ్ 9:113]. అప్పుడు అబూతాలిబ్’ను గురించి అల్లాహ్ యొక్క ఈ వాక్కులు అవతరించినాయి: { إِنَّكَ لا تَهْدِي مَنْ أَحْبَبْتَ وَلَكِنَّ اللهَ يَهْدِي مَنْ يَشَاءُ} { (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీవు, నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకం చేయలేవు. కానీ అల్లాహ్ తాను కోరిన వారికి మార్గదర్శకం చేస్తాడు. మరియు ఆయనకు మార్గదర్శకం పొందే వారెవరో బాగా తెలుసు} [సూరహ్ అల్ ఖసస్ 28:56]. నిశ్చయంగా నీవు కోరిన వారికి మార్గదర్శకం చేయలేవు; కానీ అతనికి సత్య సందేశాన్ని (ఇస్లాంను) చేరవేయడం నీ బాధ్యత. అల్లాహ్ తాను కోరిన వారికి మార్గదర్శకం చేస్తాడు.
అబూ మూసా అల్ అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఖుర్’ఆన్ పఠించే విశ్వాసి యొక్క ఉపమానము దబ్బపండు వంటిది; దాని వాసనా మంచిగా ఉంటుంది మరియు రుచి కూడా మంచిగా ఉంటుంది. ఖుర్’ఆన్ పఠించని విశ్వాసి యొక్క ఉపమానము ఖర్జూరము వంటిది; దానికి వాసన ఉండదు, కానీ రుచి తీయగా ఉంటుంది. ఖుర్’ఆన్ పఠించే కపట విశ్వాసి ఉపమానము సబ్జా మొక్క వంటిది, దానికి మంచి వాసన ఉంటుంది, కానీ దాని రుచి చేదుగా ఉంటుంది; అలాగే ఖుర్’ఆన్ పఠించని కపట విశ్వాసి ఉపమానము చేదు పుచ్చకాయ వంటిది, దానికి ఎటువంటి వాసనా ఉండదు, పైగా దాని రుచి చేదుగా ఉంటుంది.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్’ఆన్ పఠించి దాని నుండి ప్రయోజనం పొందే ప్రజల వర్గాలను గురించి వివరించారు. మొదటి వర్గము: ఖుర్’ఆన్ పఠించి దాని నుండి ప్రయోజనం పొందే విశ్వాసి: అతడు దబ్బపండు లాంటి వాడు. అది మంచి రుచి, మంచి సువాసన, సుందరమైన వర్ణము కలిగి ఉంటుంది. దాని ప్రయోజనాలు అనేకం. అతడు తాను చదివిన దానిని ఆచరిస్తాడు, దానిని అమలు చేస్తాడు. అతడి వలన అల్లాహ్ యొక్క దాసులకు ప్రయోజనం చేకూరుతుంది. రెండవ వర్గము: ఖుర్’ఆన్ పఠించని విశ్వాసి : ఖురాన్ పఠించని విశ్వాసి మధురమైన రుచి కలిగి ఉన్నా వాసన లేని ఖర్జూరం లాంటివాడు. ఖర్జూరం రుచిలో మధురంగా ఉండి, దాని తీపి లోపలి వరకూ కలిగి ఉటుంది, అలాగే అతని హృదయం విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. అది సువాసన లేని మధురమైన ఖర్జూరము వంటిది. అతని నుండి ఖుర్’ఆన్ పారాయణం వినబడినందున, ప్రజలు సంత్వన పొందరు. మూడో వర్గం: ఖుర్ఆన్ పఠించే కపటవిశ్వాసి: అతడు సబ్జా మొక్క లాంటి వాడు. దాని వాసన బాగుంటుంది, కానీ రుచి చేదుగా ఉంటుంది. ఎందుకంటే అతను తన హృదయాన్ని విశ్వాసంతో సంస్కరించలేదు లేదా ఖుర్ఆన్ ప్రకారం ఆచరించలేదు. ప్రజల ముందు బయటకు అతడు విశ్వాసిలా కనిపిస్తాడు. వాసన మంచిగా ఉంటుంది అనే పోలిక అతని ఖుర్’ఆన్ పఠనాన్ని సూచిస్తుంది, రుచి చేదుగా ఉంటుంది అనే పోలిక అతని అవిశ్వాసాన్ని సూచిస్తుంది. నాల్గవ వర్గం: ఖుర్ఆన్ పఠించని కపటవిశ్వాసి: అతడు చేదు పుచ్చకాయ వంటివాడు. దానికి వాసనా ఉండదు, పైగా చేదుగా ఉంటుంది. ‘ఏ వాసనా ఉండదు’ అనే పోలిక అతడు ఖుర్’ఆన్ పఠించకపోవడాన్ని సూచిస్తుంది, ‘పైగా చేదుగా ఉంటుంది’ అనే పోలిక అతని లోని అవిశ్వాసపు చేదును సూచిస్తుంది. అతడి అంతరంగము విశ్వాసలేమితో శూన్యంగా ఉంటుంది, అతడి బహిరంగము (ఉమ్మత్’కు) ఎటువంటి ఉపయోగం లేనిది, పైగా హానికరమైనది.
ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “ఖుర్ఆన్ పారాయణంలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి, దైవదూతలలో గొప్పవారైన, ఉన్నతులైన మరియు విధేయులైన లేఖరుల సాంగత్యములో ఉంటాడు; మరియు ఎవరైతే ఖుర్ఆన్ ను తడబడుతూ, పారాయణం అతనికి కష్టంగా అనిపించినా ఖుర్ఆన్ పారాయణం చేసే వ్యక్తికి రెండు ప్రతిఫలాలు లభిస్తాయి.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైతే ఖుర్ఆన్ పఠనం చేసి, దానిని బాగా కంఠస్థం చేసి, దానిని పఠించడంలో ప్రావీణ్యత మరియు నైపుణ్యం సంపాదించిన వ్యక్తికి పరలోకంలో ప్రతిఫలం లభిస్తుంది, అతనికి గొప్ప హోదా లభిస్తుంది, మరియు అతడు సద్గుణవంతులైన దైవదూతలతో ఉంటాడు, అలాగే ఎవరైతే తన బలహీన ఙ్ఞాపక శక్తి కారణంగా ఖుర్ఆన్ ను సంకోచిస్తూ, తడబడుతూ, పఠిస్తాడో; అతనికి కష్టంగా ఉన్నప్పటికీ, దానిని పారాయణం చేస్తాడో, అతనికి రెండు బహుమతులు ఉన్నాయి. ఒకటి పారాయణం చేసినందుకు ప్రతిఫలం, రెండు దానిని పఠించడంలో అతని ప్రయత్నానికి, సంకోచానికి, తడబాటుకు ప్రతిఫలం.
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాతో, «నాకు చదివి వినిపించు» అన్నారు. నేను, “ఓ రసూలుల్లాహ్! నేను మీకు చదివి వినిపించాలా, ఇది మీపైనే కదా అవతరించింది?” అని అన్నాను. ఆయన, «అవును» అన్నారు. అప్పుడు నేను 'అన్నిసా' సూరహ్ పారాయణం చేస్తూ, ఈ వాక్యం దగ్గరికి చేరుకున్నాను: {మేము ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని తెచ్చి, నిన్ను వారందరిపై సాక్షిగా నిలబెట్టినప్పుడు వీరి పరిస్థితి ఏమిటి?} [అన్నిసా: 41], అప్పుడు ఆయన, «ఇక చాలు» అన్నారు. నేను ఆయన వైపు తిరిగి చూస్తే, ఆయన కళ్ళ నుండి ఏకధాటిగా కన్నీళ్ళు ప్రవహిస్తున్నాయి.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లాహ్ ఇబ్న్ మసూద్ రదియల్లాహు అన్హును ఖుర్ఆన్ నుండి కొంత భాగం చదివి వినిపించమని కోరారు. దానికి అతను, “ఓ రసూలుల్లాహ్! ఖుర్ఆన్ మీపైనే కదా అవతరించింది కదా! అలాంటప్పుడు నేను మీకు ఖుర్ఆన్ చదివి వినిపించటమేమిటి?” అన్నారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, “నాకు ఇతరుల నుండి ఖుర్ఆన్ పారాయణం వినాలనిపిస్తోంది” అని అన్నారు. అప్పుడు అతను 'అన్నిసా' సూరహ్ లోని ఈ ఆయతు నుండి పారాయణం మొదలుపెట్టారు. అలా అతను పారాయణం చేస్తూ, సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ వాక్కుకు చేరుకున్నప్పుడు: {فَكَيْفَ إِذَا جِئْنَا مِنْ كُلِّ أُمَّةٍ بِشَهِيدٍ، وَجِئْنَا بِكَ عَلَى هَؤُلاَءِ شَهِيدًا}. అంటే, "నీవు నీ ప్రభువు సందేశాన్ని వారికి చేరవేశావని నీ సమాజంపై నిన్ను సాక్షిగా మేము నిలబెట్టినప్పుడు, నీ పరిస్థితి మరియు నీ సమాజం పరిస్థితి ఏమవుతుంది?" ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, 'ఇక పారాయణం ఆపు' అని అన్నారు. ఇబ్నె మసూద్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: నేను ఆయన వైపు తిరిగి చూడగా, ఆ పరిస్థితి యొక్క భయంతో మరియు తన సమాజంపై గల కరుణతో ఆయన కళ్ళ నుండి కన్నీటి ధారలు ప్రవహిస్తున్నాయి.
