





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబూ బుర్'దహ్ బిన్ అబూ మూసా రదియల్లాహు అన్హు ఉల్లేఖన: అబూ మూసా తీవ్ర నొప్పితో బాధపడుతున్నారు, అతని తల అతని కుటుంబంలోని ఒక మహిళ ఒడిలో ఉండగా అతను స్పృహ కోల్పోయారు. మరియు అతను ఆమెకు ఏ విధంగానూ (ఆమె పెడబొబ్బలకు నిస్పృహ వలన) స్పందించలేకపోయారు. స్పృహ తిరిగి వచ్చిన తర్వాత, అతను ఇలా అన్నారు: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి నుండి అయితే తనను తాను వేరు చేసుకున్నారో, వారి నుండి నన్ను నేను వేరు చేసుకుంటున్నాను. నిశ్చయంగా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, సాలిఖా (జనాజాపై పెద్దగా పెడబొబ్బలు పెడుతూ విలపించే స్త్రీ), హాలిఖా (తలజుట్టు గొరిగించుకునే స్త్రీ) మరియు షక్కా (దుఃఖంలో దుస్తులు చింపుకునే స్త్రీ) లను తిరస్కరించారు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఅబూ బుర్దా రదియల్లాహు అన్హు తన తండ్రి అబూ మూసా అల్-అష్’అరి రదియల్లాహు అన్హు తీవ్ర అనారోగ్యానికి గురై స్పృహ కోల్పోయారని, అతని తల అతని కుటుంబంలోని ఒక మహిళ ఒడిలో ఉందని, అపుడు ఆమె బిగ్గరగా అరుస్తూ విలపించిందని, కానీ అతను స్పృహలో లేకపోవడం వలన ఆమెకు స్పందించ లేకపోయారని (నివారించలేకపోయారని) తెలిపినారు. అతను స్పృహలోకి వచ్చిన తరువాత, ఇలా అన్నారు: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి నుండి అయితే తనను తాను వేరు చేసుకున్నారో, అతను రదియల్లాహు అన్హు కూడా తనను తాను వారి నుండి వేరు చేసుకుంటన్నానని పలికినారు: అస్సాలిఖహ్: విపత్తు, దుఃఖంపై విలపిస్తూ తన స్వరాన్ని పెంచే స్త్రీ అంటే పెడబొబ్బలు పెడుతూ బిగ్గరగా ఏడ్చే స్త్రీ. అల్' హాలిఖా: విపత్తు, దుఃఖంపై తన తలజుట్టును గొరిగించుకునే స్త్రీ. అల్'షఖ్ఖహ్: విపత్తు, దుఃఖంపై తన వస్త్రాన్ని చింపుకునే స్త్రీ. ఎందుకంటే అలాంటి విలపించే అలవాట్లు ఇస్లాంకు పూర్వం గడిచిన అజ్ఞాన కాలం యొక్క ఆచారాల నుండి వచ్చాయి. బదులుగా, విపత్తు సమయాల్లో ఓపికగా ఉండాలని మరియు అందుకు గాను అల్లాహ్ నుండి ప్రతిఫలాన్ని కోరాలని ఆదేశించబడింది.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "‘ఒక ముస్లింకి మరొక ముస్లిం పై ఆరు హక్కులు ఉన్నాయి. ‘ఒకటి అతన్ని కలిసినప్పుడు సలాం చేయాలి, రెండు : అతను నిన్ను ఆహ్వానించినప్పుడు దాన్ని స్వీకరించాలి. మూడు : అతను నిన్ను సలహా కోరితే అతనికి మేలైన సలహా ఇవ్వాలి. నాలుగు : తుమ్మినప్పుడు అల్హందులిల్లాహ్ పలికితే దానికి యర్హముకల్లాహ్ అని జవాబు చెప్పాలి. ఐదు : అతను జబ్బు పడినప్పుడు అనారోగ్యానికి గురైనప్పుడు వెళ్ళి పరామర్శించాలి. ఆరు : చనిపోయినప్పుడు అతని జనాజా వెంట వెళ్ళాలి
ముస్లిం నమోదు చేసినారు:ఒక ముస్లిం మీద మరో ముస్లిం హక్కులు ఆరు ఉన్నాయని ప్రవక్త ﷺ స్పష్టం చేసినారు. అవి: మొదటి హక్కు: ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరుడిని కలిసినప్పుడు, "అస్సలాము అలైకుం" (మీపై శాంతి ఉండుగాక) అని సలాం చెప్పాలి. దానికి అతను కూడా "వఅలైకుమ్ అస్సలాం" (మీపై కూడా శాంతి ఉండుగాక) అని జవాబు ఇవ్వాలి. రెండవ హక్కు: ఒక ముస్లిం తన సహోదరుడిని వలీమా (విందు) లేదా ఇతర (ధర్మబద్ధమైన) శుభకార్యాలకు పిలిస్తే, ఆ ఆహ్వానాన్ని స్వీకరించి, హాజరు కావాలి. మూడవ హక్కు: సోదరుడు సలహా అడిగితే, నిజాయితీగా, దొంగదనమూ లేకుండా, మోసం చేయకుండా అతనికి మంచి సలహా ఇవ్వాలి. నాల్గవ హక్కు: ఒక ముస్లిం తుమ్మినప్పుడు, అతడు "అల్హమ్దు లిల్లాహ్" (అల్లాహ్ కే సకల స్తుతులు) అని పలకాలి. అప్పుడు నీవు అతనికి "యర్హముకల్లాహ్" (అల్లాహ్ నీపై దయజూపుగాక) అని చెప్పాలి. ఆయన కూడా దానికి ప్రతిగా "యహ్దీకుముల్లాహ్ వయుస్లిహ్ బాలకుమ్" (అల్లాహ్ మీకు మార్గదర్శనం చేయుగాక, మీ పరిస్థితిని మంచిగా మార్చుగాక) అని చెప్పాలి. ఐదవ హక్కు: ఒక ముస్లిం అనారోగ్యంతో ఉన్నప్పుడు, అతడిని పరామర్శించాలి, అతడి ఆరోగ్యం కోసం దుఆ చేయాలి. ఆరవ హక్కు: ఒక ముస్లిం మరణిస్తే, అతడి జనాజా పాల్గొనాలి, అతడి పై జనాజా నమాజ్ చేయాలి, అతడిని సమాధిలో ఉంచే వరకూ అతడి జనాజా వెంట వెళ్లాలి.
