





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: ఎవరైతే ‘హద్ద్’ నేరానికి (చట్టపరంగా శిక్షార్హమైన పాపపు పనికి) పాల్బడతాడో; మరియు దాని కొరకు అతడు ఇహలోకములో శిక్షించబడతాడో, అల్లాహ్ ఎంతటి న్యాయవంతుడు అంటే అల్లాహ్ అతనికి పరలోకములో రెండవసారి శిక్ష విధించడు; అలాగే ఎవరైతే ‘హద్ద్’ నేరానికి (చట్టపరంగా శిక్షార్హమైన పాపపు పనికి) పాల్బడతాడో; అల్లాహ్ దానిని ఇహలోకములో అతని కొరకు కప్పివేసి, దానిని క్షమించి వేసాడో, అల్లాహ్ ఎంతటి దయగలవాడు అంటే తాను అప్పటికే క్షమించిన దానిని, పరలోకములో తిరిగి వెలికి తీయడు.
అత్తిర్మిదీ మరియు ఇబ్నె మాజహ్ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియఏస్తున్నారు: ‘షరియత్’లో నిర్దిష్టమైన శిక్షలు నిర్ణయించబడిన పాపములలో (ఉదా: దొంగతనము, వ్యభిచారము మొ.) ఎవరైనా ఏదైనా పాపము చేసి ఉండి, ఆ పాపానికి అతడు ఈ లోకములో శిక్షించబడితే, ఆ శిక్ష అతని ఆ పాపాన్ని తొలగిస్తుంది; మరియు ఆ పాపానికి పరలోకములో శిక్షనుండి విముక్తిని కలిగిస్తుంది. ఎందుకంటే అల్లాహ్ ఎంత ఉదారుడూ, దయగలవాడూ అంటే ఒకే పాపానికి రెండు శిక్షలు విధించడు; మరియు అల్లాహ్ ఈ లోకములో ఎవరి పాపాన్నైనా కప్పివేసి ఉండి, అతడిని మన్నించి, క్షమించి ఉన్నట్లైతే, మరియు అతడు ఆ పాపానికి ఈ లోకములో శిక్షించబడకపోయినట్లైతే, అల్లాహ్ ఎంత ఉదారుడూ, దయగలవాడూ అంటే తాను అప్పటికే మన్నించి, క్షమించివేసిన పానికి పరలోకములో తిరిగి శిక్ష విధించడు.
ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో అబ్దుల్లాహ్ అనే పేరు గల ఒక వ్యక్తి ఉండేవారు. ఆయనకు ‘హిమార్’ (గాడిద) అనే ముద్దుపేరు ఉండేది. ఆయన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను నవ్వించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి మద్యం సేవించినందుకు (గతంలో) కొరడా దెబ్బల శిక్ష విధించారు. ఒకరోజు అతను (మళ్ళీ అదే నేరానికి) తీసుకురాబడగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం మేరకు అతనికి కొరడా దెబ్బలు వేయబడ్డాయి. అప్పుడు అక్కడున్న వారిలో ఒక వ్యక్తి ఇలా అన్నాడు: “ఓ అల్లాహ్! ఇతనిని శపించు. ఇతను ఎన్నిసార్లు (ఈ నేరానికి) తీసుకురాబడ్డాడు?”. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అతనిని శపించకండి, అల్లాహ్ సాక్షిగా! నాకు తెలిసినంత వరకు, నిశ్చయంగా అతను అల్లాహ్'ను మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తాడు”.
అల్ బుఖారీ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో అబ్దుల్లాహ్ అనే వ్యక్తి ఉండేవారు, అతడి మారుపేరు హిమార్. అతడు తన మాటలతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను నవ్వించేవారు. మద్యం సేవించినందుకుగాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి కొరడా దెబ్బలు వేయించారు. మరలా ఒకరోజు అతను మద్యం సేవించి ఉండగా అతన్ని తీసుకువచ్చారు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం మేరకు మరలా అతనికి కొరడా దెబ్బలు వేయబడ్డాయి. అక్కడ హాజరైన వారిలో ఒకరు అతనిని, 'అల్లాహ్ ఇతనిని శపించుగాక! మద్యం సేవించి ఎన్నిసార్లు ఇక్కడికి తీసుకురాబడ్డాడు?!' అని శపించగా, ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్, 'అతనిని శపించకండి. అల్లాహ్ సాక్షిగా! నాకు తెలిసినంత వరకు అతను అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను ప్రేమిస్తున్నాడు' అని బోధించారు.
