





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ముగైరహ్ బిన్ షుఅబహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "నా సమాజంలో ఒక సమూహం (తాయిఫా) ఎల్లప్పుడూ సత్యంపైనే స్థిరంగా ఉంటుంది. అల్లాహ్ ఆజ్ఞ (ప్రళయం లేదా నిర్ణయం) వచ్చే వరకు వారు దానిపైనే విజయవంతంగా నిలిచి ఉంటారు."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు, "నా సమాజంలో నుండి ఒక సమూహం ప్రజలపై విజయం సాధిస్తూ, సత్యవిరోధులను అణచివేస్తూ ఉంటారు. చివరి సమయంలో అల్లాహ్ ఆజ్ఞ (ప్రళయం) వచ్చే వరకు వారు ఈ స్థితిలోనే ఉంటారు."
ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, రసూలుల్లాహు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఏ వ్యక్తి అయినా తన సహోదరుడిని చూసి: "ఓ అవిశ్వాసి (కాఫిర్)" అని అంటే, అది వారిద్దరిలో ఒకరిపై పడుతుంది; నిజంగా అతను చెప్పినట్లే ఉంటే, ఆ మాట అతనిపై పడుతుంది, ఒకవేళ అలా లేకపోతే, ఆ మాట తిరిగి అతనిపైనే (చెప్పిన వ్యక్తి పైనే) పడుతుంది."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరునితో "ఓ అవిశ్వాసి (కాఫిర్)" అని అనకూడదని తీవ్రంగా హెచ్చరించారు. ఈ విధంగా అవిశ్వాసి అని అనడం వలన, ఆ మాట వారిద్దరిలో ఒకరిపై పడుతుంది: అది నిజంగా అతనికి సరిపోతే, అప్పుడు ఆ మాట అతను అలా అన్న వ్యక్తిపై పడుతుంది; ఒకవేళ అలా లేకపోతే, ఆ నింద తిరిగి చెప్పినవాడిపైనే పడుతుంది.
ఇమ్రాన్ బిన్ హుసైన్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "మీలో ఉత్తములు నా తరం వారు (సహాబాలు), తర్వాత వారిని అనుసరించే వారు (తాబియీన్), తర్వాత వారిని అనుసరించే వారు (అతబ్బ తాబియీన్)." ఇమ్రాన్ (రదియల్లాహు అన్హు) ఇలా పలికినారు: "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు తరాలను గురించి చెప్పారా లేక మూడు తరాలను గురించి చెప్పారా అనే విషయం నాకు స్పష్టంగా గుర్తు లేదు." ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "మీ తర్వాత కొంతమంది ప్రజలు వస్తారు – వారు విశ్వసిస్తారు, కానీ నమ్మదగినవారు కారు; వారు సాక్ష్యం చెబుతారు, కానీ వారిని సాక్షిగా అడగరు; వారు ప్రతిజ్ఞ చేస్తారు, కానీ నెరవేర్చరు; వారి మధ్య మోటుదనం (అధిక బరువు/సుఖ జీవనం) విస్తరించి, లావుగా ఉంటారు."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: ప్రజలలో ఉత్తమమైన తరం అంటే నేను (ప్రవక్తగా) మరియు నా సహాబాలు (సహచరులు) ఉన్న తరం. వారి తర్వాత తాబియీన్ (సహాబాలను కలిసిన, మరియు ప్రవక్తను కలవని విశ్వాసులు) వస్తారు. ఆ తర్వాత తబ్బఅ-తాబియీన్ (తాబియీన్ అనుచరులు) వస్తారు." ఈ హదీథును ఉల్లేఖించిన సహాబీ (రదియల్లాహు అన్హు) నాల్గవ తరం గురించి చెప్పడంలో సందేహించారు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "వారి తర్వాత (ఉత్తమ తరాల తర్వాత) కొంతమంది ప్రజలు వస్తారు – వారు ద్రోహం చేస్తారు, ప్రజలు వారిని నమ్మరు; వారు సాక్ష్యం చెబుతారు, కానీ వారి సాక్షి చెల్లదు; వారు ప్రతిజ్ఞ చేస్తారు, కానీ నెరవేర్చరు; వారు తినే, త్రాగే విషయాల్లో విస్తృతంగా ప్రవర్తిస్తారు (అధికంగా తింటారు, త్రాగుతారు), చివరికి వారి మధ్య మోటుదనం (అధిక బరువు) విస్తరిస్తుంది."