ఉమ్ముల్ ముమినీన్ అంటే విశ్వాసుల తల్లి అయిన ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, తాను కోలుకోలేని అనారోగ్యంతో ఉన్న సమయంలో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "యూదులను మరియు క్రైస్తవులను అల్లాహ్ శపించు గాక! ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనా స్థలాలుగా చేసుకున్నారు." ఆ తరువాత ఆమె ఇలా అన్నారు: "ఆయన సమాధిని ప్రార్థనా స్థలంగా చేసుకుంటారనే భయం లేకపోతే, ఆయన సమాధి పైకి కనబడేలా చేయబడి ఉండేది".
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఉమ్ముల్ ముమినీన్ అంటే విశ్వాసుల తల్లి అయిన ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా పలికినారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తన తీవ్రమైన అనారోగ్యంతో అంతిమ సమయంలో ఉన్నప్పుడు ఇలా పలికినారు: “అల్లాహ్ యూదులను మరియు క్రైస్తవులను శపించారు మరియు వారిని తన దయ నుండి బహిష్కరించినాడు, ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను ప్రార్థనా స్థలాలుగా చేసుకున్నారు, వాటిపై కట్టడాలు నిర్మించడం లేదా వాటి దగ్గర ప్రార్థించడం లేదా వాటికి అభిముఖంగా నిలబడి ప్రార్థన చేయడం ద్వారా.” ఇంకా ఆమె రదియల్లాహు అన్హా ఇలా పలికినారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నిషేధం మరియు హెచ్చరిక లేకుంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధికి కూడా యూదులు మరియు క్రైస్తవులు తమ ప్రవక్తల సమాధులకు చేసినట్లుగానే జరుగుతుందనే భయం లేకుంటే, ఆయన సమాధి కనిపించేది మరియు ప్రముఖమైనదిగా తయారు చేయబడి ఉండేది.
అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: అలీ ఇబ్నె అబూ తాలిబ్ (రదియల్లాహు అన్హు) యెమెన్ నుండి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు కొంత బంగారం పంపారు. ఆ బంగారానికి ఇంకా కొంత మట్టి అంటుకుని ఉండగా, పచ్చటి వస్త్రంలో పెట్టి పంపించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ బంగారాన్ని ఈ నలుగురికి పంచిపెట్టారు: 'ఉయైనహ్ బిన్ బద్ర్, అఖ్రఅ్ బిన్ హాబిస్, జైద్ అల్ ఖైల్, మరియు నాలుగో వ్యక్తి అల్ఖమా లేదా ఆమిర్ బిన్ తుఫైల్ (ఇద్దరిలో ఒకరు). అప్పుడు సహాబాలలో ఒకరు: "మేము వీళ్లకంటే దీనికి ఎక్కువ హక్కుదారులం" అని అన్నారు. ఇది ప్రవక్తకు తెలిసింది. దానిపై ఆయన ఇలా అన్నారు: "మీరు నన్ను నమ్మడం లేదా? నేను ఆకాశాల్లో ఉన్న అల్లాహ్కు విశ్వసనీయుడిని. ఉదయం, సాయంత్రం నా వద్దకు పరలోక వార్తలు వస్తుంటాయి." అప్పుడు ఒక వ్యక్తి (కళ్లలో లోతు, బుగ్గలు ముదురు, నుదురు పైగా, గడ్డం మందంగా, తల శుభ్రంగా గీయించుకున్నవాడు, కడుపుపై మడత పెట్టుకున్న దుస్తులు ధరించినవాడు) లేచి: "ఓ రసూలల్లాహ్! అల్లాహ్ కు భయపడండి" అని అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహ వసల్లం: "నీకు శాపం! భూమిపై ఉన్న వారందరి కంటే ఎక్కువగా అల్లాహ్ కు భయపడటానికి నేను అర్హుడిని కాదా?" అని అన్నారు. ఆ తరువాత ఆ వ్యక్తి వెళ్లి పోయాడు. అపుడు ఖాలిద్ ఇబ్న్ వలీద్: "ఓ రసూలిల్లాహ్! నేను ఇతని మెడ నరికి వేయనా?" అని అడిగారు. దానికి ఆయన: "లేదు, ఎందుకంటే ఇతను నమాజ్ చేయువారిలోని వాడు" అని చెప్పారు. అపుడు ఖాలిద్: "ఎంతో మంది నమాజ్ చేస్తారు, కానీ వారి మనసులో లేనిది నోటితో చెబుతారు" అని అన్నారు. దానికి ప్రవక్త : "నేను ప్రజల హృదయాలను చీల్చి చూడమని, వారి పొట్టలను తెరచి చూడమని ఆదేశించబడలేదు" అన్నారు. ఆ వ్యక్తి వెళ్లిపోతుండగా ప్రవక్త: "ఈ వ్యక్తి సంతానంలోంచి ఒక వర్గం పుట్టుకు వస్తారు. వారు అల్లాహ్ గ్రంథాన్ని (ఖుర్ఆన్) మధురమైన స్వరంతో పారాయణం చేస్తారు, కానీ అది వారి గొంతును దాటి లోపలికి పోదు. వారు బాణం లక్ష్యాన్ని ఛేదించినంత వేగంగా ధర్మాన్ని విడిచి పెట్టి వెళ్తారు. ఒకవేళ నేను వారిని చూడగలిగితే, థమూద్ ప్రజలు నాశనమైనట్లుగా, వారినీ అలా నాశనం చేస్తాను" అని అన్నారు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఅలీ బిన్ అబూ తాలిబ్ రదియల్లాహు అన్హు యెమెన్ నుండి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు ఒక బంగారం ముక్కను పంపించారు. ఆ బంగారం ముక్కను చర్మంతో తయారుచేసిన సంచిలో పెట్టి పంపించారు. ఆ బంగారం ముక్కను ఇంకా మట్టి అంటుకునే ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం (ఆ బంగారాన్ని) అక్కడున్న నలుగురు వ్యక్తులకు పంచిపెట్టారు. ఆ నలుగురు - ఉయైనహ్ బిన్ బద్ర్ అల్ ఫజారీ, అఖ్రఅ్ బిన్ హాబిస్ అల్ హన్జలీ, జైద్ అల్ ఖైల్ అల్ నబ్హానీ, మరియు అల్కమా బిన్ ఉలాథా అల్ ఆమిరీ. అది చూసి ఆయన సహాబాలలోని ఒకరు ఇలా అన్నారు: "వీళ్ళకంటే మేమే దీనికి ఎక్కువ హక్కుదారులం."హదీసు రావీ అంటున్నారు: ఆ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సల్లల్లాహు అలైహి వసల్లంకు చేరితే ఆయన ఇలా పలికినారు: "నీవు నన్ను నమ్మడం లేదా? నేను ఆకాశంలో ఉన్నవాని (అల్లాహ్) విశ్వసనీయుడిని. నాకు పరలోక సమాచారం ఉదయం, సాయంత్రం వస్తూ ఉంటుంది." అప్పుడు ఆ వ్యక్తి లేచాడు — అతడి కళ్లు లోతుగా, బుగ్గలు బయటకు ఉబ్బి, నుదురు కొంచెం పైకి ఉండి, గడ్డం మందంగా (కానీ పొడవుగా కాదు) ఉంది, తలను పూర్తిగా గొరిగించుకుని ఉన్నాడు, తన కింద భాగాన్ని కప్పే వస్త్రాన్ని పైకి ఎత్తుకుని ఉన్నాడు — అతను ఇలా అన్నాడు: "ఓ రసూలుల్లాహ్! అల్లాహ్ కు భయపడండి." దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: "నీకు శాపం! భూమిపై ఉన్న వారందరిలో అల్లాహ్ కు భయపడటానికి నేను ఎక్కువ అర్హుడిని కాదా?" ఆ తరువాత ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అప్పుడు ఖాలిద్ ఇబ్న్ వలీద్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు:" "ఓ రసూలుల్లాహ్! నేను అతడి మెడ నరికి వేయనా?" దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం: 'లేదు, అతను నమాజ్ చేసే వాడై ఉండవచ్చు' అని పలికినారు. అప్పుడు ఖాలిద్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు, "ఎంతో మంది నమాజ్ చేసేవారిలో వారి నోటితో చెప్పేది వారి హృదయంలో ఉండదు" దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ప్రజల హృదయాలను తవ్వి