అబూ ద్’దర్దా రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: «నేను మీకు ఉపవాసం, నమాజు మరియు దానధర్మాల స్థాయి కంటే ఉత్తమమైన దాని గురించి తెలియజేయనా?» వారు, “తప్పకుండా తెలియజేయండి” అన్నారు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: «పరస్పర సంబంధాలను చక్కదిద్దడం, ఎందుకంటే పరస్పర సంబంధాలు చెడిపోవడమే వినాశము».
అబూదావూద్ మరియు అత్తిర్మిదీ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలను ఇలా ప్రశ్నించారు: నఫిల్ ఉపవాసాలు, నమాజులు మరియు దానధర్మాలను అధికంగా ఆచరించడం కంటే ఎక్కువ పుణ్యప్రదమైన దాని గురించి మీకు తెలియజేయనా? వారు, ‘తప్పకుండా’ అని అన్నారు. అప్పు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: వివాదంలో ఉన్న వారి మధ్య సయోధ్య (అవసరం), ఎందుకంటే వివాదం ప్రజల మధ్య విభజన, అపరిచిత్వం, పరస్పర ద్వేషం మరియు పరస్పర విముఖతను కలిగిస్తుంది. నిశ్చయంగా, పరస్పర సంబంధాలు చెడిపోవడం వల్ల కలిగే ద్వేషం ఒకలాంటి గుణం, అది కత్తి వెంట్రుకలను ఎలాగైతే సమూలంగా కత్తిరించి వేస్తుందో, అదే విధంగా ధర్మాన్ని మరియు ప్రాపంచిక జీవితాన్ని నాశనం చేసి సమూలంగా పెరికివేస్తుంది.
ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: నిర్దిష్ట వారసులకు వారి వారసత్వ భాగం (ఫరైద్) ముందుగా కేటాయించండి. (వారసత్వ పంపకాల తరువాత) మిగిలిన సంపత్తి అత్యంత సమీప పురుష వారసునికి (అసబా) చెందుతుంది.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారసత్వ ఆస్తిని పంచేవారికి, సర్వోన్నతుడైన అల్లాహ్ కోరిన విధంగా, న్యాయమైన మరియు ధార్మికమైన పద్ధతిలో, దానికి అర్హులైన వారికి పంచాలని ఆజ్ఞాపిస్తున్నారు. అందువలన, నిర్ణీత వాటాలు (ఫురూద్) కలిగిన వారికి అల్లాహ్ గ్రంథంలో నిర్దేశించిన వారి వాటాలు ఇవ్వబడతాయి. అవి: రెండు-మూడు వంతులు (2\3), మూడవ వంతు (1\3), ఆరవ వంతు (1\6), సగం (1\2), నాలుగవ వంతు (1\4), మరియు ఎనిమిదవ వంతు (1\8). ఆ తర్వాత ఏది మిగిలి ఉన్నా, అది మరణించిన వ్యక్తికి అత్యంత దగ్గర సంబంధం కలిగి ఉన్న పురుషులకు ఇవ్వబడుతుంది, మరియు వారిని 'అస్బా' (Residuaries) అని అంటారు.
ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "దీనార్ లో కనీసం నాలుగవ వంతు లేదా అంతకంటే ఎక్కువ విలువైనదాన్ని దొంగతనం చేసిన వారి చేయి నరకాలి."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా ఇలా తెలిపినారు: దొంగతనానికి పాల్పడినవారు బంగారపు దీనార్ లో కనీసం నాలుగవ వంతు లేదా అంతకంటే ఎక్కువ విలువైనదాన్ని దొంగిలిస్తేనే, వారి చెయ్యి నరకాలి. ఇది సుమారు 1.06 గ్రాముల బంగారం విలువకు సమానం.
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా తాను విన్నానని అబూ బుర్దహ్ అల్ అన్సారీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించినారు: "అల్లాహ్ నిర్దేశించిన హుదూద్ మహాశిక్షలను మినహాయించి, ఎవరికీ పది కొరడా దెబ్బల కంటే ఎక్కువ కొరడా దెబ్బల శిక్ష విధించకూడదు"
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పది కొరడా దెబ్బలకు మించి ఎవరినీ కొరడా దెబ్బలు కొట్టకూడదని నిషేధించారు. అయితే, ఈ నిషేధం, పెద్ద పాపాలకు నిర్దేశించబడిన హుదూద్ మహాశిక్షలకు వర్తించదు. ఇక్కడ ఉద్దేశ్యం ఏమిటంటే, శిక్షార్థంగా కొట్టడం, ఉదాహరణకు భార్య లేదా బిడ్డను కొరడాతో కొట్టడం, అది పది కొరడా దెబ్బలకు మించకూడదు.