అబూ సఅ'లబా అల్-ఖుషనియ్యి జర్'సూమి ఇబ్నె నాషిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "నిశ్చయంగా, అల్లాహ్ కొన్ని బాధ్యతలను విధించాడు, కాబట్టి వాటిని వృధా చేయకండి. మరియు కొన్ని హద్దులు (నిబంధనలు) నిర్దేశించాడు, కాబట్టి వాటిని అతిక్రమించకండి. మరియు కొన్నింటిని నిషేధించాడు, కాబట్టి వాటిని ఉల్లంఘించకండి. మరియు మీపై దయ వలన, మరికొన్నింటి గురించి మౌనం దాల్చాడు; (అది) ఆయన మరచిపోవడంవల్ల కాదు, కాబట్టి మీరు వాటిని పరిశోధించకండి."
దారు ఖుత్నీ తన సునన్ లో మరియు తదితరులు నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా అన్నారు, అల్లాహ్ కొన్నింటిని తప్పనిసరి చేసాడు మరియు విధిగావించాడు, కాబట్టి వాటికి కట్టుబడి ఉండండి మరియు వాటిని వదిలివేయడం ద్వారా లేదా వాటిని పట్టించుకోక పోవడం ద్వారా వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఆయన మీ కోసం అడ్డంకులు మరియు ఆటంకాలను ఏర్పాటు చేశాడు, అవి మిమ్మల్ని నిరోధించి, ఆయన ఇష్టపడని వాటిని మీరు ఆచరించకుండా మిమ్మల్ని నిరోధిస్తాయి, కాబట్టి షరియా ఆదేశించిన నిషేధాజ్ఞలను అతిక్రమించవద్దు. ఆయన కొన్నింటిని నిషేధించాడు, కాబట్టి వాటిలో పాల్గొనవద్దు లేదా వాటి దగ్గరికి వెళ్లవద్దు, వాటిని ఉల్లంఘించవద్దు. వాటిని కాకుండా, ఆయన తన సేవకుల పట్ల దయతో మిగతా వాటి గురించి మౌనంగా ఉన్నాడు, కాబట్టి అవి వాటి అసలు స్థితిలోనే అనుమతించబడతాయి, అందువలన వాటి కోసం వెతకవద్దు.
అబూ ముహమ్మద్ అల్-హసన్ ఇబ్నె అలీ ఇబ్నె అబూ తాలిబ్ - రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మనుమడు మరియు ఆయనకు ఇష్టమైనవాడు - నుండి ఉల్లేఖన: నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇది కంఠస్థం చేసుకున్నాను: "ఏది నీకు సందేహాన్ని కలిగిస్తుందో, దానిని వదిలిపెట్టి, ఏది నీకు సందేహాన్ని కలిగించదో, దానిని ఆచరించు."
అత్తిర్మిదీ మరియు అన్నసాయీ నమోదు చేసినారు:ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు: మాటలలో లేదా పనులలో, ఏది నిషిద్ధమైనదా కాదా, హరామా (నిషేధించబడినదా) లేదా హలాలా (ధర్మసమ్మతమైనదా) అని నీకు సందేహం కలిగించే వాటిని విడిచిపెట్టి, ఏది ఉత్తమమైనదని మరియు ధర్మసమ్మతమైనదని నీవు నిశ్చయించుకున్నావో, దానిని ఆచరించు.