చూడమని, లేదా వారి పొట్టలను చీల్చి చూడమని నేను ఆదేశించబడలేదు; బహిరంగ విషయాల ప్రకారం మాత్రమే తీర్పు చెప్పమని నేను ఆదేశించబడినాను." "ఆ వ్యక్తి వెనక్కు తిరిగి వెళ్తుండగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని చూసి ఇలా పలికినారు: "ఈ వ్యక్తి సంతానంలో నుండో లేదా అతని సహచరుల సంతానంలో నుండో లేదా అతని తెగ సంతానంలో నుండో ఒక వర్గం పుట్టి, బయలుదేరుతుంది. ఆ వర్గం వారు అల్లాహ్ యొక్క గ్రంథాన్ని (ఖుర్ఆన్ను) చాలా చక్కటి స్వరంతో మృదుమధురంగా పఠించడంలో నిపుణులు. వారి నోళ్లు ఖుర్ఆన్ పారాయణం వల్ల తడిగా ఉంటాయి. కానీ ఖుర్ఆన్ వారి గొంతును దాటి వారి హృదయాలకు చేరదు, అంటే వారు పఠించిన ఖుర్ఆన్ వారి మనసులను మార్చదు, అల్లాహ్ వారిని (శుభాలలో) పైకి ఎత్తడు, వారిని అంగీకరించడు. బాణం ఎక్కు పెట్టిన తరువాత అది తన లక్ష్యాన్ని ఛేదించడానికి వెంటనే ఎంత వేగంగా బయటకు వెళ్తుందో, వారు అంత వేగంగా, సులభంగా ఇస్లాం నుండి బయటకు వెళ్లిపోతారు." ఆ తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా కూడా అన్నారని నేను అనుకుంటున్నాను: 'వారు (ఆ వర్గం) ముస్లింలపై ఖడ్గంతో (యుద్ధంతో) తిరుగుబాటు చేసినపుడు, థమూద్ ప్రజలను ఎలా నాశనం చేయబడినారో, వారు కూడా అలా తీవ్రంగా సంహరింప బడాలని నేను ఆశిస్తున్నాను.'"
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "నిశ్చయంగా, స్వర్గంలో మీలో ఒకరికి లభించే అత్యల్ప స్థానం ఏమిటంటే, అల్లాహ్ అతనితో 'కోరుకో' అంటాడు: అతను కోరుకుంటాడు. మళ్లీ కోరుకుంటాడు. అప్పుడు అల్లాహ్ అతన్ని అడుగుతాడు: 'నీవు కోరుకున్నావా?' అతను 'అవును' అని జవాబిస్తాడు. అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు: 'నీవు కోరుకున్నది నీకు ఇవ్వబడింది, అదనంగా దానికి సమానమైనంత కూడా ఇవ్వబడింది.'"
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: స్వర్గంలో ప్రవేశించిన వ్యక్తికి లభించే అత్యల్ప (అతి తక్కువ) స్థానం ఏమిటంటే, అతనితో (అల్లాహ్) 'కోరుకో' అని అంటాడు. అతను కోరుకుంటాడు, మళ్లీ కోరుకుంటాడు, తన కోరికలలో ఏదీ మిగిలి పోకుండా అన్నింటినీ కోరుకుంటాడు. అప్పుడు అతనితో 'నువ్వు కోరుకున్నావా?' అని అల్లాహ్ అడుగుతాడు. అతను 'అవును' అని జవాబిస్తాడు. అప్పుడు అల్లాహ్ 'నీవు కోరుకున్నది నీకు ఇవ్వబడింది, దానికి సమానమైనది కూడా నీకు ఇవ్వబడింది' అని అంటాడు."
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు మాంసం తీసుకువచ్చారు. ఆయనకు ఇష్టమైన తొడ భాగం (అజ్-జిరాఅ్) ఆయనకు అందజేశారు. ఆయన దాన్ని కొంచెం కొరికి తిన్నారు, తర్వాత ఇలా పలికినారు..." "నేను ప్రళయ దినాన ప్రజలకు నాయకుడని. ఈ విషయం ఎందుకో మీకు తెలుసా? అల్లాహ్ మొదటి తరం నుండి చివరి తరం వరకు ఉనికిలో వచ్చిన ప్రజలందరినీ ఒకే చోట సమీకరిస్తాడు. ప్రతి ఒక్కరూ ప్రకటనకర్త (ఇస్రాఫీల్) స్వరాన్ని వింటారు, ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యుడు అతి సమీపంలోకి వచ్చేస్తాడు. ప్రజలు ఎంతో బాధతో(ఆ వేడిని) తట్టుకోలేని స్థితిలో భయకంపితులై ఉంటారు. అపుడు