





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “పునరుత్థాన దినాన ప్రజలు చెప్పులు లేకుండా, బట్టలు లేకుండా, మరియు సున్తీ చేయని స్థితిలో (హషర్ మైదానంలో) జమ చేయ బడతారు.” నేను అడిగాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! సమీకరించబడిన స్త్రీలు మరియు పురుషులు ఒకరినొకరు చూసుకుంటారా?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బదులిచ్చారు: “ఓ ఆయిషా! ఆ సమయంలో పరిస్థితి ఒకరినొకరు చూసుకోవడం కంటే చాలా తీవ్రంగా, గంభీరంగా ఉంటుంది.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పునరుత్థాన దినం యొక్క కొన్ని లక్షణాలను వివరించారు. తీర్పు కోసం ప్రజలు తమ సమాధుల నుండి పునరుత్థానం చేయబడిన (లేపబడిన) తర్వాత ఒకచోట సమీకరించబడతారు. వారు కాళ్ళకు చెప్పులు లేకుండా, బట్టలు లేకుండా, ఏ ఆచ్ఛాదనా లేకుండా, నగ్నంగా ఉంటారు. వారి తల్లులు వారిని కన్న దినాన ఉన్నట్లుగా వారు వొడుగులు (సున్తీ) చేయని స్థితిలో ఉంటారు. ఆయిషా రదియల్లాహు అన్హా ఇది వినగానే, ఆమె ఆశ్చర్యంతో ఇలా అడిగారు: “ఓ రసూలుల్లాహ్! అపుడు స్త్రీలు, పురుషులు ఒకరినొకరు చూసుకుంటారా?” అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు ఇలా వివరించినారు: (అల్లాహ్ ముందు) నిలబడటం మరియు పునరుత్థానం తర్వాత ఒక చోట సమీకరించబడడం - ఆ పరిస్థితి చాలా భయంకరమైన సంఘటనలతో నిండి ఉంటుంది, ప్రజలు ఇతరుల నగ్నత్వాన్ని కూడా గమనించలేనంతగా (తమ విషయంలో ఏమని తీర్పు వెలుపడుతుందో అని) భయకంపితులై ఉంటారు.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్-అషజ్జి – అషజ్జి అబ్దిల్ ఖైస్ రదియల్లాహు అన్హుతో ఇలా పలికారు: “నిశ్చయంగా నీలో అల్లాహ్ ఇష్టపడే రెండు లక్షణాలు ఉన్నాయి – అవి ప్రాజ్ఞత (దూరదృష్ఠి), వివేకం మరియు సహనము”.
ముస్లిం నమోదు చేసినారు:అత్యంత ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు మరియు అబ్దిల్ ఖైస్ తెగ నాయకుడైన అల్ మున్’దిర్ ఇబ్న్ అల్ ఆ’ఇజ్ అషజ్జి (రదియల్లాహు అన్హు) తో ఇలా అన్నారు మీలో దేవుడు ఇష్టపడే రెండు లక్షణాలు ఉన్నాయి: తెలివితేటలు, ఆలోచనాశక్తి, గౌరవం మరియు తొందరపాటు లేకపోవడం (సహనం).
అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా అల్లాహ్ (తన దాసులలో) ఒక దాసుని ప్రేమించినపుడు జిబ్రయీల్ అలైహిస్సలాంను పిలిచి ఇలా అంటాడు: “నేను ఫలానా దాసుడిని ప్రేమిస్తున్నాను, కనుక అతడిని ప్రేమించు”. అపుడు జిబ్రయీల్ అలైహిస్సలాం అతడిని ప్రేమిస్తాడు. మరియు అతడు (జిబ్రయీల్) ఆకాశాలలో పిలుపునిస్తాడు; అతడు ఇలా అంటాడు: “నిశ్చయంగా అల్లాహ్ ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, కనుక అతడిని ప్రేమించండి”, అపుడు ఆకాశ నివాసులందరూ అతడిని ప్రేమిస్తారు. అప్పుడు అతనికి భూమిపై ఆమోదం లభిస్తుంది. అలాగే ఒకవేళ అల్లాహ్ (తన దాసులలో) ఒకరిని ద్వేషించినట్లయితే, జిబ్రయీల్ అలైహిస్సలాంను పిలిచి ఇలా అంటాడు: “నిశ్చయంగా నేను ఫలానా వ్యక్తిని ద్వేషిస్తున్నాను. కనుక అతడిని ద్వేషించు. అపుడు జిబ్రయీల్ అలైహిస్సలాం అతడిని ద్వేషిస్తాడు. అపుడు జిబ్రయీల్ ఆకాశావాసులలో పిలుపునిస్తాడు, అతడు (జిబ్రయీల్) ఇలా అంటాడు: “నిశ్చయంగా అల్లాహ్ ఫలానా వ్యక్తిని ద్వేషిస్తున్నాడు, కనుక అతడిని ద్వేషించండి”. అపుడు వారందరూ అతడిని ద్వేషిస్తారు. మరియు అతని పట్ల భూమిలో ద్వేషం స్థిరపడుతుంది”.
సహీహ్ ముస్లింఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: “తన ఆజ్ఞలను పాటించే మరియు తన నిషేధాలనుండి దూరంగా ఉండే విశ్వాసి అయిన దాసుడిని అల్లాహ్ ప్రేమించినప్పుడు, ఆయన జిబ్రయీల్ అలైహిస్సలాంను పిలిచి ఇలా అంటాడు: “నిశ్చయంగా సర్వోన్నతుడైన అల్లాహ్ ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, కనుక అతడిని ప్రేమించు”. అపుడు దైవదూతల నాయకుడైన జిబ్రయీల్ అలైహిస్సలాం అతడిని ప్రేమిస్తాడు. ఇంకా జిబ్రయీల్ అలైహిస్సలాం ఆకాశాల దైవదూతలందరిలో ఇలా ప్రకటిస్తాడు: “నిశ్చయంగా మీ ప్రభువు ఫలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, కనుక అతడిని ప్రేమించండి. అపుడు ఆకాశవాసులందరూ అతడిని ప్రేమిస్తారు. మరియు అతని పట్ల ప్రేమ, ఇష్టము, ప్రేరణల ద్వారా విశ్వాసుల హృదయాలలో అతని పట్ల ఆమోదము వేయబడుతుంది. మరియు అల్లాహ్ ఎవరైనా దాసుడిని ద్వేషించినట్లయితే, ఆయన జిబ్రయీల్ అలైహిస్సలాంను పిలిచి ఇలా అంటాడు: “నిశ్చయంగా నేను ఫలానా వ్యక్తిని ద్వేషిస్తున్నాను, కనుక అతడిని ద్వేషించు. అపుడు జిబ్రయీల్ అలైహిస్సలాం అతడిని ద్వేషిస్తాడు. ఇంకా జిబ్రయీల్ అలైహిస్సలాం ఆకాశ వాసులందరిలో ఇలా ప్రకటిస్తాడు: “నిశ్చయంగా మీ ప్రభువు ఫలానా వ్యక్తిని ద్వేషిస్తున్నాడు, అతడిని ద్వేషించండి”. అపుడు వారు అతడిని ద్వేషిస్తారు. మరియు విశ్వాసుల హృదయాలలో అతని పట్ల ద్వేషం మరియు అసహ్యం నాటబడతాయి.
ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “కొంతమంది ‘సబ్’యీ’ లు (యుద్ధములో బందీలుగా పట్టుబడ్డ స్త్రీలు మరియు పిల్లలు – వీరు “సబ్’యీ” అనబడతారు. మగ యుద్ధ ఖైదీలను సాధారణంగా ‘అసీర్’ أَسِير అంటారు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ప్రవేశపెట్టబడినారు. వారిలో ఒక స్త్రీ ఒక శిశువుకు తన రొమ్మును పితుకుతూ పాలు త్రాపిస్తూ కనిపించింది. బందీలలో ఏ శిశువు కనిపించినా ఆమె అదే విధంగా ఆ శిశువును తీసుకుని, తన చాతీని నొక్కిపట్టి, తన రొమ్మును పితుకుతూ ఆ శిశువుకు పాలు త్రాపిస్తున్నది. అది చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాతో ఇలా అన్నారు: “ఈ స్త్రీ తన బిడ్డను అగ్నిలో పడవేస్తుందని మీరు అనుకుంటున్నారా?” దానికి మేము: “లేదు, ఆమె తన శిశువును అగ్నిలో విసిరివేయకుండా నిరోధించగలిగితే, ఆమె (నిశ్చయంగా) విసిరివేయదు” అన్నాము. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం: “నిశ్చయంగా అల్లాహ్ తన దాసులపట్ల, ఈ స్త్రీ తన బిడ్డ పట్ల ఉన్నదానికంటే ఎక్కువ దయ మరియు కరుణ గలవాడు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుహవాజిన్ తెగకు చెందిన బందీలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వద్దకు తీసుకువచ్చారు. వారిలో ఒక స్త్రీ తన బిడ్డ కోసం వెతుకుతోంది. ఆమె తన రొమ్ములలో పాలు నిండిపోయి బాధ కలిగిస్తూ ఉండడం వల్ల, ఆమెకు ఎవరైనా పసిబిడ్డ కనపడితే చాలు అతన్ని చేతుల్లోనికి తీసుకుని అతనికి పాలిస్తున్నది. తరువాత బందీలలో తన సొంత బిడ్డను ఆమె కనుగొన్నది, అంతే ఆమె ఉప్పొంగిన ప్రేమ, దయ, కరుణతో అతన్ని తీసుకొని, తన ఛాతీకి హత్తుకుని, ఆ బాలునికి పాలిచ్చింది. అది చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తన సహచరులతో ఇలా అన్నారు: “మీ అభిప్రాయం ఏమిటి - ఈ స్త్రీ తన బిడ్డను అగ్నిలోనికి విసిరివేయగలదని అనుకుంటున్నారా?” దానికి మేము: “ఆమె తన ఇష్టపూర్వకంగా ఎన్నటికీ విసిరివేయదు” అన్నాము. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఈ స్త్రీ తన బిడ్డ పట్ల కనికరం చూపే దానికంటే అల్లాహ్ తన ముస్లిం దాసుల పట్ల ఎక్కువ దయ, కనికరం గలవాడు”.
ముఆవియహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను: “తీర్పు దినము నాడు ప్రజల మధ్య ‘ముఅజ్జిన్’లు (మస్జిదులలో అజాన్ పలికేవారు) పొడవైన మెడలు కలిగి ఉంటారు.”
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలియజేస్తున్నారు: నమాజు కొరకు పిలిచే ముజ్జిన్లు (అజాన్ పలికే వారు) పునరుత్థాన దినాన అతి పొడవైన మెడలను కలిగి ఉంటారు, ఇది వారు చేస్తున్న పని యొక్క గొప్పతనం, ఘనత, వారి మంచి పనుల సమృద్ధి మరియు వారి ప్రతిఫలం యొక్క గొప్పతనం కారణంగా.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: «ఎవరైతే అల్లాహ్’కు దేనినీ సాటి కల్పించకుండా (షిర్క్ చేయకుండా) ఆయనను కలుస్తాడో, అతని పాపాలు అతనికి హాని చేయలేవు. మరియు ఎవరైతే ఆయనకు ఇతరులను సాటి కల్పిస్తూ (షిర్క్ చేస్తూ) మరణిస్తాడో, అతని పుణ్యకార్యాలు అతనికి ప్రయోజనం చేకూర్చలేవు.»
ఆహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: ఎవరైతే ఏకదైవారాధకుడిగా (తౌహీద్ పై) ఉంటూ, అల్లాహ్ కు దేనినీ సాటి కల్పించని స్థితిలో మరణించి ఆయనను కలుస్తాడో, అతను తన పాపాల కారణంగా నరకంలో శిక్షించబడినప్పటికీ, చివరికి అతని గమ్యస్థానం స్వర్గమే అవుతుంది. మరియు ఎవరైతే అల్లాహ్ కు ఇతరులను సాటి కల్పిస్తూ (షిర్క్ చేస్తూ) మరణిస్తాడో, షిర్క్ తో పాటు చేసిన ఏ పుణ్యకార్యం కూడా అతనికి ప్రయోజనం చేకూర్చదు; మరియు అతనిపై స్వర్గం నిషిద్ధం (హరామ్) చేయబడుతుంది.
అబూ మూసా రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా మధ్య నిలబడి ఐదు మాటలు సెలవిచ్చారు: «నిశ్చయంగా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నిద్రపోడు మరియు నిద్రపోవడం ఆయనకు తగదు, ఆయన త్రాసులను వంచుతాడు మరియు త్రాసులను పైకి ఎత్తుతాడు, పగటి ఆచరణకు ముందు రాత్రి ఆచరణ, మరియు రాత్రి ఆచరణకు ముందు పగటి ఆచరణ ఆయన ముందు సమర్పించబడుతుంది, తేజస్సు ఆయన అడ్డు తెర - మరో ఉల్లేఖనం ప్రకారం: అగ్ని- ఆయన దానిని తెరిస్తే ఆయన ముఖ కాంతి ఆయన దృష్టికి అందేంతవరకు ఆయన సృష్టిని కాల్చేస్తుంది».
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను ఐదు సంపూర్ణ వచనాలను బోధించారు, అవి: మొదటిది: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నిద్రపోడు. రెండవది: ఆయనకు నిద్ర అసంభవం; ఆయన సర్వ పోషకత్వం మరియు జీవం యొక్క పరిపూర్ణత వలన. మూడవది: ఆయన, తన వైపుకు ఎత్తబడే దాసుల ఆచరణలను మరియు భూమిపైకి పంపే వారి ఆహారములను తూకం వేయడం ద్వారా తూకమును తగ్గిస్తాడు మరియు పెంచుతాడు. కాబట్టి, ప్రతి ప్రాణి యొక్క వాటా మరియు భాగమైన ఆహారమును తాను తలిచినట్లుగా ఆయన తగ్గించి కుదిస్తాడు, మరియు పెంచి విశాలపరుస్తాడు. నాలుగవది: దాసులు రాత్రి చేసిన ఆచరణలు మరుసటి పగలు రాకముందే, మరియు పగలు చేసిన ఆచరణలు మరుసటి రాత్రి రాకముందే ఆయనకు సమర్పించబడతాయి; కావున, సంరక్షక దైవదూతలు రాత్రి కాలపు ఆచరణలను, రాత్రి ముగిసిన తర్వాత పగటి ఆరంభంలోనూ, మరియు పగటి కాలపు ఆచరణలను, పగలు ముగిసిన తర్వాత రాత్రి ఆరంభంలోనూ తీసుకుని పైకి వెళ్తారు. ఐదవది: ఆయనను చూడకుండా నిరోధించే ఆయన తెర కాంతి లేదా అగ్ని, ఒకవేళ ఆయన దానిని తొలగిస్తే, ఆయన సృష్టిలో ఆయన దృష్టి చేరినంత వరకు ఆయన ముఖ తేజస్సు కాల్చివేస్తుంది; ఆయన ముఖ తేజస్సు అంటే ఆయన కాంతి, ఆయన వైభవం మరియు ఆయన ప్రకాశం. దీని అర్థం ఏమిటంటే: ఒకవేళ ఆయన తనను చూడకుండా అడ్డుకుంటున్న తెరను తొలగించి, తన సృష్టి ముందు ప్రత్యక్షమైతే, ఆయన ముఖ తేజస్సు, ఆయన దృష్టి చేరినంత వరకు ఉన్న దానిని దహించివేసేది; అది సమస్త సృష్టి; ఎందుకంటే పరిశుద్ధుడు మరియు సర్వోన్నతుడైన ఆయన దృష్టి సమస్త సృష్టిని చుట్టుముట్టి ఉంది.
ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పనులను ఆదేశించినప్పుడు, వారు చేయగలిగిన వాటినే ఆదేశించేవారు. వారు ఇలా అన్నారు: "ఓ ప్రవక్తా! మేము మీలాంటి వాళ్ళం కాదు. నిశ్చయంగా అల్లాహ్ మీ గత మరియు భవిష్యత్ పాపాలను క్షమించాడు". అప్పుడు ఆయన ఎంతగా కోపగించుకున్నారంటే, ఆయన ముఖంలో కోపం స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత ఆయన ఇలా సెలవిచ్చారు: «నిశ్చయంగా మీ అందరిలోకెల్లా అల్లాహ్ పట్ల అత్యంత భయభీతి కలవాడను మరియు ఆయన గురించి మీకంటే బాగా తెలిసినవాడను నేనే».
అల్ బుఖారీ నమోదు చేసినారు:విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా తెలియజేస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను ఏదైనా ఆచరణ (ఆరాధన) చేయమని ఆజ్ఞాపించినప్పుడు, వారు దానిని నిరంతరం కొనసాగించడంలో విఫలమవుతారేమోనన్న భయంతో, వారికి కష్టమైనది కాకుండా సులభమైన దానినే ఆజ్ఞాపించేవారు. ఆయన కూడా, వారికి ఆజ్ఞాపించిన సులభమైన పనులనే ఆచరించేవారు. అయితే వారు, ఆయన కంటే ఉన్నత స్థాయిలను పొందడానికి, తాము ఆరాధనలలో మరింత ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఉందని భావించి, కష్టమైన పనులను తమపై విధించమని ఆయనను కోరారు. అప్పుడు వారు ఇలా పలుకుతారు: "ఓ రసూలుల్లాహ్! నిశ్చయంగా మా పరిస్థితి మీ పరిస్థితిలాంటిది కాదు, ఎందుకంటే అల్లాహ్ మీ గత మరియు భవిష్యత్ పాపాలను మన్నించాడు." దానికి ఆయన ముఖంలో స్పష్టంగా ఆగ్రహం కనిపించేంతగా ఆయన ఆగ్రహం చెందారు. ఆ తరువాత ఆయన ఇలా పలికారు: "నిశ్చయంగా మీలోకెల్లా అత్యంత దైవభీతిపరుడను మరియు అల్లాహ్ గురించి అత్యధికంగా తెలిసినవాడను నేనే. కావున, నేను మీకు ఆజ్ఞాపించిన దానిని మీరు చేయండి.
ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: మేము సమాజములలో చివరివారము మరియు లెక్క తీసుకోబడేవారిలో మొట్టమొదటి వారము, ఇలా అనబడుతుంది: నిరక్షరాస్య సమాజం మరియు దాని ప్రవక్త ఎక్కడ? కావున మేము చివరివారము మరియు మొదటివారము.
ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు, వారి సమాజము కాలపరంగా చివరి సమాజము మరియు ప్రళయదినాన మొట్టమొదట లెక్క తీసుకోబడే సమాజము కూడా అదే. ప్రళయదినాన ఇలా పిలవబడుతుంది: 'నిరక్షరాస్య సమాజం మరియు దాని ప్రవక్త ఎక్కడ ఉన్నారు?'. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చదవడం, రాయడం తెలియని నిరక్షరాస్యులు కావడాన్ని బట్టి ఈ సమాజానికి ఆ పేరు వచ్చింది. కాబట్టి మనము మొదట లెక్క కోసం పిలవబడతాము. మనము ఈ ప్రపంచంలో చిట్టచివరి వాళ్ళము, కానీ తీర్పు రోజున లెక్కలో మరియు స్వర్గంలో ప్రవేశించడంలో మొదటివాళ్ళం.