అబూ యఅ'లా షద్దాద్ ఇబ్నె ఔస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి విషయంలోనూ 'ఇహ్సాన్' (ఉత్తమంగా, దయతో వ్యవహరించడం) ను విధిగా చేశాడు. కాబట్టి, మీరు చంపినట్లయితే, మంచి పద్ధతిలో చంపండి అంటే మీరు జంతువు ఖుర్బానీ చేసేటప్పుడు, మంచి పద్ధతిలో ఖుర్బానీ చేయండి. మీలో ప్రతి ఒక్కరూ తన కత్తిని బాగా పదును పెట్టుకోవాలి మరియు తన ఖుర్బానీ జంతువుకు ఉపశమనం కలిగించాలి (మొండి కత్తి వలన ఖుర్బానీ సమయంలో జంతువుకు కష్టం కలిగించకూడదు)."
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు – ‘ప్రతి విషయంలోనూ ‘అల్ ఇహ్’సాన్’ కలిగి ఉండడాన్ని అల్లాహ్ మనపై విధిగావించినాడు. (అల్ ఇహ్’సాన్: అంటే, ఉచితమైన స్థాయి కంటే కూడా ఎక్కువగా కరుణ కలిగి ఉండుట అనే అర్థం ఉన్నది). అది (అల్ ఇహ్’సాన్) అల్లాహ్ పట్ల అన్ని వేళలా చేతన కలిగి ఉండుట, ఆయన ఆరాధనలలో, అన్ని వేళలా మంచిని చేయటలో, దాతృత్వ గుణాన్ని కలిగి ఉండుటలో, అల్లాహ్ సృష్టితాలకు నష్టం కలిగించకుండా ఉండుట - మొదలైన విషయాలలో చేతన కలిగి ఉండుట ద్వారా సాధించ బడుతుంది. అదే విధంగా ‘అల్ ఇహ్’సాన్’ కలిగి ఉండ వలసిన విషయాలలో, ఏదైనా ప్రాణం తీయుట మరియు అల్లాహ్ పేరున జిబహ్ చేయుట కూడా ఉన్నాయి. అల్’ఖిసాస్ విషయంలో ‘అల్ ఇహ్’సాన్’ పాటించుట: (అల్ ఖిసాస్ – అంటే షరియత్ ప్రకారం ‘ప్రాణానికి ప్రాణము’ అనే నియమం క్రింద, హతుని కుటుంబము క్షమాభిక్ష ప్రసాదించక పోతే, హంతకునికి విధించబడే మరణ శిక్ష): ఆ సందర్భములో హంతకునికి కష్టము, బాధ కలుగకుండా, తేలికగా, అత్యంత వేగంగా అతని ప్రాణం పోయే విధానాన్ని ఎంచుకోవడం. అల్లాహ్ పేరున జంతువు జిబహ్ చేయ బడునప్పుడు ‘అల్ ఇహ్’సాన్’ పాటించుట: జిబహ్ చేయబడే జంతువు ఎదురుగా (అది చూస్తుండగా) కత్తిని పదును చేయరాదు మరియు ( మందలోని) ఇతర జంతువులు చూస్తుండగా జిబహ్ చేయరాదు.
అబూ మాలిక్ అల్ హారిథ్ ఇబ్నె ఆసిమ్ అల్ అష్'అరీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "పరిశుభ్రత (తుహూర్) విశ్వాసం (ఈమాన్) లో సగభాగం. 'అల్-హమ్దు లిల్లాహ్' (అల్లాహ్ కే సకల పొగడ్తలు, కృతజ్ఞతలు శోభిస్తాయి) త్రాసును నింపుతుంది. 'సుబ్హానల్లాహ్' (అల్లాహ్ పరమ పరిశుద్ధుడు) మరియు 'అల్-హమ్దు లిల్లాహ్' ఆకాశానికి మరియు భూమికి మధ్య ఉన్న ఖాళీని నింపుతాయి. నమాజ్ మన హృదయాలకు, ముఖాలకు వెలుగును ఇస్తుంది. దానధర్మం మన విశ్వాసానికి ఒక స్పష్టమైన రుజువు. కష్టాలలో సహనం ఒక ప్రకాశవంతమైన ఒక మార్గదర్శకం, ఒక కాంతి. ఖుర్ఆన్ నీకు అనుకూలంగా లేదా నీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తుంది. ప్రతి మనిషి ఉదయం లేచి వెళ్ళిపోతాడు, తన ఆత్మను (స్వర్గానికి లేదా నరకానికి) అమ్ముకుంటాడు, ఆ తర్వాత దాన్ని విముక్తి చేస్తాడు లేదా దాన్ని నాశనం చేసుకుంటాడు."