ప్రజలు ఇలా అంటారు: 'మీరు చూడటం లేదా? ఎంత భయంకరమైన స్థితి వచ్చింది! మన కోసం మన ప్రభువు వద్ద ఎవరైనా శిఫారసు చేసేవారు ఉన్నారా?' అప్పుడు వారు ఒకరినొకరు సలహా అడుగుతారు, ఎవరో 'ఆదం అలైహిస్సలాం వద్దకు వెళ్లండి!' అంటారు. వారు ఆదం అలైహిస్సలాం వద్దకు వెళ్లి, ఇలా అంటారు: 'మీరు మానవుల పితామహులు. అల్లాహ్ స్వయంగా తన చేతులతో మిమ్మల్ని సృష్టించాడు, తనే స్వయంగా మీలో ఆత్మను ఊదాడు, దేవదూతలు మీకు సాష్టాంగ ప్రణామం చేశారు. మా కోసం మన ప్రభువు వద్ద శిఫారసు చేయండి! మేము ఏ స్థితిలో ఉన్నామో చూడటం లేదా?' దానికి ఆదం అలైహిస్సలాం ఇలా అంటారు: 'నా ప్రభువు ఈ రోజు ఎన్నడూ లేనంత ఎక్కువ కోపంతో ఉన్నాడు. ఆయన నాకు ఒక చెట్టు నుండి తినకూడదని ఆజ్ఞాపించాడు, కానీ నేను అవిధేయతకు పాల్బడినాను. అయ్యో నా ప్రాణం! అయ్యో నా ప్రాణం! మీరు వేరొకరి వద్దకు వెళ్లండి - నూహ్ అలైహిస్సలాం వద్దకు వెళ్లండి!' ... (ఇలాగే నూహ్, ఇబ్రాహీం, మూసా, ఈసా అలైహిముస్సలాం వద్దకు వెళ్లి అందరూ తమ తప్పులను స్మరించుకుని తమను తాము రక్షించుకోవాలని అంటారు)...చివరికి వారు నా వద్దకు (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చి, ఇలా అంటారు: 'ఓ ముహమ్మద్! మీరు అల్లాహ్ యొక్క రసూల్, ప్రవక్తలలో చిట్టచివరివారు. అల్లాహ్ మీ మునుపటి, తర్వాతి పాపాలను క్షమించాడు. మా కోసం మన ప్రభువు వద్ద శిఫారసు చేయండి!' నేను అల్లాహ్ సింహాసనం క్రింద సజ్దా చేస్తాను. అప్పుడు అల్లాహ్ తన మహిమలు, స్తుతులను నాకు అర్థం చేసుకునే శక్తిని ఇస్తాడు. అపుడు ఆయన ఇలా అంటాడు: 'ఓ ముహమ్మద్! తల ఎత్తు, అడుగు - ఇవ్వబడుతుంది, శిఫారసు చేయి - ఆమోదించబడుతుంది!' అపుడు నేను ఇలా అంటాను: 'ఓ నా ప్రభువా! నా సమాజం. ఓ నా ప్రభువా! నా సమాజం,' దానికి అల్లాహ్ ఇలా అంటాడు: 'నీ సమాజంలోని వారిలో తమపై ఏ లెక్కా లేని వారిని స్వర్గం కుడి ద్వారం ద్వారా ప్రవేశపెట్టు!' ఆ స్వర్గం ద్వారాల మధ్య దూరం మక్కా-హిమ్యర్ (లేదా మక్కా-బుస్రా) మధ్య దూరం అంత ఉంటుంది."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలతో కలిసి ఒక విందులో పాల్గొన్నారు. వారు ఆయన ముందు గొర్రె తొడ భాగం పెట్టారు, ఇది ఆయనకు చాలా ఇష్టమైన భాగం. ఆయన తన పళ్ళ కొనలతో ఒక చిన్న ముక్క కొరికి తిన్నారు, తర్వాత సహాబాలతో మాట్లాడటం ప్రారంభించారు. ఆయన ఇలా అన్నారు: "ప్రళయ దినాన నేను (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదం సంతతికి నాయకుడిగా ఉంటాను. ఇది తనపై అల్లాహ్ తఆలా యొక్క అనుగ్రహాన్ని వివరిస్తూ ఆయన పలికిన మాట." "తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు: 'ఈ విషయం ఎందుకో మీకు తెలుసా?' తరువాత ఆయన ఇలా వివరించారు: 'ప్రళయ దినాన ప్రజలందరిని ఒక విశాలమైన, సమతలంగా ఉన్న భూమిపై ఒకచోట సమీకరించబడతారు. అక్కడ ఉన్నవారందరూ ప్రకటనకర్త (ఇస్రాఫీల్) స్వరాన్ని వింటారు, సర్వదృష్టి కలవాడు (అల్లాహ్) వారిని చుట్టుముట్టి ఉంటాడు - ఏ రహస్యమూ ఆయన వద్ద దాచిపెట్టలేరు. ఈ సమతల భూమిలో ఎవరూ ఎక్కడా దాక్కోలేరు. ప్రతి ఒక్కరి మాటలు అందరికీ వినిపిస్తాయి, ప్రతి