





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబూ బుర్దా, అతని తండ్రి అబూ మూసా అల్-అష్అరీ రదియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించినారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తనను యమన్కు పంపినప్పుడు, ఆయనను అక్కడ తయారుచేసే కొన్ని పానీయాల గురించి అడిగాడు. దానికి ప్రవక్త ఇలా అడిగారు: "అవి ఏమిటి?" అతను ఇలా సమాధానమిచ్చాడు: "అల్-బిత్' మరియు అల్-మిజ్ర్." అప్పుడు అబూ బుర్దాను అల్-బిత్' అంటే ఏమిటని అడిగారు, అతను ఇలా చెప్పాడు: తేనెతో తయారు చేసిన రసం, మరియు అల్-మిజ్ర్ అంటే బార్లీతో తయారు చేసిన రసం. అప్పుడు ప్రవక్త ఇలా అన్నారు: "మత్తు కలిగించే ప్రతిదీ నిషిద్ధం (హరామ్)." దీనిని బుఖారీ ఉల్లేఖించారు. ముస్లిం ఉల్లేఖించిన దానిలో ఇలా ఉంది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను మరియు ముఆద్ ను యమన్కు పంపినప్పుడు, నేను ఇలా అడిగాను: 'ఓ రసూలుల్లాహ్! మా ప్రాంతంలో అల్-మిజ్ర్ అనే ఒక పానీయం బార్లీ నుండి తయారు చేయబడుతుంది, మరియు అల్-బిత్' అనే ఒక పానీయం తేనె నుండి తయారు చేయబడుతుంది.' అప్పుడు ఆయన ఇలా అన్నారు: "మత్తు కలిగించే ప్రతిదీ నిషిద్ధం." "ముస్లిం ఉల్లేఖించిన మరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: 'రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఏది నమాజుకు అడ్డుపడుతుందో, అది నిషిద్ధం.'" "మరియు అతని (ముస్లిం) ఉల్లేఖనంలో ఇలా ఉంది: 'అల్లాహ్ యొక్క ప్రవక్తకు మాటల సారాంశం దాని ముగింపులతో ఇవ్వబడింది. అప్పుడు ఆయన ఇలా అన్నారు: నమాజు నుండి దూరం చేసే ప్రతి మత్తు కలిగించే దానిని నేను నిషేధిస్తున్నాను.'"
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు:అబూ మూసా అల్-అష్అరీ రదియల్లాహు అన్హు తెలియజేశారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తనను యమన్కు పంపినప్పుడు, అక్కడ తయారుచేసే కొన్ని పానీయాలు నిషిద్ధమా అని ఆయనను అడిగారు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటి గురించి విచారించారు. అప్పుడు అబూ మూసా రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: "అవి 'అల్-బిత్" అంటే తేనెతో తయారు చేసిన రసం, మరియు 'అల్-మిజ్ర్' అంటే బార్లీతో తయారు చేసిన రసం." ఆయనకు మాటల సారాంశం ఇవ్వబడిన తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "మత్తు కలిగించే ప్రతిదీ నిషిద్ధం."