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాలు తెలియజేస్తున్నారు: భౌతిక పరిశుద్ధత వుదూ మరియు గుసుల్ ఆచరించుట ద్వారా లభించును. నమాజు కొరకు వుదూ చేసి ఉండుట ఒక షరతు. ‘అల్-హందులిల్లాహ్’ అని పలుకుట అంటే ‘సకల స్తోత్రములు కేవలం అల్లాహ్ కే చెందుతాయి’ అని పలుకుట మరియు అల్లాహ్ ను అత్యంత పరిపూర్ణమైన గుణగణాలతో, లక్షణాలతో కీర్తించుట – తీర్పు దినము నాడు సత్కర్మల త్రాసులో తూచబడుతుంది మరియు అది సత్కర్మల త్రాసును నింపివేస్తుంది. మరియు ‘సుబ్’హానల్లాహి వల్’హందులిల్లాహి’ (అల్లాహ్ పరమ పవిత్రుడు మరియు సకల స్తోత్రములు ఆయనకే చెందుతాయి) అని ఈ రెండు పదాలను కలిపి ఉచ్ఛరించుట భూమ్యాకాశాల మధ్యన ఉన్న అంతటినీ నింపివేస్తుంది. అలాగే ‘నమాజు కాంతి’, అంటే అది అతని హృదయములో కాంతి, అతని ముఖములో కాంతి, అతని సమాధిలో కాంతి అలాగే తీర్పు దినమున అది అతని కొరకు కాంతి అని అర్థము. ఇంకా ‘దానము చేయుట ఒక సాక్ష్యము’ అంటే దానము చేయుట అనే గుణము ఇస్లాంలో అతని విశ్వాసములో అతనియొక్క నిజాయితీ, నిష్కపటత్వము లకు నిదర్శనం. ఈ గుణము కపట విశ్వాసిలో కనపడదు. ఎందుకంటే దానగుణమును అలవర్చుకునే వారికి ఇస్లాం చేసే వాగ్దానములలో కపట విశ్వాసికి నమ్మకం ఉండదు. మరియు ‘సహనము వెలుగు’ – అంటే దైనందిన జీవితములో ఎదురయ్యే చింత, వేదన, వ్యాకులత, కోపము, విద్వేషము, శత్రుత్వము మొదలైన వాటి నుండి తనను తాను ఆపుకొనుట, సహనము వహించుట. వెలుగు అనేది , సూర్యకాంతి వలే తనతో పాటు మంటను వేడినీ తీసుకుని వస్తుంది. సహనం వహించుట అనేది చాలా కష్టమైనది. ఎందుకంటే అందులో స్వయంతో పోరాటం, స్వీయ ఆత్మతో పోరాటం ఉంటాయి. ఆత్మ ఉత్తేజ పరిచే కోరికల నుండి తనను తాను బందీ చేసుకోవలసి ఉంటుంది. అందుకనే సహనం వహించే వ్యక్తి ఎప్పుడూ వెలుగును కలిగి ఉంటాడు, మార్గదర్శనం కలిగి ఉంటాడు, మరియు ఎల్లప్పుడూ సత్యము పై ఉంటాడు. అలాగే అతడు అల్లాహ్ యొక్క విధేయతకు సంబంధించిన విషయాలలో సహనం కలిగి ఉంటాడు. అల్లాహ్ యొక్క అవిధేయతకు దారి తీసే విషయాల పట్ల సహనం కలిగి ఉంటాడు. విధిలిఖితం, పూర్వనిర్దిష్టం వలన కలిగే కష్టాలు, బాధల పట్ల సహనం కలిగి ఉంటాడు. మరియు ఖుర్’ఆన్ నీ పక్షమున ఒక సాక్షి, దానిని అనుదినము పఠిస్తూ దానిపై ఆచరిస్తూ ఉన్నట్లయితే; అలాగే ఖుర్’ఆన్ నీకు వ్యతిరేకంగా ఒక సాక్షి, ఒకవేళ దాని పారాయణం చేయకుండా మరియు దానిపై ఆచరించకుండా వదిలి వేసినట్లయితే. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలు ప్రతిరోజూ ఉదయమే తమ నిద్రల నుండి లేస్తారు, ఉరుకులు పరుగులతో తమతమ ఇళ్ళను వదిలి తమతమ పనల కొరకు బయలుదేరుతారు అని తెలియజెసారు. వారిలో కొంతమంది అల్లాహ్ యొక్క విధేయతలో నిజాయితీ కలిగి ఉంటారు, ఆయన విధేయతలో పటిష్ఠంగా నిలబదతారు. వారు తమను తాము నరకాగ్ని నుండి రక్షించుకుంటారు. మరి కొందరు సత్యమార్గము నుండి వైదొలగి అల్లాహ్ యొక్క అవిధేయతలో పడిపోతారు, తమను తాము నాశనం చేసుకుని నరకాగ్నిలో పడిపోతారు.