ఒక్కరినీ అందరూ చూడగలరు. సూర్యుడు ప్రజలకు కేవలం ఒక మైలు దూరంలో ఉంటాడు. ప్రజలు ఎంతో బాధ, భయంతో తట్టుకోలేని స్థితిలో ఉంటారు. అప్పుడు వారు శిఫారసు ద్వారా ఈ స్థితి నుండి విముక్తి కోసం అర్థిస్తారు.'" "అల్లాహు తఆలా విశ్వాసుల హృదయాలలో ఈ ఆలోచన పుట్టిస్తాడు: 'మీరు మానవుల తండ్రి ఆదం అలైహిస్సలాం వద్దకు వెళ్లండి!' వారు ఆయన వద్దకు వెళ్లి, ఆయన గొప్పతనాన్ని స్మరించుకుంటారు, బహుశ ఆయన వారి కోసం అల్లాహ్ వద్ద శిఫారసు చేయవచ్చని ఆశిస్తారు. వారు ఇలా అంటారు: 'ఓ ఆదం! మీరు మానవుల పితామహులు. అల్లాహ్ స్వయంగా తన చేతులతో మిమ్మల్ని సృష్టించాడు, దైవదూతలు మీకు సజ్దా చేశారు, ప్రతి వస్తువు పేరు మీకు నేర్పాడు, తనే స్వయంగా మీలో ఆత్మను ఊదాడు. మా కోసం మన ప్రభువు వద్ద శిఫారసు చేయండి!' కానీ ఆదం అలైహిస్సలాం క్షమాపణ కోరుతూ ఇలా అంటారు: 'నా ప్రభువు ఈ రోజున ఎన్నడూ లేనంత ఎక్కువ కోపంతో ఉన్నాడు. ఆయన నాకు ఒక నిషిద్ధ వృక్షం నుండి తినకూడదని ఆజ్ఞాపించాడు, కానీ నేను అవిధేయతకు పాల్బడినాను. నా ప్రాణమే నాకు రక్షణ కావాలి. మీరు వేరొకరి వద్దకు వెళ్లండి - నూహ్ అలైహిస్సలాం వద్దకు వెళ్లండి!'" "అప్పుడు ప్రజలు నూహ్ అలైహిస్సలాం వద్దకు వెళ్లి ఇలా అంటారు: 'ఓ నూహ్! మీరు భూమి పైకి పంపబడిన మొట్టమొదటి ప్రవక్త. అల్లాహ్ మిమ్మల్ని "కృతజ్ఞత కలిగిన దాసుడు" (అబ్దన్ షకూరా) అని పేర్కొన్నాడు. మా కోసం మన ప్రభువు వద్ద శిఫారసు చేయండి!' కానీ నూహ్ అలైహిస్సలాం క్షమాపణ కోరుతూ ఇలా అంటారు: 'నా ప్రభువు ఈ రోజున ఎన్నడూ లేనంత ఎక్కువ కోపంతో ఉన్నాడు. నేను నా జనులపై ఒక శాపం చేసాను (వారు నమ్మకపోవడంతో). నా ప్రాణమే నాకు రక్షణ కావాలి. మీరు ఇంకొకరి వద్దకు వెళ్లండి - ఇబ్రాహీం (అలైహిస్సలాం) వద్దకు వెళ్లండి!'" "అప్పుడు ప్రజలు ఇబ్రాహీం అలైహిస్సలాం వద్దకు వెళ్లి ఇలా అంటారు: 'ఓ ఇబ్రాహీం! మీరు భూమిపై అల్లాహ్ స్నేహితులు (ఖలీలుల్లాహ్). మా కోసం మన ప్రభువు వద్ద శిఫారసు చేయండి! మేము ఏ స్థితిలో ఉన్నామో చూడటం లేదా?' కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా జవాబిస్తారు: 'నా ప్రభువు ఈ రోజు ఎన్నడూ లేనంత ఎక్కువ కోపంతో ఉన్నాడు. నేను మూడు సార్లు ఇలా అసత్యం చెప్పాను: "నేను అనారోగ్యంతో ఉన్నాను" (జనులను తప్పించడానికి), "ఈ విగ్రహాన్ని పెద్దవాడే నాశనం చేశాడు", నా భార్య సారాకు చెప్పిన "అతను నా సహోదరుడని చెప్పు" (అన్యాయం నుండి రక్షణ కోసం). నా ప్రాణమే నాకు రక్షణ కావాలి. మీరు ఇంకొకరి వద్దకు వెళ్లండి!'" "నిజానికి ఆ మూడు మాటలు (ఇబ్రాహీం చెప్పిన) మాటల గారడీలా చమత్కారాలుగా (మఆరిజ్-అల్-కలామ్) ఉండవచ్చు. కానీ అవి బాహ్యంగా అసత్యాలుగా కనిపించడంతో, ఆయన తనను తాను శిఫారసు చేసుకోవడానికి అనర్హుడిగా భావించారు. ఎందుకంటే, ఎవరు అల్లాహ్ను బాగా అర్థం చేసుకున్నవారో, ఆయన దగ్గర ఎక్కువ స్థానం ఉన్నదో, వారికి దైవభయం ఎక్కువగా ఉంటుంది. ఆయన (ఇబ్రాహీం) ఇలా అన్నారు: 'నా ప్రాణమే రక్షణకు అర్హమైనది. మీరు ఇంకొకరి వద్దకు వెళ్లండి - మూసా అలైహిస్సలాం వద్దకు వెళ్లండి!'" "అప్పుడు ప్రజలు మూసా