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా నేను విన్నాను: ఎవరైతే కేవలం అల్లాహ్ కొరకు హజ్ చేస్తారో, అందులో (తన భార్యతో) లైంగిక చర్యలకు మరియు అశ్లీల సంభాషణలకు, చెడు పనులకు పాల్బడడో – అతడు తన తల్లి తనకు జన్మనిచ్చిన దినము వలే తిరిగి వస్తాడు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏమని వివరిస్తున్నారూ అంటే “ఎవరైతే కేవలం సర్వోన్నతుడైన అల్లాహ్ కొరకు మాత్రమే హజ్ చేస్తాడో మరియు అశ్లీలతలకు పాల్బడడో." అన్నారు – ఇక్కడ అశ్లీలత అంటే సంభోగములో పాల్గొనుట మరియు దానికి దారితీసే ప్రతి చర్యా అని అర్థము. ఉదాహరణకు (కాంక్షతో) ముద్దు పెట్టుకొనుట, కౌగలించుకొనుట, ప్రేరేపించుట మొదలైనవి. అదే విధంగా అశ్లీల సంభాషణలు, అసభ్యకరమైన పనులు, చెడుపనులకు పాల్బడుట మొదలైనవి. అసభ్యకరమైన పనులలో, చెడు పనులలో ఇహ్రాంను భంగపరిచే పనులు కూడా వస్తాయి. ఎవరైతే పైన తెలిపిన వాటికి దూరంగా ఉంటాడో, అతడు పాపాల నుండి పూర్తిగా క్షమించబడి, అపుడే జన్మించిన శిశువు మాదిరిగా (పవిత్రంగా) తన హజ్ నుండి తిరిగి వస్తాడు.
ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించినారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “భోజనము వడ్డించి, తయారుగా ఉన్న సమయాన సలాహ్ (నమాజు) ఆచరించరాదు, లేదా కాలకృత్యములు తీర్చుకోవలసిన తీవ్రమైన అవసరం ఉన్నపుడు కూడా సలాహ్ (నమాజు) ఆచరించరాదు.”
ముస్లిం నమోదు చేసినారు:భోజనము వడ్డించి ఉన్నపుడు సలాహ్ ఆచరించడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారు, ఎందుకంటే సలాహ్ ఆచరిస్తున్న వానిలో ఆ ఆహారాన్ని భుజించాలనే అపేక్ష ఉంటుంది, అతని మనసు ఆ వడ్డించబడి ఉన్న ఆహారానికే అంటుకుని ఉంటుంది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు అశుద్ధ విషయాలను, విడుదల చేయవలసిన తీవ్ర అవసరం ఉన్నప్పటికీ, వాటిని ఆపి ఉంచుకుని సలాహ్ ఆచరించుటను నిషేధించినారు. అవి ఒకటి మూత్ర విసర్జన, రెండు మలవిసర్జన. ఎందుకంటే అతడి ధ్యానము వాటిని ఆపి ఉంచుకొనుటకు చేసే ప్రయత్నం పైనే ఉంటుంది.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “శుక్రవారము నాడు ఇమాం ఖుత్బా ప్రసంగము ఇస్తూ ఉండగా, నీవు నీ ప్రక్కన కూర్చుని ఉన్న తోటివాడిని “మౌనంగా ఉండు” అని అంటే నీవు పెద్ద పొరపాటు చేసినవాడవు అవుతావు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "శుక్రవారనాడు ‘ఖుత్బతుల్ జుమ్’అహ్’ (జుమా ప్రసంగము) వినుట కొరకు హాజరైన వారు విధిగా ఆచరించవలసిన మర్యాద ఏమిటంటే వారు జుమా ప్రసంగాన్ని శ్రద్ధగా వినడం" అని వివరిస్తున్నారు. అంటే ఇమాం ప్రసంగాన్ని శ్రద్ధగా వినడం, అందులో చేయబడే సూచనలపై, హెచ్చరికలపై లోతుగా ఆలోచించడం, అవగాహన చేసుకోవడం, అలాగే ఇమాం ప్రసంగిస్తూ ఉండగా ఒక చిన్న మాటైనా సరే మాట్లాడకుండా ఉండటం ఉత్తమం. మీ ప్రక్కవాడిని “మౌనంగా ఉండు” అని, లేక “విను” అని అన్నా కూడా అతడు జుమా నమాజు యొక్క ఘనతను కోల్పోయిన వాడవుతాడు.