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎవరైనా వేట కోసం లేదా పశువుల కాపలా కోసం కాకుండా కుక్కను పెంచుకుంటే, అతని సత్కార్యాలు ప్రతి రోజు రెండు ఖీరాతుల వరకు తగ్గిపోతాయి." దానికి సాలిమ్ ఇలా చెప్పినారు: అబూ హురైరా రదియల్లాహు అన్హు వద్ద ఒక పొలం ఉండేది, అతను ఇలా చెప్పేవారు: "లేదా పొలం కాపాడే కుక్క అయితే కూడా (వ్యతిరేకం లేదు)."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు: "వేట కోసం, పశువులను లేదా పంటలను కాపాడే అవసరం కోసం తప్ప, ఇతర కారణాల కోసం కుక్కను పెంచడం నిషిద్ధం. ఇతర ఉద్దేశాల కోసం కుక్కను పెంచినవారి సత్కార్యాల నుంచి ప్రతిరోజూ రెండు ఖీరాతులు (దాని పరిమాణం కేవలం అల్లాహ్ కు మాత్రమే తెలుసు) తగ్గిపోతాయి.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఒక వ్యక్తి వచ్చి నమాజ్ (సలాహ్) చేసినాడు. ఆ పిదప అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సలాం చెప్పినాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి సమాధానం ఇచ్చి ఇలా అన్నారు: "నీవు తిరిగి వెళ్లి నమాజ్ చేయి, ఎందుకంటే నువ్వు నమాజ్ ను సరిగ్గా చేయలేదు." అతను తిరిగి వెళ్లి మళ్లీ అదే విధంగా నమాజ్ చేసినాడు. ఆ తరువాత వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సలాం చెప్పినాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో మళ్లీ అలాగే చెప్పినారు: "నీవు తిరిగి వెళ్లి నమాజ్ చేయి, ఎందుకంటే నువ్వు నమాజ్ సరిగ్గా చేయలేదు." ఇలా మూడు సార్లు జరిగింది. ఇక ఆ వ్యక్తి ఇలా అన్నాడు: "మిమ్ముల్ని సత్యంతో పంపినవాడిపై ప్రమాణం చేస్తూ చెబుతున్నాను, నేను దీని కంటే మెరుగ్గా నమాజు చేయలేను. కాబట్టి, దయచేసి మీరు నాకు నేర్పండి." అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా బోధించినారు: "నీవు నమాజ్ కొరకు నిలబడినప్పుడు మొట్టమొదట తక్బీర్ (అల్లాహు అక్బర్) చెప్పు. తర్వాత నీకు సాధ్యమైనంత ఖుర్ఆన్ చదువు. ఆ తరువాత రుకూలోనికి వెళ్లి, రుకూలో పూర్తిగా ప్రశాంతంగా ఉండు. ఆ తరువాత నిలబడు, అంటే పూర్తిగా నిటారుగా నిలబడు. ఆ తరువాత సజ్దాలోకి వెళ్ళు, సజ్దాలో ప్రశాంతంగా ఉండు. ఆ తరువాత కూర్చో, కూర్చోవడంలో ప్రశాంతంగా ఉండు. నీ నమాజ్ మొత్తం ఇలాగే చేయి."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్లోకి ప్రవేశించారు. ఆయన తర్వాత ఒక వ్యక్తి వచ్చి, రెండు రకాతుల నమాజ్ త్వరత్వరగా పూర్తి చేసినాడు — నిలబడడం, రుకూ, సజ్దా ప్రశాంతంగా చేయలేదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని నమాజ్‌ను గమనిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి నమాజ్ ముగించాక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చున్న మస్జిదు మూలకు వచ్చి సలాం చేసినాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడి సలాంకు సమాధానం ఇచ్చి ఇలా అన్నారు: "నీవు తిరిగి వెళ్లి నీ నమాజ్‌ను మళ్లీ చేయి, ఎందుకంటే నీవు నీ నమాజ్ ను పూర్తిగా చేయలేదు." అతను తిరిగి వెళ్లి మళ్లీ అంతకు ముందు వలే త్వర త్వరగా నమాజ్ పూర్తి చేసినాడు. మళ్లీ వచ్చి ప్రవక్తకు సల్లల్లాహు అలైహి వసల్లంకు సలాం చెప్పినాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మళ్లీ అతనితో ఇలా పలికినారు: "నీవు తిరిగి వెళ్లి నమాజ్ చేయి, ఎందుకంటే నీవు ఇంకా నమాజ్ పూర్తిగా చేయలేదు." ఇలా మూడు సార్లు జరిగింది. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు: "మిమ్ములను సత్యంతో పంపినవాడిగా ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను దీని కంటే మెరుగ్గా చేయలేను. దయచేసి మీరు నాకు నేర్పండి." అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా బోధించినారు: "నీవు నమాజ్ కొరకు నిలబడినప్పుడు, ముందుగా ప్రారంభ తక్బీర్ చెప్పు. ఆ తరువాత ఖుర్ఆన్ ప్రారంభం (సూరతుల్-ఫాతిహా) మరియు అల్లాహ్ నీకు సాధ్యము చేసినంత ఖుర్ఆన్ భాగాన్ని పఠించు. ఆ తరువాత రుకూలో వెళ్లి, పూర్తిగా ప్రశాంతంగా రుకూ చేయి — అరచేతులతో మోకాళ్ళను గట్టిగా పట్టుకుని, వీపును నేరుగా ఉంచి, శరీరాన్ని పూర్తిగా రుకూలో స్థిరంగా ఉంచు. ఆ తరువాత నిలబడు, అంటే పూర్తిగా నిటారుగా నిలబడు — ఎముకలు మళ్లీ సరైన స్థానాల్లోకి వచ్చేలా ప్రశాంతంగా నిలబడు. ఆ తరువాత సజ్దాలోకి వెళ్లి, పూర్తిగా ప్రశాంతంగా సజ్దా చేయి — నుదురు, ముక్కు, రెండు చేతులు, రెండు మోకాళ్లు, రెండు పాదాల వేళ్లు నేలపై ఉండాలి. ఆ తరువాత రెండు సజ్దాల మధ్య ప్రశాంతంగా కూర్చో. ప్రతి రకాతులో ఇదే విధంగా చేయి."
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఒక ముస్లిం - లేదా విశ్వాసి - వుదూ చేసినప్పుడు — అతడు తన ముఖాన్ని కడిగినప్పుడు, అతడు తన కళ్లతో చూసిన ప్రతి పాపం, ఆ నీటితో లేదా చివరి నీటి బొట్టుతో ముఖం నుండి బయటకు వచ్చేస్తుంది; అతడు తన చేతులను కడిగినప్పుడు, చేతులతో చేసిన ప్రతి పాపం, నీటితో లేదా చివరి నీటి బొట్టుతో చేతుల నుండి బయటకు వచ్చేస్తుంది; అతడు తన కాళ్ళను కడిగినప్పుడు, కాళ్లతో వెళ్లిన ప్రతి పాపం, నీటితో లేదా చివరి నీటి బొట్టుతో కాళ్ళ నుండి బయటకు వచ్చేస్తుంది — అలా, చివరికి అతడు తన పాపాల నుండి పూర్తిగా శుభ్రంగా బయటకు వచ్చేస్తాడు."
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా ఇలా తెలిపినారు: ఒక ముస్లిం లేదా విశ్వాసి వుదూ చేసేటప్పుడు — అతడు తన ముఖాన్ని కడిగినప్పుడు, తన కళ్లతో చూసిన ప్రతి చిన్న పాపం నీటితో లేదా చివరి నీటి బొట్టుతో ముఖం నుండి బయటకు వచ్చేస్తుంది; అలాగే తన చేతులను కడిగినప్పుడు, చేతులతో చేసిన ప్రతి చిన్న పాపం నీటితో లేదా చివరి నీటి బొట్టుతో చేతుల నుండి బయటకు వచ్చేస్తుంది; అలాగే తన కాళ్ళను కడిగినప్పుడు, కాళ్ళతో వెళ్లిన ప్రతి చిన్న పాపం నీటితో లేదా చివరి నీటి బొట్టుతో కాళ్ళ నుండి బయటకు వచ్చేస్తుంది. ఇలా, ఉదూ పూర్తయ్యేసరికి అతను చిన్న చిన్న పాపాల నుండి పూర్తిగా శుభ్రంగా బయటకు వస్తాడు