అలైహిస్సలాం వద్దకు వెళ్లి ఇలా అంటారు: 'ఓ మూసా! మీరు అల్లాహ్ ప్రవక్త, ఆయన మిమ్మల్ని ప్రత్యేకించి తన సందేశంతో మరియు ప్రత్యక్షంగా మాట్లాడడంతో గౌరవించాడు. మా కోసం మన ప్రభువు వద్ద శిఫారసు చేయండి! మేము ఏ స్థితిలో ఉన్నామో చూడటం లేదా?' కానీ మూసా అలైహిస్సలాం ఇలా జవాబిస్తారు: 'నా ప్రభువు ఈ రోజు ఎన్నడూ లేనంత ఎక్కువ కోపంతో ఉన్నాడు. నేను ఒక ప్రాణిని (ఎగిప్తియను) చంపాను, అలా చంపేందుకు నేను ఆజ్ఞాపించబడ లేదు. నా ప్రాణమే నాకు రక్షణ కావాలి. మీరు ఇంకొకరి వద్దకు వెళ్లండి - మర్యం కుమారుడు ఈసా అలైహిస్సలాం వద్దకు వెళ్లండి!'" "అప్పుడు ప్రజలు ఈసా అలైహిస్సలాం వద్దకు వెళ్లి ఇలా అంటారు: 'ఓ ఈసా! మీరు అల్లాహ్ ప్రవక్త, ఆయన మర్యంకు అందించిన 'కలిమతుల్లాహ్' (అల్లాహ్ వాక్కు), మరియు ఆయన ఆత్మ నుండి సృష్టించబడినవారు. మీరు శిశువుగా ఉండగానే ఉయ్యాలలో నుండే ప్రజలతో మాట్లాడారు. మా కోసం మన ప్రభువు వద్ద శిఫారసు చేయండి! మేము ఏ స్థితిలో ఉన్నామో చూడటం లేదా?' కానీ ఈసా అలైహిస్సలాం ఇలా జవాబిస్తారు: 'నా ప్రభువు ఈ రోజు ఎన్నడూ లేనంత ఎక్కువ కోపంతో ఉన్నాడు. (ఆయన తన పాపాలను ప్రస్తావించలేదు కానీ) నా ప్రాణమే నాకు రక్షణ కావాలి. మీరు ఇంకొకరి వద్దకు వెళ్లండి - ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్లండి!'" "అప్పుడు ప్రజలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్లి ఇలా అంటారు: 'ఓ ముహమ్మద్! మీరు అల్లాహ్ ప్రవక్త మరియు ప్రవక్తలలో చిట్టచివరివారు. అల్లాహ్ మీ మునుపటి మరియు తర్వాతి పాపాలను క్షమించాడు. మా కోసం మన ప్రభువు వద్ద శిఫారసు చేయండి! మేము ఏ స్థితిలో ఉన్నామో చూడటం లేదా?' అప్పుడు నేను వెళ్లి అల్లాహ్ అర్ష్ (సింహాసనం) క్రింద సజ్దా చేస్తాను. అల్లాహ్ నా కోసం తన మహిమలు మరియు స్తుతుల నుండి ప్రత్యేక వాక్యాలను నాపై అవతరింపజేస్తాడు, అవి ఇంతకు ముందు ఎవరికీ ఇవ్వబడలేదు. తర్వాత ఆయన (అల్లాహ్) అంటాడు: 'ఓ ముహమ్మద్! తల ఎత్తు, అడుగు - ఇవ్వబడుతుంది, శిఫారసు చేయి - అంగీకరించబడుతుంది.' నేను నా తల ఎత్తి ఇలా అంటాను: 'ఓ ప్రభువా! నా సమాజం. ఓ ప్రభువా! నా సమాజం. ఓ ప్రభువా! నా సమాజం.' అప్పుడు నా శిఫారసు ఆమోదించ బడుతుంది." "అప్పుడు అల్లాహ్ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అంటాడు: 'ఓ ముహమ్మద్! నీ సమాజం లోని ఆ ప్రజలను (ఎవరిపై ఏ లెక్కా లేదో) స్వర్గం యొక్క కుడి ద్వారం ద్వారా ప్రవేశపెట్టు. మిగతా ద్వారాల ద్వారా ప్రవేశించే ప్రజలందరిలో కూడా వారు భాగస్వాములు అవుతారు.'" "ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రమాణం చేసారు: 'నా ప్రాణం ఆయన చేతిలో ఉందో ఆ ప్రభువు పై ప్రమాణం! స్వర్గపు ఒక్క ద్వారం యొక్క రెండు వైపుల మధ్య దూరం, మక్కా మరియు యెమెన్ లోని సనా (సనాఆ) మధ్య దూరం లాంటిది, లేదా మక్కా మరియు షామ్ (సిరియా) లోని బుస్రా (హౌరాన్ ప్రాంతం) మధ్య దూరం లాంటిది.'"
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురుషుడు స్త్రీ వస్త్రాలు ధరించడాన్ని, స్త్రీ పురుషుని వస్త్రాలు ధరించడాన్ని శపించారు.