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా నేను విన్నాను: “మనిషి సహజత్వ ప్రక్రియలలో ఐదు విషయాలు ఇమిడి ఉన్నాయి: అవి సుంతీ, నాభి క్రింది భాగములోని వెంట్రుకలను తొలగించుట, మీసములను కత్తిరించుట (కురచగా చేయుట), (చేతి వేళ్ళ మరియు కాలి వేళ్ళ) గోళ్ళు కత్తిరించుట మరియు చంకలలోని వెంట్రుకలు తొలగించుట.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం ధర్మములోని ఐదు స్వాభావిక ఆచరణల గురించి తెలియ జేసినారు. ఇవి గతించిన ప్రవక్తల సున్నత్’లోని భాగముగా కూడా ఉండేవి. వాటిలో మొదటిది: ‘అల్ ఖితాన్’ (సుంతీ) – అంటే పురుషులలో శిశ్నాగ్రమును కప్పుతూ వదులుగా ఉండే చర్మాన్ని కత్తిరించుట, అలాగే స్త్రీలలో సంభోగపు ప్రదేశానికి (యోనికి) పై భాగాన ఉండే యోని శీర్షాన్ని కత్తిరించుట. రెండవది: ‘అల్’ఇస్తిహ్’దాద్’ – అంటే జననాంగాలపై మరియు జననాంగాల పరిసరాలలో మొలిచే వెంట్రుకలను తొలగించుట. మూడవది: మీసాలను కత్తిరించుట (కురుచవిగా చేయుట). నాలుగవది: గోళ్ళు కత్తిరించుట. ఐదవది: చంకలలోని వెంట్రుకలు తొలగించుట.
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: మీసాలు కత్తిరించండి మరియు గడ్డాన్ని వదిలేయండి (పెంచండి).
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుపెదవులపైకి పెరుగుతూ ఉండే మీసాలను అలాగే వదలి వేయకుండా వాటిని కత్తిరించాలని ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గడ్డాన్ని (కత్తిరించకుండా) వదిలివేయమని ఆదేశిస్తున్నారు.
హుమ్రాన్ మౌలా (ఈయన ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు యొక్క బానిసలలో ఒకరు. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ ఈయనకు స్వేచ్ఛ ప్రసాదించి, బానిసత్వము నుండి విముక్తి చేసినారు) ఉల్లేఖన: అతను ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు వుజూ చేయుట కొరకు నీళ్ళు తెప్పించగా చూసినారు. అపుడు ఆయన (ఉస్మాన్ రజియల్లాహు అన్హు) (ఆ నీటి పాత్ర నుండి) తన రెండు చేతులపై నీళ్ళను వొంపుకుని మూడు సార్లు బాగా కడిగినారు. తరువాత నీటిలో తన కుడి చేతిని వేసి, గుప్పెడు నీళ్ళతో తన నోటినీ మరియు ముక్కునూ శుభ్రపర్చుకున్నారు. తరువాత ఆయన తన ముఖాన్ని మూడు సార్లు కడుగుకున్నారు, తన చేతులను మోచేతుల వరకు మూడు సార్లు కడిగినారు. తరువాత (తడి అరచేతులతో) తన తలను తుడిచినారు. తరువాత తన పాదాలను (చీలమండలాల వరకు) మూడు సార్లు కడిగినారు. తరువాత ఆయన ఇలా అన్నారు: “ఇపుడు నేను ఏవిధంగా ఉదూ చేసినానో, అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయగా నేను చూసినాను. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని తెలిపినారు “ఎవరైతే నేను చేసిన విధంగా వుజూ చేసి, తరువాత నిలబడి, రెండు రకాతుల నమాజును ఖుషూతో అంటే ఆ రకాతులలో తన మనసు, తన ఆలోచనలు ఎటూ పోకుండా, నమాజుపైనే నిలిపి ఆచరిస్తాడో, అతడి పూర్వపు పాపాలు క్షమించి వేయబడతాయి.