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: "ఖుర్ఆన్ సహచరుని (ఖుర్’ఆన్ ను కంఠస్థం చేసిన వ్యక్తి) ఉదాహరణ కట్టివేయబడిన ఒంటెల యజమాని లాంటిది. అతను వాటిని జాగ్రత్తగా చూసుకుంటే, అతను వాటిని నిలుపుకుంటాడు; కానీ అతను వాటిని వదిలేస్తే, అవి తప్పించుకుంటాయి."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో - ఖుర్’ఆన్ ను అధ్యయనం చేసిన వ్యక్తిని – అది ముస్’హఫ్ ను (ఖుర్’ఆన్ యొక్క ప్రతిని) చూసి చదవడం ద్వారా కావచ్చు, లేక ఖుర్’ఆన్ ను కంఠస్థం చేయడం ద్వారా కావచ్చు - ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మోకాళ్ళను తాడుతో కట్టిన ఒంటె యజమానితో పోల్చారు. అతను దానిని జాగ్రత్తగా చూసుకుంటే, అతను దానిని తన అధీనంలో ఉంచుకుంటాడు, కానీ అతను దాని తాడును విప్పితే, అది తప్పించుకుని వెళ్ళిపోతుంది. అదే విధంగా ఖుర్’ఆన్ సహచరుడు తాను అధ్యయనం చేసిన దానిపై, లేక తాను కంఠస్థం చేసిన దానిపై స్థిరంగా ఉంటే అతడు దానిని గుర్తుంచుకుంటాడు; మరియు అతను దానిని నిర్లక్ష్యం చేస్తే, అతను దానిని మరచిపోతాడు. కనుక ఖుర్’ఆన్ తో సంబంధం క్రమం తప్పకుండా నిర్వహించబడినంత వరకు, కంఠస్థం చెక్కుచెదరకుండా ఉంటుంది.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: “జిబ్రయీల్ అలైహిస్సలాం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉన్నపుడు పైన ‘కిర్రు’ మనే శబ్దం విన్నారు. ఆయన తన తలపైకి ఎత్తి చూసి, ఇలా అన్నారు: “ఇది స్వర్గములోని ఒక ద్వారము; అది ఈ రోజు తెరుచుకున్నది, ఈ రోజు తప్ప ఇంతకు మునుపు ఎన్నడూ ఆ ద్వారము తెరువబడలేదు”; ఆ ద్వారము నుండి ఒక దైవదూత దిగి వచ్చినాడు. ఆయన (జిబ్రీల్) ఇలా అన్నారు: “ఆయన దైవదూత, ఆ దైవదూత ఈ రోజే భూమిపై దిగివచ్చినాడు, ఈ దినము తప్ప ఇంతకు మునుపు ఎన్నడూ అతడు భూమి మీదకు రాలేదు. అతడు (ఆ దైవదూత) సలాం చేసి ఇలా అన్నాడు: “మీకు ప్రసాదించబడుతున్న రెండు కాంతి పుంజముల శుభవార్తను స్వీకరించండి; మీకు ముందు ఏ సందేశహరునికీ ఇవి ఇవ్వబడలేదు: ‘ఫాతిహతుల్ కితాబ్’ (సూరహ్ ఫాతిహా), మరియు సూరహ్ అల్ బఖరహ్ యొక్క చివరి ఆయతులు. దాని నుండి మీరు ఒక్క అక్షరం పఠించినా అది (దాని ప్రతిఫలం) మీకు ఇవ్వబడుతుంది.”
ముస్లిం నమోదు చేసినారు:జిబ్రయీల్ అలైహిస్సలాం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కూర్చుని ఉన్నపుడు ఆయన స్వర్గము నుండి ఏదో తలుపు తెరువబడున్న శబ్దం విన్నారు. ఆ శబ్దం విని జిబ్రయీల్ అలైహిస్సలాం తన తలను పైకి ఎత్తి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇలా తెలిపినారు – అది స్వర్గములోని ఒక ద్వారము, అది ఈ రోజు తెరువబడినది, ఇంతకు మునుపు ఎప్పుడూ తెరువబడలేదు. ఆ ద్వారము నుండి ఒక దైవదూత భూమి మీదకు దిగివచ్చినాడు. అతడు అంతకు మునుపు ఎన్నడూ భూమి మీదకు దిగిరాలేదు. ఆ దైవదూత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు సలాం చేసి ఇలా పలికినాడు: “నేను మీకు అందజేసిన మరియు మీ కంటే ముందు ఏ ప్రవక్తకూ ఇవ్వబడని రెండు వెలుగుకిరణాల శుభవార్త పట్ల సంతోషించండి. అవి సూరతుల్ ఫాతిహా మరియు సూరతుల్ బఖరహ్ యొక్క చివరి రెండు ఆయతులు.” అప్పుడు ఆ దైవదూత ఇలా అన్నాడు: ఎవరైనా ఆ రెండింటిలో నుండి ఒక్క అక్షరం పఠించినా, సర్వోన్నతుడైన అల్లాహ్ అతనికి వాటిల్లో ఉన్న మంచిని, దుఆలను, వేడుకోళ్ళను అతనికి ప్రసాదిస్తాడే తప్ప, అలా ప్రసాదించకుండా ఉండడు.