అన్నసాయీ కుబరాలో, ఇబ్న్ మాజహ్ అదే భావంతో మరియు అహ్మద్ నమోదు చేసినారు:స్త్రీల వస్త్రాల వంటి శైలిని అనుకరించే పురుషులపై దైవ శాపం కలగాలని మరియు వారు ఆయన కరుణ నుండి దూరం కావాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థించారు. దుస్తుల ధరించడంలో, వాటి శైలిలో స్త్రీలు పురుషులను అనుకరించడం మరియు పురుషులు స్త్రీలను అనుకరించడం - ఒక పెద్ద పాపం
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "స్వర్గంలో ప్రవేశించే మొదటి సమూహం పూర్ణ చంద్రుని (పౌర్ణమి చంద్రుడు) వలె ప్రకాశవంతంగా ఉంటారు. వారిని అనుసరించే తదుపరి సమూహం ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రంలా మెరుస్తారు. అక్కడ వారికి మూత్ర విసర్జన, విరేచన, ఉమ్మడం, ముక్కు తుడిచుకోవడం వంటి అవసరాలు ఏవీ ఉండవు. వారి జుట్టు దువ్వుకునే దువ్వెనలు బంగారంతో తయారవుతాయి. వారి చెమట ముస్క్ పరిమళంలా సువాసనను గుబాళిస్తూ ఉంటుంది. వారు ఉపయోగించే ధూపపు కట్టెలు అతి విలువైన అలూవా (ఒక రకం పరిమళ వృక్షం)కు చెందినవి. వారికి హూర్-అల్-ఐన్ (స్వర్గపు అపురూప స్త్రీలు) భార్యలు అవుతారు. వారందరూ ఒకే ఆకారంలో, ఒకే రూపంలో తమ తండ్రి ఆదాం అలైహిస్సలాం రూపాన్ని పోలి, దాదాపు అరవై ముళ్ల (60 ముళ్ల) ఎత్తులో ఉంటారు."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీథు ప్రకారం, స్వర్గంలో ప్రవేశించే మొదటి విశ్వాసుల సమూహం వారి ముఖాలు పౌర్ణమి చంద్రుని వలె ప్రకాశవంతంగా ఉంటాయి. వారిని అనుసరించే తదుపరి సమూహం ఆకాశంలోని అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రంలా మెరుస్తారు. వారికి ఈ ప్రపంచంలోని అపవిత్ర అవసరాలు ఉండవు - వారు మూత్ర విసర్జన, విరేచన, ఉమ్మడం, ముక్కు తుడిచుకోవడం చేయరు. వారి జుట్టు దువ్వుకునే దువ్వెనలు బంగారంతో తయారు చేయబడతాయి, వారి చెమట ముస్క్ పరిమళంలా గుబాళిస్తూ ఉంటుంది, వారు ఉపయోగించే ధూపపు కట్టెలు అత్యంత విలువైన పరిమళ వృక్షాల నుండి తీసుకు రాబడతాయి. హూర్-అల్-ఐన్ (స్వర్గపు అపురూప స్త్రీలు) వారి భార్యలు అవుతారు. వారందరూ ఒకే ఆకారంలో, ఒకే రూపంలో ఉంటారు — వారు తమ తండ్రి ఆదాం (అలైహిస్సలాం) రూపాన్ని పోలి, అరవై ముళ్ల (60 ముళ్ల) ఎత్తుతో ఉంటారు.
ఉబాదహ్ బిన్ సాబిత్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలూల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "స్వర్గంలో వంద స్థాయిలు ఉంటాయి, ప్రతి రెండు స్థాయిల మధ్య ఆకాశం మరియు భూమి మధ్య దూరం అంత ఉంది. ఫిర్'దౌసు స్వర్గం అత్యున్నత స్థాయి స్వర్గం, మరియు దాని నుండి స్వర్గం యొక్క నాలుగు నదులు ఉద్భవిస్తాయి మరియు దాని పైనే అర్ష్ సింహాసనం ఉంది. కాబట్టి మీరు అల్లాహ్ను ఏదైనా అడిగినప్పుడు, ఆయనతో ఫిర్'దౌస్ స్వర్గాన్ని ప్రసాదించమని వేడుకోండి."
అత్తిర్మిదీ నమోదు చేసినారు:స్వర్గంలో వంద స్థాయిలు మరియు హోదాలు ఉన్నాయని ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తెలిపినారు, ప్రతి రెండు స్థాయిల మధ్య దూరం స్వర్గం మరియు భూమి మధ్య దూరం అంత ఉంది. ఈ స్వర్గాలలో అత్యున్నతమైనది ఫిర్దౌస్ స్వర్గం, దాని నుండి స్వర్గంలోని నాలుగు నదులు ప్రవహిస్తాయి మరియు ఫిర్దౌస్ పైనే అర్ష్ సింహాసనం ఉంది. కాబట్టి మీరు అల్లాహ్ ను ఏదైనా అడిగితే, మొత్తం స్వర్గాలలో అన్నింటికంటే పైన ఉన్న ఫిర్దౌస్ స్వర్గం కోసం అడగండి.