అబూ సయీద్ సఅద్ ఇబ్నె మాలిక్ ఇబ్నె సినాన్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: హాని చేయకూడదు మరియు ప్రతిహాని కూడా చేయకూడదు
ఇబ్న్ మాజహ్ మరియు అద్దారఖుత్నీ మొదలైనవారు ముస్నదుగా నమోదు చేసినారు:ప్రవక్త ముహమ్మద్ ﷺ స్పష్టంగా ఇలా తెలియజేశారు: హానికరమైనది ఏ రూపంలో ఉన్నా, దానిని తన కొరకు మరియు ఇతరుల కొరకు దూరంగా ఉంచడం తప్పనిసరి. ఎందుకంటే ఎవ్వరూ తమకు తాము హాని కలిగించుకోవడం గానీ, ఇతరులకు హాని కలిగించడం గానీ ధర్మసమ్మతం కాదు. ఒక వ్యక్తి నష్టానికి ప్రతీకారంగా నష్టాన్ని కలిగించడం ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే న్యాయమైన ప్రతీకారం (ఖిసాస్) పద్ధతిలో తప్ప, నష్టాన్ని నష్టంతో తొలగించకూడదు. అది కూడా హక్కుల అతిక్రమణ లేకుండా మాత్రమే జరగాలి.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ప్రజలకు కేవలం వారి దావాల ఆధారంగానే ఇవ్వబడితే, కొంతమంది ప్రజలు ఇతరుల సంపదపై మరియు రక్తంపై (ప్రాణాలపై) కూడా దావా చేస్తారు. కానీ, సాక్ష్యం చూపే బాధ్యత దావా చేసేవారి మీద ఉంటుంది; మరియు ప్రమాణం నిరాకరించే వ్యక్తిపై ఉంటుంది."
బైహఖీ మరియు ఇతరులు ఇలాగే నమోదు చేసినారు: మరియు దాని కొంత భాగం సహీహైన్ లలో ఉందిప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: సాక్ష్యాలు గానీ లేదా తగిన ఆధారాలు గానీ లేకుండా ప్రజలు దావా చేసిన (క్లెయిమ్ చేసిన) దానిని ఇచ్చివేస్తే, కొంతమంది ఇతరుల డబ్బు మరియు రక్తాన్ని కూడా క్లెయిమ్ చేస్తారు. అయితే, దావా చేస్తున్న వ్యక్తి, తాను దావా చేస్తున్న దానికి సాక్ష్యం మరియు రుజువును తప్పనిసరిగా సమకూర్చాలి. అతని వద్ద సాక్ష్యం, రుజువు లేకపోతే, ఆ దావా ప్రతివాదికి సమర్పించబడుతుంది. అతను దానిని తిరస్కరించినట్లయితే, అతను ప్రమాణం చేయాలి, ఆ విధంగా అతడు నిర్దోషిగా ప్రకటించబడతాడు.