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఉస్మాన్ రజియల్లాహు అన్హు ఆచరణాత్మకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వుజూ విధానాన్ని బోధించినారు. బాగా స్పష్టంగా ఉండేందుకు గాను, ఆయన ఒక పాత్రలో నీళ్ళు తెమ్మని అడిగారు. అందులో నుంచి తన చేతులపై నీళ్ళు ఒలుపుకుని మూడు సార్లు తన చేతులను కడిగినారు. తరువాత తన కుడి చేతిని నీళ్ళు ఉన్న పాత్రలో పెట్టి, అందునుండి నీళ్ళు తీసుకుని తన నోటిలో పోసుకుని బాగా పుక్కిలించి ఉమ్మివేసినారు, తరువాత తన ముక్కులోనికి నీరు పోనిచ్చి, చీదుతూ బయటకు తీసినారు, తరువాత ఆయన తన ముఖాన్ని మూడు సార్లు కడిగినారు, తరువాత ఆయన తన చేతులను మోచేతుల సమేతంగా మూడు సార్లు కడిగినారు, తరువాత తన అరచేతులను తడి చేసుకుని, తడిచేతులను ఒకసారి తన తలపై నుంచి పోనిచ్చినారు, తరువాత తన పాదాలను చీలమండలాల సమేతంగా మూడుసార్లు కడిగినారు. తరువాత ఆయన రజియల్లాహు అన్హు అక్కడి వారితో తాను చేసి చూపిన విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయగా తాను చూసినాను అని తెలిపినారు; మరియు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభవార్తను కూడా వినిపించినారు - ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసి చూపిన విధంగా వుజూ చేసి, ఖుషూతో రెండు రకాతుల నమాజును అంటే తన హృదయాన్ని సర్వ శక్తిమంతుడూ, సర్వోన్నతుడూ అయిన తన ప్రభువు సమక్షమున నిలిపి ఉంచి ఆచరిస్తాడో, అల్లాహ్ అతనికి - పరిపూర్ణంగా ఉదూ చేసి, కేవలం అల్లాహ్ కొరకే రెండు రకాతుల నమాజు ఆచరించినందుకు గాను అతని పూర్వ పాపాలు క్షమించడం ద్వారా అతనికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా చిన్న హదస్ స్థితిలో (తప్పనిసరిగా వుదూ చేయవలసిన అశుద్ధ స్థితిలో) ఉన్నట్లయితే, వారు వుదూ చేయనంత వరకు అల్లాహ్ వారి సలాహ్ ను (నమాజును) స్వీకరించడు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరిశుద్ధత అనేది సలాహ్ ఆచరించుట కొరకు ఒక షరతు అని తెలుపుతున్నారు. కనుక ఎవరైతే సలాహ్ ఆచరించాలని సంకల్పిస్తాడో, అతడు అంతకు ముందు వుదూను భంగ పరిచే పనులలో దేనికైనా పాల్బడి ఉంటే, అతడు సలాహ్ ఆచరించడానికి వుదూ చేయుట అతని కొరకు విధి అవుతుంది.
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “సివాక్ (పంటిపుల్ల) నోటిని శుభ్రపరుస్తుంది మరియు ప్రభువు (అయిన అల్లాహ్) ను ప్రసన్నుడిని చేస్తుంది".
అన్నసాయీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ‘అరాక్ చెట్టు’ యొక్క పుల్లను లేదా అటువంటి చెట్ల పుల్లను ఉపయోగించి పళ్ళను శుభ్రపరుచుకోవడం నోటిని మాలిన్యము నుండి మరియు దుర్గంధము నుండి శుభ్రపరుస్తుంది’ అని తెలియజేస్తున్నారు. మరియు ఈ విధంగా నోటిని శుభ్రంగా ఉంచుకోవడం తన దాసుని పట్ల అల్లాహ్ ప్రసన్నుడు కావడానికి ఒక కారణం అవుతుంది. ఎందుకంటే, ఇందులో అల్లాహ్ పట్ల దాసుని విధేయత మరియు ఆయన ఆఙ్ఞను శిరసావహించడమూ ఉన్నాయి, అలాగే సర్వ శక్తిమంతుడైన అల్లాహ్ ఇష్టపడే పరిశుభ్రత కూడా ఉన్నది.